
జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి అమెరికాలో అవమానం జరిగింది. న్యూయార్క్ నగరంలో మాన్‌హట్టన్ సమీపంలోని యూనియన్ స్క్వేర్‌లో ఉన్న గాంధీజీ నిలువెత్తు విగ్రహాన్ని 2022 ఫిబ్రవరి 4 రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. 1980వ దశకంలో న్యూయార్క్ నగరంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దేశం వెలుపల గాంధీజీ విగ్రహాలు అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా కూడా ఒకటి కావడం గమనార్హం.
గాంధీజీ విగ్రహం ధ్వంసం చేయడం పట్ల గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (గోపియో) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దారుణానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని గోపియో అధ్యక్షుడు శివేందర్ సోఫాట్ డిమాండ్ చేశారు. ఈ తప్పుడు పనికి పాల్పడిన వారిని త్వరగా గుర్తించాలంటూ న్యూయార్క్ మేయర్‌ని డిమాండ్ చేశారు.
On Mahatma Gandhi statue in New York City being defaced:@MEAIndia @IndianEmbassyUS @DrSJaishankar @NYCMayor @NYPDPC @globalnyc pic.twitter.com/Sr0Q2RQIWn
— India in New York (@IndiainNewYork) February 5, 2022