ఆహా ! అనిపించిన ఫుడ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ | Saraswati TK Food Art Exhibition In New York | Sakshi
Sakshi News home page

ఆహా ! అనిపించిన ఫుడ్ ఆర్ట్ ఎగ్జిబిషన్

Published Sat, Jun 11 2022 1:10 PM | Last Updated on Sat, Jun 11 2022 1:12 PM

Saraswati TK Food Art Exhibition In New York - Sakshi

న్యూయార్క్: అందరూ అన్ని బొమ్మలు గీస్తారు.. కానీ ఆమె బొమ్మలు చాలా చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఆమె బొమ్మలు చూస్తే మీకు నోరు ఊరుతుంది.. తెలంగాణకు చెందిన మన తెలుగుబిడ్డ అమెరికాలో ఏర్పాటుచేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్ ఆహుతుల చేత ఆహా అనిపించుకుంది. 

న్యూజెర్సీలో ఉంటున్న సరస్వతీ టీకే ఎప్పుడూ సరికొత్తగా ఆలోచిస్తూ ఉంటుంది. అమెరికాలో ఫుడ్ ఆర్ట్‌కు మంచి క్రేజ్ ఉంది. అయితే ఆ ఫుడ్ ఆర్ట్స్ అంతా అమెరికన్ ఫుడ్స్ మీదే ఉంటాయి. అసలు మనం కూడా మన తెలుగు వంటకాలను, భారతీయ వంటకాలపై బొమ్మలు వేస్తే ఎలా ఉంటుంది..? మన వంటకాలు కూడా తెలియని వాళ్లకు కచ్చితంగా తెలుస్తాయి కదా..! ఇలాంటి ఆలోచనలతో మన ఆహార సంస్కృతిని కూడా విదేశీయులకు సరికొత్తగా పరిచయం అవుతుందనే భావనతో సరస్వతీ టీకే మన భారతీయ ఆహార చిత్రాలపై దృష్టి పెట్టింది.



ఎంతో కళాత్మకంగా, సృజనాత్మకంగా ఫుడ్‌ ఐటమ్స్‌ చిత్రాలు గీసి చక్కటి రంగులు అద్దింది. అవి బొమ్మలా..? నిజమైనవా అనే రీతిలో ఆ చిత్రాలను రూపుదిద్దింది. ఇలా తన అభిరుచితో వేసిన చిత్రాలన్నింటితో సరస్వతి ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. సృజనాత్మకతను నిత్యం ప్రోత్సాహించే నాట్స్ బోర్డు చైర్ విమెన్ అరుణ గంటి ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. మన భారతీయ సంస్కృతిని, ఆహారపు అలవాట్లను విశ్వవ్యాప్తం చేయాలంటూ సరస్వతి టీకేని నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి  ప్రోత్సహించారు.  నాట్స్‌ బోర్డ్ అఫ్ డైరెక్టర్ రాజ్ అల్లాడ కూడా ఎగ్జిబిషన్‌ తిలకించారు.

చదవండి: న్యూజిలాండ్‌లో తెలుగు సాహితీ సదస్సు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement