
ఘనంగా 'సాక్షి' ప్రాపర్టీ షో ప్రారంభం
* సందర్శకులతో కిటకిటలాడిన స్టాళ్లు
* నేటితో ముగియనున్న షో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. దాన్ని మరింత చేరువ చేసేందుకు నగరంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలను ఒకే వేదిక మీదికి తీసుకొచ్చింది ‘సాక్షి’. బంజారాహిల్స్‌లోని హోటల్ తాజ్‌కృష్ణలో శనివారం ‘సాక్షి ప్రాపర్టీ షో’ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ‘సాక్షి’ అడ్వర్టైజింగ్ డెరైక్టర్ కేఆర్‌పీ రెడ్డి పాల్గొని ప్రదర్శనను ప్రారంభించారు.
ఈ షోలో నగరానికి చెందిన 32 నిర్మాణ సంస్థలు.. 50కి పైగా స్టాళ్లను ఏర్పాటు చేశాయి. దీంతో వివిధ ప్రాంతాల్లోని ప్రాపర్టీలను ఒకేసారి చూడటంతో పాటు ఒకింత తక్కువ ధరలకే ఫ్లాట్ లేదా స్థలం లభించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒక కంపెనీవారు ఎక్కువ ధర చెప్పినా మరొక చోట వాకబు చేసుకునే అవకాశం ఉంటుందని పలువురు సందర్శకులు పేర్కొన్నారు. రెండు రోజుల ఈ ప్రదర్శన ఆదివారంతో ముగుస్తుంది.
స్టాళ్లకు సందర్శకుల తాకిడి
తమ అవసరాలు, అభిరుచులకు అనుగుణమైన ఫ్లాట్లు, ఇళ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు సందర్శకులు బారులు తీరారు. స్టాళ్లు అన్నీ కిటకిటలాడాయి. ఏయే ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోంది? ధరల్లో వ్యత్యాసం.. స్థిరాస్తి కంపెనీల ప్రత్యేక ఆఫర్లు, బ్యాంక్‌లోన్ సదుపాయం వంటి వివరాలు పొందారు. వేల సంఖ్యలో పాల్గొన్న సందర్శకులు ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు, వాణిజ్య సముదాయాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్నారు.
గంట గంటకూ లక్కీ డ్రా..
సిరి సంపద ఫామ్ ల్యాండ్స్ సంస్థ గంట గంటకూ లక్కీ డ్రా తీసింది. ప్రదర్శనకు వచ్చిన సందర్శకులు తమ పేర్లను నమోదు చేసుకోగా.. వీరి పేర్లను డ్రా తీసి విజేతకు బహుమతులు అందజేశారు. ప్రాపర్టీ షోను సందర్శించిన ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్‌కు సిరి సంపద ప్రతినిధులు శ్రీగంధం మొక్కను ఆయనకు బహుకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నగరంలో స్థిరాస్తిని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇలాంటి ప్రాపర్టీ షోలు ఎంతైనా అవసరమన్నారు. దీన్ని ‘సాక్షి’ వంటి సంస్థ నిర్వహించడం బాగుందన్నారు.
భాగ్యనగరం భేష్..
బెంగళూరు, పుణె, ముంబై వంటి ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో నేటికీ స్థిరాస్తి ధరలు తక్కువే. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్న మెట్రో రైలు వచ్చే ఉగాది కల్లా పట్టాలపై పరుగులు పెట్టనుంది. త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న ఔటర్ రింగ్ రోడ్డు, నూతన పారిశ్రామిక విధానంతో వెల్లువలా వస్తున్న దేశ, విదేశీ కంపెనీలు.. పెట్టుబడులతో నగరంలో స్థిరాస్తి రంగానికి పూర్వ వైభవం రావటం ఖాయమని పలువురు నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు.
పాల్గొన్న సంస్థలివే...
మెయిన్ స్పాన్సర్: అపర్ణ కన్‌స్ట్రక్షన్స్
అసోసియేట్స్ స్పాన్సర్స్: ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్,పూర్వాంకర, రాంకీ
కో-స్పాన్సర్స్: సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, ఎన్‌సీసీ అర్బన్, సిరి సంపద ఫాం ల్యాండ్స్, మ్యాక్ ప్రాజెక్ట్స్
సంస్థలు: మంజీర, శాంత శ్రీరామ్, అక్యురేట్ డెవలపర్స్, ప్రణీత్ గ్రూప్, ఎస్‌ఎంఆర్ హోల్డింగ్స్, సాకేత్ ఇంజినీర్స్, జనప్రియ, రాజపుష్ప ప్రాపర్టీస్, వర్టెక్స్ హోమ్స్, ఎస్ అండ్ ఎస్ గ్రీన్ ప్రాజెక్ట్స్, స్వర్ణ విహార్ ఇన్‌ఫ్రా, గ్రీన్ హోమ్, ఫార్చూన్ బటర్‌ఫ్లై సిటీ, నార్త్ స్టార్ హోమ్స్, గిరిధారి హోమ్స్, ఆక్సాన్ హౌసింగ్, ప్రతిష్ట ప్రాపర్టీస్, స్పేస్ విజన్, మహేంద్రా లైఫ్ స్పేసెస్, ఏఆర్‌కే ఇన్‌ఫ్రా డెవలపర్స్, శ్రీనిధి ఇన్‌ఫ్రాటెక్, యూఎస్‌ఎం మై సిటీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
ఇలాంటి షోస్ అవసరం..
గ్రేటర్‌లో ప్లాట్స్ ధరలు ఎలా ఉన్నాయో ఈ ప్రాపర్టీ షోలో తెలుసుకున్నా. మధ్య తరగతి కుటుంబాలకు అనుగుణంగా కూడా అందుబాటు ధరల్లో ప్లాట్స్‌ను ఉంచారు. సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఇలాంటి ప్రాపర్టీ షోలు దోహదపడతాయి. ‘సాక్షి’ ప్రకటన చూసి వచ్చాం. స్టాల్స్ నిర్వాహకులు అన్ని విషయాలను క్షుణ్ణంగా వివరించారు.
- సుజాత, జీడిమెట్ల
‘సాక్షి’ కృషి భేష్..
హైదరాబాద్ మహానగరంలో సొంతింటి నిర్మాణం ఓ కల. ఈ కలను సాకారం చేసేందుకు అన్ని కన్‌స్ట్రక్షన్ సంస్థలు ఒకే వేదికపైకి వచ్చి అందరికీ అందుబాటు ధరల్లో ప్లాట్స్‌ను ఉంచారు. ఇక్కడ నగరంలోని నిర్మాణాలు, ప్లాట్స్, విల్లాస్‌పై మంచి అవగాహన వచ్చింది. ఇలాంటి ప్రాపర్టీ షోను నిర్వహించిన ‘సాక్షి’కి ప్రత్యేక అభినందనలు.
- వివేకానంద, యూసుఫ్‌గూడ
చాలా విషయాలు తెలిశాయి..
నగరంలోని ఏ ప్రాంతంలో ఎంత ధరల్లో విల్లాస్, ప్లాట్స్ ఉన్నాయో ‘సాక్షి’ ప్రాపర్టీ షోలో తెలుసుకున్నాను. అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే ప్లాట్స్‌ను వివిధ నిర్మాణ సంస్థలు వివరించాయి. సిటీలోని వివిధ ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపడుతున్నారో ఇక్కడ వివరించారు. ఇలాంటి ప్రాపర్టీ షోలు నగర ప్రజలకు ఎంతో అవసరం.
- వీరేష్, మణికొండ