చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి: బొత్స | ysrcp demands chandrababu naidu apology over demolish mahatma gandhi statue | Sakshi
Sakshi News home page

చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి: బొత్స

Published Mon, Aug 8 2016 12:47 PM | Last Updated on Tue, May 29 2018 2:26 PM

చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి: బొత్స - Sakshi

చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి: బొత్స

విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం మహాత్మా గాంధీ విగ్రహాన్ని పరిశీలించారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఉన్న గాంధీజీ విగ్రహాన్ని ఇటీవల అధికారులు తొలగించి సమీపంలోని బుడమేరు కాల్వలో పడేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్షంతో పాటు అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో దిగివచ్చిన అధికారులు ...కూల్చివేసిన స్థానంలోనే గాంధీజీ విగ్రహాన్ని ఆదివారం తిరిగి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ జిల్లా ఇన్చార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాష్ట్ర నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, జిల్లా అధ్యక్షుడు పార్థసారధి తదితరులు ఇబ్రహీంపట్నం విచ్చేసి మహాత్మగాంధీ విగ్రహాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా... బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ క్విట్ చంద్రబాబు సేవ్ ఏపీ అని ప్రతి ఒక్కరు నినదించాలన్నారు. గాంధీ విగ్రహానికి అపచారం ఘటనలో చంద్రబాబు క్షమాపణలు చెప్పి... జిల్లా స్థాయి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement