న్యూఢిల్లీ: గత కొంతకాలంగా ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ బుధవారం వినూత్నంగా నిరసన తెలిపారు. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తలపెట్టిన ర్యాలీలో పాల్గొనేందుకు హస్తినకు వచ్చిన ఆమె.. పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట ప్రార్థన చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని మహాత్మున్ని మమత వేడుకున్నారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి రాజకీయ పార్టీకి సొంత భావజాలం ఉంటుందని అన్నారు. తాము దేశభక్తిని విశ్వసిస్తున్నామని తెలిపారు. గాంధీ ముందు ప్రార్థన చేయడానికే తాను పార్లమెంటుకు వచ్చినట్టు పేర్కొన్నారు. బీజేపీని, నరేంద్ర మోదీని అధికారంలోంచి తొలగించి దేశాన్ని, ఐక్యతను కాపాడాలని గాంధీజీని ప్రార్థించినట్టు చెప్పారు. తమ ప్రభుత్వంపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఇటీవల మమతాబెనర్జీ కోల్‌కతాలో మూడు రోజుల పాటు దీక్ష చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment