mega property show
-
హైటెక్స్‌లో 26, 27 తేదీల్లో ఎస్బీఐ మెగా ప్రాపర్టీ షో..!
ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ పరిధిలో కోవిడ్ కష్టకాలంలోనూ రూ.10 వేల కోట్ల మేర గృహరుణాలు మంజూరు చేసినట్లు సంస్థ తెలంగాణ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జిన్గ్రాన్ మంగళవారం నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. హైదరాబాద్ సర్కిల్ పరిధిలో రూ.44,580 కోట్ల మేర హోమ్ లోన్ పోర్ట్‌ఫోలియో నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 19 వేల గృహరుణాలు జారీ చేశామన్నారు. ఈ మొత్తం రూ.8,500 కోట్లుగా ఉందన్నారు. మరో 9,100 టాప్అప్ లోన్లను జారీచేశామని.. ఈ మొత్తం రూ.1700 కోట్లని తెలిపారు. గృహరుణాల జారీలో ఎస్బీఐ మార్కెట్ లీడర్‌గా నిలిచిందని పేర్కొన్నారు. ఇతర బ్యాంకులతో పోలిస్తే అన్ని రకాల రుణాలపై తక్కవ వడ్డీ వర్తిస్తుందని చెప్పారు. యోనో,ఓసీఏఎస్ ద్వారానూ ఆన్లైన్లో రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి అవాస్ యోజన పథకానికి తమ బ్యాంకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందన్నారు. మెగా ప్రాపర్టీ షో.. హైటెక్స్ ప్రాంగణంలో ఎస్బీఐ ఆధ్వర్యంలో ఈ నెల 28,27 తేదీల్లో మెగా ప్రాపర్డీ షో నిర్వహిస్తున్నామన్నారు. నగరంలో ప్రముఖ బిల్డర్లు, నిర్మాణ రంగ సంస్థలు ఇందులో పాలుపంచుకోనున్నాయన్నారు. ఈ ప్రదర్శన వద్ద రుణ మంజూరీపై తక్కువ ప్రాసెసింగ్ ఫీజు వసూలు, ఇతర ఆకర్షణీయమైన ఆఫర్లను వర్తింపజేయనున్నామని తెలిపారు. (చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. ఆ గడువు మార్చి 31 వరకే..!) -
వచ్చే నెల 9, 10 తేదీల్లో సాక్షి ప్రాపర్టీ షో
సాక్షి, హైదరాబాద్: నగరవాసుల సొంతింటి కలను సాకారం చేసేందుకు మరోసారి సిద్ధమైంది సాక్షి. వచ్చే నెల 9, 10 తేదీల్లో మెగా ప్రాపర్టీ షోను నిర్వహించనుంది. మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో జరగనున్న ఈ ప్రదర్శనలో నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు పాల్గొననున్నాయి. ఓపెన్ ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలు అన్ని విభాగాల స్థిరాస్తి సమాచారం అందుబాటులో ఉండనుంది. డెవలపర్లు స్టాల్స్ బుకింగ్ చేసేందుకు 99122 20380, 99516 03004 నంబర్లలో సంప్రదించవచ్చు. -
సాక్షి మెగా ప్రాపర్టీ షో!
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైలు పరుగులతో హైదరాబాద్ రియల్టీ పట్టాలెక్కేసింది. స్థానిక ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు, ప్రోత్సాహకాలతో కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభాలూ పెరిగాయి. భవిష్యత్తులో ధరలు పెరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం కొనుగోళ్లూ వృద్ధి చెందాయి. ఇలాంటి సానుకూల పరిస్థితుల్లో నగరంలో తక్కువ ధరలో ప్రాపర్టీని సొంతం చేసుకోవటమెలా? అభివృద్ధి చెందే ప్రాంతాల్లో అందుబాటు గృహాలున్నాయా? నివాస, వాణిజ్య, రిటైల్ ప్రాపర్టీల్లో పెట్టుబడులు పెట్టాలంటే ఎలా.. వంటి సవాలక్ష సందేహాలొస్తాయి. వీటన్నింటికీ ఒకే వేదికగా పరిష్కారం చూపించేందుకు మరోసారి నగరవాసుల ముందుకురానుంది ‘సాక్షి మెగా ప్రాపర్టీ షో’! మాదాపూర్‌లోని హైటెక్స్ సమీపంలోని సైబర్ కన్వెన్షన్‌లో మే 19, 20 తేదీల్లో జరగనున్న ఈ ప్రదర్శనలో నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు పాల్గొననున్నాయి. స్టాళ్ల ఏర్పాటుకు ఆసక్తి ఉన్నవాళ్లు 99122 20380, 87902 30124లో సంప్రదించవచ్చు. -
‘సాక్షి’ ప్రాపర్టీ షో మొదలైంది
సందర్శకులతో కిటకిటలాడిన ప్రాంగణం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భాగ్యనగరం నలువైపులా నిర్మాణం జరుపుకుంటున్న అపార్ట్మెంట్లు, వెంచర్ల వివరాలను కొనుగోలుదారులకు చేరువ చేసేందుకు ‘సాక్షి’ప్రాపర్టీ షో వేదికగా మారింది. శనివారమిక్కడ ఘనంగా ప్రారంభమైన మెగా ప్రాపర్టీ షోలో హైదరాబాద్‌కు చెందిన 23 ప్రముఖ నిర్మాణ సంస్థలు పాల్గొన్నాయి. ఉదయం 10 గంటల నుంచే కుటుంబంతో సహా సందర్శకులు ప్రదర్శనకు విచ్చేశారు. ప్రతి స్టాల్ వద్ద ప్రాజెక్టుల వివరాల సేకరణ, ఎంపికలో వారు బిజీబిజీగా కనిపించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) కమిషనర్ టి.చిరంజీవులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం హైదరాబాద్ జనాభా 10 మిలియన్లు. 2040 నాటికి 22 మిలియన్లకు చేరుతుంది. అప్పటి జనాభాకు తగ్గట్టుగా మౌలిక వసతుల ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టిసారించింది’అని చెప్పారు. హైదరాబాద్‌లో ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు, ఈ–కామర్స్ సంస్థలూ కార్యాలయాల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయని అన్నారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఐకియా వంటి విదేశీ కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించాయని.. దీంతో కార్యాలయాల సముదాయాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని చెప్పారు. కార్యక్రమంలో భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) తెలంగాణ అధ్యక్షుడు గుమ్మి రాంరెడ్డి, జనరల్ సెక్రటరీ రామచంద్రారెడ్డి, అపర్ణా కన్స్ట్రక్షన్స్ బ్రాండ్ ప్రమోషన్ మేనేజర్ శ్రీనివాస్ దివాకర్ల, సాక్షి డైరెక్టర్లు వైఈపీ రెడ్డి (ఫైనాన్స్ అండ్ అడ్మిన్), కేఆర్పీ రెడ్డి (అడ్వర్టయిజింగ్) తదితరులు పాల్గొన్నారు. -
మార్చి 4, 5 తేదీల్లో సాక్షి ప్రాపర్టీ షో!
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణాలో మార్చి 4, 5 తేదీల్లో సాక్షి మెగా ప్రాపర్టీ షో జరగనుంది. అపర్ణా కన్స్ట్రక్షన్స్ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో ఆదిత్య, రాజపుష్ప, జనప్రియ, మ్యాక్ ప్రాజెక్ట్స్, సైబర్ సిటీ, ఎన్సీసీ, సుమధుర, నార్త్ స్టార్ హోమ్స్, సాకేత్, ఆక్సాన్ హౌజింగ్, శాంతా శ్రీరామ్, ఫార్చ్యూన్ బటర్ఫ్లైసిటీ, ఏఆర్కే ఇన్ఫ్రా, కపిల్ టవర్స్. గ్రీన్ హోమ్స్ వంటి సంస్థలు కూడా పాల్గొననున్నాయి. స్టాల్స్ బుకింగ్ కొరకు 99122 20380, 99516 03004 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. -
సొంతింటికి ఇదే సమయం!
♦ నేడు, రేపు సాక్షి మెగా ప్రాపర్టీ షో ♦ మాదాపూర్‌లోని హోటల్ అవాసలో.. ♦ ఉదయం 10 గంటలకు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. ‘పొందికగా అల్లుకున్న పొదరిల్లు మాది’ అని గర్వంగా చెప్పుకోవాలనుకుంటారు. స్థలం కొనుగోలు నుంచి అందమైన ఇల్లు కట్టుకునే వరకు అన్నీ ప్రత్యక్షంగా చూసుకోవాలనుకుంటారు. దీని కోసం ఎక్కడెక్కడో తిరిగి వివరాలు సేకరించే సమస్య లేకుండా అన్ని వివరాలు ఒకే చోట అందించేందుకు సాక్షి అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. శని, ఆదివారాల్లో మాదాపూర్‌లోని హోటల్ అవాసలో మెగా ప్రాపర్టీ షోను నిర్వహించనుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకుండే ఈ ప్రాపర్టీ షోలో నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు పాల్గొంటాయి. కొన్ని సంస్థలు లక్కీ, బంపర్ డ్రాల పేర్లతో సందర్శకులకు ప్రత్యేక బహుమతులను అందించనున్నాయి కూడా. బంపర్ డ్రా కింద సిరి సంపద ఫామ్ ల్యాండ్స్ సంస్థ ప్రతి రోజూ ఎల్ఈడీ టీవీని అందిస్తుంది. లక్కీ డ్రా కింద మ్యాక్ ప్రాజెక్ట్స్ బనియన్ ట్రీ రిట్రీట్ సంస్థ ప్రతి రోజూ 3 సర్ప్రైజ్ గిఫ్ట్‌లను అందిస్తుంది. ♦ నగరం నలువైపులా విస్తరించి ఉన్న ప్రాజెక్టుల వివరాలు తెలుసుకోవడం కాస్త కష్టమే. స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని భావించేవారు కనీసం ఒకట్రెండు నెలలు తిరిగితే తప్ప సమాచారాన్ని తెలుసుకోలేని పరిస్థితి. అందుకే ‘సాక్షి’ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే స్థిరాస్తి ప్రదర్శనలో.. సుమారు 22 ప్రముఖ నిర్మాణ సంస్థలు, 40కి పైగా స్టాళ్ల ద్వారా వివిధ ప్రాంతాల్లో ఏయే నిర్మాణాల్లో ఎంత రేటు చెబుతున్నాయి. అవి ప్రస్తుతం ఏయే దశల్లో ఉన్నాయి. ఏయే రాయితీలను అందిస్తున్నాయి వంటి సమాచారాన్ని కొనుగోలుదారుల ముందు ప్రదర్శిస్తారు. ఎంపికలో కీలకమైన ఇలాంటి విషయాలు తెలిస్తేనే.. కొనుగోలుదారులు అంతిమ నిర్ణయానికి రావటం తేలికవుతుంది. ♦ ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగింది. అనువుతుల కోసం వివిధ ప్రభుత్వ సంస్థలకు కట్టాల్సిన రుసుములు, ఇతరత్రా ఖర్చులూ రెట్టింపయ్యాయి. అయినప్పటికీ పలు సంస్థలు ఇంటి అంతిమ ధరను పెంచట్లేదు. దీంతో నేటికీ నగరంలో ఇళ్ల ధరలు అందుబాటులోనే ఉన్నాయని నిపుణులు అంటున్నారు. రానున్న రోజుల్లో మార్కెట్ వురింత మెరుగవుతుంది కాబట్టి, ధరలు పెరిగినా ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి, సొంతిల్లు కొనుక్కోవడానికి ఇంతకు మించిన తరుణం లేదని నిపుణులు చెబుతున్నారు. మరి ఆలస్యం దేనికి.. వెంటనే మీ కుటుంబ సభ్యులతో విచ్చేసి సొంతింటి కలను నెరవేర్చుకోండి మరి. పాల్గొనే సంస్థలివే మెయిన్ స్పాన్సర్: అపర్ణా కన్స్ట్రక్షన్స్ అసోసియేటెడ్ స్పాన్సర్స్: ఆదిత్య కన్స్ట్రక్షన్స్, ప్రావిడెంట్, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ కో-స్పాన్సర్స్: రాంకీ, మ్యాక్ ప్రాజెక్ట్స్, సైబర్ సిటీ బిల్డర్స్ సంస్థలు: ఎన్సీసీ అర్బన్, మంజీరా, మహేంద్రా లైఫ్‌స్పేస్, ప్రణీత్ గ్రూప్, జనప్రియ, సాకేత్ ఇంజనీర్స్, అక్యురేట్ డెవలపర్స్, నార్త్ స్టార్ హోమ్స్, ఆక్సాన్ హౌజింగ్ ఇన్ఫ్రా, శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్, ఏఆర్క్ టెర్మినస్ ఇన్ఫ్రా, గ్రీన్ హోమ్, బటర్‌ఫ్లై సిటీ, గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రా. స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి. realty@sakshi.com -
ప్రాపర్టీ షో.. స్పందన భేష్..