
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో సొంతింటి ఎంపిక అంటే సులువేం కాదు. నమ్మకమైన బిల్డర్, నాణ్యమైన నిర్మాణం, గడువులోగా ప్రాజెక్ట్ పూర్తి, ఆధునిక వసతులు, తక్కువ ధర.. ఇవన్నీ ఉండాల్సిందే. మరి ఇలాంటి ప్రాజెక్ట్‌ల సమాచారం ఒకే వేదికగా పొందగలిగితే? ఇదే లక్ష్యంగా మరోసారి నగరవాసుల ముందుకురానుంది ‘సాక్షి ప్రాపర్టీ షో’.
మాదాపూర్ హైటెక్స్ సమీపంలోని సైబర్ కన్వెన్షన్‌లో ఈనెల 19, 20 తేదీల్లో స్థిరాస్తి ప్రదర్శనను నిర్వహించనుంది. ఈ షోలో నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థల ఓపెన్ ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు, వాణిజ్య ప్రాజెక్ట్‌లు అన్నీ ప్రదర్శనలో ఉంటాయి. నిర్మాణ సంస్థలు స్టాల్స్ బుకింగ్ కోసం 99122 20380, 87902 30124 నంబర్లలో సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment