అమెరికాలోని ప్రవాస భారతీయులు ఆనందించే విషయం చోటు చేసుకుంది. న్యూయార్క్ నగరంలోని ఓ వీధికి గణేష్ స్ట్రీట్‌గా నామకరణం చేస్తూ అక్కడి స్థానిక ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. న్యూయర్క్ నగరంలోని క్వీన్స్‌కౌంటీలో ఉన్న బౌనే వీధిని ఇపై గణేష్ స్ట్రీట్‌గా పిలవనున్నారు.
అమెరికాలో స్థిరపడిన భారతీయులు 1977లో ఈ ఆలయాన్ని వల్లభ గణపతి దేవస్థానం పేరుతో నిర్మించారు. కాలక్రమంలో స్థానికంగా గణేష్ టెంపులగా ప్రసిద్ధి చెందింది. ఉత్తర అమెరికాలో అత్యంత పురాతన గుడిగా ఈ ఆలయానికి పేరుంది. దీంతో ఆలయం ప్రతిష్టకు గుర్తుగా బౌనే వీధికి గణేష్ స్ట్రీట్‌గా పేరు మార్చారు. ఈ పేరు మార్చే కార్యక్రమాన్ని ప్రవాస భారతీయులు వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాన్సుల్ జనరల్ రణ్‌ధీర్ జైస్వాల్ పాల్గొన్నారు.
బానిసత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో బౌనే అలుపెరుగని పోరాటం చేశారు. దీంతో ఈ వీధికి బౌనే స్ట్రీట్‌గా పేరు వచ్చింది. అనేక ఏళ్లపాటు ఈ వీధిని బౌనే స్ట్రీట్‌గా పిలుస్తు వస్తున్నారు. ఇకపై ఈ వీధిని బౌనే స్ట్రీట్/ గణేష్ స్ట్రీట్‌గా పిలవనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment