ఈరోజు, రేపు సాక్షి ప్రాపర్టీ షో! | today and tomarrow sakshi property show | Sakshi
Sakshi News home page

ఈరోజు, రేపు సాక్షి ప్రాపర్టీ షో!

Published Sat, Mar 4 2017 12:09 AM | Last Updated on Tue, Sep 5 2017 5:06 AM

ఈరోజు, రేపు సాక్షి ప్రాపర్టీ షో!

ఈరోజు, రేపు సాక్షి ప్రాపర్టీ షో!

ఎక్కడ: హోటల్‌ తాజ్‌ కృష్ణ
సమయం: ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు
ప్రవేశంఉచితం


పాల్గొనే సంస్థలివే
మెయిన్‌ స్పాన్సర్‌: అపర్ణా కన్‌స్ట్రక్షన్స్‌
అసోసియేట్‌ పార్టనర్స్‌: ఆదిత్య, రాజపుష్ప, కెన్‌వర్త్‌ ప్రావిడెంట్‌
కో–స్పాన్సర్స్‌: మ్యాక్‌ ప్రాజెక్ట్స్, జనప్రియ
ఇతర సంస్థలు: సుమధుర, సైబర్‌ సిటీ, నార్త్‌స్టార్‌ హోమ్స్, శాంతా శ్రీరామ్, ఎన్‌సీసీ అర్బన్, సాకేత్, ఏఆర్కే డెవలపర్స్, గ్రీన్‌హోమ్, ఆర్వీ నిర్మాణ్, ముప్పా, అమృత ప్రాజెక్ట్స్, ఫార్చ్యూన్‌ బటర్‌ ఫ్లైసిటీ, వెర్టెక్స్, సాయి చరణ్, స్వర్ణవిహార్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్, స్పేస్‌ విజన్‌

సాక్షి, హైదరాబాద్‌
భాగ్యనగరంలో ఎప్పటికైనా ఓ సొంతిల్లు ఉండాలని కలలు కనేవారికి ‘సాక్షి’ మరోసారి చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. బంజారాహిల్స్‌లోని హోటల్‌ తాజ్‌కృష్ణలో ఈరోజు, రేపు మెగా ప్రాపర్టీ షోను నిర్వహిస్తోంది. నగరానికి చెందిన 22 ప్రముఖ నిర్మాణ సంస్థలు పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో వెంచర్లు, వ్యక్తిగత గృహాలు, విల్లాలు, అపార్ట్‌మెంట్లు, కార్యాలయ సముదాయాల వివరాలు వంటివి అందుబాటులో ఉంటాయి. మరెందుకు ఆలస్యం? కుటుంబ సమేతంగా విచ్చేసి అన్ని విధాల నప్పే ఇంటిని ఆనందంగా ఎంచుకోండి!

నగరం నలువైపులా నిర్మాణం జరపుకుంటోన్న ప్రాజెక్ట్‌ల సమాచారాన్ని కొనుగోలుదారులకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఏడాది ‘సాక్షి’ ప్రాపర్టీ షోను నిర్వహిస్తోంది. కస్టమర్ల నుంచి కూడా అపూర్వ స్పందన వస్తోంది. చిన్న సైజు నుంచి సంపన్న గృహాలకు సంబంధించిన పూర్తి వివరాలు దొరుకుతాయన్న నమ్మకంతో ప్రదర్శనకు విచ్చేసి చాలా మంది తమ కలల గృహాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. ఇల్లు నచ్చితే అక్కడే గృహరుణం దరఖాస్తునూ నింపేస్తున్నారు.

స్థిరమైన అభివృద్ధి ఉన్న వైపే..
మెరుగైన రవాణా సదుపాయాలు, విద్యా, వైద్యం, వినోద కేంద్రాలున్న ప్రాంతాల్లోనే కొనుగోళ్లకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. నిర్మాణ సంస్థలూ అలాంటి ప్రాజెక్ట్‌లకే శ్రీకారం చుడుతున్నాయి. మరోవైపు చెన్నై, బెంగళూరు వంటి ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో నేటికీ ఇళ్ల ధరలు అందుబాటులోనే ఉన్నాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఫ్లాట్ల రేట్లు పెరిగిన్పటికీ హైదరాబాద్‌లో నేటికీ తక్కువకే దొరుకుతున్నాయి. జిమ్, క్లబ్‌హౌజ్, స్విమ్మింగ్‌పూల్‌ వంటి ఆధునిక సదుపాయాలు గల గేటెడ్‌ కమ్యూనిటీల్లో బిల్డర్లు చెబుతోన్న రేట్లు బేరీజు వేశాక కొనుగోలుదారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సొంతింటిని కొంటున్నారు. భవిష్యత్తులో ఇంతకంటే తక్కువ ధరకు దొరుకుతాయన్న నమ్మకం లేదు కాబట్టి సొంతింటి కల సాకారానికి ఇదే సరైన సమయమని డెవలపర్లు చెబుతున్నారు.

మెట్రో ప్రారంభమైతే..
కాసింత మార్కెట్‌ స్థిరపడగానే అందరి ఆలోచనలు గృహం చుట్టూ తిరుగుతుంటాయి. ఇన్నాళ్లు మార్కెట్‌ ఒడిదుడుకుల్లో ఉందని చాలామంది తమ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. ప్రస్తుతం నగర స్థిరాస్తి మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొంది. మెట్రో నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ప్రపంచ దృష్టిసారిస్తోన్న మెట్రో ప్రాజెక్ట్‌ను నిర్ధారిత గడువులోపు పూర్తి చేయడానికి శ్రమిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే అంతర్జాతీయ నగరంగా మన భాగ్యనగరం పూర్వవైభవాన్ని సొంతం చేసుకుంటుంది. దీంతో ఇంటి ధరలకు మళ్లీ రెక్కలొచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ అంశాన్ని దృష్టిసారించిన చాలామంది నగరంలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు.

ప్రత్యేక బహుమతులు..
స్థిరాస్తులకు సంబంధించిన సమస్త సమాచారాన్ని అందించడంతో పాటూ సందర్శకుల్లో ఉత్సాహం నింపేందుకు కొన్ని సంస్థలు ప్రత్యేక బహుమతులను అందించనున్నాయి. సిరిసంపద ఫామ్‌ ల్యాండ్స్‌ ప్రై.లి. రెండు రోజులు లక్కీ డ్రా ద్వారా ఎల్‌జీ మైక్రో వేవ్‌ ఓవెన్‌ను, లియోనియా రిసార్ట్స్‌  గంట గంటకూ గిఫ్ట్‌ ఓచర్‌ను అందిస్తాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement