![Mahatma Gandhi Statue To Be Inaugurated At UN Head Quarter - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/28/2514.jpg.webp?itok=wIyksbXK)
ఐక్యరాజ్యసమితి: న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయానికి భారత్ మహాత్మాగాంధీ విగ్రహాన్ని బహూకరించింది. డిసెంబర్ 14వ తేదీన భద్రతా మండలి అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా విదేశాంగ మంత్రి జై శంకర్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రముఖ భారతీయ శిల్పి, పద్మశ్రీ అవార్డు గ్రహీత రామ్ సుతార్ ఈ శిల్పాన్ని మలిచారు. ఈయనే గుజరాత్‌లో నర్మదా నది తీరంలో ఏర్పాటు చేసిన సర్దార్ పటేల్ విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని డిజైన్ చేశారు.
ఐరాస ప్రధాన కార్యాలయం ప్రతిష్టాత్మక నార్త్‌లాన్‌లో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు ఐరాసలో భారత్ శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ తెలిపారు. ఐరాస ప్రధాన కార్యాలయం ఆవరణలో భారత్ 1982లో ఇచ్చిన ఏకైక కానుక 11వ శతాబ్దం నాటి నల్లరాతి సూర్య విగ్రహం, జర్మనీ అందజేసిన బెర్లిన్ గోడలో ఒక భాగం, దక్షిణాఫ్రికా బహూకరించిన నెల్సన్ మండేలా కాంస్య విగ్రహం, పాబ్లో పికాసో వేసిన గుయెర్నికా చిత్రం తదితరాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment