Shilpakala Vedhika
-
1635 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించిన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో 90 రోజుల్లో 31వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను పట్టించుకోలేదన్నారు. 1635 మందికి ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు అందించడం సంతోషంగా ఉందంటూ కామెంట్స్ చేశారు.శిల్పకళావేదికలో ‘కొలువుల పండుగ’ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగ జంగ్ సైరన్ మోగించిన నాడు.. వాళ్ల ఉద్యోగాలు ఊడితేనే మీకు ఉద్యోగాలు వస్తాయని నేను చెప్పాను. మా మాటపై నమ్మకం ఉంచి కాంగ్రెస్‌ను గెలిపించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే 90 రోజుల్లోనే మేం ప్రమాణ స్వీకారం చేసిన చోటే 30వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. దసరా పండగ నేపథ్యంలో తెలంగాణలో ప్రతీ కుటుంబంలో ఆనందం చూడాలని ఇవాళ మరిన్ని నియామక పత్రాలు అందిస్తున్నాం. 1635 మందికి ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు అందించడం సంతోషంగా ఉంది.మీ చప్పట్లలో మీ సంతోషం, మీ కుటుంబ సభ్యుల ఆనందం కనిపిస్తుంది. ఏళ్లుగా నిరీక్షించిన మీ కల ఇవాళ సాకారమవుతోంది. వందలాది మంది ఆత్మ బలిదానాలతో తెలంగాణ ఏర్పడింది. అలాంటి తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కాబోతున్నారు. ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు.. ఇది భావోద్వేగం. ఉద్యోగ నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించండి. లక్షలాది మంది హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి ఇంజనీర్లను మీరు ఆదర్శంగా తీసుకోవాలి.హైదరాబాద్‌లో వందల ఏళ్ల క్రితం నిర్మించిన అద్భుత కట్టడాలున్నాయి. వందేళ్ల అనుభవం ఒకవైపు.. పదేళ్ల దుర్మార్గం మరోవైపు. కాళేశ్వరం కట్టినవారిని ఆదర్శంగా తీసుకుంటారో.. నాగార్జున సాగర్ కట్టిన వారిని ఆదర్శంగా తీసుకుంటారో ఆలోచించుకోండి. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి పదవీ విరమణ వరకు ఒకే విధంగా వ్యవహరించండి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత మీ అందరిపై ఉంది. తన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచుకున్న కేసీఆర్.. 2015లో నోటిఫికేషన్లు ఇచ్చిన వాళ్ళకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు?. తెలంగాణ ఉద్యమం గొప్పతనాన్ని.. విద్యార్థి నిరుద్యోగుల త్యాగాలను కేసీఆర్ కవచంగా మార్చుకున్నారు. ఇవాళ ముసుగు తొలగిపోవడంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అక్టోబర్ 9న 11,063 ఉపాధ్యాయ నియామక పత్రాలు అందించబోతున్నాం. ఇది మా చిత్తశుద్ధి.. ఇది మా బాధ్యత.మూసీ మురికిని ప్రక్షాళన చేయాలని మేం నిర్ణయం తీసుకున్నాం. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మీ చేతుల మీదుగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ జరుగబోతుంది. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు మూసీ కంపులోనే బ్రతకాలా?. మూసీ పరివాహక ప్రజలకు ఇండ్లు కట్టించి వారికి మంచి భవిష్యత్తును అందిద్దాం. ప్రతీ దానికి అడ్డుపడటం కాదు.. మూసీ బాధితులను ఎలా ఆదుకుందామో సలహాలు ఇవ్వండి. ఈటల అంగి మారింది కానీ.. వాసన మారలేదు. హరీష్, కేటీఆర్ మాట్లాడిందే ఈటల మాట్లాడుతున్నారు. ఆయన ఇప్పటికైనా పేదల వైపు నిలబడాలి. ఇలా వచ్చి అలా వెళ్లడం కాదు.. ధైర్యం ఉంటే కేసీఆర్, హరీష్, ఈటల మూసీ పరివాహక నివాసాల్లో వారం రోజులు ఉండండి. వాళ్ల కష్టాలు, బాధలు తెలుస్తాయి అంటూ కామెంట్స్ చేశారు.ఇది కూడా చదవండి: గ్యారెంటీలపై నిలదీయండి: యువతకు హరీశ్‌రావు పిలుపు -
సుస్థిరమైన ఆవిష్కరణలు, ఉత్పత్తులు రావాలి
సాక్షి, హైదరాబాద్: మన దేశంలోని అతి పెద్ద మార్కెట్ లక్ష్యంగా వివిధ రంగాల్లో కొత్త ఆవిష్కరణలు, సుస్థిరమైన ఉత్పత్తులు తీసుకురావాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. వివిధ రంగాల పరస్పర సహకారం, వినూత్న విధానాలతో వచ్చే 25 ఏళ్లలో భారత్ అభివృద్ధి చెందిన దేశాల శక్తికేంద్రంగా నిలుస్తుందనే ధీమా వ్యక్తంచేశారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిఫ్ట్, ఎఫ్డీఐఐ, ఎన్ఐడి, ఐఐఎఫ్టి, ఐఐపి విద్యార్థుల సమావేశం శిల్పకళావేదికలో శనివారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన నిర్మలా సీతారామన్ ‘డిజిటలైజేషన్, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్: భారత ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలు’ అనే అంశంపై మాట్లాడారు. ఆగస్టు 15 ప్రసంగంలో ప్రధాని మోదీ సూచించిన పంచ సూత్రాల(పంచ పరిష్కారాలు) అమలుతో దేశం మరింత బలోపేతం అవుతోందన్నారు. ఇప్పటికే భారత్ అభివృద్ధి చేసిన స్థిరమైన డిజైన్ల గురించి తెలుసుకొని, వాటిని ఈ తరానికి సౌకర్యంగా ఉండేలా మెరుగుపరచాలని విద్యార్థులకు సలహా ఇచ్చారు. మార్పును స్వీకరించి, కొనసాగించే వారధులుగా విద్యార్థులు ఉండాలని సీతారామన్ వ్యాఖ్యానించారు. ఆశాకిరణంగా భారత్ ఆర్థిక వ్యవస్థ : పీయూష్ గోయల్ ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ప్రపంచానికి భారత్ ఆర్థికవ్యవస్థ ఒక ఆశాకిరణంగా ఉందని కేంద్ర పరిశ్రమలు, ప్రజా పంపిణీ, జౌళి శాఖల మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఉత్తమ డిజైన్లను రూపొందించి, ఖర్చు తగ్గించే అంశాలపై దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు. సభికులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. పేటెంట్ల కోసం ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. డిజిటలైజేషన్ ద్వారా అవినీతిని రూపుమాపామని, మధ్యవర్తులను దూరం చేయగలిగామని, పోటీతత్వం పెంచగలిగామని తెలిపారు. నూతన ఆవిష్కరణలకు కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ఐదు విద్యాసంస్థల విద్యార్థుల (పూర్వవిద్యార్థులుసహా) సమ్మేళనం తొలిసారిగా హైదరాబాద్‌లో జరుగుతోందని, రాబోయే రోజుల్లో దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటివి నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కేంద్రవాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి రాజీవ్ సింగ్ ఠాకూర్, ఎఫ్‌డీడీఐ ఎండీ అరుణ్ కుమార్ సిన్హా, నిఫ్ట్ డైరెక్టర్ విజయ్ కుమార్ మంత్రి, ఎన్ఐడి ప్రొఫెసర్ శేఖర్ ముఖర్జీ, ఎఫ్డిఐఐ హైదరాబాద్ సెంటర్ ఇంచార్జ్ దీపక్ చౌదరి, ఐఐఎఫ్టి డీన్ డాక్టర్ సతీందర్ భాటియా, ఐఐపీ చైర్మన్ వాగీ దీక్షిత్ పాల్గొన్నారు. -
మునావర్ కామెడీ షో: శిల్పకళా వేదిక వద్ద టెన్షన్.. టెన్షన్
స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ షో.. తెలంగాణలో టెన్షన్‌కు క్రియేట్ చేసింది. మునవార్ షోను అడ్డుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, మునావర్ షో విషయంలో అలర్ట్ అయిన పోలీసులు.. షోను గంట ముందే ప్రారంభించేలా ప్లాన్ చేశారు. దీంతో, శిల్పకళా వేదికలో మునావర్ షో సాయంత్రం 5 గంటలకే ప్రారంభమైంది. శిల్పకళా వేదికలో మునావర్ షో ముగిసింది. దాదాపు గంటన్నరపాటు షో కొనసాగింది. ఇక, బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు విడతలవారీగా శిల్పకళా వేదిక వద్దకు తరలివస్తుండటంతో అక్కడ టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. దీంతో అక్కడ బందోబస్తు పోలీసులకు సవాల్‌గా మారింది. ఇప్పటి వరకు దాదాపు 50 మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. మునావర్ ఫరూఖీ కామెడీ షో కోసం.. దాదాపు 2083 మంది శిల్పకళావేదికలో టికెట్ బుక్ చేసుకున్నారు. బీజేపీ కార్యకర్తలు అక్కడికి వస్తున్న నేపథ్యంలో దాదాపు 200 మంది పోలీసులు మఫ్టీలో గస్తీ కాస్తున్నారు. మునావర్ కామెడీ షోపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి స్పందించారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ వల్లే మునావర్ షో చేస్తున్నారు. మా కార్యకర్తలను కొట్టి అరెస్ట్ చేశారు. పోలీసు స్టేషన్లో మా సైన్యాన్ని బంధించారు అని అన్నారు. -
సాక్షి ప్రాపర్టీ షో నేడే
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో సొంతింటి కొనుగోలు అంత ఆషామాషీ పనేం కాదు. నమ్మకమైన బిల్డర్, నాణ్యమైన నిర్మాణం, గడువులోగా ప్రాజెక్ట్ పూర్తి, ఆధునిక వసతులు, తక్కువ ధర.. ఇవన్నీ ఉన్న ప్రాజెక్ట్ ఎక్కడుందో వెతకాలంటే కష్టమే. మరి ఇలాంటి ప్రాజెక్ట్‌లన్నింటినీ ఒకే వేదిక మీదికి తీసుకొస్తే.. అదే ‘సాక్షి ప్రాపర్టీ షో’! ప్రాజెక్ట్ ఎంపిక నుంచి గృహ రుణం వరకూ నిర్మాణ సంస్థలను, బ్యాంక్‌లను ఒకే చోటికి తీసుకొచ్చి కొనుగోలుదారులకు సౌలభ్యాన్ని కల్పిస్తుంది సాక్షి. నేడు, రేపు మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో సాక్షి ప్రాపర్టీ షో జరగనుంది. ముఖ్య అతిథిగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ, రెరా చైర్మన్ సోమేశ్ కుమార్ హాజరుకానున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ అందుబాటులో ఉంటుంది. ప్రవేశం ఉచితం. 40కి పైగా స్టాళ్ల ఏర్పాటు.. నగరానికి చెందిన 20కి పైగా ప్రముఖ నిర్మాణ సంస్థలు, 40కి పైగా స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలు.. ఇలా అన్ని రకాల గృహ ప్రాజెక్ట్‌లు ప్రదర్శనలో ఉంటాయి. వివిధ ప్రాంతాల్లో ఏయే నిర్మాణాల్లో ఎంత రేటు చెబుతున్నారు? అవి ప్రస్తుతం ఏయే దశలో ఉన్నాయి? ఏయే రాయితీలను అందిస్తున్నారు? సొంతింటి కొనుగోలు నిర్ణయంలో కీలకమైన ఇలాంటి విషయాలు తెలిస్తేనే.. కొనుగోలుదారులు అంతిమ నిర్ణయానికి రావటం తేలికవుతుంది. మరి ఆలస్యమెందుకు? వెంటనే మీ కుటుంబ సభ్యులతో విచ్చేసి.. నచ్చిన ఇంటిని ఎంచక్కా ఎంపిక చేసుకోండి. ప్రధాన స్పాన్సర్: అపర్ణా కన్స్ట్రక్షన్స్ అసోసియేటెడ్ స్పాన్సర్: రాంకీ ఎస్టేట్స్ కో–స్పాన్సర్స్: జనప్రియ ఇంజనీర్స్, మ్యాక్, ఎన్సీసీ అర్బన్, స్పేస్ విజన్ పాల్గొనే సంస్థలు: ఈఐపీఎల్ ప్రాజెక్ట్స్, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, గ్రీన్ మార్క్ డెవలపర్స్, గిరిధారి హోమ్స్, శ్రీ ఆదిత్య హోమ్స్, ప్రణీత్ గ్రూప్, ఆర్వీ నిర్మాణ్, కపిల్ ప్రాపర్టీస్, గ్రీన్ సిటీ ఎస్టేట్స్, ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై సిటీ, గ్రీన్ హోమ్స్, పేరం గ్రూప్, వర్టుసా లైఫ్ స్పేసెస్, చరణ్ గ్రూప్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ). -
వచ్చే నెల 9, 10 తేదీల్లో సాక్షి ప్రాపర్టీ షో
సాక్షి, హైదరాబాద్: నగరవాసుల సొంతింటి కలను సాకారం చేసేందుకు మరోసారి సిద్ధమైంది సాక్షి. వచ్చే నెల 9, 10 తేదీల్లో మెగా ప్రాపర్టీ షోను నిర్వహించనుంది. మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో జరగనున్న ఈ ప్రదర్శనలో నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు పాల్గొననున్నాయి. ఓపెన్ ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలు అన్ని విభాగాల స్థిరాస్తి సమాచారం అందుబాటులో ఉండనుంది. డెవలపర్లు స్టాల్స్ బుకింగ్ చేసేందుకు 99122 20380, 99516 03004 నంబర్లలో సంప్రదించవచ్చు. -
కళకళ...మిలమిల...
ఒక్కరు కాదు... ఇద్దరు కాదు.. దాదాపు వంద మంది కళాకారులు... ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడు భాషలకు చెందిన కళాకారులు... ఒకే వేడుకలో పాల్గొంటే చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. సినీ ప్రేమికులకైతే అంతకన్నా ఆనందం మరోటి ఉండదు. ఆదివారం అలాంటి అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రముఖ పారిశ్రామికవేత్త, కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి తారలందర్నీ ఒకే వేదిక పైకి తీసుకొచ్చారు. ఆయన ఆధ్వర్యంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ, పంజాబీ, హిందీ భాషలకు చెందిన తారలకు అవార్డుల ప్రదానం జరిగింది. కళాకారులకు నిజమైన ఆనందం దక్కేదెప్పుడు? తాము నటించిన చిత్రం ఘనవిజయం సాధించినప్పుడు. మరి.. రెట్టింపు ఆనందం దక్కేదెప్పుడు? ఆ చిత్రాలు అవార్డులు కూడా పొందినప్పుడు. ఆ విధంగా అవార్డులు అందుకున్న తారల ఆనందంతో వేదిక కళకళలాడింది... మిలమిల మెరిసింది. దాదాపు ఐదు గంటల పాటు ఆట, పాటలతో పసందుగా సాగిన ఈ వేడుకలో అవార్డు విజేతల ప్రసంగం వీక్షకులను ఆకట్టుకుంది. అలాగే, పలువురు కథానాయికల నృత్య ప్రదర్శన ఆహూతులను ఆనందపరిచింది. టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ -‘‘భారతదేశం గర్వించేలా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ... ఇలా ఏడు భాషల కళాకారులను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చాను. ఇన్ని భాషల కళాకారులను ఒకే వేడుకలో చూడాలన్న ఏడు కోట్ల తెలుగు ప్రజల కోరికను ఇలా తీర్చాను’’ అన్నారు. జమున: 1978లో సుబ్బరామిరెడ్డి నాకు ‘సిల్వర్ జూబ్లీ స్టార్’ అవార్డు ఇచ్చారు. ఏకధాటిగా 25ఏళ్లు కథానాయికగా నటించిన సందర్భంగా ఆ అవార్డు ప్రదానం చేశారు. సుబ్బరామిరెడ్డికి సినిమా తారలంటే పిచ్చి అనుకునే దాన్ని కానీ.. ఆయనకు కళలంటే చాలా ఇష్టం. శత్రుఘ్న సిన్హా: ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి మహానుభావులు ఉన్న పరిశ్రమ ఇది (తెలుగు). భారతీయ సినిమా ఖ్యాతిని పెంచిన ‘బాహుబలి’ రూపొందించిన సినిమా పరిశ్రమకు చెందినవాణ్ణి కావడం ఆనందంగా ఉంది. రాజమౌళి ఉన్న పరిశ్రమలో ఉండటం ఆనందంగా ఉందని అమితాబ్ కూడా నాతో అన్నారు. రిషి కపూర్: కళాకారులకు తమిళ్, హిందీ అనే వ్యత్యాసం లేదు. మేం మాట్లాడేది సినిమా భాష. చిరంజీవి: కళలను ప్రోత్సహించే దిశగా సుబ్బరామిరెడ్డి కృషి చేస్తున్నారు. అందుకే కాదనుకుండా ఈ వేడుకకు వచ్చాను. మన తెలుగువాడు రాజమౌళి తీసిన ‘బాహుబలి’ హాలీవుడ్ చిత్రాలకు దీటుగా ఉంది. మోహన్‌బాబు: సుబ్బరామిరెడ్డికి అన్ని భాషలవాళ్లను తీసుకొచ్చి, అవార్డులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? కళలను పోషించాలనే తపనతో ఇస్తున్నారు. బాలకృష్ణ: ప్రభు, రిషి కపూర్‌గారు, గుల్షన్ గ్రోవర్ ఇలా చాలా మంది ఇక్కడకు రావడం ఆనందంగా ఉంది. రమేష్ సిప్పి తెరకెక్కించిన ‘షోలే’ చిత్రాన్ని థియేటర్లో 32 సార్లు చూశాను. వెంకటేశ్: కొత్త రకం ఫ్యామిలీఎంటర్టైనర్ అయిన ‘దృశ్యం’కి అందుకోవడం ఆనందంగా ఉంది.