Hotel Taj Krishna
-
నయా ఫ్యాషన్..
-
నగరంలో వరల్డ్ క్లాస్ డిఫెన్స్ యూనివర్సిటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం నెంబర్‌వన్‌గా నిలిచిందని తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి మంత్రి కేటీఆర్ అన్నారు. టీఎస్ఐపాస్ ద్వారా కంపెనీలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లోని హోటల్ తాజ్‌కృష్ణలో యూఎస్ కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు యూఎస్-ఇండియా డిఫెన్స్ ఒప్పందాలపై సదస్సు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం సదస్సును ఉద్దేశిస్తూ.. ఆయన ప్రసంగించారు. 'టీఎస్ఐపాస్ ద్వారా ఐదేళ్లలో అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. అమెజాన్ వంటి పెద్ద సంస్థలు హైదరాబాద్‌కు వచ్చాయి. తెలంగాణ డిఫెన్స్ హబ్‌గా మారుతుంది. 12కు పైగా డిఫెన్స్ సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయి. 25 ఏరోస్పేస్ సంస్థలు హైదరాబాద్‌లో పనిచేస్తున్నాయి. బోయింగ్ లాంటి సంస్థలు నగరంలో ఉన్నాయి. ఆదిబట్లలో ప్రత్యేకంగా ఏరోస్పేస్ పార్క్ ఏర్పాటు చేశాం. తెలంగాణ ఆకాడమీ ఆఫ్ స్కిల్స్ ద్వారా ప్రత్యేక శిక్షణలు ఇస్తున్నాం. వరల్డ్ క్లాస్ డిఫెన్స్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ తక్కువ ధరకే వస్తువును ఉత్పత్తి చేయవచ్చు. టీహబ్ భారత్‌లోనే అతిపెద్ద స్టార్టప్ హబ్. హార్డ్‌వేర్ స్టార్టప్‌కు ప్రోత్సాహం అందిస్తున్నామని' మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. -
రాజకీయ నేతలతో ఈసీ బృందం భేటీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ నేతృత్వంలోని బృందం సోమవారం మధ్యాహ్నం రాష్ట్రానికి చేరుకుంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఈసీ బృందం రాష్ట్రంలోని గుర్తింపు పొందిన 9 రాజకీయ పార్టీల నాయకులతో హోటల్ తాజ్ క్రిష్ణలో భేటీ అయ్యింది. ఈసీతో సమావేశానికి ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు నేతలు హాజరుకానున్నట్లు సమాచారం. అంతేకాక ఈసీ ఒక్కో పార్టీ నాయకులతో దాదాపు 10 నిమిషాల పాటు సమావేశం కానున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈసీతో భేటీ నిమిత్తం అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు హోటల్ తాజ్ క్రిష్ణకు చేరుకున్నారు. ఎన్నికల సంఘం అధికారులు వీరితో ముఖాముఖి నిర్వహించి అభిప్రాయాలు సేకరించనున్నారు. ఈసీ బృందంతో భేటికి హాజరైన పార్టీలు - సభ్యులు బీఎస్పీ - సిద్ధార్థ్ పూలే బీజేపీ - ఇంద్రసేనా రెడ్డి, బాలసుబ్రహ్మణ్యం సీపీఐ - చాడ వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు సీపీఎం - నంద్యాల నర్సింహా రెడ్డి, వెంకటేష్ ఎంఐఎం - ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీ జాఫ్రీ టీఆర్ఎస్ - వినోద్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ - మర్రి శశిధర్ రెడ్డి, నిరంజన్ టీడీపీ - రావుల చంద్రశేఖర్ రెడ్డి, గురుమూర్తి వైసీపీ - రవికుమార్, సంజీవరావు పార్టీలతో సమావేశం ముగిసిన అనంతరం ఈసీ బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్, పోలీసు విభాగం నోడల్ అధికారి, అదనపు డీజీ జితేందర్‌రెడ్డిలతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీయనుంది. రేపటి షెడ్యూల్ మంగళవారం ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 1.30 వరకు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు,డీఐజీలు, ఐజీలతో సమావేశం మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 7 గంటల వరకు అన్ని జిల్లాల డిఇఓలు, ఎస్పీలతో సమావేశం బుధవారం షెడ్యూల్ ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు నోడల్ అధికారులు, ఇంకమ్ టాక్స్ అధికారులు, బ్యాంకు అధికారులు, రైల్వే, ఎయిర్పోర్ట్, సీపీఎఫ్, రాష్ట్ర పోలీస్ అధికారులతో సమావేశం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సీఎస్, డీజీపీ, ఫైనాన్స్ సెక్రటరీ, ఆబ్కారీ ముఖ్య కార్యదర్శి, రవాణా అధికారులతో భేటీ మధ్యాహ్నం 12.30 గంటల నుండి 1.00 వరకు మీడియా సమావేశం అనంతరం తిరిగి ఢిల్లీ వెళ్లనున్న ఈసీ బృందం -
తాజ్‌కృష్ణాలో ’ది లెబల్ ’ ఎగ్జిబిషన్ అండ్ సేల్
-
మార్చి 4,5 తేదీల్లో సాక్షి ప్రాపర్టీ షో!
-
ఈరోజు, రేపు సాక్షి ప్రాపర్టీ షో!
ఎక్కడ: హోటల్ తాజ్ కృష్ణ సమయం: ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రవేశంఉచితం పాల్గొనే సంస్థలివే మెయిన్ స్పాన్సర్: అపర్ణా కన్స్ట్రక్షన్స్ అసోసియేట్ పార్టనర్స్: ఆదిత్య, రాజపుష్ప, కెన్వర్త్ ప్రావిడెంట్ కో–స్పాన్సర్స్: మ్యాక్ ప్రాజెక్ట్స్, జనప్రియ ఇతర సంస్థలు: సుమధుర, సైబర్ సిటీ, నార్త్‌స్టార్ హోమ్స్, శాంతా శ్రీరామ్, ఎన్సీసీ అర్బన్, సాకేత్, ఏఆర్కే డెవలపర్స్, గ్రీన్‌హోమ్, ఆర్వీ నిర్మాణ్, ముప్పా, అమృత ప్రాజెక్ట్స్, ఫార్చ్యూన్ బటర్ ఫ్లైసిటీ, వెర్టెక్స్, సాయి చరణ్, స్వర్ణవిహార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, స్పేస్ విజన్ సాక్షి, హైదరాబాద్ భాగ్యనగరంలో ఎప్పటికైనా ఓ సొంతిల్లు ఉండాలని కలలు కనేవారికి ‘సాక్షి’ మరోసారి చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. బంజారాహిల్స్‌లోని హోటల్ తాజ్‌కృష్ణలో ఈరోజు, రేపు మెగా ప్రాపర్టీ షోను నిర్వహిస్తోంది. నగరానికి చెందిన 22 ప్రముఖ నిర్మాణ సంస్థలు పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో వెంచర్లు, వ్యక్తిగత గృహాలు, విల్లాలు, అపార్ట్మెంట్లు, కార్యాలయ సముదాయాల వివరాలు వంటివి అందుబాటులో ఉంటాయి. మరెందుకు ఆలస్యం? కుటుంబ సమేతంగా విచ్చేసి అన్ని విధాల నప్పే ఇంటిని ఆనందంగా ఎంచుకోండి! నగరం నలువైపులా నిర్మాణం జరపుకుంటోన్న ప్రాజెక్ట్‌ల సమాచారాన్ని కొనుగోలుదారులకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఏడాది ‘సాక్షి’ ప్రాపర్టీ షోను నిర్వహిస్తోంది. కస్టమర్ల నుంచి కూడా అపూర్వ స్పందన వస్తోంది. చిన్న సైజు నుంచి సంపన్న గృహాలకు సంబంధించిన పూర్తి వివరాలు దొరుకుతాయన్న నమ్మకంతో ప్రదర్శనకు విచ్చేసి చాలా మంది తమ కలల గృహాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. ఇల్లు నచ్చితే అక్కడే గృహరుణం దరఖాస్తునూ నింపేస్తున్నారు. స్థిరమైన అభివృద్ధి ఉన్న వైపే.. మెరుగైన రవాణా సదుపాయాలు, విద్యా, వైద్యం, వినోద కేంద్రాలున్న ప్రాంతాల్లోనే కొనుగోళ్లకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. నిర్మాణ సంస్థలూ అలాంటి ప్రాజెక్ట్‌లకే శ్రీకారం చుడుతున్నాయి. మరోవైపు చెన్నై, బెంగళూరు వంటి ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో నేటికీ ఇళ్ల ధరలు అందుబాటులోనే ఉన్నాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఫ్లాట్ల రేట్లు పెరిగిన్పటికీ హైదరాబాద్‌లో నేటికీ తక్కువకే దొరుకుతున్నాయి. జిమ్, క్లబ్‌హౌజ్, స్విమ్మింగ్‌పూల్ వంటి ఆధునిక సదుపాయాలు గల గేటెడ్ కమ్యూనిటీల్లో బిల్డర్లు చెబుతోన్న రేట్లు బేరీజు వేశాక కొనుగోలుదారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సొంతింటిని కొంటున్నారు. భవిష్యత్తులో ఇంతకంటే తక్కువ ధరకు దొరుకుతాయన్న నమ్మకం లేదు కాబట్టి సొంతింటి కల సాకారానికి ఇదే సరైన సమయమని డెవలపర్లు చెబుతున్నారు. మెట్రో ప్రారంభమైతే.. కాసింత మార్కెట్ స్థిరపడగానే అందరి ఆలోచనలు గృహం చుట్టూ తిరుగుతుంటాయి. ఇన్నాళ్లు మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉందని చాలామంది తమ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. ప్రస్తుతం నగర స్థిరాస్తి మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొంది. మెట్రో నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ప్రపంచ దృష్టిసారిస్తోన్న మెట్రో ప్రాజెక్ట్‌ను నిర్ధారిత గడువులోపు పూర్తి చేయడానికి శ్రమిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే అంతర్జాతీయ నగరంగా మన భాగ్యనగరం పూర్వవైభవాన్ని సొంతం చేసుకుంటుంది. దీంతో ఇంటి ధరలకు మళ్లీ రెక్కలొచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ అంశాన్ని దృష్టిసారించిన చాలామంది నగరంలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ప్రత్యేక బహుమతులు.. స్థిరాస్తులకు సంబంధించిన సమస్త సమాచారాన్ని అందించడంతో పాటూ సందర్శకుల్లో ఉత్సాహం నింపేందుకు కొన్ని సంస్థలు ప్రత్యేక బహుమతులను అందించనున్నాయి. సిరిసంపద ఫామ్ ల్యాండ్స్ ప్రై.లి. రెండు రోజులు లక్కీ డ్రా ద్వారా ఎల్జీ మైక్రో వేవ్ ఓవెన్‌ను, లియోనియా రిసార్ట్స్ గంట గంటకూ గిఫ్ట్ ఓచర్‌ను అందిస్తాయి. -
తాజ్ కృష్ణ వేదికగా క్వాయిష్ ఎగ్జిబిషన్
-
ట్రెడిషనల్ touch
మేలిమి ముత్యాల హారాలు, రాళ్లు పొదిగిన లోలాకులు... జలతారు చీరలు, తళుకులీనే డిజైనర్ వేర్...వీటి ప్రదర్శనకు వేదికయ్యింది బంజారాహిల్స్ హోటల్ తాజ్ కృష్ణా. ఉగాది సందర్భంగా మహిళల సాధికారతే ధ్యేయంగా క్వాయిష్ ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్ నిజంగానే నగర మహిళల క్వాయిష్‌ను తీరుస్తోంది. ఈ రోజు కూడా కొనసాగే ఈ ఎగ్జిబిషన్లో... లాక్మే ఫ్యాషన్ వీక్ డిజైనర్స్ వివేక్ కుమార్, సయంతన్ సర్కార్, అమల్ రాజ్ సేన్గుప్తాల లేటెస్ట్ కలెక్షన్‌తోపాటు... ప్రముఖ డిజైనర్స్ చేతిలో రూపుదిద్దుకున్న జ్యువెలరీ, షూస్, హోమ్ ఫర్నిషింగ్స్, యాక్సెసరీస్‌ను ప్రదర్శించారు. కొత్తదనాన్ని కోరుకోవడమే కాదు... న్యూ ఎరైవల్స్ను అందుకోవడానికీ నిత్యం సిద్ధంగా ఉండే సిటీవాసులు వీటిని చూసేందుకే కాదు... కొనేందుకూ ఆసక్తి చూపారు. -
ప్రాపర్టీ షో.. స్పందన భేష్..
-
సాక్షి ప్రాపర్టీ షో షురూ
కిక్కిరిసిన స్టాళ్లు.. ఈ రోజుతో ఆఖరు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నగరంలో స్థిరాస్తి సంస్థలన్నో... ప్రాజెక్టులూ అనేకం.. కట్టేది మాత్రం వేర్వేరు ప్రాంతాల్లో.. అన్నీ వేటికవే ప్రత్యేకం. వీటన్నింటినీ ఏకకాలంలో కొనుగోలుదారులకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ‘సాక్షి’ మెగా ప్రాపర్టీ షోను నిర్వహించింది. శనివారం బంజారాహిల్స్ రోడ్ నం. 1లోని హోటల్ తాజ్ కృష్ణాలో జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ నవీన్ మిట్టల్ ప్రాపర్టీ షోను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్నేళు ్లగా స్థిరాస్తి రంగంలో నిధుల లేమి, లోన్ల విడుదల లో కనికరించని బ్యాంకులు, స్థానిక రాజకీయాం శం కారణాలతో నగరంలో స్థిరాస్తి వ్యాపారం మందగించిందన్నారు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్రాల్లో స్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడ్డాయన్నారు. ఇక నగరంలో రియల్ వ్యాపారం పూర్వ వైభవాన్ని సంతరించుకోవడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్‌లోనే రియల్ ధరలు తక్కువగా ఉన్నాయని, నగరంలో సొంతిల్లు ఉండాలనుకునే వారికి ఇదే మంచి తరుణమని ఆయనన్నారు. ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (అప్రెడా) ప్రెసిడెంట్ హరిబాబు మాట్లాడుతూ.. మూడు నెలలుగా నగరంలో స్థిరాస్తి అమ్మకాలు జోరందుకున్నాయని, భవిష్యత్తులో బ్యాంకులు వడ్డీ రేట్ల మరింత తగ్గిస్తే ఈ అమ్మకాలు రెట్టింపు అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సిరి సంపద ఫామ్ ల్యాండ్స్ డెరైక్టర్ రాఘవేంద్ర, ‘సాక్షి’ (అడ్వర్టైజింగ్) వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్, ‘సాక్షి’ (అడ్వర్టైజింగ్) జీఎంలు రమణ కుమార్, కమల్ కిశోర్, సాక్షి (అడ్వర్టైజింగ్) ఏజీఎంలు ప్రవీణ్ రెడ్డి, వినోద్ పాల్గొన్నారు. ప్రాపర్టీ షో ముగియనుంది. గంట గంటకూ లక్కీ డ్రా.. సందర్శకుల్లో ఉత్సాహం నింపేందుకు సిరి సంపద ఫామ్ ల్యాండ్స్ ఆధ్వర్యంలో గంట గంటకూ లక్కీ డ్రా నిర్వహించింది. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులనూ అందజేసింది. సామాన్యుల నుంచి ఉన్నత వర్గాల వారికి అందరికీ అనుకూలంగా ఉండేలా నిర్మాణ సంస్థలు ఫ్లాట్లను నిర్మిస్తున్నాయి. కొన్ని సంస్థలు సింగిల్ బెడ్రూమ్ నుంచి నాలుగు పడకల గదులు వరకు నిర్మిస్తుండడం విశేషం. కేవలం ఫ్లాట్లే కాకుండా విల్లాలు, డూప్లెక్స్‌తో పాటు స్థలాలు కొనుగోలు చేయాలన్నా సమస్త సమాచారాన్ని ఇక్కడే తెలుసుకోవచ్చు. స్థిరాస్తి కంపెనీలకు సంబంధించిన పూర్తి సమాచారం ఒకే చోట లభిస్తుండటంతో ‘సాక్షి’ ప్రాపర్టీ షో సందర్శకులను అమితంగా ఆకర్షిస్తోంది. ఉద్యోగంలో బిజీగా ఉండే వారికి ప్రాజెక్టులను సందర్శించి వివరాలు తెలుసుకునేందుకు సమయం దొరకదు. అలాంటి వారికి సాక్షి ప్రాపర్టీ షో మంచి అవకాశంగా మారింది. మేలు చేసే పోటీ.. మార్కెట్లో ఉన్న అన్ని కంపెనీలు ఒకేచోట చేరడం వల్ల సరసమైన ధరలకు ఫ్లాట్, ప్లాట్ లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఒక కంపెనీవారు ఎక్కువ ధర చెప్పినా మరోచోట వాకబు చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది. ప్రాపర్టీ షో వల్ల కొన్ని కంపెనీలు పోటీపడి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఫలితంగా వినియోగదారులు సరసమైన ధరలకు, అన్ని వసతులతో తమకు కావాల్సిన ఇంటిని సొంతం చేసుకునే అవకాశముంది. ఫ్లాటూ.. ఫైనాన్స్ ఒకేచోట.. ‘సాక్షి’ ప్రాపర్టీ షోలో నిర్మాణ సంస్థలే కాదు.. బ్యాం కులూ స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. సందర్శకులకు గృహ రుణానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడంతో పాటు లోను సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. పాల్గొన్న సంస్థలివే.. మెయిన్ స్పాన్సర్: అపర్ణ కన్స్ట్రక్షన్స్ అసోసియేట్ స్పాన్సర్: ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కంపెనీ కో స్పాన్సర్స్ : హిల్‌కౌంటీ ప్రాపర్టీస్, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, సిరి సంపద ఫామ్ లాండ్స్, మంజీర కన్స్ట్రక్షన్స్, శ్రేష్ట్ వాటర్ ప్యూరిఫయర్. పాల్గొన్న సంస్థలు: సత్వ గ్రూప్, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్, సాకేత్ ఇంజినీర్స్, శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్, ఫార్చూన్ ఇన్ఫ్రా డెవలపర్స్, రాజపుష్ప ప్రాపర్టీస్, జనప్రియ ఇంజినీర్స్, ప్రణీత్ గ్రూప్, మ్యాక్ ప్రాజెక్ట్స్, ఆక్సాన్ హౌజింగ్ సొల్యూషన్స్, నార్త్ స్టార్ హోమ్స్, ఎస్ఎల్ గ్రూప్, బీఆర్సీ ఇన్ఫ్రా, వర్ధన్ డెవలపర్స్, గ్రీన్ హోమ్, శతాబ్ది టౌన్‌షిప్స్ ప్రై.లి., స్వేర్ మైల్ ప్రాజెక్ట్స్, గ్రీన్ సిటీ ఎస్టేట్స్, శ్రీ సాయి బాలాజీ ఎస్టేట్స్, స్పేస్ విజన్, జీకే డెవలపర్స్, స్వర్ణ విహార్ ఇన్ఫ్రా. బ్యాంకులు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఇండియన్ బ్యాంక్, ఐడీబీఐ. -
నేడు, రేపు సాక్షి ప్రాపర్టీ షో 2015
-
సాక్షి ప్రాపర్టీ షో నేడే!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో సొంతింటి కలను సాకారం చేసుకోవడమంటే మామూలు విషయం కాదు. ఎన్నో వ్యయ ప్రయాసలు, మరెంతో సమయం వృథా. వీటన్నింటికి సులువైన పరిష్కారం చూపించేందుకు సిద్ధమైంది సాక్షి. శని, ఆదివారాల్లో బంజారాహిల్స్ రోడ్ నంబర్:1లోని హోటల్ తాజ్‌కృష్ణాలో ఉదయం 10 గంటలకు మెగా ప్రాపర్టీ షో జరగనుంది. ⇒ జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ నవీన్ మిట్టల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సందర్శకుల్లో ఉత్సాహం నింపేందుకు సిరి సంపద ఫామ్‌ల్యాండ్స్ గంట గంటకూ లక్కీ డ్రా తీయనుంది. ⇒ నగరంలోని ఏయే ప్రాంతాల్లో అభివృద్ధి ఎలా ఉంది? స్థిరాస్తి కంపెనీలు అందజేస్తున్న ప్రత్యేక ఆఫర్లు, బ్యాంక్‌లోన్ సదుపాయాలు.. ఇలా స్థిరాస్తికి సంబంధించిన సమాచారం ఈ షోలో తెలుసుకోవచ్చు. మార్కెట్లో ఉన్న అన్ని కంపెనీలు ఒకే చోటుకి చేరడం వల్ల సరసమైన ధరలకు ఫ్లాట్ లేదా స్థలం లభించే అవకాశం ఉంటుంది. మెయిన్ స్పాన్సర్: అపర్ణా కన్స్ట్రక్షన్స్ అసోసియేట్ స్పాన్సర్: ఆదిత్యా కన్స్ట్రక్షన్స్ కో-స్పాన్సర్స్: హిల్‌కౌంటీ ప్రాపర్టీస్, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, సిరి సంపద ఫామ్‌ల్యాండ్స్, మంజీరా కన్స్ట్రక్షన్స్. పాల్గొనే సంస్థలు: సత్వా గ్రూప్, ఎస్ఎంఆర్ బిల్డ ర్స్, శాంతా శ్రీరామ్, జనప్రియ ఇంజనీర్స్, రాజపుష్ప ప్రాపర్టీస్, ప్రణీత్ గ్రూప్, నార్త్ స్టార్ హోమ్స్, సాకేత్ ఇంజనీర్స్, ఆక్సాన్ హౌజింగ్ సొల్యూషన్స్, ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్, గ్రీన్ హోమ్, ఎస్ఎల్ గ్రూప్, బీఆర్సీ ఇన్ఫ్రా, శతాబ్ధి టౌన్‌షిప్స్, స్వర్ణ విహార్ ఇన్ఫ్రా, వర్ధన్ డెవలపర్స్, స్పేస్ విజన్, మ్యాక్ ప్రాజెక్ట్స్, జీకే డెవలపర్స్, గ్రీన్ సిటీ ఎస్టేట్స్, స్వేర్మైల్ ప్రాజెక్ట్స్, శ్రీసాయి బాలాజీ ఎస్టేట్స్. బ్యాంకులు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఇండియన్ బ్యాంక్, ఐడీబీఐ. -
హొయలు.. తళుకుల లయలు..