sakshi Property Show
-
హైడ్రా కూల్చివేతలు.. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
-
తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి...
-
ఒక అపార్ట్మెంట్ లైఫ్ ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు..
-
సాక్షి ప్రాపర్టీ షో నేడే
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో సొంతింటి కొనుగోలు అంత ఆషామాషీ పనేం కాదు. నమ్మకమైన బిల్డర్, నాణ్యమైన నిర్మాణం, గడువులోగా ప్రాజెక్ట్ పూర్తి, ఆధునిక వసతులు, తక్కువ ధర.. ఇవన్నీ ఉన్న ప్రాజెక్ట్ ఎక్కడుందో వెతకాలంటే కష్టమే. మరి ఇలాంటి ప్రాజెక్ట్‌లన్నింటినీ ఒకే వేదిక మీదికి తీసుకొస్తే.. అదే ‘సాక్షి ప్రాపర్టీ షో’! ప్రాజెక్ట్ ఎంపిక నుంచి గృహ రుణం వరకూ నిర్మాణ సంస్థలను, బ్యాంక్‌లను ఒకే చోటికి తీసుకొచ్చి కొనుగోలుదారులకు సౌలభ్యాన్ని కల్పిస్తుంది సాక్షి. నేడు, రేపు మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో సాక్షి ప్రాపర్టీ షో జరగనుంది. ముఖ్య అతిథిగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ, రెరా చైర్మన్ సోమేశ్ కుమార్ హాజరుకానున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ అందుబాటులో ఉంటుంది. ప్రవేశం ఉచితం. 40కి పైగా స్టాళ్ల ఏర్పాటు.. నగరానికి చెందిన 20కి పైగా ప్రముఖ నిర్మాణ సంస్థలు, 40కి పైగా స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలు.. ఇలా అన్ని రకాల గృహ ప్రాజెక్ట్‌లు ప్రదర్శనలో ఉంటాయి. వివిధ ప్రాంతాల్లో ఏయే నిర్మాణాల్లో ఎంత రేటు చెబుతున్నారు? అవి ప్రస్తుతం ఏయే దశలో ఉన్నాయి? ఏయే రాయితీలను అందిస్తున్నారు? సొంతింటి కొనుగోలు నిర్ణయంలో కీలకమైన ఇలాంటి విషయాలు తెలిస్తేనే.. కొనుగోలుదారులు అంతిమ నిర్ణయానికి రావటం తేలికవుతుంది. మరి ఆలస్యమెందుకు? వెంటనే మీ కుటుంబ సభ్యులతో విచ్చేసి.. నచ్చిన ఇంటిని ఎంచక్కా ఎంపిక చేసుకోండి. ప్రధాన స్పాన్సర్: అపర్ణా కన్స్ట్రక్షన్స్ అసోసియేటెడ్ స్పాన్సర్: రాంకీ ఎస్టేట్స్ కో–స్పాన్సర్స్: జనప్రియ ఇంజనీర్స్, మ్యాక్, ఎన్సీసీ అర్బన్, స్పేస్ విజన్ పాల్గొనే సంస్థలు: ఈఐపీఎల్ ప్రాజెక్ట్స్, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, గ్రీన్ మార్క్ డెవలపర్స్, గిరిధారి హోమ్స్, శ్రీ ఆదిత్య హోమ్స్, ప్రణీత్ గ్రూప్, ఆర్వీ నిర్మాణ్, కపిల్ ప్రాపర్టీస్, గ్రీన్ సిటీ ఎస్టేట్స్, ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై సిటీ, గ్రీన్ హోమ్స్, పేరం గ్రూప్, వర్టుసా లైఫ్ స్పేసెస్, చరణ్ గ్రూప్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ). -
వచ్చే నెల 9, 10 తేదీల్లో సాక్షి ప్రాపర్టీ షో
సాక్షి, హైదరాబాద్: నగరవాసుల సొంతింటి కలను సాకారం చేసేందుకు మరోసారి సిద్ధమైంది సాక్షి. వచ్చే నెల 9, 10 తేదీల్లో మెగా ప్రాపర్టీ షోను నిర్వహించనుంది. మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో జరగనున్న ఈ ప్రదర్శనలో నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు పాల్గొననున్నాయి. ఓపెన్ ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలు అన్ని విభాగాల స్థిరాస్తి సమాచారం అందుబాటులో ఉండనుంది. డెవలపర్లు స్టాల్స్ బుకింగ్ చేసేందుకు 99122 20380, 99516 03004 నంబర్లలో సంప్రదించవచ్చు. -
శిల్పకళా వేదికలో సాక్షి ప్రాపర్టీ షో
-
శిల్పకళా వేదికలో సాక్షి ప్రాపర్టీ షో
-
నేడు, రేపు సాక్షి ప్రాపర్టీ షో
మెట్రో రైలు పరుగులు ఒకవైపు...ఓఆర్ఆర్, త్రిబుల్ ఆర్‌లతో నగర విస్తరణ మరోవైపు... జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ఎంట్రీ,స్టార్టప్‌ల జోష్ ఇంకొక వైపు... రెరా, జీఎస్టీల అమలుతో కొనుగోలుదారుల నమ్మకం మరొక వైపు... .. ఇదీ సింపుల్‌గా హైదరాబాద్ రియల్టీ రంగం వృద్ధికి కారణాలు! సాధారణంగా ఎన్నికల వాతావరణంలో రియల్టీ మందగమనంలో ఉంటుంది. అదేంటో మరి? ఈసారి ఎలక్షన్స్ ప్రభావం హైదరాబాద్ రియల్టీ రంగం మీద అస్సల్లేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో గృహాల అమ్మకాల్లో క్షీణత నమోదైతే.. నగరంలో వృద్ధి కనిపించడమే ఇందుకు నిదర్శనం. ఇక, ఎన్నికల ఫలితాల తర్వాత స్థిరాస్తి రంగం పరుగులు పెట్టడం ఖాయమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ప్రాపర్టీ షో నిర్వహిస్తే? కొనుగోలుదారులకు, ఇన్వెస్టర్లకు సరైన ప్రాపర్టీలను ఎంచుకునే వీలు కల్పిస్తే? ఒకే వేదికగా వీటికి సమాధానం చెప్పేందుకు సిద్ధమైంది ‘సాక్షి ప్రాపర్టీ షో’! సాక్షి ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో నేడు, రేపు మెగా ప్రాపర్టీ షో జరగనుంది. తెలంగాణ రెరా చైర్మన్ రాజేశ్వర్ తివారీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ ప్రదర్శనలో 35కి పైగా నగరానికి చెందిన బడా నిర్మాణ సంస్థలు ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలు, వాణిజ్య సముదాయాలను ప్రదర్శించనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు షో అందుబాటులో ఉంటుంది. సందర్శకులకు ప్రవేశం ఉచితం. – సాక్షి, హైదరాబాద్ ప్రధాన స్పాన్సర్: అపర్ణా కన్స్ట్రక్షన్స్ అసోసియేట్ స్పాన్సర్: రాంకీ ఎస్టేట్స్ కో–స్పాన్సర్స్: జనప్రియ, ఎన్సీసీ అర్బన్, మ్యాక్ ప్రాజెక్ట్స్ ఇతర పాల్గొనే సంస్థలు: అక్యురేట్ డెవలపర్స్, రాజపుష్ప, వెర్టెక్స్, గిరిధారి హోమ్స్, ఆర్క్ బిల్డర్స్, ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై సిటీ, గ్రీన్ హోమ్స్, సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, ఆర్వీ నిర్మాణ్, సాకేత్, ప్రావిడెంట్, కపిల్ ప్రాపర్టీస్, ప్రగతి గ్రీన్మోడోస్, దామరి ఎస్టేట్స్, వర్ధన్ డెవలపర్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. -
వచ్చే శని, ఆదివారాల్లో సాక్షి ప్రాపర్టీ షో
సాక్షి, హైదరాబాద్: మెట్రో నగరంలో ఎలాంటి న్యాయపరమైన చిక్కుల్లేని ప్రాపర్టీలను వెతకడం సవాలే. అభివృద్ధి చెందే ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో స్థిరాస్తిని కొనుగోలు చేయడం కష్టమే. వీటన్నింటికి పరిష్కారం చూపించనుంది ‘సాక్షి ప్రాపర్టీ షో’. ఫ్లాట్లు, ప్లాట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలు, వాణిజ్య సముదాయాలు.. అన్ని రకాల ప్రాపర్టీ లను ఒకే వేదికగా ప్రదర్శించనుంది. మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో మే 4, 5 తేదీల్లో సాక్షి ప్రాపర్టీ షో జరగనుంది. ప్రారంభ సమయం ఉదయం 10 గంటలు. ప్రవేశం ఉచితం. ప్రధాన స్పాన్సర్: అపర్ణ కన్స్ట్రక్షన్స్ అసోసియేట్ స్పాన్సర్స్: రాంకీ, ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కో–స్పాన్సర్స్: జనప్రియ, ఎన్సీసీ, మ్యాక్ ప్రాజెక్ట్స్ ఇతర పాల్గొనే సంస్థలు: అక్యురేట్ డెవలపర్స్, ప్రావిడెంట్ హౌసింగ్, రాజపుష్ప ప్రాపర్టీస్, సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, సాకేజ్ ఇంజనీర్స్, ఆర్వీ నిర్మాణ్, ఆర్క్ బిల్డర్స్, ఫార్చూన్ బటర్‌ఫ్లై సిటీ, గ్రీన్ హోమ్, వర్టెక్స్ హోమ్స్, గిరిధారి హోమ్స్. స్టాల్స్ బుకింగ్ కోసం 99122 20380, 99516 03004 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. -
‘సాక్షి’ ప్రాపర్టీ షో ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహానగరంలో సొంతింటి ఎంపిక అంత సులువేమీ కాదు. నమ్మకమైన బిల్డర్, నాణ్యమైన నిర్మాణం, గడువులోగా ప్రాజెక్ట్ పూర్తి, ఆధునిక వసతులు, తక్కువ ధర.. ఇవన్నీ ఉండాలి. మరి ఇలాంటి ప్రాజెక్ట్‌లను ఎంచుకోవాలంటే కొనుగోలుదారులు చెమటోడ్చాల్సిందే! కానీ కొనుగోలుదారులు ఒకే వేదికపై ఇవన్నీ పొందటానికి ‘సాక్షి ప్రాపర్టీ షో’ ఆరంభమైంది. శనివారం మాదాపూర్ హైటెక్స్ దగ్గర్లోని సైబర్ కన్వెన్షన్ సెంటర్లో ఈ మెగా ప్రదర్శన మొదలైంది. ఉదయం 10 గంటలకు ప్రాపర్టీ షో ప్రారంభమైనప్పటికీ.. మధ్యాహ్నం ఎండ తీవ్రతను కూడా లెక్క చేయకుండా సందర్శకులతో ప్రాంగణమంతా కిటకిటలాడింది. నగరానికి చెందిన 32 నిర్మాణ సంస్థలు, 70కి పైగా స్టాళ్లను ఏర్పాటు చేసి ప్రాజెక్ట్‌ల వివరాలను సందర్శకులకు వివరించాయి. ఆదివారం రాత్రి వరకూ ఈ షో కొనసాగనుంది. ప్రాపర్టీ షోకు ముఖ్య అతిథిగా హాజరైన హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు మాట్లాడుతూ, ‘‘గతంలో హెచ్ఎండీఏ పరిధిలో నెలకు 20 లేఅవుట్ల వరకూ అనుమతులిచ్చే వాళ్లం. ఇప్పుడవి 100 దాటేస్తున్నాయి. హైదరాబాద్‌లో రియల్ బూమ్ మొదలైందనడానికి ఇదో ఉదాహరణ’’అని అన్నారు. గతేడాదితో పోలిస్తే దేశం లోని ఇతర నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, చెన్నైల్లో ధరలు పడిపోతుంటే నగరంలో మాత్రం 34% వృద్ధి నమోదైందన్నారు. నగరంలో మెట్రో, ఓఆర్‌ఆర్‌లకు తోడు ఎస్ఆర్డీపీ, ఫ్లైఓవర్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందన్నారు. క్రెడాయ్ జనరల్ సెక్రటరీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ల్యాండ్, కార్మికులు, సిమెం ట్, ఇనుము వంటి నిర్మాణ సామగ్రి ధరలు పెరిగాయ ని, దీంతో స్థిరాస్తి ధరలు కూడా 20–40% వరకూ పెరిగాయన్నారు. ఇంకా రేట్లు తగ్గుతాయని చూడటం సరికాదని, ప్రాపర్టీ ఎంపికకు సరైన సమయమిదేనని అన్నారు. కార్యక్రమంలో సాక్షి అడ్వరై్టజ్‌మెంట్ డైరెక్టర్ కేఆర్పీ రెడ్డి, జీఎం కె.రమణకుమార్ పాల్గొన్నారు. సరైన సమయంలో ప్రాపర్టీ షో ప్రభుత్వ సానుకూల నిర్ణయాలతో నగరంలో రియల్ బూమ్ మొదలైందని, ఈ సమయంలో ఒకే చోట నగరంలోని అన్ని రకాల ప్రాపర్టీలను ప్రదర్శించడం సరైన నిర్ణయమని ‘సాక్షి’ప్రాపర్టీ షో ప్రధాన స్పాన్సర్ అపర్ణా కన్స్ట్రక్షన్స్, రాంకీ గ్రూప్ అభినందించాయి. అపర్ణా కన్స్ట్రక్షన్స్ బ్రాండ్ ప్రమోషన్ మేనేజర్ శ్రీనివాస్ దివాకర్ల మాట్లాడుతూ.. ప్రధాన నగరంతోపాటు శివారుల్లోనూ రియల్ వ్యాపారం జోరందుకుందని.. అందుకే ఎంపిక చేసిన ప్రాంతాల్లో అపర్ణా ప్రాజెక్ట్‌లను నిర్వహిస్తోందని తెలిపారు. రాంకీ ప్రతినిధి ఎస్.శరత్‌బాబు మాట్లాడుతూ.. రెండేళ్లుగా నగరంలో ఆఫీసు, కమర్షియల్ లావాదేవీలు పెరిగాయని, దీంతో వచ్చే రెండేళ్లూ నివాస సముదాయాలకు డిమాండ్ పెరగడం ఖాయమన్నారు. -
నేడు, రేపు సాక్షి ప్రాపర్టీ షో!
సాక్షి, హైదరాబాద్ : ‘‘సార్.. సొంతింటి ప్రయత్నం ఎంత వరకు వచ్చింది’’ .. ఈ ప్రశ్న అడగగానే చాలా మంది నోటి నుంచి వచ్చే సమాధానం.. ‘ఏం చెప్పమంటారండీ.. నా బడ్జెట్లో ఇల్లు దొరకడం లేదు’ అనే! ఇల్లు నచ్చితే ధర ఎక్కువని.. ఇల్లు, ధర కుదిరితే ప్రాంతం బాగోలేదని.. ఏళ్ల తరబడి సొంతింటి అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. మీ ప్రయత్నాన్ని విజయవంతం చేసేందుకు మరోసారి మీ ముందుకొచ్చింది ‘సాక్షి ప్రాపర్టీ షో’! మీ అవసరాలు, అభిరుచులు, అందుబాటు ధరల్లో ఎలాంటి రాజీపడాల్సిన అవసరం లేకుండా నగరంలోని ప్రముఖ నిర్మాణ సంస్థల ప్రాజెక్ట్‌లను మీ ముందుకు తీసుకొచ్చింది సాక్షి ప్రాపర్టీ షో. ప్రముఖ నిర్మాణ సంస్థ అపర్ణా కన్స్ట్రక్షన్స్ స్పాన్సర్‌గా, రాంకీ ఎస్టేట్స్ అండ్ ఫామ్స్ పవర్డ్ బైకి వ్యవహరిస్తున్న ఈ సాక్షి ప్రాపర్టీ షోలో నగరానికి చెందిన 32 నిర్మాణ సంస్థలు.. 70కి పైగా స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. పలు బ్యాంకులూ పాల్గొంటున్నాయి. వీటిల్లో ఓపెన్ ప్లాట్లతో పాటూ ఫ్లాట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు, వాణిజ్య సముదాయల వివరాలను ప్రదర్శిస్తారు. హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మాదాపూర్ హైటెక్ సిటీ దగ్గర్లోని సైబర్ కన్వెన్షన్ సెంటర్లో శని, ఆదివారాల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ ఈ షో అందుబాటులో ఉంటుంది. ప్రవేశం ఉచితం. మరెందుకు ఆలస్యం? కుటుంబ సమేతంగా విచ్చేసి అన్ని విధాల నప్పే ఇంటిని ఆనందంగా ఎంచుకోండి! మెట్రోతో జోష్.. మార్కెట్ స్థిరపడగానే అందరి ఆలోచనలు ప్రాపర్టీల చుట్టే తిరుగుతుంటాయి. ఇన్నాళ్లు మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉందని చాలామంది తమ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. ప్రస్తుతం నగర స్థిరాస్తి మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొంది. తొలి దశ మెట్రో రైలు పరుగులతో నగరం చుట్టూ రియల్టీ క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో నగరంలో స్థిరాస్తి అమ్మకాలు 25 శాతం వృద్ధిని నమోదు చేశామని అన్‌రాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నివేదిక తెలిపింది. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇక్కడే వృద్ధి కనిపించిందని తెలిపింది. దీనికి తోడు త్వరలోనే మెట్రో కారిడార్–2ను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దీంతో నగర రియల్టీలో మరింత జోష్ ఖాయమని నిపుణులు చెబుతున్నారు. స్థిరమైన అభివృద్ధి ఉన్న వైపే.. మెరుగైన రవాణా సదుపాయాలు, విద్యా, వైద్యం, వినోద కేంద్రాలున్న ప్రాంతాల్లోనే కొనుగోళ్లకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. నిర్మాణ సంస్థలూ అలాంటి ప్రాజెక్ట్‌లకే శ్రీకారం చుడుతున్నాయి. మరోవైపు చెన్నై, బెంగళూరు వంటి ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో నేటికీ ఇళ్ల ధరలు అందుబాటులోనే ఉన్నాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఫ్లాట్ల రేట్లు పెరిగినప్పటికీ హైదరాబాద్‌లో నేటికీ తక్కువకే దొరుకుతున్నాయి. జిమ్, క్లబ్‌హౌజ్, స్విమ్మింగ్‌పూల్ వంటి ఆధునిక సదుపాయాలు గల గేటెడ్ కమ్యూనిటీల్లో బిల్డర్లు చెబుతోన్న రేట్లు బేరీజు వేశాక కొనుగోలుదారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సొంతింటిని కొంటున్నారు. భవిష్యత్తులో ఇంతకంటే తక్కువ ధరకు దొరకుతాయన్న నమ్మకం లేదు కాబట్టి సొంతింటి కల సాకారానికి ఇదే సరైన సమయం. పాల్గొనే సంస్థలివే స్పాన్సర్: అపర్ణా కన్స్ట్రక్షన్స్ పవర్డ్ బై: రాంకీ ఎస్టేట్స్ అండ్ ఫామ్స్ అసోసియేట్ స్పాన్సర్స్: ఆదిత్య కన్స్ట్రక్షన్స్, స్పేస్‌విజన్ గ్రూప్ కో–స్పాన్సర్స్: సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, మ్యాక్ ప్రాజెక్ట్స్, వెర్టెక్స్ హోమ్స్, విర్టుసా లైఫ్ స్పేసెస్ ఇతర సంస్థలు: జనప్రియ, మంజీరా, ప్రొవిడెంట్, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్, ఆక్యురేట్ డెవలపర్స్, రాజపుష్ప ప్రాపర్టీస్, సిరి సంపద హోమ్స్, ఆర్వీ నిర్మాణ్, ఏఆర్కే టెర్మినస్ ఇన్ఫ్రా సాకేత్, శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్, మనస్వీ డెవలపర్స్, గ్రీన్ హోమ్, గ్రీన్‌మార్క్ డెవలపర్స్, ఫార్చూన్ బటర్‌ఫ్లై సిటీ, యాక్సాన్ హౌసింగ్ ఇన్ఫ్రా, అమృత ప్రాజెక్ట్స్, సాయిసూర్య డెవలపర్స్, శివోం ప్రాజెక్ట్స్, ఎంకే ఇన్ఫ్రా డెవలపర్స్, వర్ధన్ డెవలపర్స్, యూఎస్ఎం మై సిటీ, స్వర్ణ విహార్ ఇన్ఫ్రా, జెనెక్స్ హోమ్స్. -
ఈనెల 19, 20 తేదీల్లో సాక్షి మెగా ప్రాపర్టీ షో!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో సొంతింటి ఎంపిక అంటే సులువేం కాదు. నమ్మకమైన బిల్డర్, నాణ్యమైన నిర్మాణం, గడువులోగా ప్రాజెక్ట్ పూర్తి, ఆధునిక వసతులు, తక్కువ ధర.. ఇవన్నీ ఉండాల్సిందే. మరి ఇలాంటి ప్రాజెక్ట్‌ల సమాచారం ఒకే వేదికగా పొందగలిగితే? ఇదే లక్ష్యంగా మరోసారి నగరవాసుల ముందుకురానుంది ‘సాక్షి ప్రాపర్టీ షో’. మాదాపూర్ హైటెక్స్ సమీపంలోని సైబర్ కన్వెన్షన్‌లో ఈనెల 19, 20 తేదీల్లో స్థిరాస్తి ప్రదర్శనను నిర్వహించనుంది. ఈ షోలో నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థల ఓపెన్ ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు, వాణిజ్య ప్రాజెక్ట్‌లు అన్నీ ప్రదర్శనలో ఉంటాయి. నిర్మాణ సంస్థలు స్టాల్స్ బుకింగ్ కోసం 99122 20380, 87902 30124 నంబర్లలో సంప్రదించవచ్చు. -
వచ్చే నెల 19, 20 తేదీల్లో సాక్షి ప్రాపర్టీ షో!
సాక్షి, హైదరాబాద్ : నగరవాసుల సొంతింటి కలను సాకారం చేసేందుకు సాక్షి ప్రాపర్టీ షో మరోసారి సిద్ధమైంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో అందుబాటు ధరల్లో గృహాలు, ఓపెన్ ప్లాట్లు, ఆఫీస్, రిటైల్ స్థలాలు ఎక్కడెక్కడున్నాయో వివరించేందుకు రెడీ అయింది. వచ్చే నెల 19, 20 తేదీల్లో మాదాపూర్‌లోని హైటెక్స్ సమీపంలోని సైబర్ కన్వెన్షన్‌లో మెగా ప్రాపర్టీ షోను నిర్వహించనుంది. ఇందులో నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు పాల్గొననున్నాయి. స్టాళ్ల ఏర్పాటుకు ఆసక్తి ఉన్నవాళ్లు 99122 20380, 87902 30124 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. -
సొంతిల్లు మీ లక్ష్యమా?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో సొంతిల్లు వెతకటమంటే మామూలు విషయం కాదు. డెవలపర్ ఎంపిక నుంచి మొదలుపెడితే సరైన ప్రాంతం, వసతులు, ధర ప్రతిదీ ముఖ్యమే. వీటిలో ఏ మాత్రం చిన్నతేడా వచ్చినా అంతే సంగతులు. ఇలాంటి చిక్కులేవీ లేకుండా నగరంలోని నివాస, వాణిజ్య సముదాయల వివరాలన్నింటినీ ఒకే వేదికగా అందించేందుకు మరోసారి నగరవాసుల ముందుకొచ్చింది ‘సాక్షి ప్రాపర్టీ షో’. కూకట్‌పల్లిలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కల్యాణ మండపంలో శనివారం ఉదయం ఘనంగా సాక్షి ప్రాపర్టీ షో ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు ఆరంభమైన దగ్గరి నుంచీ సందర్శకులతో కిటకిటలాడింది. మెట్రో రైలు పరుగులు మొదలయ్యాక.. నగర స్థిరాస్తి మార్కెట్లోనూ సానుకూల వాతావరణం నెలకొనడం, భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశం ఉండటంతో సొంతింటి ఎంపికకు ఇదే సరైన సమయమని కొనుగోలుదారులు భావించారు. దీంతో కుటుంబ సభ్యులతో సహా సందర్శకులు వచ్చిన ప్రాపర్టీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. (ప్రాపర్టీ షోను ప్రారంభిస్తున్న క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు జి.రామిరెడ్డి, చిత్రంలో సాక్షి ఏడీవీటీ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ కేఆర్పీ రెడ్డి, ఏడీవీటీ వైస్ ప్రెసిడెంట్ పి.శ్రీధర్ తదితరులు) ఒకే వేదికగా సమాచారమంతా.. నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేసి నగరం నలువైపులా నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌ల వివరాలను సందర్శకులకు అందించారు. ప్లాట్లు, ఫ్లాట్లు, వ్యక్తిగత గృహాలు, విల్లాలు, వాణిజ్య సముదాయాల సమాచారాన్ని ప్రదర్శించారు. గృహ రుణాల సమాచారం అందించేందకు ఎస్బీఐ స్టాల్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఆసక్తి ఉన్న కస్టమర్లను అక్కడిక్కడే రుణాలందించేందుకు దరఖాస్తులనూ తీసుకుంది. వివిధ ప్రాంతాల్లో ఏయే నిర్మాణాల్లో ఎంత రేటు చెబుతున్నారు? అవి ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి? ఏయే రాయితీలను అందిస్తున్నారు? వంటి సమాచారాన్ని కొనుగోలుదారుల ముందు ప్రదర్శిస్తారు. ఎంపికలో ఇలాంటి సమాచారం తెలిస్తేనే కొనుగోలుదారులు అంతిమ నిర్ణయానికి రావటం తేలికవుతుందని పలువురు సందర్శకులు తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే సాక్షి ప్రాపర్టీ షో నేటితో ముగియనుంది. ప్రధాన స్పాన్సర్: అపర్ణా కన్స్ట్రక్షన్స్ అసోసియేట్ స్పాన్సర్స్: ఆదిత్య, రాంకీ, గ్రీన్‌మార్క్ డెవలపర్స్ కో–స్పాన్సర్: ప్రణీత్ గ్రూప్ ఇతర సంస్థలు: జనప్రియ, సాకేత్, ఏఆర్కే టెర్మినస్, ఆర్వీ నిర్మాణ్, గ్రీన్ఎకర్స్, ఫారŠూచ్యన్ బటర్‌ఫ్లై సిటీ, ఎస్ఆర్జీవీ వెంచర్స్, తరుణి, చీదెల్లా హౌజింగ్ ప్రై.లి., గ్రీన్ ఎన్ హోమ్, యాక్సాన్ హౌజింగ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) భయం పోయింది.. మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విల్లా దొరుకుతుందా అని చూస్తున్నా. ఎవరైనా మధ్యవర్తిని కలుద్దామంటే భయమేస్తోంది. సాక్షి ప్రాపర్టీ షోతో ఆ భయం పోయింది. ఆఫీసు దగ్గర్లో ఉండేలా విల్లా కోసం చూస్తున్నా. రూ.50 లక్షల పైన అయినా పర్వాలేదు. – షర్మిల, ప్రగతి నగర్ మార్కెట్‌పై అవగాహన వచ్చింది.. నగరంలో స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి ధరలు వంటి వాటిపై అవగాహన వచ్చింది. స్థోమతను బట్టి స్థలాన్ని, ఇళ్లును ఎంపిక చేసుకునేందుకు ఈ షో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలాంటి షోలు జరగడం నగరవాసులకు ఎంతైనా అవసరం. పేరున్న డెవలపర్, బ్రాండెడ్ విల్లాల కోసం చూస్తున్నా. – కిరణ్, చందానగర్ ఎంతోగానో ఉపయుక్తం.. నగరంలో ఇళ్లు కొనాలంటే చాలా విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. ఈ ప్రాపర్టీ షో ద్వారా వివరంగా తెలుసుకున్నా. నిర్మాణ సంస్థలు అందిస్తున్న రకరకాల ఆఫర్లతో పాటు ఇళ్లకు సంబంధించిన ఏ బ్యాంకులు ఎలాంటి లోన్లు ఇస్తాయో కూడా తెలుసుకున్నా. ఇలా విలువైన ప్రాపర్టీ షోలు మరిన్ని నిర్వహించాలి. – సింధు, నిజాంపేట ప్రాపర్టీ షోకు ఇది సరైన సమయం.. సాక్షి ప్రాపర్టీ షోతో సామాన్యులు సైతం నగరంలో సొంతింటి కల సాకారం చేసుకోవచ్చు. విలువైన సమాచారం లె లిసింది. అభివృద్ధి చెందిన ప్రాంతాలతో పాటు శివారు ప్రాంతాల్లోనూ స్థలాలు, అపార్ట్మెంట్ల ధరలు ఎలా ఉన్నాయో తెలిసింది. మెట్రో ప్రారంభమయ్యాక ఇలాంటి షో నిర్వహించడం అభినందనీయం. – అనుశ్రీ, బొటానికల్ గార్డెన్ ప్రాపర్టీ షోలో వివరాలు అడిగి తెలుసుకుంటున్న సందర్శకులు -
‘సాక్షి’ ప్రాపర్టీ షో ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌లో మెట్రో రైలు పరుగులు మొదలయ్యాక స్థిరాస్తి రంగంలో సానుకూల వాతావరణం నెలకొంది. ఇలాంటి సమయంలో నగరంలోని నివాస, వాణిజ్య సముదాయాల సమాచారం కొనుగోలుదారులకు అందితే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇదే లక్ష్యంతో ‘సాక్షి’ఆధ్వర్యంలో శనివారం ‘మెగా ప్రాపర్టీ షో’ను ప్రారంభించింది. కూకట్‌పల్లిలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జునస్వామి కల్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం వరకు ఈ షో కొనసాగనుంది. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) తెలంగాణ అధ్యక్షుడు గుమ్మి రాంరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంరెడ్డి మాట్లాడుతూ.. ‘‘పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జీఎస్టీ), స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు (రెరా) వంటి వాటితో నగర నిర్మాణ రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఇలాంటి సమయంలో మెట్రో రైలు పరుగులు, ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లతో మార్కెట్ మెరుగవటమే కాక నగరం పేరు విశ్వవ్యాప్తమైంది. మళ్లీ నగరంలోని ప్రాపర్టీలకు డిమాండ్ పెరిగింది..’’అని పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశముందని, కాబట్టి సొంతింటి కొనుగోలుకు ఇదే సరైన సమయమని సూచించారు. మెట్రో మార్గంలోనే.. సాక్షి అడ్వర్టైజ్మెంట్ విభాగం డైరెక్టర్ కేఆర్పీ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. ఏ ప్రాంతంలో ఎంత ధర ఉందో, ఏ నిర్మాణ సంస్థ ఎక్కడ ప్రాజెక్టులు చేస్తోందో, వసతులు, అభివృద్ధి చెందే ప్రాంతం ఏదో తెలుసుకోవటం కాసింత కష్టం. వీటన్నింటికీ సమాధానం ‘సాక్షి ప్రాపర్టీ షో’. ఆరేళ్లుగా ఏటా రెండు సార్లు ఈ షో ను నిర్వహిస్తున్నాం. డెవలపర్లు, కొనుగోలుదారులు ఇద్దరి వైపు నుంచి మంచి స్పందన వస్తోంది..’’అని చెప్పారు. మెట్రో రైలు పరుగులు పెడుతున్న ప్రాంతాల్లో ప్రాపర్టీల గురించి వాకబు పెరిగిందన్నారు. అందుకే మియాపూర్– నాగోల్ ప్రాంతంలో ప్రాపర్టీ షోలను నిర్వహించాలని భావించి.. కూకట్‌పల్లిలో ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో సాక్షి అడ్వర్టైజ్మెంట్ విభాగం వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్, జీఎం రమణ కుమార్, మధు, పాపారావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
నేడే సాక్షి ప్రాపర్టీ షో
హైదరాబాద్‌లో మెట్రో పరుగులు మొదలయ్యాయి. స్థిరాస్తి మార్కెట్టూ సానుకూలంగా మారింది. ఇలాంటి సమయంలో అందుబాటు ధరల్లో సొంతిల్లు ఎక్కడ దొరుకుతుందని వెతుకుతున్నారా? మీకా శ్రమక్కర్లేకుండా ‘సాక్షి ప్రాపర్టీ షో’ మీ ముందుకొచ్చింది. ఒకే వేదికగా నగరంలోని నివాస, వాణిజ్య, కార్యాలయ సముదాయాల వివరాలను అందించేందుకు సిద్ధమైంది. మరెందుకు ఆలస్యం.. వెంటనే కూకట్‌పల్లిలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కల్యాణ మండపానికి విచ్చేసి.. నచ్చిన స్థిరాస్తిని సొంతం చేసుకోండి! సాక్షి, హైదరాబాద్: 2017లో స్థిరాస్తి రంగానికి సవాల్ విసిరినవి.. పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జీఎస్టీ), స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు (రెరా)లే! ఆయా నిర్ణయాలతో ఒక్కసారిగా రియల్ రంగం కుదేలైంది. నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగింది. వివిధ ప్రభుత్వ సంస్థలకు కట్టాల్సిన రుసుములు, ఇతరత్రా ఖర్చులు రెట్టింపయ్యాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య మెట్రో రైలు కూతతో సానుకూల వాతావరణం నెలకొంది. మెట్రోతో మార్కెట్ మెరుగవుతుంది కాబట్టి రానున్న రోజుల్లో ధరలు పెరుగుతాయనడంలో సందేహమక్కర్లేదు. కాబట్టి సొంతింటి ఎంపికకు సాక్షి ప్రాపర్టీ షోనే సరైన వేదిక. ► హైదరాబాద్ డెవలపర్లతో పాటూ బెంగళూరు, ముంబై ఇతర నగరాల నిర్మాణ సంస్థలూ భాగ్యనగరంలో నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మిస్తున్నా యి. ఎక్కువగా గేటెడ్ కమ్యూనిటీ, ఆకాశహర్మ్యాలు ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారు. లగ్జరీ విల్లాలు, ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్పులు కూడా ఉన్నాయి. దేశంలోని ఏ ఇతర మెట్రో నగరాలతో పోల్చినా సరే నేటికీ నగరం లో ఇళ్ల ధరలు అందుబాటులోనే ఉన్నాయి. శివారు ప్రాంతాలకు వెళితే చ.అ.కు రూ.1,600లు దొరికే ప్రాంతాలున్నాయంటే ధరలను అర్థం చేసుకోవచ్చు. ► రెండు రోజుల పాటు జరిగే ఈ స్థిరాస్తి ప్రదర్శనలో నిర్మాణ సంస్థలు బ్యాంకులు, ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థలు పాల్గొని ప్రాజెక్ట్‌లు, రుణాల గురించి సందర్శకులకు వివరిస్తాయి. రుణమెంత లభిస్తుందో అక్కడిక్కడే తెలుసుకొని ఇంటికి సంబంధించిన అంతిమ నిర్ణయాన్ని సులువుగా తీసుకోవచ్చు. ప్రధాన స్పాన్సర్: అపర్ణా కన్స్ట్రక్షన్స్ అసోసియేట్ స్పాన్సర్స్: ఆదిత్య, రాంకీ, గ్రీన్‌మార్క్ డెవలపర్స్ కో–స్పాన్సర్: ప్రణీత్ గ్రూప్, ఇతర సంస్థలు: జనప్రియ, సాకేత్, ఏఆర్కే టెర్మినస్, ఆర్వీ నిర్మాణ్, గ్రీన్ఎకర్స్, ఫారŠూచ్యన్ బటర్‌ఫ్లై సిటీ, ఎస్ఆర్జీవీ వెంచర్స్, తరుణి, చీదెల్లా హౌజింగ్ ప్రై.లి., గ్రీన్ ఎన్ హోమ్, యాక్సాన్ హౌజింగ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ► నగరం నలువైపులా నిర్మిస్తోన్న ప్రాజెక్ట్‌ల వివరాలను తెలుసుకోవటం కష్టమే. స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని భావించేవారు కనీసం ఒకట్రెండు నెలలు తిరిగితే తప్ప వీటి సమాచారం తెలియదు. అలాంటిది ఒకే చోట నగరంలోని నివాస, వాణిజ్య సముదాయాల వివరాలన్నింటినీ తెలుసుకునే వీలు కల్పిస్తోంది సాక్షి ప్రాపర్టీ షో. వివిధ ప్రాంతాల్లో ఏయే నిర్మాణాల్లో ఎంత రేటు చెబుతున్నారు? అవి ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి? ఏయే రాయితీలను అందిస్తున్నారు? వంటి సమాచారాన్ని కొనుగోలుదారుల ముందు ప్రదర్శిస్తారు. ఎంపికలో ఇలాంటి సమాచారం తెలిస్తేనే కొనుగోలుదారులు అంతిమ నిర్ణయానికి రావటం తేలికవుతుంది. వేదిక: శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కల్యాణ మండపం, కూకట్పల్లి సమయం: ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు -
ఈనెల 16, 17 తేదీల్లో.. సాక్షి ప్రాపర్టీ షో!
సాక్షి, హైదరాబాద్: మెట్రో నగరంలో సాక్షి ప్రాపర్టీ షో కూత పెట్టనుంది. నగరవాసుల సొంతింటి కలను సాకారం చేసేందుకు స్థిరాస్తి ప్రదర్శన ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈనెల 16, 17 తేదీల్లో కూకట్‌పల్లిలోని శ్రీభ్రమరాంబిక మల్లికార్జున స్వామి కల్యాణ మండపంలో ప్రాపర్టీ షో జరగనుంది. నగరానికి చెందిన 25కి పైగా నిర్మాణ సంస్థలు పాల్గొనే ఈ స్థిరాస్తి ప్రదర్శనకు ప్రధాన స్పాన్సర్‌గా అపర్ణా కన్స్ట్రక్షన్స్, అసోసియేట్ స్పాన్సర్లుగా రాంకీ, ఆదిత్య, గ్రీన్‌మార్క్ డెవలపర్స్, కో–స్పాన్సర్‌గా ప్రణీత్ గ్రూప్ వ్యవహరించనున్నాయి. స్టాల్ బుకింగ్, ఇతరత్రా వివరాల కోసం 99122 20380, 99516 03004 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. -
ప్రాపర్టీప్లస్ 29nd October 2017
-
ప్రాపర్టీప్లస్ 22nd October 2017
-
‘సాక్షి’ ప్రాపర్టీ షో
-
‘సాక్షి’ ప్రాపర్టీ షో ప్రారంభం
-
‘సాక్షి’ ప్రాపర్టీ షో ప్రారంభం
- సందర్శకులతో కిటకిటలాడిన ప్రాంగణం - 35 స్టాళ్లు ఏర్పాటు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నగరవాసులు సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ‘సాక్షి’ ప్రాపర్టీ షో మరోసారి వేదికయింది. హైదరాబాద్ నలువైపులా నిర్మాణంలో ఉన్న వెంచర్లు, అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ గృహాల వివరాలను తెలుసు కునేందుకు వచ్చిన సందర్శకులతో మాదాపూర్‌లోని శిల్పకళావేదిక ప్రాంగణం కిటకిటలాడింది. శనివారం ఘనంగా ప్రారంభమైన మెగా ప్రాపర్టీ షోలో హైదరాబాద్‌కు చెందిన 25 ప్రముఖ నిర్మాణ సంస్థలు, 35 స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ఉదయం 10 నుంచే సందర్శకులు రావడం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు గుమ్మి రాంరెడ్డి, జనరల్ సెక్రటరీ చెరుకు రామచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలను ఒకే గొడుకు కిందికి తీసుకు రావటం నిర్మాణ సంస్థలకు ఎంత ఉపయుక్తమో.. సందర్శకులకూ అంతేనన్నారు. స్థిరాస్తిపై సందేహాలను నివృత్తి చేసుకోవటంతో పాటు ఒక ప్రాంతంలోని ధరలను ఒకే వేదికపై సరిపోల్చుకునే వీలుంటుందన్నారు. ఇలాంటి అవకాశాన్ని ఏడాదికి రెండు సార్లు కల్పిస్తున్న సాక్షిని అభినందించారు. స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు (రెరా), వస్తు సేవల పన్ను (జీఎస్టీ)తో నిర్మాణ రంగంలో పార దర్శకత నెలకొంటోందని.. సీరియస్ కొనుగోలు దారులు, విదేశీ, ప్రవాస ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. ఇతర మెట్రోలతో పోలిస్తే హైదరాబాద్‌లో స్థలాల ధరలు తక్కువగా ఉండటమే ఇందుకు కారణమన్నారు. నివాస సముదాయాలతో పాటు వాణిజ్య, కార్యాలయాల స్థలాలకు గిరాకీ పెరుగుతోందని, ఈ మార్కెట్‌ను అందిపుచ్చుకోవటానికి స్థానిక నిర్మాణ సంస్థలు సిద్ధంగా ఉండా లన్నారు. ఈ కార్యక్రమంలో సాక్షి అడ్వరై్టజ్‌మెంట్ విభాగం వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్, జనరల్ మేనేజర్ రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సాక్షి ప్రాపర్టీ షోకి విశేష స్పందన
-
‘సాక్షి’ ప్రాపర్టీ షో మొదలైంది
సందర్శకులతో కిటకిటలాడిన ప్రాంగణం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భాగ్యనగరం నలువైపులా నిర్మాణం జరుపుకుంటున్న అపార్ట్మెంట్లు, వెంచర్ల వివరాలను కొనుగోలుదారులకు చేరువ చేసేందుకు ‘సాక్షి’ప్రాపర్టీ షో వేదికగా మారింది. శనివారమిక్కడ ఘనంగా ప్రారంభమైన మెగా ప్రాపర్టీ షోలో హైదరాబాద్‌కు చెందిన 23 ప్రముఖ నిర్మాణ సంస్థలు పాల్గొన్నాయి. ఉదయం 10 గంటల నుంచే కుటుంబంతో సహా సందర్శకులు ప్రదర్శనకు విచ్చేశారు. ప్రతి స్టాల్ వద్ద ప్రాజెక్టుల వివరాల సేకరణ, ఎంపికలో వారు బిజీబిజీగా కనిపించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) కమిషనర్ టి.చిరంజీవులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం హైదరాబాద్ జనాభా 10 మిలియన్లు. 2040 నాటికి 22 మిలియన్లకు చేరుతుంది. అప్పటి జనాభాకు తగ్గట్టుగా మౌలిక వసతుల ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టిసారించింది’అని చెప్పారు. హైదరాబాద్‌లో ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు, ఈ–కామర్స్ సంస్థలూ కార్యాలయాల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయని అన్నారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఐకియా వంటి విదేశీ కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించాయని.. దీంతో కార్యాలయాల సముదాయాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని చెప్పారు. కార్యక్రమంలో భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) తెలంగాణ అధ్యక్షుడు గుమ్మి రాంరెడ్డి, జనరల్ సెక్రటరీ రామచంద్రారెడ్డి, అపర్ణా కన్స్ట్రక్షన్స్ బ్రాండ్ ప్రమోషన్ మేనేజర్ శ్రీనివాస్ దివాకర్ల, సాక్షి డైరెక్టర్లు వైఈపీ రెడ్డి (ఫైనాన్స్ అండ్ అడ్మిన్), కేఆర్పీ రెడ్డి (అడ్వర్టయిజింగ్) తదితరులు పాల్గొన్నారు. -
మార్చి 4,5 తేదీల్లో సాక్షి ప్రాపర్టీ షో!
-
ఈరోజు, రేపు సాక్షి ప్రాపర్టీ షో!
ఎక్కడ: హోటల్ తాజ్ కృష్ణ సమయం: ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రవేశంఉచితం పాల్గొనే సంస్థలివే మెయిన్ స్పాన్సర్: అపర్ణా కన్స్ట్రక్షన్స్ అసోసియేట్ పార్టనర్స్: ఆదిత్య, రాజపుష్ప, కెన్వర్త్ ప్రావిడెంట్ కో–స్పాన్సర్స్: మ్యాక్ ప్రాజెక్ట్స్, జనప్రియ ఇతర సంస్థలు: సుమధుర, సైబర్ సిటీ, నార్త్‌స్టార్ హోమ్స్, శాంతా శ్రీరామ్, ఎన్సీసీ అర్బన్, సాకేత్, ఏఆర్కే డెవలపర్స్, గ్రీన్‌హోమ్, ఆర్వీ నిర్మాణ్, ముప్పా, అమృత ప్రాజెక్ట్స్, ఫార్చ్యూన్ బటర్ ఫ్లైసిటీ, వెర్టెక్స్, సాయి చరణ్, స్వర్ణవిహార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, స్పేస్ విజన్ సాక్షి, హైదరాబాద్ భాగ్యనగరంలో ఎప్పటికైనా ఓ సొంతిల్లు ఉండాలని కలలు కనేవారికి ‘సాక్షి’ మరోసారి చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. బంజారాహిల్స్‌లోని హోటల్ తాజ్‌కృష్ణలో ఈరోజు, రేపు మెగా ప్రాపర్టీ షోను నిర్వహిస్తోంది. నగరానికి చెందిన 22 ప్రముఖ నిర్మాణ సంస్థలు పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో వెంచర్లు, వ్యక్తిగత గృహాలు, విల్లాలు, అపార్ట్మెంట్లు, కార్యాలయ సముదాయాల వివరాలు వంటివి అందుబాటులో ఉంటాయి. మరెందుకు ఆలస్యం? కుటుంబ సమేతంగా విచ్చేసి అన్ని విధాల నప్పే ఇంటిని ఆనందంగా ఎంచుకోండి! నగరం నలువైపులా నిర్మాణం జరపుకుంటోన్న ప్రాజెక్ట్‌ల సమాచారాన్ని కొనుగోలుదారులకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఏడాది ‘సాక్షి’ ప్రాపర్టీ షోను నిర్వహిస్తోంది. కస్టమర్ల నుంచి కూడా అపూర్వ స్పందన వస్తోంది. చిన్న సైజు నుంచి సంపన్న గృహాలకు సంబంధించిన పూర్తి వివరాలు దొరుకుతాయన్న నమ్మకంతో ప్రదర్శనకు విచ్చేసి చాలా మంది తమ కలల గృహాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. ఇల్లు నచ్చితే అక్కడే గృహరుణం దరఖాస్తునూ నింపేస్తున్నారు. స్థిరమైన అభివృద్ధి ఉన్న వైపే.. మెరుగైన రవాణా సదుపాయాలు, విద్యా, వైద్యం, వినోద కేంద్రాలున్న ప్రాంతాల్లోనే కొనుగోళ్లకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. నిర్మాణ సంస్థలూ అలాంటి ప్రాజెక్ట్‌లకే శ్రీకారం చుడుతున్నాయి. మరోవైపు చెన్నై, బెంగళూరు వంటి ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో నేటికీ ఇళ్ల ధరలు అందుబాటులోనే ఉన్నాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఫ్లాట్ల రేట్లు పెరిగిన్పటికీ హైదరాబాద్‌లో నేటికీ తక్కువకే దొరుకుతున్నాయి. జిమ్, క్లబ్‌హౌజ్, స్విమ్మింగ్‌పూల్ వంటి ఆధునిక సదుపాయాలు గల గేటెడ్ కమ్యూనిటీల్లో బిల్డర్లు చెబుతోన్న రేట్లు బేరీజు వేశాక కొనుగోలుదారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సొంతింటిని కొంటున్నారు. భవిష్యత్తులో ఇంతకంటే తక్కువ ధరకు దొరుకుతాయన్న నమ్మకం లేదు కాబట్టి సొంతింటి కల సాకారానికి ఇదే సరైన సమయమని డెవలపర్లు చెబుతున్నారు. మెట్రో ప్రారంభమైతే.. కాసింత మార్కెట్ స్థిరపడగానే అందరి ఆలోచనలు గృహం చుట్టూ తిరుగుతుంటాయి. ఇన్నాళ్లు మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉందని చాలామంది తమ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. ప్రస్తుతం నగర స్థిరాస్తి మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొంది. మెట్రో నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ప్రపంచ దృష్టిసారిస్తోన్న మెట్రో ప్రాజెక్ట్‌ను నిర్ధారిత గడువులోపు పూర్తి చేయడానికి శ్రమిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే అంతర్జాతీయ నగరంగా మన భాగ్యనగరం పూర్వవైభవాన్ని సొంతం చేసుకుంటుంది. దీంతో ఇంటి ధరలకు మళ్లీ రెక్కలొచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ అంశాన్ని దృష్టిసారించిన చాలామంది నగరంలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ప్రత్యేక బహుమతులు.. స్థిరాస్తులకు సంబంధించిన సమస్త సమాచారాన్ని అందించడంతో పాటూ సందర్శకుల్లో ఉత్సాహం నింపేందుకు కొన్ని సంస్థలు ప్రత్యేక బహుమతులను అందించనున్నాయి. సిరిసంపద ఫామ్ ల్యాండ్స్ ప్రై.లి. రెండు రోజులు లక్కీ డ్రా ద్వారా ఎల్జీ మైక్రో వేవ్ ఓవెన్‌ను, లియోనియా రిసార్ట్స్ గంట గంటకూ గిఫ్ట్ ఓచర్‌ను అందిస్తాయి. -
ఘనంగా 'సాక్షి' ప్రాపర్టీ షో ప్రారంభం
-
ఘనంగా 'సాక్షి' ప్రాపర్టీ షో ప్రారంభం
* సందర్శకులతో కిటకిటలాడిన స్టాళ్లు * నేటితో ముగియనున్న షో హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. దాన్ని మరింత చేరువ చేసేందుకు నగరంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలను ఒకే వేదిక మీదికి తీసుకొచ్చింది ‘సాక్షి’. బంజారాహిల్స్‌లోని హోటల్ తాజ్‌కృష్ణలో శనివారం ‘సాక్షి ప్రాపర్టీ షో’ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ‘సాక్షి’ అడ్వర్టైజింగ్ డెరైక్టర్ కేఆర్పీ రెడ్డి పాల్గొని ప్రదర్శనను ప్రారంభించారు. ఈ షోలో నగరానికి చెందిన 32 నిర్మాణ సంస్థలు.. 50కి పైగా స్టాళ్లను ఏర్పాటు చేశాయి. దీంతో వివిధ ప్రాంతాల్లోని ప్రాపర్టీలను ఒకేసారి చూడటంతో పాటు ఒకింత తక్కువ ధరలకే ఫ్లాట్ లేదా స్థలం లభించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒక కంపెనీవారు ఎక్కువ ధర చెప్పినా మరొక చోట వాకబు చేసుకునే అవకాశం ఉంటుందని పలువురు సందర్శకులు పేర్కొన్నారు. రెండు రోజుల ఈ ప్రదర్శన ఆదివారంతో ముగుస్తుంది. స్టాళ్లకు సందర్శకుల తాకిడి తమ అవసరాలు, అభిరుచులకు అనుగుణమైన ఫ్లాట్లు, ఇళ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు సందర్శకులు బారులు తీరారు. స్టాళ్లు అన్నీ కిటకిటలాడాయి. ఏయే ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోంది? ధరల్లో వ్యత్యాసం.. స్థిరాస్తి కంపెనీల ప్రత్యేక ఆఫర్లు, బ్యాంక్‌లోన్ సదుపాయం వంటి వివరాలు పొందారు. వేల సంఖ్యలో పాల్గొన్న సందర్శకులు ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు, వాణిజ్య సముదాయాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్నారు. గంట గంటకూ లక్కీ డ్రా.. సిరి సంపద ఫామ్ ల్యాండ్స్ సంస్థ గంట గంటకూ లక్కీ డ్రా తీసింది. ప్రదర్శనకు వచ్చిన సందర్శకులు తమ పేర్లను నమోదు చేసుకోగా.. వీరి పేర్లను డ్రా తీసి విజేతకు బహుమతులు అందజేశారు. ప్రాపర్టీ షోను సందర్శించిన ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్‌కు సిరి సంపద ప్రతినిధులు శ్రీగంధం మొక్కను ఆయనకు బహుకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నగరంలో స్థిరాస్తిని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇలాంటి ప్రాపర్టీ షోలు ఎంతైనా అవసరమన్నారు. దీన్ని ‘సాక్షి’ వంటి సంస్థ నిర్వహించడం బాగుందన్నారు. భాగ్యనగరం భేష్.. బెంగళూరు, పుణె, ముంబై వంటి ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో నేటికీ స్థిరాస్తి ధరలు తక్కువే. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్న మెట్రో రైలు వచ్చే ఉగాది కల్లా పట్టాలపై పరుగులు పెట్టనుంది. త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న ఔటర్ రింగ్ రోడ్డు, నూతన పారిశ్రామిక విధానంతో వెల్లువలా వస్తున్న దేశ, విదేశీ కంపెనీలు.. పెట్టుబడులతో నగరంలో స్థిరాస్తి రంగానికి పూర్వ వైభవం రావటం ఖాయమని పలువురు నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. పాల్గొన్న సంస్థలివే... మెయిన్ స్పాన్సర్: అపర్ణ కన్స్ట్రక్షన్స్ అసోసియేట్స్ స్పాన్సర్స్: ఆదిత్య కన్స్ట్రక్షన్స్,పూర్వాంకర, రాంకీ కో-స్పాన్సర్స్: సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, ఎన్సీసీ అర్బన్, సిరి సంపద ఫాం ల్యాండ్స్, మ్యాక్ ప్రాజెక్ట్స్ సంస్థలు: మంజీర, శాంత శ్రీరామ్, అక్యురేట్ డెవలపర్స్, ప్రణీత్ గ్రూప్, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్, సాకేత్ ఇంజినీర్స్, జనప్రియ, రాజపుష్ప ప్రాపర్టీస్, వర్టెక్స్ హోమ్స్, ఎస్ అండ్ ఎస్ గ్రీన్ ప్రాజెక్ట్స్, స్వర్ణ విహార్ ఇన్ఫ్రా, గ్రీన్ హోమ్, ఫార్చూన్ బటర్‌ఫ్లై సిటీ, నార్త్ స్టార్ హోమ్స్, గిరిధారి హోమ్స్, ఆక్సాన్ హౌసింగ్, ప్రతిష్ట ప్రాపర్టీస్, స్పేస్ విజన్, మహేంద్రా లైఫ్ స్పేసెస్, ఏఆర్కే ఇన్ఫ్రా డెవలపర్స్, శ్రీనిధి ఇన్ఫ్రాటెక్, యూఎస్ఎం మై సిటీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇలాంటి షోస్ అవసరం.. గ్రేటర్లో ప్లాట్స్ ధరలు ఎలా ఉన్నాయో ఈ ప్రాపర్టీ షోలో తెలుసుకున్నా. మధ్య తరగతి కుటుంబాలకు అనుగుణంగా కూడా అందుబాటు ధరల్లో ప్లాట్స్‌ను ఉంచారు. సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఇలాంటి ప్రాపర్టీ షోలు దోహదపడతాయి. ‘సాక్షి’ ప్రకటన చూసి వచ్చాం. స్టాల్స్ నిర్వాహకులు అన్ని విషయాలను క్షుణ్ణంగా వివరించారు. - సుజాత, జీడిమెట్ల ‘సాక్షి’ కృషి భేష్.. హైదరాబాద్ మహానగరంలో సొంతింటి నిర్మాణం ఓ కల. ఈ కలను సాకారం చేసేందుకు అన్ని కన్స్ట్రక్షన్ సంస్థలు ఒకే వేదికపైకి వచ్చి అందరికీ అందుబాటు ధరల్లో ప్లాట్స్‌ను ఉంచారు. ఇక్కడ నగరంలోని నిర్మాణాలు, ప్లాట్స్, విల్లాస్‌పై మంచి అవగాహన వచ్చింది. ఇలాంటి ప్రాపర్టీ షోను నిర్వహించిన ‘సాక్షి’కి ప్రత్యేక అభినందనలు. - వివేకానంద, యూసుఫ్‌గూడ చాలా విషయాలు తెలిశాయి.. నగరంలోని ఏ ప్రాంతంలో ఎంత ధరల్లో విల్లాస్, ప్లాట్స్ ఉన్నాయో ‘సాక్షి’ ప్రాపర్టీ షోలో తెలుసుకున్నాను. అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే ప్లాట్స్‌ను వివిధ నిర్మాణ సంస్థలు వివరించాయి. సిటీలోని వివిధ ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపడుతున్నారో ఇక్కడ వివరించారు. ఇలాంటి ప్రాపర్టీ షోలు నగర ప్రజలకు ఎంతో అవసరం. - వీరేష్, మణికొండ -
నేడే సాక్షి ప్రాపర్టీ షో
తాజ్‌కృష్ణలో శని, ఆదివారాల్లో.. సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రాంతాల్లో నిర్మాణం జరుపుకుంటున్న అపార్ట్మెంట్ల సమాచారం కొనేవారికి చేరువకావాలన్న ఉద్దేశంతో సాక్షి నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోకు అపూర్వ స్పందన లభిస్తోంది. చిన్న సైజు ఫ్లాట్ల నుంచి లగ్జరీ విల్లాల వరకూ అన్ని రకాల గృహాలకు సంబంధించిన వివరాలు తెలుస్తాయన్న నమ్మకంతో ప్రదర్శనకు విచ్చేసి.. చాలా మంది తమ కలల గృహాన్ని సొంతం చేసుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో సానుకూల పరిస్థితులు నెలకొన్నాయి. ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకుంటున్న మెట్రో రైల్.. వచ్చే ఏడాదికల్లా పరుగులు పెడుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న ఔటర్ రింగ్ రోడ్డు, నూతన పారిశ్రామిక విధానంతో వెల్లువలా వస్తున్న దేశ, విదేశీ కంపెనీలు, పెట్టుబడులు.. ఫలితంగా భాగ్యనగరం విశ్వ నగరంగా మారనుంది. సమీప భవిష్యత్తులో స్థిరాస్తి ధరలు పుంజుకోనున్నాయి. ఇలాంటి సమయంలో నిర్మాణ సంస్థలు, బ్యాంకులను ఒకే గొడుకు కిందికి తీసుకొచ్చి.. నగరవాసుల సొంతింటి కలను చేరువ చేస్తోంది ‘సాక్షి ప్రాపర్టీ షో’!! పాల్గొనే సంస్థలివే మెయిన్ స్పాన్సర్: అపర్ణా కన్స్ట్రక్షన్స్ అసోసియేట్ స్పాన్సర్స్: ఆదిత్య కన్స్ట్రక్షన్స్, పూర్వాంకర, రాంకీ కో-స్పాన్సర్స్: సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, ఎన్సీసీ అర్బన్, సిరి సంపద ఫాంల్యాండ్స్, మ్యాక్ ప్రాజెక్ట్స్ పాల్గొనే సంస్థలు: మంజీరా, శాంతా శ్రీరామ్, అక్యురేట్ డెవలపర్స్, ప్రణీత్ గ్రూప్, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్, సాకేత్ ఇంజనీర్స్, జనప్రియ, రాజపుష్ప ప్రాపర్టీస్, వర్టెక్స్ హోమ్స్, ఎస్ అండ్ ఎస్ గ్రీన్ ప్రాజెక్ట్స్, స్వర్ణ విహార్ ఇన్ఫ్రా, గ్రీన్ హోమ్, ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై సిటీ, నార్త్ స్టార్ హోమ్స్, గిరిధారి హోమ్స్, ఆక్సాన్ హౌజింగ్, ప్రతిష్ట ప్రాపర్టీస్, స్పేస్ విజన్, మహేంద్రా లైఫ్ స్పేసెస్, ఏఆర్కే ఇన్ఫ్రా డెవలపర్స్, శ్రీనిధి ఇన్ఫ్రాటెక్, యూఎస్ఎం మై సిటీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. -
విశాఖ సాగరతీరంలో సాక్షి ప్రాపర్టీ షో
-
19, 20 తేదీల్లో ‘సాక్షి ప్రాపర్టీ షో’
మహారాణిపేట : స్థిరాస్తి రంగంలో పెట్టుబడి పెట్టేందుకు సరైన సమయం ఇది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ రియల్ ఎస్టేట్ సంస్థలు, బ్యాంకులు, డెవలపర్లుతో ఈ నెల 19, 20 వ తేదీల్లో బీచ్‌రోడ్ వైఎంసీఏ దరి సన్ఫ్రా రిసాట్స్లో ‘‘సాక్షి ప్రాపర్టీ షో’’ నిర్వహించబోతోంది. మీ సొంతింటి స్వప్నం సాకారం అయ్యేందుకు వీలుగా అందుకవసరమైన సమాచారమంతటిని మీకందించి, ఓ వివేకవంతమై న నిర్ణయం తీసుకునేందుకు బాటలు వేసింది. ఈ ప్రాపర్టీ షో ద్వారా మీ సొంతింటి స్వప్న సాకారానికి ‘సాక్షి’ మా ర్గం సుగమం చేస్తోంది. ‘సాక్షి ప్రాపర్టీ షో’కి విచ్చేయండి.. పలు రకాల గృహాలు, ప్లాట్లు మీ బడ్జెట్‌కు లోబడే ఎంపిక చేసుకోండి...అంటూ నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. ‘సాక్షి ప్రాపర్టీ షో’లో కొనుగోలు చేసిన వారికి డ్రాలో మొదటి బహుమతిగా ఎల్ఈడి టీవీ, రెండవ బహుమతిగా ఫ్రిజ్, మూడవ బహుమతిగా వాషింగ్మెషిన్లను గెలాక్సి ఎలక్ట్రానిక్ షోరూం వారి సౌజన్యంతో అందించనున్నారు. ఈ ప్రాపర్టీ షోలో కొనుగోలు చేసిన ప్రతి వారికి స్పాట్ గిఫ్ట్‌ను గాయత్రి హోం అప్లయన్స వారి సౌజన్యం తో అందించనున్నారు. ఈ షో సందర్శకులకు ఎం.వి.ఆర్.మాల్ సౌజన్యంతో ఏర్పాటు చేయనున్న ‘ఫిల్ అండ్ డ్రాప్ కాంటెస్ట్’ ద్వారా గంట గంటకు గిఫ్ట్ కూపన్లు అందించడం మరో ప్రత్యేక ఆకర్షణ. ‘సాక్షి ప్రాపర్టీ షో’లో రియల్ఎస్టేట్ సంస్థలు, డెవలపర్లు, బ్యాంకులు పాల్గొనుటకు స్టాల్ బుకింగ్స కోసం 9912222796, 9912220550 నంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు. -
నేడు, రేపు సాక్షి ప్రాపర్టీ షో 2015
-
సాక్షి ప్రాపర్టీ షో నేడే!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో సొంతింటి కలను సాకారం చేసుకోవడమంటే మామూలు విషయం కాదు. ఎన్నో వ్యయ ప్రయాసలు, మరెంతో సమయం వృథా. వీటన్నింటికి సులువైన పరిష్కారం చూపించేందుకు సిద్ధమైంది సాక్షి. శని, ఆదివారాల్లో బంజారాహిల్స్ రోడ్ నంబర్:1లోని హోటల్ తాజ్‌కృష్ణాలో ఉదయం 10 గంటలకు మెగా ప్రాపర్టీ షో జరగనుంది. ⇒ జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ నవీన్ మిట్టల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సందర్శకుల్లో ఉత్సాహం నింపేందుకు సిరి సంపద ఫామ్‌ల్యాండ్స్ గంట గంటకూ లక్కీ డ్రా తీయనుంది. ⇒ నగరంలోని ఏయే ప్రాంతాల్లో అభివృద్ధి ఎలా ఉంది? స్థిరాస్తి కంపెనీలు అందజేస్తున్న ప్రత్యేక ఆఫర్లు, బ్యాంక్‌లోన్ సదుపాయాలు.. ఇలా స్థిరాస్తికి సంబంధించిన సమాచారం ఈ షోలో తెలుసుకోవచ్చు. మార్కెట్లో ఉన్న అన్ని కంపెనీలు ఒకే చోటుకి చేరడం వల్ల సరసమైన ధరలకు ఫ్లాట్ లేదా స్థలం లభించే అవకాశం ఉంటుంది. మెయిన్ స్పాన్సర్: అపర్ణా కన్స్ట్రక్షన్స్ అసోసియేట్ స్పాన్సర్: ఆదిత్యా కన్స్ట్రక్షన్స్ కో-స్పాన్సర్స్: హిల్‌కౌంటీ ప్రాపర్టీస్, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, సిరి సంపద ఫామ్‌ల్యాండ్స్, మంజీరా కన్స్ట్రక్షన్స్. పాల్గొనే సంస్థలు: సత్వా గ్రూప్, ఎస్ఎంఆర్ బిల్డ ర్స్, శాంతా శ్రీరామ్, జనప్రియ ఇంజనీర్స్, రాజపుష్ప ప్రాపర్టీస్, ప్రణీత్ గ్రూప్, నార్త్ స్టార్ హోమ్స్, సాకేత్ ఇంజనీర్స్, ఆక్సాన్ హౌజింగ్ సొల్యూషన్స్, ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్, గ్రీన్ హోమ్, ఎస్ఎల్ గ్రూప్, బీఆర్సీ ఇన్ఫ్రా, శతాబ్ధి టౌన్‌షిప్స్, స్వర్ణ విహార్ ఇన్ఫ్రా, వర్ధన్ డెవలపర్స్, స్పేస్ విజన్, మ్యాక్ ప్రాజెక్ట్స్, జీకే డెవలపర్స్, గ్రీన్ సిటీ ఎస్టేట్స్, స్వేర్మైల్ ప్రాజెక్ట్స్, శ్రీసాయి బాలాజీ ఎస్టేట్స్. బ్యాంకులు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఇండియన్ బ్యాంక్, ఐడీబీఐ. -
సాక్షి ప్రాపర్టీ షో!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాక్షి ఆధ్వర్యంలో తొలి ప్రాపర్టీ షో జరగనుంది. అపర్ణా కన్స్ట్రక్షన్స్ ప్రధాన స్పాన్సర్‌గా నిర్వహిస్తున్న ఈ ప్రాపర్టీ షో.. బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ను పెంచడంతో పాటు మార్కెట్లో సానుకూల వాతావరణం ఏర్పడటానికి దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మార్చి 7, 8న తాజ్‌కృష్ణలో.. సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లోని తాజ్‌కృష్ణలో మార్చి 7, 8 తేదీల్లో జరిగే ఈ స్థిరాస్తి ప్రదర్శనలో దాదాపు 30కి పైగా బిల్డర్లు తమ నిర్మాణాలు, లే-అవుట్లను ప్రదర్శిస్తారు. వివిధ ప్రాంతాల్లో కడుతోన్న వ్యక్తిగత గృహాలు, డూప్లేలు, విల్లాలు, ఫ్లాట్ల, వాణిజ్య సముదాయాల సమాచారాన్ని కొనుగోలుదారులు తెలుసుకోవచ్చు. పైగా అక్కడే బ్యాంకులూ ఉండటం వల్ల గృహ రుణాలకు సంబంధించిన వివరాలనూ కనుక్కోవచ్చు కూడా. నగరం నలువైపులా నిర్మిస్తోన్న ప్రాజెక్టుల వివరాల్ని తెలుసుకోవడం కాస్త కష్టమే. స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని భావించేవారు కనీసం ఒకట్రెండు నెలలు తిరిగితే తప్ప సమాచారాన్ని తెలుసుకోలేని పరిస్థితి. వివిధ ప్రాంతాల్లో ఏయే నిర్మాణాల్లో ఎంత రేటు చెబుతున్నారు, అవి ప్రస్తుతం ఏయే దశలో ఉన్నాయి, ఏయే రాయితీలను అందిస్తున్నారు వంటి సమాచారాన్ని కొనుగోలుదారుల ముందు ప్రదర్శిస్తారు. ఎంపికలో కీలకమైన ఇలాంటి విషయాలు తెలిస్తేనే.. కొనుగోలుదారులు అంతిమ నిర్ణయానికి రావటం తేలికవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగింది. అనువుతుల కోసం వివిధ ప్రభుత్వ సంస్థలకు కట్టాల్సిన రుసుములు, ఇతరత్రా ఖర్చులూ రెట్టింపయ్యాయి. అయినప్పటికీ పలు సంస్థలు ఇంటి అంతిమ ధరను పెంచట్లేదు. అందుకే నేటికీ నగరంలో ఇళ్ల ధరలు అందుబాటులోనే ఉన్నాయి. ఇతర నగరాలతో పోల్చితే దాదాపు 30 శాతం తక్కువకే లభిస్తున్నాయి. రానున్న రోజుల్లో మార్కెట్ వురింత మెరుగవుతుంది కాబట్టి, ధరలు పెరిగినా ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి, సొంతిల్లు కొనుక్కోవడానికి ఇదే మంచి తరుణం. మరి ఆలస్యం దేనికి.. వెంటనే మీ కుటుంబ సభ్యులతో విచ్చేసి నచ్చిన ఇంటిని ఎంచక్కా ఎంపిక చేసుకోండి. స్టాల్స్ బుకింగ్ కోసం 99122 20380, 99516 03004 నంబర్లలో సంప్రదించవచ్చు. -
సాక్షి ప్రోపర్టీ షో 8th June 2014
-
జూన్ 2 తర్వాత భారీగా పుంజుకోనున్న రియల్ఎస్టేట్
-
హైదరాబాద్‌లో సాక్షి ప్రాపర్టీ షో