ఎస్‌బీఐ హైదరాబాద్ సర్కిల్ పరిధిలో కోవిడ్ కష్టకాలంలోనూ రూ.10 వేల కోట్ల మేర గృహరుణాలు మంజూరు చేసినట్లు సంస్థ తెలంగాణ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జిన్‌గ్రాన్ మంగళవారం నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. హైదరాబాద్ సర్కిల్ పరిధిలో రూ.44,580 కోట్ల మేర హోమ్ లోన్ పోర్ట్‌ఫోలియో నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 19 వేల గృహరుణాలు జారీ చేశామన్నారు. ఈ మొత్తం రూ.8,500 కోట్లుగా ఉందన్నారు. మరో 9,100 టాప్‌అప్ లోన్లను జారీచేశామని.. ఈ మొత్తం రూ.1700 కోట్లని తెలిపారు.
గృహరుణాల జారీలో ఎస్‌బీఐ మార్కెట్ లీడర్‌గా నిలిచిందని పేర్కొన్నారు. ఇతర బ్యాంకులతో పోలిస్తే అన్ని రకాల రుణాలపై తక్కవ వడ్డీ వర్తిస్తుందని చెప్పారు. యోనో,ఓసీఏఎస్ ద్వారానూ ఆన్‌లైన్‌లో రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి అవాస్ యోజన పథకానికి తమ బ్యాంకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందన్నారు.
మెగా ప్రాపర్టీ షో..
హైటెక్స్ ప్రాంగణంలో ఎస్‌బీఐ ఆధ్వర్యంలో ఈ నెల 28,27 తేదీల్లో మెగా ప్రాపర్డీ షో నిర్వహిస్తున్నామన్నారు. నగరంలో ప్రముఖ బిల్డర్లు, నిర్మాణ రంగ సంస్థలు ఇందులో పాలుపంచుకోనున్నాయన్నారు. ఈ ప్రదర్శన వద్ద రుణ మంజూరీపై తక్కువ ప్రాసెసింగ్ ఫీజు వసూలు, ఇతర ఆకర్షణీయమైన ఆఫర్లను వర్తింపజేయనున్నామని తెలిపారు.
(చదవండి: ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. ఆ గడువు మార్చి 31 వరకే..!)
Comments
Please login to add a commentAdd a comment