
సందర్శకులకు అందుబాటులో 250కి పైగా చిత్రాలు
ఫిబ్రవరి 5 వరకూ ప్రదర్శన కొనసాగింపు
సాలార్‌జంగ్ మ్యూజియం, ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడమీ వంటి మ్యూజియాలలో ప్రదర్శనకు ఉంచిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, చారిత్రక చిహ్నాలు (రాణి లక్ష్మీబాయి, రుద్రమదేవి, అక్కన్న, మాదన్న) ఇతర స్థానిక ప్రముఖుల నుంచి పౌరాణిక వ్యక్తులు, శకుంతల సిరీస్‌కు ప్రసిద్ధి. సందేశాత్మక, సంస్కృతి, సంప్రదాయాల చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ ఆయన చిత్రాలే. ఆయనే కళాకారుడు డాక్టర్ కొండపల్లి శేషగిరిరావు. ఆయన వేసిన చిత్రాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. – మాదాపూర్
ఆకర్షణగా రామాయణ ప్రధాన ఘట్టాల చిత్రాలు మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ అర్ట్ గ్యాలరీలో ఆయన కుమారుడు వేణుగోపాల్‌రావు అధ్వర్యంలో రివైవింగ్ ది రూట్స్ పేరిట ఏర్పాటు చేసిన చిత్రప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటుంది. 1940 నుంచి 2012 వరకూ గీసిన 250 చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు. రామాయణాన్ని కళ్లకు కట్టినట్టు ప్రతి సన్నివేశాన్నీ చిత్రరూపంలో గీసి సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేశారు. రామాయణంలోని ప్రధాన ఘట్టాలను చిత్రప్రదర్శన ద్వారా నేటి యువతరం తెలుకునే విధంగా వివరించారు. యువతరం చిత్రరంగంలో రాణించడానికి ఈ ప్రదర్శన స్ఫూర్తినిస్తుందని పలువురు చిత్రకారులు చెబుతుండడం విశేషం. నేటి యువకళాకారులకు చిత్రకళపై ఆకర్షణ పెరిగేందుకు ఈ ప్రదర్శన తోడ్పడుతుందన్నారు. ఫిబ్రవరి 5 వరకూ నిర్వహించనున్న ఈ ప్రదర్శనను నగరంలోని వివిధ కళాశాలల విద్యార్థులు సందర్శిస్తున్నారు.
సంస్కృతి, సంప్రదాయాలు తెలిసేలా...
కళాకారుడు శేషగిరిరావు చిత్రాలు సందేశాత్మకంగా ఉంటాయి. యువతను ఆలోచింప జేస్తాయి. ఆయన చిత్రరంగంలో రాణించేందుకు ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నాడు. నేటి భవిష్యత్తు తరాలకు తెలిసేలా ఆయన కోడలు కొండపల్లి నిహారిక చిత్రకళా తపస్వి కొండపల్లి శేషగిరిరావు పేరిట జీవిత చరిత్రను రాశారు. ప్రతి ఒక్కరూ కుటుంబాలతో కలసి చూడాల్సిన ప్రదర్శన. – డాక్టర్ కె.లక్ష్మి ఆర్ట్‌గ్యాలరీ డైరెక్టర్
ప్రదర్శన ఉపయోగకరం..
చిత్రరంగంలో రాణిస్తున్న వారికి ఈ ప్రదర్శన ఎంతో ఉపయోగకరం. రామాయణ ఘట్టాలను చిత్రరూపంలో అద్భుతంగా చిత్రించారు. వీటి ద్వారా సంస్కృతి, సాంప్రదాయాలను నేటి తరానికి తెలియజెప్పొచ్చు. చిత్రకారులు వీటి ద్వారా ఎన్నో మెళకువలను తెలుసుకోవచ్చు. – కీర్తి, జేఎన్‌ఏఎఫ్‌యూ విద్యార్థిని
ఇవీ చదవండి: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ : తీసుకున్నోడికి తీసుకున్నంత!
గ్లోబల్ పాప్ స్టార్ జెన్నీ స్కిన్ కేర్ సీక్రెట్ : రెండే రెండు ముక్కల్లో!
Comments
Please login to add a commentAdd a comment