![TDP Leaders Insulted Mahatma Gandhi In Palnadu District - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/16/TDP-Leaders-Insulted-Mahatm.jpg.webp?itok=Dboabqf8)
పెదకూరపాడు మండలం కంభంపాడు గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహానికి టీడీపీ జెండాలు కట్టిన దృశ్యం
పెదకూరపాడు(పల్నాడు జిల్లా): జాతిపిత మహాత్మా గాంధీని టీడీపీ అవమానపరిచింది. గాంధీ విగ్రహానికి రాజకీయ రంగు పులిమింది. పల్నాడు జిల్లా కంభంపాడులోని గాంధీజీ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టి జాతిపితను అవమానించారు. ఇటీవల టీడీపీ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఆ పార్టీ జెండాలు, తోరణాలు కట్టారు. కొందరు టీడీపీ కార్యకర్తలు వికృత చేష్టలకు పాల్పడి గాంధీ విగ్రహం చేతికి టీడీపీ జెండాలు కట్టారు. దీంతో సర్వత్రావిమర్శలు వెల్లువెత్తాయి. విషయం తెలుసుకున్న పెదకూరపాడు సీఐ వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి గాంధీ విగ్రహానికి కట్టిన టీడీపీ జెండాలను తొలగించారు.
చదవండి: చంద్రబాబును దత్తపుత్రుడు ఎందుకు ప్రశ్నించలేదు: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment