
సాక్షి, హైదరాబాద్: నగరవాసుల సొంతింటి కలను సాకారం చేసేందుకు మరోసారి సిద్ధమైంది సాక్షి. వచ్చే నెల 9, 10 తేదీల్లో మెగా ప్రాపర్టీ షోను నిర్వహించనుంది. మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో జరగనున్న ఈ ప్రదర్శనలో నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు పాల్గొననున్నాయి. ఓపెన్ ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలు అన్ని విభాగాల స్థిరాస్తి సమాచారం అందుబాటులో ఉండనుంది. డెవలపర్లు స్టాల్స్ బుకింగ్ చేసేందుకు 99122 20380, 99516 03004 నంబర్లలో సంప్రదించవచ్చు.