పట్న : భారీ ఉగ్ర కుట్రను బిహార్ పోలీసులు భగ్నం చేశారు. అప్రమత్తమై బోధ్(బుద్ధ) గయలో మరో మారణ హోమం జరగకుండా నిలువరించగలిగారు. దలైలామ పర్యటన, రిపబ్లిక్ డే నేపథ్యంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు శుక్రవారం సాయంత్రం రెండు క్రూడ్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి.. తనిఖీలను విస్తృతం చేశారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... బౌద్ధ గురువు దలైలామా ప్రస్తుతం భోద్ గయలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తనిఖీలు కొనసాగుతుండగా.. శుక్రవారం సాయంత్రం వంట గదిలో ఓ స్వల్ఫ పేలుడు సంభవించింది. తొలుత గ్యాస్ లీకేజీ అని భావించిన పోలీసులు.. తర్వాత ఫ్లాస్క్‌లో బాంబు అమర్చి పేలుడుకు పాల్పడినట్లు నిర్ధారించారు. వెంటనే బాంబ్ స్వ్కాడ్ రంగంలోకి దిగి ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో కాలచక్ర మైదానంలో రెండు శక్తివంతమైన బాంబులను స్వాధీనం చేసుకున్నారు. దలైలామా శుక్రవారం తన కార్యక్రమాలను ముగించుకుని వెళ్లిన కాసేపటికే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
కాగా, 2013 బుద్ధ గయలో వరుస పేలుళ్లు(9 చోట్ల) దేశం మొత్తాన్ని దిగ్ర్భాంతికి గురి చేశాయి. అయితే అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం మాత్రం సంభవించలేదు. ఈ ఘటన తర్వాత సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని ఆలయ ప్రాంగణంలో మోహరించేందుకు కేంద్ర హోం శాఖ ప్రయత్నాలు చేసినా.. అవి సఫలం కాలేదు. దీంతో ఆలయ సిబ్బంది ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకుంది.
ఇది కూడా చదవండి... బుద్ధ గయపై నెత్తుటిచారిక
Comments
Please login to add a commentAdd a comment