♦ నేడు, రేపు సాక్షి మెగా ప్రాపర్టీ షో
♦ మాదాపూర్‌లోని హోటల్ అవాసలో..
♦ ఉదయం 10 గంటలకు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. ‘పొందికగా అల్లుకున్న పొదరిల్లు మాది’ అని గర్వంగా చెప్పుకోవాలనుకుంటారు. స్థలం కొనుగోలు నుంచి అందమైన ఇల్లు కట్టుకునే వరకు అన్నీ ప్రత్యక్షంగా చూసుకోవాలనుకుంటారు. దీని కోసం ఎక్కడెక్కడో తిరిగి వివరాలు సేకరించే సమస్య లేకుండా అన్ని వివరాలు ఒకే చోట అందించేందుకు సాక్షి అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. శని, ఆదివారాల్లో మాదాపూర్‌లోని హోటల్ అవాసలో మెగా ప్రాపర్టీ షోను నిర్వహించనుంది.
ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకుండే ఈ ప్రాపర్టీ షోలో నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు పాల్గొంటాయి. కొన్ని సంస్థలు లక్కీ, బంపర్ డ్రాల పేర్లతో సందర్శకులకు ప్రత్యేక బహుమతులను అందించనున్నాయి కూడా. బంపర్ డ్రా కింద సిరి సంపద ఫామ్ ల్యాండ్స్ సంస్థ ప్రతి రోజూ ఎల్‌ఈడీ టీవీని అందిస్తుంది. లక్కీ డ్రా కింద మ్యాక్ ప్రాజెక్ట్స్ బనియన్ ట్రీ రిట్రీట్ సంస్థ ప్రతి రోజూ 3 సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లను అందిస్తుంది.
♦ నగరం నలువైపులా విస్తరించి ఉన్న ప్రాజెక్టుల వివరాలు తెలుసుకోవడం కాస్త కష్టమే. స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని భావించేవారు కనీసం ఒకట్రెండు నెలలు తిరిగితే తప్ప సమాచారాన్ని తెలుసుకోలేని పరిస్థితి. అందుకే ‘సాక్షి’ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే స్థిరాస్తి ప్రదర్శనలో.. సుమారు 22 ప్రముఖ నిర్మాణ సంస్థలు, 40కి పైగా స్టాళ్ల ద్వారా వివిధ ప్రాంతాల్లో ఏయే నిర్మాణాల్లో ఎంత రేటు చెబుతున్నాయి. అవి ప్రస్తుతం ఏయే దశల్లో ఉన్నాయి. ఏయే రాయితీలను అందిస్తున్నాయి వంటి సమాచారాన్ని కొనుగోలుదారుల ముందు ప్రదర్శిస్తారు. ఎంపికలో కీలకమైన ఇలాంటి విషయాలు తెలిస్తేనే.. కొనుగోలుదారులు అంతిమ నిర్ణయానికి రావటం తేలికవుతుంది.
♦ ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగింది. అనువుతుల కోసం వివిధ ప్రభుత్వ సంస్థలకు కట్టాల్సిన రుసుములు, ఇతరత్రా ఖర్చులూ రెట్టింపయ్యాయి. అయినప్పటికీ పలు సంస్థలు ఇంటి అంతిమ ధరను పెంచట్లేదు. దీంతో నేటికీ నగరంలో ఇళ్ల ధరలు అందుబాటులోనే ఉన్నాయని నిపుణులు అంటున్నారు. రానున్న రోజుల్లో మార్కెట్ వురింత మెరుగవుతుంది కాబట్టి, ధరలు పెరిగినా ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి, సొంతిల్లు కొనుక్కోవడానికి ఇంతకు మించిన తరుణం లేదని నిపుణులు చెబుతున్నారు. మరి ఆలస్యం దేనికి.. వెంటనే మీ కుటుంబ సభ్యులతో విచ్చేసి సొంతింటి కలను నెరవేర్చుకోండి మరి.
పాల్గొనే సంస్థలివే
మెయిన్ స్పాన్సర్: అపర్ణా కన్‌స్ట్రక్షన్స్
అసోసియేటెడ్ స్పాన్సర్స్: ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్, ప్రావిడెంట్, ఎస్‌ఎంఆర్ హోల్డింగ్స్
కో-స్పాన్సర్స్: రాంకీ, మ్యాక్ ప్రాజెక్ట్స్, సైబర్ సిటీ బిల్డర్స్
సంస్థలు: ఎన్‌సీసీ అర్బన్, మంజీరా, మహేంద్రా లైఫ్‌స్పేస్, ప్రణీత్ గ్రూప్, జనప్రియ, సాకేత్ ఇంజనీర్స్, అక్యురేట్ డెవలపర్స్, నార్త్ స్టార్ హోమ్స్, ఆక్సాన్ హౌజింగ్ ఇన్‌ఫ్రా, శాంత శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్, ఏఆర్క్ టెర్మినస్ ఇన్‌ఫ్రా, గ్రీన్ హోమ్, బటర్‌ఫ్లై సిటీ, గోల్డ్ స్టోన్ ఇన్‌ఫ్రా.
స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి.
realty@sakshi.com