Art Exhibition
-
ఆకట్టుకుంటున్న ‘రివైవింగ్ రూట్స్’.. ఆర్ట్ ఎగ్జిబిషన్
సాలార్జంగ్ మ్యూజియం, ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడమీ వంటి మ్యూజియాలలో ప్రదర్శనకు ఉంచిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, చారిత్రక చిహ్నాలు (రాణి లక్ష్మీబాయి, రుద్రమదేవి, అక్కన్న, మాదన్న) ఇతర స్థానిక ప్రముఖుల నుంచి పౌరాణిక వ్యక్తులు, శకుంతల సిరీస్‌కు ప్రసిద్ధి. సందేశాత్మక, సంస్కృతి, సంప్రదాయాల చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ ఆయన చిత్రాలే. ఆయనే కళాకారుడు డాక్టర్ కొండపల్లి శేషగిరిరావు. ఆయన వేసిన చిత్రాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. – మాదాపూర్ ఆకర్షణగా రామాయణ ప్రధాన ఘట్టాల చిత్రాలు మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ అర్ట్ గ్యాలరీలో ఆయన కుమారుడు వేణుగోపాల్‌రావు అధ్వర్యంలో రివైవింగ్ ది రూట్స్ పేరిట ఏర్పాటు చేసిన చిత్రప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటుంది. 1940 నుంచి 2012 వరకూ గీసిన 250 చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు. రామాయణాన్ని కళ్లకు కట్టినట్టు ప్రతి సన్నివేశాన్నీ చిత్రరూపంలో గీసి సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేశారు. రామాయణంలోని ప్రధాన ఘట్టాలను చిత్రప్రదర్శన ద్వారా నేటి యువతరం తెలుకునే విధంగా వివరించారు. యువతరం చిత్రరంగంలో రాణించడానికి ఈ ప్రదర్శన స్ఫూర్తినిస్తుందని పలువురు చిత్రకారులు చెబుతుండడం విశేషం. నేటి యువకళాకారులకు చిత్రకళపై ఆకర్షణ పెరిగేందుకు ఈ ప్రదర్శన తోడ్పడుతుందన్నారు. ఫిబ్రవరి 5 వరకూ నిర్వహించనున్న ఈ ప్రదర్శనను నగరంలోని వివిధ కళాశాలల విద్యార్థులు సందర్శిస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయాలు తెలిసేలా...కళాకారుడు శేషగిరిరావు చిత్రాలు సందేశాత్మకంగా ఉంటాయి. యువతను ఆలోచింప జేస్తాయి. ఆయన చిత్రరంగంలో రాణించేందుకు ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నాడు. నేటి భవిష్యత్తు తరాలకు తెలిసేలా ఆయన కోడలు కొండపల్లి నిహారిక చిత్రకళా తపస్వి కొండపల్లి శేషగిరిరావు పేరిట జీవిత చరిత్రను రాశారు. ప్రతి ఒక్కరూ కుటుంబాలతో కలసి చూడాల్సిన ప్రదర్శన. – డాక్టర్ కె.లక్ష్మి ఆర్ట్‌గ్యాలరీ డైరెక్టర్ ప్రదర్శన ఉపయోగకరం.. చిత్రరంగంలో రాణిస్తున్న వారికి ఈ ప్రదర్శన ఎంతో ఉపయోగకరం. రామాయణ ఘట్టాలను చిత్రరూపంలో అద్భుతంగా చిత్రించారు. వీటి ద్వారా సంస్కృతి, సాంప్రదాయాలను నేటి తరానికి తెలియజెప్పొచ్చు. చిత్రకారులు వీటి ద్వారా ఎన్నో మెళకువలను తెలుసుకోవచ్చు. – కీర్తి, జేఎన్‌ఏఎఫ్‌యూ విద్యార్థినిఇవీ చదవండి: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ : తీసుకున్నోడికి తీసుకున్నంత!గ్లోబల్ పాప్ స్టార్ జెన్నీ స్కిన్ కేర్ సీక్రెట్ : రెండే రెండు ముక్కల్లో! -
'పాజ్ అండ్ రిఫ్లెక్ట్' : ఆర్ట్ ఎగ్జిబిషన్, సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు
కళల కాణాచి హైదరాబాద్ నగరం మరో ప్రత్యేకమైన ఆర్ట్ ఎగ్జిబిషన్‌కు వేదిక కానుంది. మాదాపూర్‌లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ వేదికగా ఢిల్లీ ఆర్ట్ మాగ్నమ్ ఆధ్వర్యంలో ప్రముఖ ఆర్ట్ క్యూరియేటర్ అన్నపూర్ణ ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ను నిర్వహించనున్నారు. ప్రముఖ ఆర్టిస్టులు ధ్రువ్ పటేల్, దుష్యంత్, రఘు, ముఖ్తార్ అహ్మద్‌లు తమ ప్రత్యేకమైన కళాఖండాలను ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించనున్నారు. చిత్రకళా రంగంలో సరికొత్త కోణాన్ని కళా ప్రేమికుల ముందుకు తీసుకువస్తున్నారు. ఉరుకుల, పరుగుల యాంత్రిక జీవితంలో ఒక్క క్షణం ఆగి ఆస్వాదించడమే ఈ పదర్శన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.ఆర్టిస్ట్ రఘు తనదైన శైలితో ఆకట్టుకుంటారనీ, అలాగే ఆర్టిస్ట్ ముఖ్తార్ అహ్మద్ వర్షం, ధూళి కారణంగా పాడుబడ్డ భవనాలు చిత్రాలు ప్రత్యేకంతా నిలువనున్నాయి. ధృవ్ పటేల్ లంగూర్ల చిత్రలతోనూ, ఆర్టిస్ట్ దుష్యంత్ ఆర్ట్ లో వాటర్ కలర్స్ చిత్రాలను వీక్షకులను బాగా ఆకర్షించ నున్నాయి. ఈ ఆర్టిస్టులు అంతా కలిసి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొత్తగా పరిచయం చేస్తారు. ఈ ప్రదర్శన కేవలం కళ ప్రదర్శన మాత్రమే కాదు, అందరినీ ఒక అడుగు వెనక్కి తీసుకుని, జీవితంలో సాధారణ ఆనందాలను ఆస్వాదించేలా ప్రేరేపిస్తుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇంటిలిజెన్స్ ఐజీ సుమతి, అలాగే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డా.కోట నీలిమ హాజరు కానున్నారు. వివరాలు : 2024 సెప్టెంబర్ 1న, ఆదివారం ఉదయం 11 గంటలు.వేదిక: మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ,ప్రదర్శన వివరాలు : సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు, ఉదయం 11 నుంచి రాత్రి 8 వరకు. -
ఎన్మ్యాక్లో ఆకట్టుకుంటున్న ఆర్ట్ ఎగ్జిబిషన్.. తరలివచ్చిన ప్రఖ్యాత ఆర్టిస్టులు
-
ఎన్మ్యాక్లో భారీ ఆర్ట్ ఎగ్జిబిషన్.. సందడి చేసిన ఇషా అంబానీ, రణ్వీర్ సింగ్
ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్లో భారీ ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ‘రన్ యాస్ స్లో యు క్యాన్’ (Run as slow as you can) పేరిట టాయిలెట్ పేపర్ అనే మ్యాగజైన్ ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. జులై 22న ప్రారంభమైన ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ అక్టోబర్ 22 వరకు సుదీర్ఘంగా కొనసాగనుంది. ఏడేళ్ల లోపు చిన్నారులు, సీనియర్ సిటిజెన్లు, ఆర్ట్ విద్యార్థులకు ఈ ప్రదర్శన పూర్తిగా ఉచితమని కల్చరల్ సెంటర్ పేర్కొంది. ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన కళ్లు చెదిరే కళాకృతులు చిన్నారులు, యువతను అమితంగా ఆకట్టుకుంటాయని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ చైర్పర్సన్ నీతా అంబానీ కుమార్తె ఇషా అంబానీ పేర్కొన్నారు. ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రఖ్యాత కళాకారులు, ఔత్సాహికులు తరలివచ్చారు. వీరితో కలిసి ఇషా అంబానీ సందడి చేశారు. ఇదీ చదవండి ➤ IPL 2023: ఫ్రీగా చూపించినా.. వేల కోట్లు సంపాదించారు! రంగురంగుల కార్నివాల్, 10,000 అరటిపండు బుడగలతో నిండిన స్విమ్మింగ్ పూల్, వింటేజ్ కారు, విలాసవంతమైన మొసలి ఆసనం, కళాకృతంగా తీర్చిదిద్దిన గోడలు వంటివి మంత్రముగ్ధులను చేస్తాయని, సందర్శకులు నచ్చినన్ని ఫొటోలు తీసుకోవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించి బనానా పూల్‌లో ఆటలాడుతూ సందడి చేశారు. -
తిరుమలలో శిల్పకళా ప్రదర్శనను ప్రారంభించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి
-
ఇండో జపనీస్ బ్రిడ్జ్ ఇకెబనా
సాక్షి, హైదరాబాద్: ఇండో జపనీస్ దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్ల పూర్తయిన సందర్భంగా నగరంలోని మాదాపూర్‌లో అద్భుతమైన పూల ప్రదర్శనను ఏర్పాటు చేశారు హైదరాబాద్ ఇకెబనా చాప్టర్ బృందం. జపాన్‌కు అలంకరణ విధానమై ఇకెబనా... పూలతో అద్భుతమైన కళాఖండాలను ఎలా చేయవచ్చో చెబుతుంది. ఈ ఆర్ట్ ద్వారా పువ్వుల కొమ్మలతో వేర్వేరు రూపాలను తయారు చేసి ప్రదర్శించారు హైదరబాద్ చాప్టర్ ఆఫ్ ఓహర ఇకెబనా. ఇండో జపనీస్ దేశాల మధ్య స్నేహాన్ని, ఒకరిపై మరొకరి అభిమానాన్ని చాటిచెప్పేలా ముదిత్ మత్సురి థీమ్‌తో ఈ ప్రదర్శన చాప్టర్ సభ్యులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జపనీస్ ఫెస్టివల్ లో ఇకెబనా, ఒరిగమి, జపనీస్ మార్షల్ ఆర్ట్స్ ఈ ప్రదర్శనలో చూపించారు. మనం జరుపుకునే పండుగల పరమార్థం వచ్చేలా ఈ ప్రదర్శనను తయారు చేశామని హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ నిర్మల అగర్వాల్ తెలిపారు. ప్రకృతి ఒడిలో జీవించడం అన్నివేళలా సాధ్యం కాదు, కాబట్టి ప్రకృతిని ఇంట్లోకి ఆహ్వానించడం అన్నమాటే ఆర్ట్ అన్నారు మాజీ డిజి జయ చంద్ర. ఇకబన ఆర్ట్ ప్రకృతికి దగ్గర చేస్తూ.. ఒక్క పువ్వుతో కూడా ఎంతో అందంగా కళా ఖండాలను తయారు చేయవచ్చని తెలిపారు. వినూత్నంగా ఏర్పాటు చేసిన ఈ ఇకెబనా ఎగ్జిబిషన్ అందరినీ ఆకర్షిస్తోంది. -
‘ఊపిరి’ సినిమాలో సీన్ మాదిరిగా, పికిల్ ఆర్ట్ 4 లక్షలు.. నెటిజన్ల ట్రోలింగ్
‘ఊపిరి’ సినిమా చూశారా? అందులో మోడర్న్ ఆర్ట్ ఎగ్జిబిషన్‌కు వెళ్లిన హీరో... జనం వాటికి ఎందుకన్ని లక్షల పెడుతున్నారో అర్థంకాక.. నవ్వుకుంటాడు. ఇంటికొచ్చి తనూ ఓ పెయింటింగ్ వేసి లక్షలకు అమ్మేస్తాడు. గుర్తుందా? అచ్చం అలాంటి సంఘటనే ఆస్ట్రేలియా లో జరిగింది. ఆర్టిస్ట్ మాథ్యూ గ్రిఫిన్... మెక్‌డొనాల్డ్స్ చీజ్ బర్గర్ తింటుండగా, అందులోని ఓ పికిల్ పీస్ వెళ్లి సీలింగ్‌కు తగిలింది. తెల్లని సీలింగ్‌పై అదో అద్భుతమైన చిత్రంగా తోచిందతనికి. ఇంకేముంది... ఆ పాపులర్ పికిల్‌తో చిత్రాన్ని రూపొందించి.. ఓ ఆస్ట్రేలియన్ ఎగ్జిబిషన్లో ఉంచాడు. దానికి ‘పికిల్’ అని పేరు పెట్టి, రూ.4లక్షలు ధర నిర్ణయించాడు. సిడ్నీ ఎగ్జిబిషన్‌లోని ఫైన్ ఆర్ట్స్‌లో ప్రదర్శించిన 4 ఆర్ట్ వర్క్స్‌లో అదీ ఒకటి. జూలై 30 వరకు జరిగిన ఈ ఎగ్జిబిషన్ వివరాలను సిడ్నీ ఫైన్ ఆర్ట్స్ ఇన్ స్టాగ్రామ్ పేజ్‌లో పంచుకున్నారు. అంతే.. అది చూసిన నెటిజన్స్ ట్రోలింగ్ మొదలుపెట్టారు. ‘నేను టీనేజర్‌గా ఉన్నప్పుడు మెక్‌డొనాల్డ్స్‌కు వెళ్లి అలా చేసినందుకు నన్ను పోలీసులు అక్కడి నుంచి తరిమారు. ఇప్పుడు మాత్రం కళాఖండమైంది’ అంటూ ఓ నెటిజన్ స్పందించారు. ఇక ‘ఇలాంటి ఆర్ట్‌వర్క్‌ను ఎలా ప్రదర్శిస్తారు?’ అంటూ చిరాకు పడ్డవారూ ఉన్నారు. అయితే ‘ఆన్లైన్లో ఆ పెయింటింగ్‌పై వచ్చిన హాస్యా స్పద స్పందనను పట్టించుకోవద్దు’ అంటున్నా డు ఫైన్ ఆర్ట్స్ డైరెక్టర్ ర్యాన్ మూరే. ఫన్నీగా ఉన్నంత మాత్రాన దానికున్న విలువ, దాని అర్థం మారిపోదని చెబుతున్నాడు. -
ఆహా ! అనిపించిన ఫుడ్ ఆర్ట్ ఎగ్జిబిషన్
న్యూయార్క్: అందరూ అన్ని బొమ్మలు గీస్తారు.. కానీ ఆమె బొమ్మలు చాలా చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఆమె బొమ్మలు చూస్తే మీకు నోరు ఊరుతుంది.. తెలంగాణకు చెందిన మన తెలుగుబిడ్డ అమెరికాలో ఏర్పాటుచేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్ ఆహుతుల చేత ఆహా అనిపించుకుంది. న్యూజెర్సీలో ఉంటున్న సరస్వతీ టీకే ఎప్పుడూ సరికొత్తగా ఆలోచిస్తూ ఉంటుంది. అమెరికాలో ఫుడ్ ఆర్ట్‌కు మంచి క్రేజ్ ఉంది. అయితే ఆ ఫుడ్ ఆర్ట్స్ అంతా అమెరికన్ ఫుడ్స్ మీదే ఉంటాయి. అసలు మనం కూడా మన తెలుగు వంటకాలను, భారతీయ వంటకాలపై బొమ్మలు వేస్తే ఎలా ఉంటుంది..? మన వంటకాలు కూడా తెలియని వాళ్లకు కచ్చితంగా తెలుస్తాయి కదా..! ఇలాంటి ఆలోచనలతో మన ఆహార సంస్కృతిని కూడా విదేశీయులకు సరికొత్తగా పరిచయం అవుతుందనే భావనతో సరస్వతీ టీకే మన భారతీయ ఆహార చిత్రాలపై దృష్టి పెట్టింది. ఎంతో కళాత్మకంగా, సృజనాత్మకంగా ఫుడ్ ఐటమ్స్ చిత్రాలు గీసి చక్కటి రంగులు అద్దింది. అవి బొమ్మలా..? నిజమైనవా అనే రీతిలో ఆ చిత్రాలను రూపుదిద్దింది. ఇలా తన అభిరుచితో వేసిన చిత్రాలన్నింటితో సరస్వతి ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. సృజనాత్మకతను నిత్యం ప్రోత్సాహించే నాట్స్ బోర్డు చైర్ విమెన్ అరుణ గంటి ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. మన భారతీయ సంస్కృతిని, ఆహారపు అలవాట్లను విశ్వవ్యాప్తం చేయాలంటూ సరస్వతి టీకేని నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి ప్రోత్సహించారు. నాట్స్ బోర్డ్ అఫ్ డైరెక్టర్ రాజ్ అల్లాడ కూడా ఎగ్జిబిషన్ తిలకించారు. చదవండి: న్యూజిలాండ్‌లో తెలుగు సాహితీ సదస్సు -
పుష్ప, RRR, ఆచార్య : ఆర్టిస్ట్ సమంతా అద్భుతమైన పాట వింటే..
సాక్షి, హైదరాబాద్: భారతీయ సినిమాలో గొప్ప గొప్ప సినిమాలన్నీ ఆర్ట్ రూపంలో దర్శనమిస్తే ఎలా ఉంటుంది. వెండి తెరపై ఒక మూవీని అవిష్కరించే అన్ని క్రమాలను ఒక థీమ్‌గా ఎంచుకుని కళాకారులు పనిచేస్తే. ఈ ఆలోచనే అద్భుత కళాఖండాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రముఖ కార్టూనిస్టు, దర్శకులు బాపు, రమణలు సినిమా మొత్తాన్ని పర్ఫెక్ట్గా బొమ్మలు గీసుకొని ఆ తరువాత సినిమా తీసేవారట. అలాగే తెలుగు, హిందీ భాషల్లో బ్లాక్ బస్టర్ సినిమాలు, సినిమా తయారయ్యేందుకు సంబంధించి వివిధ దశలు, రంగాలు, స్టార్ హీరోలు, లెజెంట్రీ నటీ నటుల పట్ల గౌరవ సూచకంగా ఆర్ట్ క్యూరేటర్ అన్నపూర్ణ మడిపడగ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఆర్ట్ ఎగ్జిబిషన్లో కొలువు దీరిన వినూత్నమైన , అద్భుతమైన చిత్రాలను ‘చిత్రం’ షోలో చూద్దాం. ఆర్టిస్టులు రకరకాల థీమ్‌లతో బొమ్మలు వేయడం, వాటిని ప్రదర్శనకు పెట్టడం అందరికీ తెలుసు. ఇందులో ప్రతీ ఆర్టిస్టుకు వారికంటూ ఒక ప్రత్యేక శైలి( సిగ్నేచర్) ఉంటుంది. దాని ఆధారంగా తమ ప్రతిభకు అద్దంపడుతూ అద్భుతమైన ఆర్ట్స్‌ను ప్రదర్శించారు. వీటిని పరిశీలిస్తే.. ఇలా కూడా ఆర్ట్ వర్క్‌ను రూపొందించవచ్చా అని ఆశ్చర్యపోవడం మన వంతవుతుంది. అనేక ఆర్ట్ ఎగ్జిబిషన్స్‌ను సక్సెస్ చేస్తూ, ఔరా అనిపించే ఎగ్జిబిషన్స్‌తో ఆకట్టుకుంటూ, గొప్ప మహిళా ఆర్ట్ క్యూరేటర్‌గా పాపులర్ అయిన అన్నపూర్ణ మడిపడగ ఎగ్జిబిషన్ విశేషాలను సాక్షి.కామ్‌తో పంచుకున్నారు. భారతీయ సినిమాకు సంబంధించిన థీమ్‌తో దీన్ని రూపొందించడం విశేషం. సినిమాలోని 24 క్రాప్ట్స్ ఇన్స్పిరేషన్తో ఆ ఆర్ట్స్‌ను రూపొందించామని అన్నపూర్ణ వివరించారు. యాక్రిలిక్, ఆయిల్, వుడ్, సీడీలు, ఫ్లోర్ టైల్స్, 24 కారెట్స్ గోల్డ్, పెన్సిల్ స్కెచ్, ఇలా విభిన్న మీడియమ్స్పై దేశవ్యాప్తంగా 30 మంది గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఇందులో పాల్గొన్నారని ఆమె తెలిపారు. ఈ ఎగ్జిబిషన్‌కోసం ఆర్టిస్ట్‌ల తపన గురించి వివరించారు. అలాగే కళకు జెండర్ లేదని, చాలామంది మహిళా ఆర్టిస్టులు కూడా అద్బుతమైన ఆర్ట్స్ రూపొందించారని అన్నారామె. అలాగే తమ ఎగ్జిబిషన్‌కు అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, రెండేళ్ల తమ శ్రమ ఫలించిందంటూ అన్నపూర్ణ సంతోషం వ్యక్తం చేశారు. కోలకతా బైస్డ్ ఆర్టిస్ట్ దెబాషిస్ సమంత బాలీవుడ్ లెజెండ్రీ మూవీ ‘పాకీజా’ కి ట్రిబ్యూట్‌గా ఒక కళాఖండాన్ని రూపొందించారు. అంతేకాదు తన అభిమాన హీరోయిన్ మీనాకుమారీపై ప్రేమతో సమంతా పాట పాడి మరీ మ్యూజికల్ ట్రిబ్యూట్ అందించారు. సంవత్సరన్నర నుంచి 40 రోజుల పాటు శ్రమించి తమ బుర్రకు, కుంచెకు పదును పెట్టి అద్బుతమైన కళా ఖండాలను ప్రదర్శించారు. ముఖ్యంగా టాలీవుడ్ సెన్సేషన్ మూవీలు, పుష్ప, ఆర్ఆర్ఆర్, ఆచార్య థీమ్‌లను తీసుకుని డిఫరెంట్ ఆర్ట్ వర్క్ తీర్చిదిద్దారు. హ్యాండ్ మేడ్ పోస్టర్స్ థీమ్‌తో వీటిని ప్రదర్శించడం హైలైట్. ఫస్ట్ విమెన్ ఆఫ్ ఇండియన్ విమెన్ అనే కాన్సెప్ట్‌తో సినిమా రంగంలో మహిళ సేవలకు గౌరవ సూచకంగా నిలిచిన ఆర్ట్‌పీస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సాక్షి కార్టూనిస్ట్ శంకర్ రూపొందించిన కార్టూన్స్ మరో ఆకర్షణ. ముఖ్యంగా సినిమాలోని స్టోరీ బోర్డును ఎంచుకుని నగేష్ గౌడ్ అలనాటి రెండు బ్టాక్ బస్టర్ మూవీలు అడవి రాముడు, భక్తకన్నప్ప పెయింటింగ్స్ రూపొందించారు. ఒక స్టోరీ బోర్డులాగా తీర్చి దిద్దినట్టు నగేష్ గౌడ్ వెల్లడించారు. ఎంతో కమిట్మెంట్, డెడికేషన్, తపన ఉంటే ఇలాంటి అద్భుతాలు వెలుగులోకి రావు నిజంగా ఆర్టిస్టులకు ధన్యవాదాలు అంటూ విజిటర్స్ ఎంజాయ్ చేశారు. -
ప్రపంచంలోనే తొలి చైల్డ్ ఆర్టిస్ట్
న్యూఢిల్లీ: చిన్నారులు ముద్దులొలికే మాటలు, వారి హావాభావాలు చూస్తుంటే పెద్దలకు తమ సమయం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. కొంత మంది పిల్లలు చిన్న వయసులో సహజ సిద్ధంగానే వాళ్లలో కొన్ని కళలు దాగి ఉంటాయి. పాట పాడటం, డ్యాన్స్ చేయడం లేదా మంచి జ్ఞాపకశక్తి తదితర టాలెంట్లను పిల్లలో చూసుంటాం. అయితే అతి చిన్న వయసులోనే కుంచె పట్టుకున్న అత్యంత ఆకర్షణీయమైన చిత్రాలను గీయగల పిల్లలను చూసి ఉండం కదా!. కానీ ఢిల్లీకి చెందిన మూడేళ్ల ఏళ్ల అర్మాన్ రహేజా సోలోగా ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టి మరీ అందర్నీ ఆకర్షించేలా కాన్వాస్‌పై రంగురంగుల పెయింటింగ్‌లు వేసి అందరీ మన్నలను పొందుతున్నాడు. (చదవండి: వామ్మో...ఓవర్ హెడ్ వైర్ల పై పెద్ద పాము) అంతే కాదండోయ్ భారత్‌లోనే తొలిసారిగా అత్యంత పిన్న వయసులో ఇండియా హాబిటాట సెంటర్లో సోలోగా ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించిన కళాకారుడుగా చరిత్రలో నిలవడమే కాక ప్రపంచంలోనే అత్యంత పిన్న కళాకారుల్లో ఒకడిగా కూడా స్థానం దక్కించుకున్నాడు. అయితే ఆర్మాన్ తన చూట్టు ఉన్న పరిసరాలను నుండి స్ఫూర్తి పొందడమే కాక దానికి తన సృజనాత్మక శక్తిని జోడించి అక్రిలిక్, వాటర్ కలర్స్ పోస్టర్ రంగులను ఉపయోగించి కాన్వాస్‌పై రమణీయమైన చిత్రాలను గీస్తాడు. అర్మాన్ తల్లి కాశిష్ రహేజా ఎఫ్ఐడీఎంలో ఇంటిరియర్ డిజైనర్, తండ్రి నయన్ రహేజా న్యూఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో ఆర్కిటెక్ట్. ఈ మేరకు అర్మాన్ తల్లి కాశిష్ మాట్లాడుతూ....గతేడాది రంగులతో ఆడుతుంటే అది తనలోని అసాధారణమైన ప్రతిభకు సంకేతంగా చెబుతున్నాడని అనుకోలేదు. తల్లిదండ్రులు కూడా పిల్లల అసాధారణ ప్రతిభ గుర్తించిగలిగితేనే వారికి అవసరమైన మార్గదర్శకత్వం అందించి ప్రోత్సహించగలరు. ఈ విషయంలో స్కూల్ టీచర్ భావన, అమ్మమ్మ నిర్మల్ రహేజా కూడా అర్మాన్ ఆలోచనలను క్రమబద్ధీకరించడంలో సహాయపడట మేకాక తన ఆలోచనలకు ఒక నమూనాను రూపొందించగలిగేలా అర్మాన్ని మలిచారు. సూపర్నోవా, జెల్లీ ఫిష్ వంటి టైటిల్స్‌తో అర్మాన్ ప్రతి కాన్వాసులను ఎంత అద్భుతంగా గీస్తాడో కూడా వివరించారు. పైగా తమ కుమారుడి పనికి తగిన గుర్తింపు లభించినందుకు సంతోషంగా ఉంది" అని అన్నారు. (చదవండి: టాయిలెట్‌కి వెళ్లింది.. బిడ్డతో బయటకు వచ్చింది) -
శిల్పం చేసి.. ప్రాణం పోసి
కడప కల్చరల్: జిల్లాకు చెందిన చిత్ర, శిల్పకారుడు, రాష్ట్ర ప్రభుత్వ కళారత్న (హంస) పురస్కార గ్రహీత గొల్లపల్లి జయన్న శిల్పకళా ప్రదర్శన నగర వాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రెండో రోజు ఆదివారం నగరం నలుమూలల నుంచి కళాభిమానులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ప్రదర్శనను తిలకించారు. పల్లెటూరు, బాల్యాన్ని ఈ శిల్పాలు మళ్లీ గుర్తుకు తెచ్చాయని, ఆ అనుభూతిని అందించినందుకు జయన్నకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జయన్నను ‘సాక్షి’ పలుకరించింది. ♦ ప్రదర్శనకు ఆదరణ ఎలా ఉంది? మనవైపు శిల్పకళ తక్కువేనని చెప్పాలి. ప్రసార మాధ్యమాల ద్వారా శిల్పకళకు మంచి ఆదరణ ఉంది. రెండు రోజులుగా పాఠశాల, కళాశాలల విద్యార్థులే కాకుండా నగర వాసులు కుటుంబాలతో కలిసి వస్తుండడంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ♦ పుట్టిన గడ్డపై తొలి ప్రదర్శన..మీ అనుభూతి ఎలా ఉంది? చాలా రోజులుగా జిల్లాలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేయాలని చూశాను. ఇప్పుడు అవకాశం లభించింది. శిల్పాలను చూసిన వారు జయన్న మన జిల్లా వాడా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ప్రాంతానికి శిల్పం అరుదైన కళా ప్రక్రియ గనుక కాస్త కొత్తగా అనిపిస్తోంది. ♦ పేదరికం నేపథ్యం నుంచి ఈ స్థాయికి ఎలా ఎదిగారు? బద్వేలులోని కుగ్రామంలో పేద కుటుంబంలో పుట్టాను. చదువు, బతుకుదెరువు కోసం బద్వేలు పట్టణంలో సైన్‌బోర్డులు, బ్యానర్లు రాసేవాడిని. కళ, విద్య దాహం తీరక హైదరాబాదుకు చేరి జర్నలిజం, శిల్పంతోపాటు సాధారణ డిగ్రీ కూడా చేశాను. వృత్తి రీత్యా పలు రాష్ట్రాలు తిరగడంతో శిల్పకళలో వైచిత్రిని తెలుసుకున్నా. నా శిల్పాలన్నీ పల్లెటూరిని ప్రతిభింబిస్తాయి ♦ జిల్లాలో తర్వాత ప్రదర్శన ఎక్కడ? చర్చలు జరుగుతున్నాయి. త్వరలో తేదీ నిర్ణయించే అవకాశం ఉంది. గుంటూరు జిల్లా కొండవీడులో కూడా ప్రదర్శన నిర్వహించాలని కోరుతున్నారు. ♦ యువ శిల్పకారులకు మీ సందేశం ? సందేశం ఇచ్చే అంతడి వాడిని కాను. జిల్లాలో కవులు, కళాకారులకు కొదవ లేదు. అవకాశాలు లేకనే అభివృద్ధికి నోచుకోవడం లేదు. వైవీయూ రాకతో ఇక ఆ కొరత తీరుతుంది. పట్టుదలతో శ్రమిస్తే ఫలితం తప్పక లభిస్తుంది. -
సీఎం సారూ.. హ్యాపీ బర్త్‌డే
సీఎం కేసీఆర్‌కు పలువురు కళాకారులు ‘ఆర్ట్‌ఫుల్’గా బర్త్‌డే విషెస్ చెప్పారు. ఆదివారం మాదాపూర్ చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలోకేసీఆర్ చిత్రాలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. పలువురు కళాకారులు తీర్చిదిద్దిన 50 చిత్రాలను ఇక్కడ ఉంచారు. మాదాపూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కేసీఆర్ చిత్రాల ప్రదర్శనను తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి, మహిళలు, పిల్లల అభివృద్ధి శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్ తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా భావించారన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేసీఆర్ చిత్ర పటాలను ప్రదర్శనలో ఉంచినట్లు తెలిపారు. జన్మదిన కేక్‌ను కట్ చేశారు. 50 చిత్రాలు ప్రదర్శనలో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 23వ తేదీ వరకు చిత్ర ప్రదర్శన ఉంటుందన్నారు. దీనికి క్యూరెటర్‌గా ప్రముఖ ఆర్టిస్ట్ రమణారెడ్డి వ్యవహారించారు. కార్యక్రమంలో ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డాక్టర్ కె.లక్ష్మి, పలువురు చిత్ర కళాకారులు తదితరులు పాల్గొన్నారు. -
నేడు కార్టూనిస్ట్ శంకర్ చిత్రాల ప్రదర్శన
సాక్షి, హైదరాబాద్: రాజకీయ వ్యంగ్య చిత్రాల్లో తనదైన ముద్ర వేసిన ప్రముఖ ఆర్టిస్ట్, ‘సాక్షి’కార్టూనిస్ట్ శంకర్ కార్టూన్ చిత్రాల ప్రదర్శన శనివారం రవీంద్రభారతి ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీలో సాయంత్రం 6 గంటలకు జరగనుంది. ఇండియా ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ‘ది ఇంక్డ్ ఇమేజ్’పేరుతో నిర్వహించే ఈ 20 ఏళ్ల రాజకీయ చిత్రాల ప్రదర్శన ప్రారంభోత్సవానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రముఖ చిత్రకారులు తోట వైకుంఠం, సూర్యప్రకాశ్, ప్రజా కవి గోరటి వెంకన్న, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, డైరెక్టర్ మామిడి హరికృష్ణ, తదితరులు పాల్గొంటారు. -
ఆర్ట్ ఎగ్జిబిషన్
-
ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన కేటిఆర్
-
ఎర్రమంజిల్‌లో ఆర్ట్ ఎగ్జిబిషన్
-
'వాయిస్ ఆఫ్ ఇమేజస్'ఆర్ట్ ఎగ్జిబిషన్
-
వాయిస్ ఆఫ్ ఇమేజెస్ ఆర్ట్ ఎగ్జిబిషన్
-
అందుబాటు ధరల్లో ఆర్ట్
సాక్షి, వీకెండ్ ప్రతినిధి: ఆర్ట్‌పీస్ అనగానే అత్యంత ఖరీదైనవి మాత్రమేనని నిరాశపడే కళాభిమానులకు కొదవలేదు. ఈ నేపథ్యంలో చిత్రాలను అందరికీ అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో బంజారాహిల్స్‌లోని గ్యాలరీ స్పేస్‌లో శనివారం ‘అఫర్డబుల్ ఆర్ట్’ షో ప్రారంభించారు. ప్రసిద్ధ చిత్రకారులు లక్ష్మాగౌడ్, ఏలె లక్ష్మణ్, జేఎంఎస్ మణి, రమేశ్ గుర్జాల, ఆనంద్ పంచాల్ తదితరుల చిత్రాలను అందుబాటులో ఉంచిన్నట్లు గ్యాలరీ స్పేస్ డైరెక్టర్ టి.హనుమంతరావు తెలిపారు. ప్రదర్శన ఈ నెలాఖరు వరకు కొనసాగుతుంది. -
‘తిరంగా’ ఆర్ట్..
మారేడుపల్లి: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మారేడుపల్లి అశ్విని నగర్లో ఆదివారం ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. రుక్మిణి ఆర్ట్స్ అకాడమీ రాజశ్రీ కళాపీఠం ఆధ్వర్యంలో రూపొందించిన పలు చిత్రాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. స్వాతంత్య్ర వేడుకలు, తివర్ణ పతాకం, మహాత్మ గాంధీతో పాటు పలు చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ఈనెల 22 వరకు ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు శ్రీకాంత్ ఆనంద్ తెలిపారు. -
వివక్షపై యుద్ధం
సాక్షి,మాదాపూర్: సమాజంలో మహిళల పట్ల వివక్ష కొనసాగుతోందని వ్యంగ చిత్రకళ నిపుణులు పి.శంకర్ పేర్కొన్నారు. మాదాపూర్‌లోని చిత్రమయి ఆర్ట్ గ్యాలరీలో ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పి.శంకర్, డాక్టర్, చిత్ర కళాకారుడు ఎం.చంద్రమౌళి వేసిన చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు. ప్రదర్శన 31వ తేదీ వరకు కొనసాగుతుంది. కార్యక్రమంలో ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డాక్టర్ కె.లక్ష్మీ, డాక్టర్ రవికుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వ్యర్థాలు..రమణీయ శిల్పాలై..
-
అరుదైన కళారూపం
‘‘మేం హైదరాబాద్కువచ్చిన తొలినాళ్ల నుంచీ తోటవైకుంఠం సాబ్, లక్ష్మాగౌడ్ సర్ వంటి వారితో పరిచయం ఉంది. తొలినాళ్లలోనే వారి వర్క్స్‌ను దగ్గర నుంచి పరిశీలించడం నా అదృష్టం’’ అని అంటున్నప్పుడు ఒక కళాకారుడ్ని కేవలం అభిమానించడమే కాదు ఎంత బాగా గౌరవించాలో కూడా తనకు తెలుసని అంజు మాటల ద్వారా నిరూపిస్తారు. - అంజుపొద్దార్ ఎం.ఎఫ్ హుస్సేన్‌కు ఆతిథ్యం... ఎం.ఎఫ్.హుస్సేన్ ప్రత్యేకంగా గీసి ఇచ్చిన కాన్వాస్ ఆమె ఇంటి గోడలపై కొలువుదీరింది. ‘‘ఆయన ఎప్పుడు వచ్చినా మా ఇంట్లో ఉండడానికి ఇష్టపడేవారు’’ అని గుర్తు చేస్తారు. రోజుకు అరడజను పుస్తకాలు చదివేసిన రోజులున్నాయని తన పఠానాభిరుచిని వివరిస్తారు. సొంతంగా దుస్తుల్ని డిజైన్ చేసుకునే ఈ మల్టీ టాలెంటెడ్ సిటిజన్‌కు కళాకారులకు అద్భుతమైన ఆతిధ్యం ఇవ్వడంలో సిటీలో మంచి పేరుంది. ఆమె నిర్వహించే పార్టీల్లో అతిథుల జాబితాలో కళాకారులు కచ్చితంగా చోటు ఉంటుంది. నాలుగు దశాబ్ధాల అనుబంధం... జూబ్లీహిల్స్‌లోని ఫిలింనగర్లో నివసించే అంజూపొద్దార్ కళాభిమాని మాత్రమే కాదు రచయిత, పర్యాటకురాలు, ఆర్ట్ కలెక్టర్, టెక్స్టైల్ ఎక్స్పర్ట్... వీటన్నింటికీ మించి విజయవంతమైన గృహిణి కూడా. ఢిల్లీ దగ్గరలోని మోడీనగర్‌కు మార్వాడీ ఫ్యామిలీకి చెందిన అంజుపొద్దార్... నగ రంతో పెనవేసుకున్న అనుబంధాన్ని పరిశీలిస్తే ఇక్కడే పుట్టి పెరిగిన వారికన్నా మిన్నగా అనిపిస్తుంది. ‘‘చిన్నప్పుడు దాదాపు ప్రతి రోజూ చార్మినార్‌కు వెళ్లేదాన్ని. అక్కడి రణగొణధ్వనులు, షాప్వాలాల మాటలు అవన్నీ నాకు ఇష్టం. ఇప్పటికీ ఖాళీ దొరికితే చార్మినార్‌కు వెళ్లడానికి ఇష్టపడతాను. అలాగే రెండు వారాల క్రితం మక్కామసీదుకి వెళ్లాను. చౌమహల్లా ప్యాలెస్‌కు వెళతాను. నేను పక్కా హైదరాబాదీని. ఈ నగరంలోని అణువణువూ నాకిష్టమైనదే’’ అని చెబుతున్నప్పుడు ఈ భాగ్యనగరి పట్ల పెంచుకున్న మమకారం ఆమె మాటల్లో మెరుస్తుంది. అష్ట్టైశ్వర్యాలు... మీ సంపద ఏమిటి? అంటే ఇవిగో అంటూ తన ‘అష్టైశ్వర్యాలు’ తీసుకొచ్చి పరుస్తారు. ఆమె రచించిన ఎనిమిది పుస్తకాలను పరిశీలిస్తే... అంజు పొద్దార్లోని మరో కోణం మనకు గోచరిస్తుంది. ‘‘అమెరికాలో బీఈ చేసి తిరిగొచ్చాక మానస సరోవర్ వెళ్లా. ఆ అనుభవం ఎంతో గొప్పగా అనిపించి తొలిసారి జర్నీ టు హెవెన్ పేరుతో పుస్తకం రాశా’’ అంటూ గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత మరో రెండు ట్రావెలాగ్లు, వెడ్డింగ్ ఇన్ ద హౌస్, ట్రెడిషిన్స్ ఆఫ్ ఇండియా, కుక్ బుక్, తన తండ్రిగారి బయోగ్రఫీ, 108 షేడ్స్ ఆఫ్ డివినిటీ...’’ పుస్తకాలను ఆమె అందించారు. వీటిలో అత్యధికం భారతీయతకు, సంస్కృతీ సంప్రదాయాలకు పట్టం కట్టేవే కావడం గమనార్హం.‘‘పుస్తకాల త ర్వాత నేను అంతగా ఇష్టపడే వి చేనేతలు’’ అంటారామె. అందుకే పోచంపల్లి, ఉప్పాడ, వెంకటగిరి, ఖాదీ వంటివి మాత్రమే కాదు నవాబులు, నిజాంలు మెచ్చిన, ప్రస్తుతం అంతరిస్తున్న హస్త కళల్లో ఒకటైన టెరియరుమాల్ (చీరాల ప్రాంతపు పురాతన చేనేత)ను సైతం ఆమె తన వస్త్రధారణలో భాగం చేసుకుంటారు.(సిటీప్లస్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆమె ధరించిన చీర టెరియరుమాల్ చేనేతదే) పెండెంట్స్లో పెయింటింగ్స్... ‘‘నా జీవితంతో మమేకమైన అంశాల్లో అత్యంత ముఖ్యమైనది చిత్రకళ’’ అంటున్నప్పుడు ఆమెలో ఒక సాధారణ కళాభిమాని కనపడతారు. అయితే ఆమె ఆ చిత్రకళతో మమేకమైన తీరు చూసినప్పుడు మాత్రం అసాధారణ కళాపిపాసి ఉట్టిపడతారు. ‘‘నా చీరలు, పెండెంట్స్లో సైతం పెయింటింగ్స్‌కు చోటుఉంటుంది’..అంటూ తన ‘చిత్ర’ప్రపంచాన్ని ఆవిష్కరిస్తారామె. అంతేకాదు... తను అభిమానించే ఎమ్ ఎఫ్ హుస్సేన్, తోట వైకుంఠం, లక్ష్మాగౌడ్ వంటి చిత్రకారులకు ఆమె తన ఇంట్లో పట్టం కట్టిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక్కో గదిని ఒక్కో చిత్రకారుడికి అంకితం ఇచ్చిన ఆమె కళాభిమానం అబ్బురపరుస్తుంది. సోషలైట్ అంటే అసహ్యం... ‘‘సోషలైట్ పిలుపు ఇష్టపడను. చిత్రకారులనో, మరెవరినో నేను ప్రమోట్ చేస్తున్నాను అంటే కూడా ఒప్పుకోను. ఎవరికైనా అంతర్గత ప్రతిభ ఉంటే అది వెలికి రావడానికి నా వంతు సాయం చేస్తాను. అది నా సంతోషం కోసం మాత్రమే. నేను గిఫ్ట్స్‌గా కూడా ఆర్ట్ వర్క్స్ మాత్రమే ఇస్తాను. ఫ్యాషన్‌లో ఆర్ట్ లేని రోజుల్లో చిత్రాలను రూ.50కి కూడా కొన్నాను. ఇప్పుడవి ఏ ధరలో ఉన్నాయో మీకు తెలుసు. అయినా నా అభిమానంలో మార్పులేదు. లక్ష్మాగౌడ్, జగదీష్ మిట్టల్, ఎం.ఎఫ్. హుస్సేన్‌ల దగ్గర నుంచి ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్న ఉదయలక్ష్మి, సరస్వతి వంటి చిత్రకారులను కూడా అభిమానిస్తాను’’ అంటారామె. బహుముఖపాత్రల్లో రాణించిన అంజుపొద్దార్... విజయవంతమైన గృహిణి కూడా. తన పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్ది, మనవళ్లు, మనవరాళ్ల ఆటపాటలతో తన జీవితానికి మరింత కళను అద్దుకుంటున్న అంజుపొద్దార్... మరికొన్ని ప్రజోపయోగ అంశాలపై పుస్తకాలు రాయాలనుందని, మరెందరో ఔత్సాహిక కళాకారుల విజయాలకు సాక్షిగా నిలవాలనుందని తన భవిష్యత్తు లక్ష్యాలను వివరిస్తారు. కళాభిమానులెందరో... అంజుపొద్దార్లు కొందరే... - ఎస్.సత్యబాబు -
‘అస్థి’త్వ అందాలు...
న్యూయార్క్‌లోని ఓ గ్యాలరీలో జెన్నిఫర్ ట్రాస్క్ ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. ఆమె తయారు చేసిన కళాకృతులను చూసి సందర్శకులంతా ముగ్ధులైపోతున్నారు. ఒకామె అడిగింది... ‘‘వీటిని ఎలా చేశారు’’ అని. ‘‘ఎముకలతో చేశాను’’ అంది జెన్నిఫర్. సందర్శకురాలు అవాక్కయ్యింది. ఎముకలతో ఇంతటి అద్భుత సృష్టిని చేయవచ్చా అంటూ ఆశ్చర్యపోయింది. జెన్నిఫర్ తయారు చేసిన కళాఖండాలను చూస్తే ఎవరైనా అలాంటి అనుభూతికే లోనవుతారు. ఎక్కడైనా, ఏ జంతువు ఎముక అయినా కనిపిస్తే ఇబ్బందిగా ముఖం పెడతారు ఎవరైనా. కానీ జెన్నీ మాత్రం ఆనందంగా దాన్ని చేతిలోకి తీసుకుంటుంది. ఇంటికి తెచ్చి, రసాయనాలతో శుభ్రం చేసి, వాటితో అందమైన కళాకృతులను తయారు చేస్తుంది. వాల్ హ్యాంగింగ్స్, పేపర్ వెయిట్స్, టేబుల్ మీద అలంకరించుకునే ఫ్లవర్ బొకేలు, కంఠాభరణాలు, ఉంగరాలు... ఒకటేమిటి, ఎముకలతో వేటినయినా, ఎంత అందాన్నయినా సృష్టించగలదు జెన్నిఫర్. ఇలా ఎముకలతో ఎందుకు అని అడిగితే కాస్త ఎమోషనల్‌గా సమాధానం చెబుతుంది జెన్నీ. ‘‘ప్రతి ప్రాణి శరీర నిర్మాణానికీ మూలం ఎముకలే. ఆ ప్రాణి చనిపోయాక మిగిలేది కూడా ఎముకలే. అంటే ప్రాణం అశాశ్వతం, ఎముక శాశ్వతం’’ అంటుంది. ప్రాణం పోయాక శరీరం మట్టిలో కలిసినా ఎముకలు అలాగే నిలిచివుంటాయి కదా! అందుకే వాటితో ఏది చేసినా కలకాలం నిలిచేవుంటుందనే ఉద్దేశంతోనే తన కళకు సాధనంగా ఎముకల్ని ఎంచుకున్నానంటుందామె. కారణం ఏదయితేనేం... జెన్నీ కళ కళ్లను కట్టిపడేస్తోందన్నది మాత్రం వాస్తవం!