Own home Dream
-
సొంతిల్లు, వ్యాపారం దీర్ఘకాల లక్ష్యాలు
ముంబై: సొంతిల్లు సమకూర్చుకోవడం, వ్యాపారం ప్రారంభించడం, ఆర్థిక స్వేచ్ఛ.. మిలీనియల్స్ (1980–1996 మధ్య జన్మించినవారు) టాప్–3 దీర్ఘకాలిక ప్రాధాన్యతలుగా ఉన్నాయి. ‘ఫైబ్–మిలీనియల్ అప్‌గ్రేడ్ ఇండెక్స్’ నిర్వహించిన అధ్యయనంలో ఈ ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. మెట్రోలు, నాన్ మెట్రో పట్టణాల్లో 8,000 మంది వ్యక్తుల అభిప్రాయాలను ఈ అధ్యయనంలో భాగంగా తెలుసుకున్నారు. ముఖ్యమైన అంశాలు.. → 30 ఏళ్లలోపు వయసు వారిలో 41 శాతం మంది సొంతంగా ఇల్లు సమకూర్చుకోవడం తమ తొలి లక్ష్యంగా చెప్పారు. → ఒంటరి పురుషులతో పోల్చితే, ఒంటరి మహిళల్లో సొంతంగా ఇల్లు కొనుగోలు చేయడం ఎక్కువ ప్రాధాన్య లక్ష్యంగా ఉంది. → వ్యాపారం ప్రారంభించడం, దాన్ని వృద్ది చేయడం 21 మంది లక్ష్యంగా ఉంది. → దీర్ఘకాలంలో ఆర్థిక స్వేచ్ఛ సాధించడమే తమ లక్ష్యమని 19 శాతం మంది చెప్పారు. → ఇక స్వల్పకాల లక్ష్యాలను గమనించినట్టయితే.. వృత్తిలో ఎదుగుదల, కొత్త గ్యాడ్జెట్, వాహనం కొనుగోలు, ఆరోగ్యం విషయంలో దృఢంగా ఉండాలని (కంటి సర్జరీలు, దంత చికిత్సలు తదితర) మిలీనియల్స్ కోరుకుంటున్నారు. → పోటీ పెరగడంతో మంచి ఉద్యోగం సంపాదించే విషయంలో మెట్రోల్లోని మిలీనియల్స్ ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. ఇలా భావిస్తున్నవారు 60 శాతంగా ఉన్నారు. → తాము పొదుపు చేస్తామని, ఆర్థిక అంశాలకు వ్యూహాత్మకంగా ప్రణాళిక వేసుకుంటామని 39 శాతం మంది చెప్పారు. → 21 శాతం మంది ఇతర ఆదాయ వనరుల కోసం అన్వేషిస్తామని చెబితే, దీర్ఘకాల లక్ష్యాల కోసం రుణ సాయం తీసుకుంటామని 29 శాతం మంది తెలిపారు. → 15 శాతం మందిలో దీర్ఘకాల ఆర్థిక ప్రణాళిక లేనే లేదు. → స్వల్పకాల ఆకాంక్షలను తీర్చుకునేందుకు ఫైనాన్షియల్ ఇనిస్ట్యూషన్స్ నుంచి రుణాలు తీసుకుంటామని చాలా మంది చెప్పారు. → ఈ విషయంలో యువతరానికి మార్గదర్శనం అవసరమని ఈసర్వే నివేదిక అభిప్రాయపడింది. బాధ్యతాయుతమైన రుణాల దిశగా వారిని చైతన్యవంతం చేయాలని, తద్వారా తమ రుణ పరపతిని కాపాడుకుంటూనే కలలను సాకారం చేసుకోగలరని పేర్కొంది. -
‘సాక్షి’ ప్రాపర్టీ షో
-
‘సాక్షి’ ప్రాపర్టీ షో ప్రారంభం
-
‘సాక్షి’ ప్రాపర్టీ షో ప్రారంభం
- సందర్శకులతో కిటకిటలాడిన ప్రాంగణం - 35 స్టాళ్లు ఏర్పాటు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నగరవాసులు సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ‘సాక్షి’ ప్రాపర్టీ షో మరోసారి వేదికయింది. హైదరాబాద్ నలువైపులా నిర్మాణంలో ఉన్న వెంచర్లు, అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ గృహాల వివరాలను తెలుసు కునేందుకు వచ్చిన సందర్శకులతో మాదాపూర్‌లోని శిల్పకళావేదిక ప్రాంగణం కిటకిటలాడింది. శనివారం ఘనంగా ప్రారంభమైన మెగా ప్రాపర్టీ షోలో హైదరాబాద్‌కు చెందిన 25 ప్రముఖ నిర్మాణ సంస్థలు, 35 స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ఉదయం 10 నుంచే సందర్శకులు రావడం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు గుమ్మి రాంరెడ్డి, జనరల్ సెక్రటరీ చెరుకు రామచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలను ఒకే గొడుకు కిందికి తీసుకు రావటం నిర్మాణ సంస్థలకు ఎంత ఉపయుక్తమో.. సందర్శకులకూ అంతేనన్నారు. స్థిరాస్తిపై సందేహాలను నివృత్తి చేసుకోవటంతో పాటు ఒక ప్రాంతంలోని ధరలను ఒకే వేదికపై సరిపోల్చుకునే వీలుంటుందన్నారు. ఇలాంటి అవకాశాన్ని ఏడాదికి రెండు సార్లు కల్పిస్తున్న సాక్షిని అభినందించారు. స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు (రెరా), వస్తు సేవల పన్ను (జీఎస్టీ)తో నిర్మాణ రంగంలో పార దర్శకత నెలకొంటోందని.. సీరియస్ కొనుగోలు దారులు, విదేశీ, ప్రవాస ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. ఇతర మెట్రోలతో పోలిస్తే హైదరాబాద్‌లో స్థలాల ధరలు తక్కువగా ఉండటమే ఇందుకు కారణమన్నారు. నివాస సముదాయాలతో పాటు వాణిజ్య, కార్యాలయాల స్థలాలకు గిరాకీ పెరుగుతోందని, ఈ మార్కెట్‌ను అందిపుచ్చుకోవటానికి స్థానిక నిర్మాణ సంస్థలు సిద్ధంగా ఉండా లన్నారు. ఈ కార్యక్రమంలో సాక్షి అడ్వరై్టజ్‌మెంట్ విభాగం వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్, జనరల్ మేనేజర్ రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు.