
ఆలియా భట్ గొంతును అనుకరిస్తూ బోలెడు పాపులారిటీ సంపాదించింది 24 సంవత్సరాల కంటెంట్ క్రియేటర్ చాందిని భాబ్డా. ఈ పాపులారిటీనే ఆమెను ముంబైలో ఒక ఫ్లాట్‌కు ఓనర్‌ను చేసింది. సంప్రదాయ రీతిలో గృహప్రవేశంతో తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది చాందిని. ఇన్‌స్టాలో షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. 2022లో ఆన్–పాయింట్ మిమిక్రీ క్లిప్స్‌తో సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది చాందిని.
సొంత ఇంటి కలతో మిమిక్రీ కళను నమ్ముకొని డబ్బులను పొదుపు చేసేది. ఎట్టకేలకు ఆమె కల ఫలించింది. ఈ ఫ్లాట్ కొనడానికి ఎన్నో ఇష్టాలను వదులుకొని, ఎలా డబ్బు పొదుపు చేసిందీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వివరించింది చాందిని. ‘ఫ్రెండ్స్ విదేశాలకు వెళుతున్నప్పుడు నాకు కూడా వెళ్లాలనిపించేది. బర్త్‌డే ఫంక్షన్‌ను ఘనంగా జరుపుకోవాలనుకునేదాన్ని... ఇలాంటి ఎన్నో సందర్భాలలో ఇంటికల గుర్తుచ్చేది. పొదుపు చేయడం ఎప్పుడూ మానలేదు’ అని రాసింది చాందిని.
Comments
Please login to add a commentAdd a comment