
సీఎం కేసీఆర్‌కు పలువురు కళాకారులు ‘ఆర్ట్‌ఫుల్’గా బర్త్‌డే విషెస్ చెప్పారు. ఆదివారం మాదాపూర్ చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలోకేసీఆర్ చిత్రాలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. పలువురు కళాకారులు తీర్చిదిద్దిన 50 చిత్రాలను ఇక్కడ ఉంచారు.
మాదాపూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కేసీఆర్ చిత్రాల ప్రదర్శనను తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి, మహిళలు, పిల్లల అభివృద్ధి శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్ తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా భావించారన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేసీఆర్ చిత్ర పటాలను ప్రదర్శనలో ఉంచినట్లు తెలిపారు. జన్మదిన కేక్‌ను కట్ చేశారు. 50 చిత్రాలు ప్రదర్శనలో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 23వ తేదీ వరకు చిత్ర ప్రదర్శన ఉంటుందన్నారు. దీనికి క్యూరెటర్‌గా ప్రముఖ ఆర్టిస్ట్ రమణారెడ్డి వ్యవహారించారు. కార్యక్రమంలో ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డాక్టర్ కె.లక్ష్మి, పలువురు చిత్ర కళాకారులు తదితరులు పాల్గొన్నారు.