Mahatma Gandhi statue
-
Manipur Violence: పార్లమెంటు ఆవరణలో రేపు విపక్షాల నిరసన
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. పార్లమెంటులో చర్చ జరగకుండా ప్రతిష్టంభన నెలకొనడంతో సభ వెలుపల నిరసనల ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించాయి. సోమవారం పార్లమెంటు ప్రాంగణంలో మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట నిరసనకు దిగనున్నాయి. ఈ మేరకు ఇండియా కూటమికి చెందిన పార్టీల ఎంపీలు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశం కానున్నారు. ఆ సమావేశంలో సభలో అనుసరించే వ్యూహాలపై చర్చిస్తారు. సభ లోపలికి వెళ్లడానికి ముందు ప్రధాని ప్రకటనపై డిమాండ్ చేస్తూ మహాత్మగాంధీ విగ్రహం ఎదుట నిరసనకు దిగనున్నారు. మరోవైపు పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే మణిపూర్ అంశంలో చర్చ లేవెనెత్తాలని టీఎంసీ డిమాండ్ చేసింది. బీజేపీ సభ్యులే సభాకార్యక్రమాలను అడ్డుకుంటున్నారని టీఎంసీ ఎంపీ డెరెక్ ఒ బ్రియన్ మండిపడ్డారు. ఆ రాష్ట్రాలపై పెదవి విప్పరెందుకు: బీజేపీ ప్రతిపక్ష పారీ్టలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మహిళలపై అకృత్యాలు జరుగుతున్నా ఎవరూ నోరు ఎందుకు మెదపడం లేదని బీజేపీ ప్రశ్నించింది. రాజస్తాన్, పశి్చమ బెంగాల్, బిహార్ వంటి రాష్ట్రాల్లో మహిళలపై నేరాలు, ఘోరాలు జరుగుతూ ఉంటే, మణిపూర్ చుట్టూ ప్రతిపక్ష పారీ్టలు రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. -
ఐరాస ప్రధాన కార్యాలయం వద్ద గాంధీజీ విగ్రహం
ఐక్యరాజ్యసమితి: న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయానికి భారత్ మహాత్మాగాంధీ విగ్రహాన్ని బహూకరించింది. డిసెంబర్ 14వ తేదీన భద్రతా మండలి అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా విదేశాంగ మంత్రి జై శంకర్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రముఖ భారతీయ శిల్పి, పద్మశ్రీ అవార్డు గ్రహీత రామ్ సుతార్ ఈ శిల్పాన్ని మలిచారు. ఈయనే గుజరాత్లో నర్మదా నది తీరంలో ఏర్పాటు చేసిన సర్దార్ పటేల్ విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని డిజైన్ చేశారు. ఐరాస ప్రధాన కార్యాలయం ప్రతిష్టాత్మక నార్త్‌లాన్‌లో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు ఐరాసలో భారత్ శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ తెలిపారు. ఐరాస ప్రధాన కార్యాలయం ఆవరణలో భారత్ 1982లో ఇచ్చిన ఏకైక కానుక 11వ శతాబ్దం నాటి నల్లరాతి సూర్య విగ్రహం, జర్మనీ అందజేసిన బెర్లిన్ గోడలో ఒక భాగం, దక్షిణాఫ్రికా బహూకరించిన నెల్సన్ మండేలా కాంస్య విగ్రహం, పాబ్లో పికాసో వేసిన గుయెర్నికా చిత్రం తదితరాలున్నాయి. -
1,000 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలతో మహాత్ముడి విగ్రహం
లక్నో: జాతిపిత మహాత్మాగాంధీ స్వాతంత్య్రంతో పాటు స్వచ్ఛభారత్ మిషన్‌పైనా ప్రజల్లో అవగాహన కల్పించారు. స్వచ్ఛాభారత్ మిషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మహాత్ముడి విగ్రహంతోనే అవగాహన కల్పిస్తంది ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా నగరపాలక సంస్థ. క్విట్ ఇండియా ఉద్యమం 80వ వార్షికోత్సవం సందర్భంగా 20 అడుగుల మార్చింగ్ మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ విగ్రహాన్ని ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి రూపొందించారు. హెచ్‌సీఎల్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో నోయిడా అడ్మినిస్ట్రేషన్ సుమారు 1,000 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి విగ్రహం తయారు చేసింది. ఈ విగ్రహాన్ని సెక్టార్ 137లో ఏర్పాటు చేశారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు గుర్తు చేసేలా మహాత్ముడి విగ్రహాన్ని ప్లాస్టిక్ వ్యర్థాలతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు అధికారులు. ఒకేసారి వాడి పడేసే ప్లాస్టిక్‌పై జులై 1వ తేదీ నుంచి నిషేధం విధించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు కృషి చేస్తూనే ఉన్నారు. మరోవైపు.. రాజస్థాన్‌లో ఖాళీ పాల ప్యాకెట్లు తీసుకొస్తే లీటర్ పెట్రోల్‌పై డిస్కౌంట్ ఇస్తున్నారు ఓ పెట్రోల్ పంపు యజమాని. ఒకేసారి వాడి పడేసే ప్లాస్టిక్ వ్యర్థాలను ఇష్టారీతిలో ఎక్కడపడితే అక్కడ పడేయకుండా అవగాహన కల్పించేందుకే ఇలా చేస్తున్నట్లు చెప్పారు అశోక్ కుమార్ ముంద్ర. Unveiled 20ft tall statue of #MarchingBapu installed by HCL Foundation at Sec-137 Noida. The Structure has been made using 1000 kg of Plastic Waste as a tribute to Mahatma Gandhi's #SwachhBharat Mission. @PankajSinghBJP @tejpalnagarMLA @noida_authority @CeoNoida @Manojguptabjp pic.twitter.com/LaTvpK4aQ8 — Dr. Mahesh Sharma (@dr_maheshsharma) August 8, 2022 ఇదీ చదవండి: Viral: 16 ఏళ్ల బాలుడి ముక్కు కొరికేసిన రాజకీయ నేత.. అంత కోపం దేనికో? -
పల్నాడు జిల్లాలో తెలుగు తమ్ముళ్ల వికృత చేష్టలు
పెదకూరపాడు(పల్నాడు జిల్లా): జాతిపిత మహాత్మా గాంధీని టీడీపీ అవమానపరిచింది. గాంధీ విగ్రహానికి రాజకీయ రంగు పులిమింది. పల్నాడు జిల్లా కంభంపాడులోని గాంధీజీ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టి జాతిపితను అవమానించారు. ఇటీవల టీడీపీ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఆ పార్టీ జెండాలు, తోరణాలు కట్టారు. కొందరు టీడీపీ కార్యకర్తలు వికృత చేష్టలకు పాల్పడి గాంధీ విగ్రహం చేతికి టీడీపీ జెండాలు కట్టారు. దీంతో సర్వత్రావిమర్శలు వెల్లువెత్తాయి. విషయం తెలుసుకున్న పెదకూరపాడు సీఐ వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి గాంధీ విగ్రహానికి కట్టిన టీడీపీ జెండాలను తొలగించారు. చదవండి: చంద్రబాబును దత్తపుత్రుడు ఎందుకు ప్రశ్నించలేదు: సీఎం జగన్ -
న్యూయార్క్‌లో బాపూజీ విగ్రహం ధ్వంసం
జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి అమెరికాలో అవమానం జరిగింది. న్యూయార్క్ నగరంలో మాన్‌హట్టన్ సమీపంలోని యూనియన్ స్క్వేర్‌లో ఉన్న గాంధీజీ నిలువెత్తు విగ్రహాన్ని 2022 ఫిబ్రవరి 4 రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. 1980వ దశకంలో న్యూయార్క్ నగరంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దేశం వెలుపల గాంధీజీ విగ్రహాలు అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా కూడా ఒకటి కావడం గమనార్హం. గాంధీజీ విగ్రహం ధ్వంసం చేయడం పట్ల గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (గోపియో) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దారుణానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని గోపియో అధ్యక్షుడు శివేందర్ సోఫాట్ డిమాండ్ చేశారు. ఈ తప్పుడు పనికి పాల్పడిన వారిని త్వరగా గుర్తించాలంటూ న్యూయార్క్ మేయర్‌ని డిమాండ్ చేశారు. On Mahatma Gandhi statue in New York City being defaced:@MEAIndia @IndianEmbassyUS @DrSJaishankar @NYCMayor @NYPDPC @globalnyc pic.twitter.com/Sr0Q2RQIWn — India in New York (@IndiainNewYork) February 5, 2022 -
బామ్మగారి బాపూజీ విగ్రహం
దుగ్గొండి: ఆమె వయసు అరవై దాటింది. పూలమ్ముకుంటేనే పట్టెడన్నం దొరుకుతుంది. ఆ బీదరాలికి జాతిపిత మహాత్మాగాంధీ అంటే అంతులేని గౌరవం.. అదే ఆమెను మహాత్ముని విగ్రహావిష్కరణకు పురిగొలిపింది. పూలమ్ముకుని సంపాదించిన సొమ్ముతో శిథిలావస్థలో ఉన్న మహాత్ముడి విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయించింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రేబల్లే గ్రామంలో పూలమ్ముకుని బతికే నౌగరి బుచ్చమ్మ తాత 1965లో గ్రామంలో మహా త్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అది ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. తాత ఏర్పాటు చేసిన విగ్రహం స్థానంలో బుచ్చమ్మ పూలవ్యాపా రం చేసి వెనకేసుకున్న డబ్బు రూ.25 వేలతో మహా త్ముడి నూతన విగ్రహాన్ని తెప్పించి బుధవా రం స్వయంగా ఆవిష్కరించింది.. దీంతో గ్రామస్తులు, మండల ప్రజలు నౌగరి బుచ్చమ్మను అభినందిం చారు. కార్యక్రమంలో సర్పంచ్ గటిక మమత, ఉప సర్పంచ్ పకిడె మైనర్‌బాబు, పాల్గొన్నారు. -
పార్లమెంట్లో పోటాపోటీ నిరసనలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద అధికార బీజేపీ, ప్రతిపక్ష ఎంపీల నడుమ శుక్రవారం కొద్దిసేపు ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. రాజ్యసభ నుంచి సస్పెండైన 12 మంది ఎంపీలతోపాటు పలువురు విపక్ష సభ్యులు ఐదు రోజులుగా గాంధీజీ విగ్రహం వద్ద బైఠాయించి, నిరసన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం బీజేపీ ఎంపీలు కూడా పోటీగా ప్లకార్డులు చేతబూని అక్కడికి చేరుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఎంపీలు కొద్దిసేపటి తర్వాత పార్లమెంట్ ప్రాంగణంలోనే ఉన్న అంబేద్కర్ విగ్రహం దాకా ర్యాలీగా వెళ్లారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అంటూ నినాదాలు చేశారు. గాంధీజీ విగ్రహం వద్ద చోటుచేసుకున్న పరిణామాలపై పార్లమెంట్ ఉభయ సభల్లో ఇరు పక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. బీజేపీ సభ్యుల తీరుపై విపక్ష ఎంపీలు సభాపతులకు ఫిర్యాదు చేశారు. 12 మంది ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్న ప్రాంతంలోకి అధికార పార్టీ ఎంపీలు అనుమతి లేకుండా చొరబడ్డారని రాజ్యసభలో ఆర్జేడీ సభ్యుడు మనోజ్‌ఝా ఆరోపించారు. లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి ఇదే అంశాన్ని లేవనెత్తారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ స్పందిస్తూ.. గాంధీజీ విగ్రహం వద్ద నిరసన తెలిపే హక్కు బీజేపీ సభ్యులకు కూడా ఉందన్నారు. పార్లమెంట్‌లోని సెక్యూరిటీ సిబ్బందిపై ప్రతిపక్షాల దాడిపై బీజేపీ ఎంపీలు నిరసన తెలిపారన్నారు. సీబీఐ, ఈడీ డైరెక్టర్ పదవీ కాలం గరిష్టంగా ఐదేళ్లు! కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) డైరెక్టర్ల పదవీ కాలాన్ని గరిష్టంగా ఐదేళ్ల దాకా పొడిగించేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులను కేంద్రం శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ మేరకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సవరణ) బిల్లు, ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్మెంట్(సవరణ) బిల్లును కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సభలో ప్రవేశపెట్టారు. గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్‌ల స్థానంలో ఈ బిల్లులను తీసుకొచ్చారు. వీటిని కాంగ్రెస్ సభ్యులు శశి థరూర్, కె.సురేష్, అధిర్ రంజన్ చౌదరి, ఆర్ఎస్పీ సభ్యుడు ఎన్.కె.ప్రేమ్‌చంద్రన్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతరాయ్ తీవ్రంగా వ్యతిరేకించారు. పదవీ కాలం పొడిగింపు అనేది సీబీఐ, ఈడీ డైరెక్టర్లు కేంద్ర ప్రభుత్వానికి మరింత విధేయులుగా మారడానికి దోహదపడుతుంది తప్ప ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. గతంలో ఉన్న చట్టాలు సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీ కాలంపై ఎలాంటి పరిమితి విధించలేదని జితేంద్ర గుర్తుచేశారు. తాము ఐదేళ్ల పరిమితిని విధిస్తూ చట్టం తీసుకొస్తున్నామని వివరించారు. సీబీఐ, ఈడీ డైరెక్టర్లకు రెండేళ్ల పదవీ కాలాన్ని ఖరారు చేస్తూ వినీత్ నారాయణ్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. -
కీడు శంకించిందని గాంధీ విగ్రహాన్ని పక్కన పడేశారు
నవాబుపేట: కీడు శంకించిందని మహాత్మా గాంధీ విగ్రహాన్ని పక్కనపడేశారు. ఏళ్ల తరబడి చెట్టు కింద బాపూజీ విగ్రహం పడి ఉంది. ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. మూఢనమ్మకాలతో ప్రతిష్ఠించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో పెట్టిన చోటే శిథిలమైంది. వివరాలిలా ఉన్నాయి. సుమారు 40 ఏళ్ల కిందట మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని గురుకుంటలో గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని అక్కడి ఉపాధ్యాయులు, గ్రామస్తులు తెప్పించారు. చదవండి: మణికొండ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతికి బాధ్యత వహిస్తాం: మంత్రి కేటీఆర్ ఆ సమయంలో ఓ ఉపాధ్యాయుడికి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కీడు శంకించిన గ్రామస్తులు ఆ విగ్రహాన్ని పోమాల్కు పంపించారు. అక్కడ విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండగా ఓ గ్రామ పెద్ద అనారోగ్యాంతో ఇబ్బందులు పడ్డాడు. దీంతో 30 ఏళ్ల కిందట మండల కేంద్రం నవాబుపేటకు తీసుకొచ్చారు. ఇక్కడా ప్రతిష్టించేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో విగ్రహం కాస్తా శిథిలావస్థకు చేరింది. చదవండి: మద్యం తాగితే రూ.10 వేల జరిమానా -
75 వేల ఇనుప వ్యర్థాలతో గాంధీ విగ్రహం
సాక్షి, తెనాలి: శిల్పకళలో ఖండాంతర ఖ్యాతిని కలిగిన గుంటూరు జిల్లా తెనాలి పట్టణం, ఇనుప వ్యర్థాలతో తీర్చిదిద్దిన కళాకృతుల్లోనూ ఘనత వహిస్తోంది. ఇనుప వ్యర్థాలతో జీవం ఉట్టిపడే శిల్పాలను చేస్తూ, విదేశాల్లోనూ ప్రదర్శిస్తోన్న స్థానిక సూర్య శిల్పశాల నిర్వాహకులైన తండ్రీకొడుకులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు తాజాగా భారీ ధ్యాన గాంధీ విగ్రహాన్ని రూపొందించారు. 10 అడుగుల ఎత్తుతో తయారు చేసిన ఈ విగ్రహానికి 75 వేల ఇనుప నట్లను వినియోగించారు. గిన్నిస్ బుక్ రికార్డు కోసం చేసిన ఈ విగ్రహాన్ని ఆదివారం తమ శిల్పశాల ఎదుట ప్రదర్శనకు ఉంచారు. చదవండి: ఐఏఎఫ్‌లో ఫ్లైయింగ్ ఆఫీసర్‌గా ఆటో డ్రైవర్ కుమారుడు కృష్ణానది ఒడ్డున ఘాతుకం: ప్రేమికుడిని బంధించి.. యువతిపై అత్యాచారం -
గాంధీజీని ఐస్ చేశాడు!
జాతిపితమహాత్మకు మనదేశంలోనేగాక ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. ఆయన పేరు మీద అనేక కార్యక్రమాలతోపాటు విగ్రహాలు కూడా పెట్టుకుంటుంటారు. తాజాగా జాతిపితకు మరోఅరుదైన గౌరవం దక్కింది. కెనడాలోని ప్రముఖ హోటల్ ఒకటి మహాత్ముని ఐస్ విగ్రహాన్ని తయారు చేసింది. కెనడాలోని క్యూబెక్ సిటీలో ఉన్న ‘హోటల్ డి గ్లేస్’లో ఏర్పాటు చేసిన మహాత్ముని మంచు విగ్రహాన్ని ప్రముఖ శిల్పి మార్క్ లిపైర్ చెక్కారు. తొమ్మిది ఐస్ గడ్డలతో ఏడడుగుల మంచు విగ్రహాన్ని ఐదు గంటల్లోనే ఆయన పూర్తి చేశారు. గాంధీ విగ్రహం తయారు చేయడం తనకెంతో సంతోషమని లిపైర్ చెప్పాడు. ఈ ఏడాది భారతదేశం 75 వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోబోతున్న సందర్భంగా ఈ శిల్పాన్ని ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం వెల్లడించింది. టొరంటోలోని ఇండియన్ కాన్సులేట్ ఈ విగ్రహ ఫోటోలను ట్విటర్లో పోస్టు చేస్తూ.. ‘ఆజాదీకా అమత్మహోత్సవ్’ అని హ్యాష్ ట్యాగ్ క్యాప్షన్‌తో ట్వీట్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా హోటల్ డి గ్లేస్ అనేది కెనడా దేశంలో ఐకానిక్ హోటల్. కెనడాలోనే గాక ఉత్తర అమెరికాలో ఉన్న ఏకైక ఐస్ హోటల్ డిగ్లేస్ కావడం విశేషం. -
పెళ్లి విందులో చిందులు.. నేలకొరిగిన ‘మహాత్ముడు’
పాపన్నపేట(మెదక్): పాపన్నపేట మండలం గాజులగూడెం గ్రామంలో పెళ్లి విందులో చిందులు వేస్తున్న కొంతమంది యువకులు ఆదివారం రాత్రి మహాత్మా గాంధీ విగ్రహానికి తగలడంతో అది కింద పడిపోయింది. అయినా సంఘటనకు కారకులైన వారిలో పశ్చాత్తాపం కనిపించలేదని గ్రామస్తులు పేర్కొన్నారు. కాగా మాజీ సర్పంచ్ బాలాగౌడ్ మాట్లాడుతూ విగ్రహాన్ని పునరుద్దరిస్తామని తెలిపారు. పెళ్లి కావడం లేదని.. వెల్దుర్తి(తూప్రాన్): వివాహం కావడం లేదని ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వెల్దుర్తి పంచాయతీ పరిధి ఎల్కపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలిలా.. గ్రామానికి చెందిన కానికె రమేశ్ కుమారుడు గణేష్(24) పట్టణంలోని ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు. రోజుమాదిరిగా ఆదివారం రాత్రి భోజనం ముగించుకొని కుటుంబసభ్యులు నిద్రకు ఉపక్రమించారు. అయితే తెల్లవారు జామున చూసేసరికి గణేష్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న స్థితిలో శవమై కనిపించాడు. వివాహం కావడం లేదని మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకొని ఉంటాడని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై మహేందర్ వెల్లడించారు. చదవండి: బూడిదతో గాంధీ బొమ్మ.. లిమ్కా బుక్‌లో చోటు -
అమెరికాలో గాంధీ విగ్రహానికి అవమానం
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి కొందరు ఖలిస్తానీ వేర్పాటు వాదులు విఫల యత్నం చేశారు. భారత్‌లో వ్యవసాయ చట్టాల రద్దుకి డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా సిక్కు అమెరికన్లు వాషింగ్టన్లో భారత రాయబార కార్యాలయం ఎదుట శనివారం నిరసన ప్రదర్శనకు దిగారు. న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, ఇండియానా, ఓహియో, నార్త్ కరోలినా, మేరీల్యాండ్, వర్జీనియా నుంచి వందలాది మంది సిక్కు యువత కార్లతో ర్యాలీ చేస్తూ వాషింగ్టన్ చేరుకున్నారు. గాంధీ విగ్రహం ఎదుట వారు శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉండగా ఖలిస్తాన్ వేర్పాటు వాదులు జెండాలు చేతపట్టుకొని వారి మధ్యలోకి దూసుకువచ్చారు. ప్రత్యేక ఖలిస్తాన్ నినాదాలు చేస్తూ జెండాలతో గాంధీ విగ్రహం ముఖాన్ని కప్పేసి ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. చదవండి: నెజీరియాలో 400 మంది విద్యార్థుల కిడ్నాప్! అక్కడున్న సీక్రెట్ ఏజెంట్లలో ఒకరు విగ్రహాలను ధ్వంసం చేయడం చట్ట ప్రకారం నేరమని అక్కడ్నుంచి వెళ్లిపోమంటూ సలహా ఇవ్వడంతో వారు పారిపోయారు. ఖలిస్తాన్ వేర్పాటువాదుల ఈ దుశ్చర్యని భారత రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై విచారణ వేగవంతం చేయాలంటూ అమెరికా విదేశాంగ శాఖని కోరింది. దుండగులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. విగ్రహాల ధ్వంసం, కట్టడాలపై దాడులు, స్మృతి చిహ్నాలను అవమానించినా పదేళ్ల వరకు జైలు శిక్ష పడేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఒక చట్టం తీసుకువచ్చారు. ఈ చట్ట ప్రకారం దుండగుల్ని శిక్షించాలంటూ భారత రాయబార కార్యాలయం డిమాండ్ చేసింది. 2000 సంవత్సరం సెప్టెంబర్‌లో మహాత్ముని విగ్రహాన్ని అప్పట్లో భారత ప్రధానిగా ఉన్న అటల్ బిహారి వాజ్‌పేయి ఆవిష్కరించారు. -
వాషింగ్టన్లో మహాత్మ గాంధీ విగ్రహం ధ్వంసం
వాషింగ్టన్ : నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా ఆందోళనలతో అమెరికా అట్టుడుకిపోతోంది. ఈ అల్లర్ల నేపథ్యంలో వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం వెలుపల మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు దుండగలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై అమెరికన్ అధికారులు దర్యాప్తును చేపట్టారు. మినియాపొలిస్ నగరంలో మే 25న పోలీస్ కస్టడీలో ఫ్లాయిడ్ మరణించిన అనంతరం అమెరికా అంతటా నిరసనలు హోరెత్తిన సంగతి తెలిసిందే. కాగా, నిరసనకారులు వెనక్కితగ్గకుంటే శాంతిభద్రతలు కాపాడేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన కలకలం రేపింది. జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతంపై ఆందోళనలతో అట్టుడుకుతున్న అమెరికాలో ఇప్పటికే 40 నగరాల్లో కర్ఫ్యూ విధించగా.. సుమారు 150 నగరాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఆరు రాష్ట్రాలతోపాటు 13 నగరాల్లో అత్యవసర పరిస్థితిని విధించారు. చదవండి : హ్యాండ్సప్.. డోంట్ షూట్! -
దుండగుల దుశ్చర్య : గాంధీ విగ్రహం కూల్చివేత
భువనేశ్వర్ : ఒడిసాలోని బాలాసోర్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో మహాత్మ గాంధీ విగ్రహం నేలమట్టమైంది. గాంధీ జ్ఞాపకార్ధం స్కూలులో కేటాయించిన ఓ గదిని సైతం దుండగులు ధ్వంసం చేశారు. గది పరిసరాల్లో సిగరెట్ ప్యాకెట్లు, తాగిపడేసిన మద్యం బాటిళ్లను చిందరవందరగా పడేశారు. స్కూల్లోకి ప్రవేశించిన దుండగులు గాంధీ విగ్రహాన్ని నేలకూల్చి, తల భాగాన్ని కిందపడవేశారు. కాగా, జూన్ 14న ఈ ఘటన జరిగి ఉంటుందని, వేసవి సెలవల కారణంగా స్కూల్‌ను మూసివేసిన క్రమంలో దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి రాజకీయ కోణం లేదని స్ధానిక పోలీస్ అధికారి సుభాన్షు శేఖర్ నాయక్ పేర్కొన్నారు. స్దానికుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని చెప్పారు. -
గాంధీ బోధనల్లో పరిష్కారం
సియోల్: ఉగ్రవాదం, వాతావరణ మార్పు అనేవి ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న రెండు అతిపెద్ద సమస్యలనీ, వీటికి పరిష్కారం మహాత్మా గాంధీ బోధనల్లో ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సమస్యలను ఎదుర్కోవాలంటే గాంధీ బోధనలు, విలువలను అనుసరించడమే సరైన మార్గమన్నారు. దక్షిణ కొరియాలోని యోన్సీ విశ్వవిద్యాలయంలో ఆ దేశాధ్యక్షుడు మూన్–జే–ఇన్, ఐక్యరాజ్య సమితి (ఐరాస) మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కీ–మూన్‌లతో కలిసి గాంధీ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. భారత్–దక్షిణ కొరియాల మధ్య వ్యూహాత్మక బంధాల బలోపేతం లక్ష్యంగా, మూన్–జే–ఇన్ ఆహ్వానం మేరకు మోదీ గురువారం నుంచి రెండ్రోజులపాటు ఆ దేశంలో పర్యటిస్తున్నారు. బోధనలు, విలువల్లోనే పరిష్కారం.. మానవాళి ఎదుర్కొంటున్న రెండు అతిపెద్ద సమస్యలైన ఉగ్రవాదం, వాతావరణ మార్పులకు గాంధీ బోధనలు, ఆయన జీవిత విలువల్లోనే పరిష్కారం ఉందని మోదీ అన్నారు. ‘మనం గాంధీ జీవితాన్ని పరిశీలిస్తే ఈ రెండు సమస్యలకు పరిష్కారం కనుక్కోగలం. గాంధీ బోధనలు, ఆయన ఇచ్చిన ఐక్యతా స్ఫూర్తి, విలువలు, హింసా మార్గంలో వెళ్తున్న వారి మనసులను అహింసతో మార్చాలంటూ గాంధీ ఇచ్చిన సందేశాలే.. ఉగ్రవాదంపై పోరాటంలో మనకు దారి చూపగలవు’ అని మోదీ తెలిపారు. ఐరాస ప్రధాన కార్యదర్శిగా బాన్ కీ–మూన్ ఉండగానే గాంధీ జయంతిని ప్రపంచ అహింసా దినోత్సవంగా ప్రకటించారని గుర్తు చేసుకున్నారు. తర్వాతి తరాలకు హరిత గ్రహాన్ని అందించడం ముఖ్యమని గాంధీ బోధించారని తెలిపారు. మోదీ దక్షిణ కొరియాలో పర్యటిస్తుండటం ఇది రెండోసారి. -
మహాత్మా.. మోదీని గద్దె దించు!
న్యూఢిల్లీ: గత కొంతకాలంగా ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ బుధవారం వినూత్నంగా నిరసన తెలిపారు. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తలపెట్టిన ర్యాలీలో పాల్గొనేందుకు హస్తినకు వచ్చిన ఆమె.. పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట ప్రార్థన చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని మహాత్మున్ని మమత వేడుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి రాజకీయ పార్టీకి సొంత భావజాలం ఉంటుందని అన్నారు. తాము దేశభక్తిని విశ్వసిస్తున్నామని తెలిపారు. గాంధీ ముందు ప్రార్థన చేయడానికే తాను పార్లమెంటుకు వచ్చినట్టు పేర్కొన్నారు. బీజేపీని, నరేంద్ర మోదీని అధికారంలోంచి తొలగించి దేశాన్ని, ఐక్యతను కాపాడాలని గాంధీజీని ప్రార్థించినట్టు చెప్పారు. తమ ప్రభుత్వంపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఇటీవల మమతాబెనర్జీ కోల్‌కతాలో మూడు రోజుల పాటు దీక్ష చేసిన సంగతి తెలిసిందే. -
గాంధీజీ విగ్రహ నిర్మాణానికి నిరసన సెగ
లిలాంగ్వే, మలావి : తూర్పు ఆఫ్రికా దేశమైన మలావి వాణిజ్య రాజధాని కేంద్రంలో మహాత్మా గాంధీ విగ్రహ నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపి వేయాలని అక్కడి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు 10 మిలియన్ డాలర్ల ఖర్చుతో ఈ విగ్రహాన్ని ఢిల్లీకి చెందిన ఓ సంస్థ నిర్మిస్తోంది. గాంధీజీ.. తన జీవితంలో ఎక్కువ కాలం జాత్యహంకారాన్ని ప్రదర్శించడానికే వెచ్చించారని, అటువంటి వ్యక్తి విగ్రహాన్ని రాజధానిలో నిర్మించడం సబబు కాదని..‘ గాంధీ మస్ట్ ఫాల్’ గ్రూప్ సభ్యులు కోర్టుకు విన్నవించారు. అంతేకాకుండా.. ‘నల్లజాతీయులైన తమకు గాంధీ వల్ల ఎటువంటి లాభం చేకూరలేదు సరికదా, ఆ భావన మాలో మరింత బలంగా నాటుకుపోయింది’ అంటూ మరో పద్దెనిమిది అభ్యంతరాలతో కూడిన లేఖను కోర్టుకు అందజేశారు. సుమారు 3 వేల మంది మలావియన్స్ సంతకం చేసిన ఈ లేఖను, వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు విగ్రహ నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఆఫ్రికా దేశాల్లో గాంధీ విగ్రహ నిర్మాణానికి నిరసన సెగ తగలడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగాయి. 2016లో ఘనాలోని ఓ యూనివర్సిటీలో గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ఘనా ప్రభుత్వం ప్రయత్నించగా.. గాంధీజీని జాత్యహంకారిగా అభివర్ణిస్తూ అక్కడి విద్యార్థులు, ప్రొఫెసర్లు నిరసన తెలియజేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మరో చోట విగ్రహాన్ని నిర్మించాలని నిర్ణయించింది. శాంతి, అహింసా మార్గాలతో భారతదేశాన్ని పరాయి పాలన నుంచి విముక్తి చేసేందుకు తన జీవితాన్ని ధారపోసిన గాంధీజీ.. తొలి ఉద్యమం దక్షిణాఫ్రికాలో మొదలైందన్న విషయం తెలిసిందే. అయితే ఆఫ్రికా దేశాల్లోని కొంతమంది ప్రజలు మాత్రం ఆయనను ఓ జాత్యహంకారిగా, తమ మధ్య విభేదాలు సృష్టించిన వ్యక్తిగా ద్వేషిస్తూ ఉంటారు. -
‘గాంధీ మనకు వ్యతిరేకి.. విగ్రహాలు తీసేయండి’
ఒట్టావా : జాతి వివక్షతకు వ్యతిరేకంగా ఉద్యమనించిన మహాత్మా గాంధీకి వ్యతిరేకంగా కెనెడాలో ఉద్యమం మొదలైంది. ఆయన విగ్రహాలను తొలగించాలంటూ ఒట్టావాలోని ఓ ప్రముఖ విశ్వవిద్యాలయం విద్యార్థులు ధర్నాలు చేపట్టగా.. క్రమక్రమంగా ఆ ఉద్యమం సోషల్ మీడియాలో పెను రూపం దాల్చింది. ఒట్టావాలోని కర్లెటోన్ యూనివర్సిటీలో ప్రముఖుల విగ్రహాలపై చర్చా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా క్యాంపస్ ప్రాంగణంలో ఉన్న గాంధీ విగ్రహాన్ని తక్షణమే తొలగించాలంటూ కొందరు నల్ల జాతీయ విద్యార్థులు ప్రతిపాదన చేశారు. దీనికి మద్ధతు ఇచ్చిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆఫ్రికన్ స్టడీస్ స్టూడెంట్ అసోషియేషన్(IASSA) అధ్యక్షుడు కెన్నెత్ అలియూ విస్తృతంగా ప్రచారం కల్పించాలంటూ పిలుపునిచ్చాడు. ‘గాంధీ నల్ల జాతి వ్యతిరేకి. అంత సముచిత స్థానం ఇవ్వటం సరికాదు. ఆఫ్రికాలో ఆయన వివక్షత ఎదుర్కున్నాడని.. అందుకే ఉద్యమం చేపట్టాడని కథలు చెబుతుంటారు. కానీ, అదంతా నిజం కాదు. స్వార్థ ప్రయోజనాలకే గాంధీ నల్ల జాతి ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఉద్యమాన్ని ఓ ఆయుధంగా వాడుకుని బ్రిటీష్ వాళ్లను బెదిరించాడు. దక్షిణాఫ్రికాలో అణచివేతకు గురవుతున్న భారతీయులను రక్షించుకునేందుకే గాంధీ అలా చేశారు. అలాంటి వ్యక్తిని ఇంతలా గౌరవించాల్సిన అవసరం మనకు లేదు’ అని కెన్నెత్ ఓ ప్రకటన విడుదల చేశాడు. అయితే యూనివర్సిటీ పరిపాలన విభాగం మాత్రం ఆ డిమాండ్‌కు విముఖత వ్యక్తం చేయగా.. పెద్ద ఎత్తున్న పోరాటం చేసేందుకు విద్యార్థులు సిద్ధమయ్యారు. కాగా, ఇదే అలియూ నేతృత్వంలో 2016లో ఘనా యూనివర్సిటీలోని గాంధీ విగ్రహాన్ని తొలగించాలంటూ ప్రయత్నాలు జరిగాయి. అయితే అది కూడా విఫలం కావటంతో మిగతా యూనివర్సిటీల చుట్టూ తిరుగుతూ నల్ల జాతి విద్యార్థులను రెచ్చగొడుతున్నాడంటూ పలువురు ప్రొఫెసర్లు చెబుతున్నారు. -
‘మహాత్మా మమ్మల్ని క్షమించు’
చేబ్రోలు(గుంటూరు జిల్లా) : దేశ స్వాతంత్యం కోసం అహింసా మార్గంలో పోరాడిన మహనీయుడు మహాత్మాగాంధీ విగ్రహానికి మంగళవారం చేబ్రోలులో అవమానం జరిగింది. చేబ్రోలు రజకపేటలో 2004సం.లో స్థానికులు ప్రత్యేక మండపం నిర్మించి మహాత్ముడు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 50సం.ల క్రితం ఇదే ప్రాంతంలో జాతిపిత విగ్రహం ఉండేది. అది శిథిలావస్థకు చేరడంతో 2004లో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మహాత్ముడి విగ్రహం చేతిని, చేతిలోని కర్రను ద్వంసం చేశారు. ఉదయం విగ్రహాన్ని చూసిన స్థానికులు సంఘటనపై విస్మయం వ్యక్తం చేశారు. రజకసంఘం నాయకులు డి.వెంకట్రామయ్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలాన్ని విగ్రహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం
కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెరువు గ్రామంలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి: బొత్స
విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం మహాత్మా గాంధీ విగ్రహాన్ని పరిశీలించారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఉన్న గాంధీజీ విగ్రహాన్ని ఇటీవల అధికారులు తొలగించి సమీపంలోని బుడమేరు కాల్వలో పడేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్షంతో పాటు అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో దిగివచ్చిన అధికారులు ...కూల్చివేసిన స్థానంలోనే గాంధీజీ విగ్రహాన్ని ఆదివారం తిరిగి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ జిల్లా ఇన్చార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాష్ట్ర నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, జిల్లా అధ్యక్షుడు పార్థసారధి తదితరులు ఇబ్రహీంపట్నం విచ్చేసి మహాత్మగాంధీ విగ్రహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా... బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ క్విట్ చంద్రబాబు సేవ్ ఏపీ అని ప్రతి ఒక్కరు నినదించాలన్నారు. గాంధీ విగ్రహానికి అపచారం ఘటనలో చంద్రబాబు క్షమాపణలు చెప్పి... జిల్లా స్థాయి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఆ దేశ పార్లమెంట్ ఆవరణలోనే గాంధీ విగ్రహం!
లండన్: భారత స్వాతంత్ర్యం కోసం ఏ దేశ పాలకులకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ పోరాడారో, ఆ దేశ పార్లమెంటు ఆవరణలోనే మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. బ్రిటిష్ పార్లమెంట్ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటుకు ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరాన్ మద్దతు పలికారు. విన్స్టన్ చర్చిల్, నెల్సన్ మండేలా విగ్రహాల సరసన భారత జాతిపిత విగ్రహం ఏర్పాటుచేయడం సరైన నిర్ణయమే అన్నారు. శాంతి, అహింసల గొప్పతనాన్ని ప్రపంచానికి బోధించిన మహోన్నత వ్యక్తి గాంధీ అని కొనియాడారు. దీంతో బ్రిటన్‌కు భారత్‌తోఉన్న చారిత్రక సంబంధాలు మరింత ధృడపడతాయని పేర్కొన్నారు. శక్తిమంతమైన సమాజాన్ని నిర్మించాలనుకునేవారికి మహాత్ముని బోధనలు మార్గదర్శకాలుగా నిలుస్తాయన్నారు. ఈ ఏడాది ప్రథమార్ధంలోనే గాంధీ విగ్రహన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని కామెరాన్ తెలిపారు. గత ఏడాది యూకే ప్రతినిధి బృందం భారత పర్యటన సందర్భంగా విగ్రహ ఏర్పాటు విషయాన్ని ప్రకటించారు. ప్రవాస భారతీయ ఆర్థిక వేత్త లార్డ్ మేఘనాథ్ దేశాయ్ నేతత్వంలోని 'గాంధీ స్టాట్యూ మెమోరియల్ ట్రస్ట్' ఈ విగ్రహానికి నిధులు సమీకరిస్తోంది, విగ్రహ ఏర్పాటుకు 7 లక్షల 50 వేల పౌండ్లు అవసరమని భావించగా, మూడు నెలల స్వల్ప వ్యవధిలోనే 5 లక్షల పౌండ్లు సమీకరించినట్లు ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. -
సమైక్యాంధ్రకు మద్దతుగా నేడు వైఎసార్సిపి ధర్నా