సాక్షి ప్రాపర్టీ షో! | Sakshi property show at taj krishna | Sakshi
Sakshi News home page

సాక్షి ప్రాపర్టీ షో!

Published Sat, Feb 14 2015 5:36 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

సాక్షి ప్రాపర్టీ షో! - Sakshi

సాక్షి ప్రాపర్టీ షో!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాక్షి ఆధ్వర్యంలో తొలి ప్రాపర్టీ షో జరగనుంది. అపర్ణా కన్‌స్ట్రక్షన్స్ ప్రధాన స్పాన్సర్‌గా నిర్వహిస్తున్న ఈ ప్రాపర్టీ షో.. బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచడంతో పాటు మార్కెట్లో సానుకూల వాతావరణం ఏర్పడటానికి దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మార్చి 7, 8న తాజ్‌కృష్ణలో..

సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లోని తాజ్‌కృష్ణలో మార్చి 7, 8 తేదీల్లో జరిగే ఈ స్థిరాస్తి ప్రదర్శనలో దాదాపు 30కి పైగా బిల్డర్లు తమ నిర్మాణాలు, లే-అవుట్లను ప్రదర్శిస్తారు. వివిధ ప్రాంతాల్లో కడుతోన్న వ్యక్తిగత గృహాలు, డూప్లేలు, విల్లాలు, ఫ్లాట్ల, వాణిజ్య సముదాయాల సమాచారాన్ని కొనుగోలుదారులు తెలుసుకోవచ్చు. పైగా అక్కడే బ్యాంకులూ ఉండటం వల్ల గృహ రుణాలకు సంబంధించిన వివరాలనూ కనుక్కోవచ్చు కూడా.
 
నగరం నలువైపులా నిర్మిస్తోన్న ప్రాజెక్టుల వివరాల్ని తెలుసుకోవడం కాస్త కష్టమే. స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని భావించేవారు కనీసం ఒకట్రెండు నెలలు తిరిగితే తప్ప సమాచారాన్ని తెలుసుకోలేని పరిస్థితి. వివిధ ప్రాంతాల్లో ఏయే నిర్మాణాల్లో ఎంత రేటు చెబుతున్నారు, అవి ప్రస్తుతం ఏయే దశలో ఉన్నాయి, ఏయే రాయితీలను అందిస్తున్నారు వంటి సమాచారాన్ని కొనుగోలుదారుల ముందు ప్రదర్శిస్తారు. ఎంపికలో కీలకమైన ఇలాంటి విషయాలు తెలిస్తేనే.. కొనుగోలుదారులు అంతిమ నిర్ణయానికి రావటం తేలికవుతుంది.

ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగింది. అనువుతుల కోసం వివిధ ప్రభుత్వ సంస్థలకు కట్టాల్సిన రుసుములు, ఇతరత్రా ఖర్చులూ రెట్టింపయ్యాయి. అయినప్పటికీ పలు సంస్థలు ఇంటి అంతిమ ధరను పెంచట్లేదు. అందుకే నేటికీ నగరంలో ఇళ్ల ధరలు అందుబాటులోనే ఉన్నాయి. ఇతర నగరాలతో పోల్చితే దాదాపు 30 శాతం తక్కువకే లభిస్తున్నాయి. రానున్న రోజుల్లో మార్కెట్ వురింత మెరుగవుతుంది కాబట్టి, ధరలు పెరిగినా ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి, సొంతిల్లు కొనుక్కోవడానికి ఇదే మంచి తరుణం. మరి ఆలస్యం దేనికి.. వెంటనే మీ కుటుంబ సభ్యులతో విచ్చేసి నచ్చిన ఇంటిని ఎంచక్కా ఎంపిక చేసుకోండి.

స్టాల్స్ బుకింగ్ కోసం 99122 20380, 99516 03004 నంబర్లలో సంప్రదించవచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement