మెట్రో రైలు పరుగులు ఒకవైపు...ఓఆర్‌ఆర్, త్రిబుల్ ఆర్‌లతో నగర విస్తరణ మరోవైపు... జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ఎంట్రీ,స్టార్టప్‌ల జోష్ ఇంకొక వైపు... రెరా, జీఎస్‌టీల అమలుతో కొనుగోలుదారుల నమ్మకం మరొక వైపు... .. ఇదీ సింపుల్‌గా హైదరాబాద్ రియల్టీ రంగం వృద్ధికి కారణాలు! సాధారణంగా ఎన్నికల వాతావరణంలో రియల్టీ మందగమనంలో ఉంటుంది. అదేంటో మరి? ఈసారి ఎలక్షన్స్ ప్రభావం హైదరాబాద్ రియల్టీ రంగం మీద అస్సల్లేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో గృహాల అమ్మకాల్లో క్షీణత నమోదైతే.. నగరంలో వృద్ధి కనిపించడమే ఇందుకు నిదర్శనం. ఇక, ఎన్నికల ఫలితాల తర్వాత స్థిరాస్తి రంగం పరుగులు పెట్టడం ఖాయమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
సరిగ్గా ఇలాంటి సమయంలోనే ప్రాపర్టీ షో నిర్వహిస్తే? కొనుగోలుదారులకు, ఇన్వెస్టర్లకు సరైన ప్రాపర్టీలను ఎంచుకునే వీలు కల్పిస్తే? ఒకే వేదికగా వీటికి సమాధానం చెప్పేందుకు సిద్ధమైంది ‘సాక్షి ప్రాపర్టీ షో’!
సాక్షి ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో నేడు, రేపు మెగా ప్రాపర్టీ షో జరగనుంది. తెలంగాణ రెరా చైర్మన్ రాజేశ్వర్ తివారీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ ప్రదర్శనలో 35కి పైగా నగరానికి చెందిన బడా నిర్మాణ సంస్థలు ఓపెన్ ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలు, వాణిజ్య సముదాయాలను ప్రదర్శించనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు షో అందుబాటులో ఉంటుంది. సందర్శకులకు ప్రవేశం ఉచితం.
– సాక్షి, హైదరాబాద్
ప్రధాన స్పాన్సర్: అపర్ణా కన్‌స్ట్రక్షన్స్
అసోసియేట్ స్పాన్సర్: రాంకీ ఎస్టేట్స్
కో–స్పాన్సర్స్: జనప్రియ, ఎన్‌సీసీ అర్బన్, మ్యాక్ ప్రాజెక్ట్స్
ఇతర పాల్గొనే సంస్థలు: అక్యురేట్ డెవలపర్స్, రాజపుష్ప, వెర్టెక్స్, గిరిధారి హోమ్స్, ఆర్క్ బిల్డర్స్, ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై సిటీ, గ్రీన్ హోమ్స్, సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, ఆర్వీ నిర్మాణ్, సాకేత్, ప్రావిడెంట్, కపిల్ ప్రాపర్టీస్, ప్రగతి గ్రీన్‌మోడోస్, దామరి ఎస్టేట్స్, వర్ధన్ డెవలపర్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
Comments
Please login to add a commentAdd a comment