
‘సాక్షి’ ప్రాపర్టీ షో ప్రారంభం
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలను ఒకే గొడుకు కిందికి తీసుకు రావటం నిర్మాణ సంస్థలకు ఎంత ఉపయుక్తమో.. సందర్శకులకూ అంతేనన్నారు. స్థిరాస్తిపై సందేహాలను నివృత్తి చేసుకోవటంతో పాటు ఒక ప్రాంతంలోని ధరలను ఒకే వేదికపై సరిపోల్చుకునే వీలుంటుందన్నారు. ఇలాంటి అవకాశాన్ని ఏడాదికి రెండు సార్లు కల్పిస్తున్న సాక్షిని అభినందించారు. స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు (రెరా), వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)తో నిర్మాణ రంగంలో పార దర్శకత నెలకొంటోందని.. సీరియస్ కొనుగోలు దారులు, విదేశీ, ప్రవాస ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు.

ఇతర మెట్రోలతో పోలిస్తే హైదరాబాద్‌లో స్థలాల ధరలు తక్కువగా ఉండటమే ఇందుకు కారణమన్నారు. నివాస సముదాయాలతో పాటు వాణిజ్య, కార్యాలయాల స్థలాలకు గిరాకీ పెరుగుతోందని, ఈ మార్కెట్‌ను అందిపుచ్చుకోవటానికి స్థానిక నిర్మాణ సంస్థలు సిద్ధంగా ఉండా లన్నారు. ఈ కార్యక్రమంలో సాక్షి అడ్వరై్టజ్‌మెంట్ విభాగం వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్, జనరల్ మేనేజర్ రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు.


