చేబ్రోలు(గుంటూరు జిల్లా) : దేశ స్వాతంత్యం కోసం అహింసా మార్గంలో పోరాడిన మహనీయుడు మహాత్మాగాంధీ విగ్రహానికి మంగళవారం చేబ్రోలులో అవమానం జరిగింది. చేబ్రోలు రజకపేటలో 2004సం.లో స్థానికులు ప్రత్యేక మండపం నిర్మించి మహాత్ముడు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
సుమారు 50సం.ల క్రితం ఇదే ప్రాంతంలో జాతిపిత విగ్రహం ఉండేది. అది శిథిలావస్థకు చేరడంతో 2004లో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మహాత్ముడి విగ్రహం చేతిని, చేతిలోని కర్రను ద్వంసం చేశారు. ఉదయం విగ్రహాన్ని చూసిన స్థానికులు సంఘటనపై విస్మయం వ్యక్తం చేశారు. రజకసంఘం నాయకులు డి.వెంకట్రామయ్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలాన్ని విగ్రహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
‘మహాత్మా మమ్మల్ని క్షమించు’
Published Tue, May 2 2017 7:30 PM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM
Advertisement