serial blasts
-
తుండా విడుదలపై సుప్రీంకు సీబీఐ
న్యూఢిల్లీ: 1993 వరుస పేలుళ్ల కేసులో అబ్దుల్ కరీం తుండా(81)ను నిర్దోషిగా పేర్కొంటూ స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని సీబీఐ తెలిపింది. కోర్టు తీర్పును క్షుణ్నంగా పరిశీలించాక సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని పేర్కొంది.తుండాపై మోపిన అభియోగాలను రుజువు చేసేందుకు అవసరమైన సాక్ష్యాధారాలను ప్రాసిక్యూషన్ చూపలేకపోయిందని పేర్కొన్న అజ్మేర్లోని ప్రత్యేక టాడా కోర్టు అతడిని నిర్దోషిగా తేల్చింది. ఇదే కేసులో రైళ్లలో బాంబులను అమర్చినట్లు ఉన్న ఆరోపణలు రుజువు కావడంతో ఇర్ఫాన్, హమీదుద్దీన్ అనే వారికి కోర్టు జీవిత ఖైదు విధిస్తూ గురువారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. బాబ్రీ మసీదు విధ్వంసానికి ఏడాదైన సందర్భంగా 1993 డిసెంబర్ 5, 6 తేదీల్లో లక్నో, కాన్పూర్, హైదరాబాద్, సూరత్, ముంబైల్లోని రైళ్లలో వరుసగా పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనల్లో ఇద్దరు చనిపోగా మరో 22 మంది గాయపడ్డారు. -
కేరళ వరుస పేలుళ్లు: రూ. 3 వేలతోనే బాంబులు,గల్ప్‌లో ఉద్యోగం
కొచ్చిన్: దేశవ్యాప్తంగా కలకలం రేపిన కేరళ బాంబు పేళుళ్ల వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వరుస పేలుళ్లకు పాల్పడిన నిందితుడు డొమినిక్ మార్టిన్ దీనికి సంబంధించి పోలీసుల ముందు సంచలన విషయాలను వెల్లడించాడు. కలమస్సేరిలోని జమ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన పేలుళ్లకు బాధ్యత వహిస్తూ లొంగిపోయిన 28 గంటల తర్వాత, నిన్న (సోమవారం) అరెస్టయిన మార్టిన్ తాను ఏ విధంగా బాంబులు తయారు చేసిందీ, తన లక్ష్యం ఏమిటీ అనే వివరాలను పోలీసులకు వివరించినట్టు సమాచారం. తాజా సమాచారం ప్రకారం కొచ్చికి చెందిన డొమినిక్ మార్టిన్ ఇంటర్నెట్ నుంచి బాంబు తయారీ నేర్చుకున్నాడు. బాంబులను తయారు చేయడానికి కేవలం 3 వేల రూపాయల ఖర్చు చేసినట్టు వెల్లడించాడు. గల్ఫ్‌లో ఫోర్‌మెన్‌గా పనిచేస్తున్న సమయంలో బాంబులు తయారీ నేర్చుకున్నాడు. మార్టిన్ కుటుంబం ఐదేళ్లుగా కొచ్చి సమీపంలో అద్దెకు ఉంటోంది. పేలుళ్లకు రెండు నెలల ముందు మార్టిన్ దుబాయ్ నుంచి తిరిగి వచ్చి పేలుళ్లకు పాల్పడ్డాడని పోలీసు వర్గాలు తెలిపాయి. బాణాసంచా తయారీలో ఉపయోగించే తక్కువ గ్రేడ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌లు (IEDలు)తో ఈ బాంబును తయారు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దాదాపు ఎనిమిది లీటర్ల పెట్రోలును త్రిపుణితుర నుంచి కొనుగోలు చేశాననీ, ఇతర మెటీరియల్స్, మందుగుండు సామగ్రిని కొనుగోలుకు సంబంధించిన సమాచారాన్ని కూడా వెల్లడించాడు. యూట్యూబ్ ద్వారా నేర్చుకుని, తన ఇంట్లోనే ఎసెంబుల్డ్ చేసి, ఆదివారం ఉదయం 7 గంటలకు యెహోవా విట్నెస్ కన్వెన్షన్ సెంటర్లోని కుర్చీల కింద పెట్టాడు. ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నవారే లక్ష్యంగా ప్లాస్టిక్ కవర్లలో పెట్రోల్ నింపిమొత్తం ఆరు చోట్ల ఉంచాడు. అనంతరం వాటిని రిమోట్ కంట్రోల్‌తో పేల్చివేశాడు. అయితే వాటిల్లో మూడు బాంబులు పేలాయి. అంతేకాదు దీనికి సంబంధించి లైవ్ వీడియోను కూడా రికార్డు చేసినట్లు నిందితుడు తెలిపినట్టు సమాచారం. అలాగే లొంగిపోయే ముందు, మార్టిన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వీడియో సందేశాన్ని కూడా పోస్ట్ చేశాడు. సంబంధిత సంస్థ విద్రోహ పూరిత బోధన చేస్తోందని, సమాజం, పిల్లలకు తప్పుడు విలువలను ప్రచారం చేస్తోందనీ, పలుమార్లు హెచ్చరించినా ప్రయోజనం లేకపోవడంతో ఈ వరుస పేలుళ్లకు పాల్పడినట్టు పేర్కొన్నాడు. లొంగిపోయే ముందు, మార్టిన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వీడియో సందేశాన్ని కూడా పోస్ట్ చేశాడు. సంబంధిత సంస్థ విద్రోహపూరిత బోధన చేస్తోందని, సమాజం, పిల్లలకు తప్పుడు విలువలను ప్రచారం చేస్తోందనీ, పలుమార్లు హెచ్చరించినా ప్రయోజనం లేకపోవడంతో ఈ వరుస పేలుళ్లకు పాల్పడినట్టు పేర్కొన్నాడు. ఈ మార్టిన్ ఎఫ్బీ లైవ్ వీడియోను అప్లోడ్ చేసిన త్రిసూర్‌లోని లాడ్జీని కూడా పోలీసులు గుర్తించారు. జాతీయ దర్యాప్తుసంస్థ(ఎన్ఐఏ) నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఇంటెలిజెన్స్ బ్యూరో, పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందంమార్టిన్ ప్రశ్నిస్తోంది. బాంబుల తయారీకి విడిభాగాలను కొనుగోలు చేయడానికి మార్టిన్ వెళ్లిన స్థలాలను పోలీసులు పరిశీలిచారు. దీనికి సంబంధించిన CCTV ఫుటేజీని సేకరించినట్లు తెలిసింది. మార్టిన్ మానసిక పరిస్థితిని కూడా పర్యవేక్షిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ పేలుళ్లలో ఇతరుల ప్రమేయంపై కూడా పరిశీలిస్తున్నామని కొచ్చి కమిషనర్ ఎ అక్బర్ తెలిపారు. కాగా ఆదివారం (అక్టోబర్ 29) ప్రార్థనలు నిర్వహిస్తుండగా జరిగిన పేలుడులో ఒక చిన్నారితో సహా ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 52 మంది గాయపడిన సంగతి తెలిసిందే. -
Kerala Blast: కేరళలో వరుస పేలుళ్లు
కొచ్చి: కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలోని కొచ్చి నగర సమీపంలో వరుస పేలుళ్ల ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. మతపరమైన వేడుక జరుగుతున్న కన్వెన్షన్ సెంటర్లో చోటుచేసుకున్న ఈ పేలుళ్లలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో 51 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మూడు రోజులుగా జరుగుతున్న ఈ వేడుకల ముగింపు కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనేందుకు కలామాస్సెరీలోని జామ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌కు ఆదివారం ఉదయం వందలాది మంది ‘జెహోవా’ క్రైస్తవులు తరలివచ్చారు. అందరూ ప్రార్థనల్లో ఉండగా, ఉదయం 9.40 గంటలకు హఠాత్తుగా పేలుడు జరిగింది. కొద్దిసేపటికే మరోరెండు పేలుళ్లు సంభవించాయి. దీంతో జనమంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది మంది రక్తమోడుతూ కనిపించారు. ఘటనా స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. మొదటి రెండు పేలుళ్లు శక్తివంతమైనవిగా, మూడోది తక్కువ తీవ్రత కలిగిన పేలుడుగా పోలీసులు గుర్తించారు. పేలుళ్ల కోసం దుండగులు ఐఈడీ ఉపయోగించినట్లు కేరళ డీజీపీ షేక్ దర్వేష్ సాహెబ్ చెప్పారు. ఇది ఉగ్రవాద చర్యా? లేక మరేదైనా కారణం ఉందా? అనేది ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. పేలుళ్లకు కారణమైన ముష్కరులను గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, చికిత్స కొనసాగుతోందని డీజీపీ స్పష్టంచేశారు. పేలుళ్ల సమాచారం తెలియగానే కేరళ రాష్ట్ర యాంటీ–టెర్రరిజం స్క్వాడ్, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలో ఆధారాల కోసం అన్వేషణ ప్రారంభించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. కేరళ గవర్నర్ దిగ్భ్రాంతి క్రైస్తవుల మత ప్రార్థనల్లో పేలుళ్లు జరగడం పట్ల కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పేలుళ్ల ఘటన అత్యంత దురదృష్టకరమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, దోషులను కఠినంగా శిక్షిస్తామని తేలి్చచెప్పారు. పేలుళ్లకు తానే కారణం అంటూ వ్యక్తి లొంగుబాటు కలామాస్సెరీలో తానే వరుస పేలుళ్లకు పాల్పడ్డానంటూ ఓ వ్యక్తి ఆదివారం కేరళలోని త్రిసూర్ జిల్లా కొడాకర పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. తాను కూడా ‘జెనోవా’ సభ్యుడినేనని చెప్పారు. లొంగిపోయిన వ్యక్తి పేరు డొమినిక్ మార్టిన్ అని పోలీసులు తెలిపారు. పేలుళ్లకు తానే కారణం అంటూ కొన్ని ఆధారాలు చూపించాడని వెల్లడించారు. అతడు చెప్పేది నిజమేనా? అనేది క్షుణ్నంగా విచారిస్తున్నామని అన్నారు. కళ్ల ముందు అగ్నిగోళం కనిపించింది కలామస్సెరీలో మత ప్రార్థనల్లో జరిగిన పేలుళ్లను తల్చుకొని ప్రత్యక్ష సాక్షులు బెంబేలెత్తిపోతున్నారు. తాను కళ్లు మూసుకొని పార్థన చేస్తున్నానని, హఠాత్తుగా భారీ పేలుడు శబ్ధం వినిపించిందని ఓ మహిళ చెప్పారు. వెంటనే ఉలిక్కిపడి కళ్లు తెరిచానని అన్నారు. కళ్ల ముందు భగభగ మండుతున్న ఒక అగి్నగోళం కనిపించిందని పేర్కొన్నారు. -
కేరళ పేలుళ్లు.. పోలీసుల ముందు లొంగిపోయిన నిందితుడు
తిరువనంతపురం: కేరళ బాంబు పేలుళ్ల ఘటనకు తానే బాధ్యుడనని లొంగిపోయాడో వ్యక్తి. పేలుళ్లు జరిగిన కన్వెన్షన్ సెంటర్లో తానే బాంబును అమర్చినట్లు పేర్కొన్నాడు. తానే ఆ బాంబులను కన్వెన్షన్ సెంటర్లోకి తీసుకెళ్లినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. కేరళ, కలమస్సేరిలోని ప్రార్థనా సమావేశంలో జరిగిన పేలుళ్లలో ఒకరు మృతి చెందగా 50 మంది గాయపడ్డారు. ప్రార్థనలు జరుగుతున్న కన్వెన్షన్ సెంటర్లో డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తి బాంబును అమర్చినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. అయితే.. ఈ పేలుళ్ల వెనుక అతడి హస్తం ఉందా లేదా? అనే విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. కేరళ ADGP (లా అండ్ ఆర్డర్) అజిత్ కుమార్ మాట్లాడుతూ.. "పేలుళ్లకు సంబంధించి త్రిసూర్ రూరల్‌లోని కొడకరా పోలీస్ స్టేషన్లో డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తి లొంగిపోయాడు. అదే ప్రాంతానికి చెందినవాడుగా ఆయన పేర్కొన్నాడు. మేము ఈ కేసుకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలిస్తున్నాము." అని చెప్పారు. It's a very unfortunate incident. We are collecting details regarding the incident. All top officials are there in Ernakulam. DGP is moving to the spot. We are taking it very seriously. I have spoken to DGP. We need to get more details after the investigation: Kerala CM Pinarayi… https://t.co/4utwtmR9Sl pic.twitter.com/GHwfwieRLB — ANI (@ANI) October 29, 2023 కేరళలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఒకేరోజు మూడు సార్లు పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుళ్లల్లో ఒకరు మృతిచెందగా.. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. కలమస్సేరి సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ప్రేయర్ మీట్ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రార్థన సమయంలో అందరూ కళ్లు మూసుకొని ప్రార్థనలు చేస్తుండగా ఉదయం 9:47 సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. అనంతరం మరో రెండు మూడు చిన్న పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాదాపు 2,000 మందితో ప్రార్థనలు జరుగినట్లు స్థానికులు తెలిపారు. ఎన్ఐఏ యాంటీ టెర్రర్ ఏజెన్సీ కేసును విచారిస్తోంది. జాతీయ భద్రతా దళం బృందం కూడా కేరళకు రానుంది. ఈ పేలుళ్లకు కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇది ఉగ్రదాడి అని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో హమాస్ నాయకుడు పాల్గొనడంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పేలుడు సంభవించింది. ఇదీ చదవండి: కేరళ బాంబు పేలుళ్ల ఘటనలో విస్తుపోయే నిజాలు..! -
కేరళ పేలుళ్లు.. ఢిల్లీ, ముంబయిల్లో హైఅలర్ట్..
తిరువనంతపురం: కేరళ బాంబు పేలుళ్ల ఘటనతో దేశ రాజధాని, ముంబయిలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ, ముంబయిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పేలుళ్ల నేపథ్యంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పండుగల సీజన్, రాబోయే క్రికెట్ మ్యాచ్‌లు ఉన్న నేపథ్యంలో ముంబయి పోలీసులు కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ముంబయిలోని యూదుల కేంద్రమైన చాబాద్ హౌస్ వద్ద ఇప్పటికే భద్రతను పెంచారు. "నిఘా సంస్థలతో ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం నిరంతరం టచ్‌లో ఉంది. ఏదైనా అనుమానిత సమాచారం అందితే తీవ్రంగా పరిగణిస్తోంది. రద్దీగా ఉండే ప్రదేశాలలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం." అని ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. కేరళ, కలమస్సేరి సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఈ పేలుడు ఘటన జరిగింది. ఈ ప్రదేశం కొచ్చికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. దాదాపు 2000 మంది ప్రజలు ఈ ప్రార్థనా శిబిరానికి హాజరయ్యారు. మూడో రోజుల ప్రార్థనల్లో భాగంగా ఆదివారం చివరి రోజు కావడం గమనార్హం. ఈ పేలుడులో ఐఈడీ పదార్ధాలను ఉపయోగించినట్లు కేరళ పోలీసులు తెలిపారు. ప్రత్యేక దర్యాప్తు బృందాలు (సిట్) దర్యాప్తు చేపట్టాయి. పేలుళ్లు ఉగ్రదాడిగా పరిగణిస్తున్నారు. #WATCH | Kerala: Outside visuals from Zamra International Convention & Exhibition Centre, Kalamassery; one person died and several others were injured in an explosion here. pic.twitter.com/RILM2z3vov — ANI (@ANI) October 29, 2023 కేరళ సీఎం పినరయ్ విజయన్‌తో మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. దర్యాప్తు చేపట్టాలని ఎన్ఐఏ, ఎన్ఎస్జీ ఉన్నతాధికారులను ఇప్పటికే ఆదేశించారు. ఉగ్రవాద నిరోధక పరిశోధనలు, కార్యకలాపాల్లో నైపుణ్యం కలిగిన రెండు కేంద్ర ఏజెన్సీలకు చెందిన ప్రత్యేక బృందాలను సంఘటనా స్థలానికి పంపాలని షా ఆదేశాలు జారీ చేశారు. ఇదీ చదవండి: కేరళలో భారీ పేలుడు.. ఉగ్రదాడి కలకలం! -
అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు
-
సంచలన తీర్పు: దేశ చరిత్రలో తొలిసారి 38 మందికి మరణశిక్ష
సాక్షి, న్యూఢిల్లీ: అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 49 మంది దోషుల్లో 38 మందికి మరణశిక్ష విధించగా.. 11 మందికి జీవిత ఖైదు విధించింది. ఈ మేరకు జడ్జి ఏఆర్ పాటిల్ తీర్పు వెలవరించారు. ఒక కేసులో ఇంత మందికి ఉరిశిక్ష విధించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. కాగా, అహ్మదాబాద్‌లో రద్దీ ప్రాంతాలే లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు 2008లో 18 చోట్ల వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి, మున్సిపల్ ఎల్జీ ఆస్పత్రి, కార్లు, పార్కింగ్ ప్రదేశాల్లో జరిగిన పేలుళ్లలో 58 మంది మృతి చెందగా, 200 మందికి గాయాలయ్యాయి. కొన్ని బాంబులను ముందే గుర్తించిన భద్రతా దళాలు వాటిని నిర్వీర్యం చేశాయి. దీంతో కొంత ప్రాణనష్టం తప్పింది. చదవండి: (వివక్ష, వివాదం ఉంటేనే జోక్యం) -
సామాన్యుడి ముసుగులో ఉగ్రదందా!
మనం రోజూ పండ్లు కొనే వ్యక్తి పచి్చనెత్తురు తాగే ఉగ్రవాదని, మనకు రోజూ ఎదురయ్యే ఎంబీఏ నిరుద్యోగి ఎంతకైనా తెగించే టెర్రరిస్టని ఎవరైనా ఊహించగలరా! సరిగ్గా ఈ పాయింటును పట్టుకొని పాక్ ఐఎస్ఐ కుటిల కుట్రకు పాల్పడింది. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి భారతీయ సమాజంలో సాధారణ జీవనం గడపమని పంపింది, అవకాశం చూసి విధ్వంసాలకు పాల్పడేలా ప్లాన్ చేసింది. ఇంటెలిజెన్స్ వర్గాలు, పోలీసుల పుణ్యమా అని ఈ ఉగ్ర కుట్ర భగ్నమైంది. నవరాత్రి, రామ్‌లీలా ఉత్సవాల సందర్భంగా భారీ విధ్వంసాలకు ప్రణాళిక రచించిన ఉగ్రవాదులను అరెస్టు చేసిన పోలీసులకు దర్యాప్తులో విస్తుపోయే అంశాలు తెలుస్తున్నాయి. అరెస్టయిన వారంతా కరడు కట్టిన టెర్రరిస్టులమని వారి ఇరుగుపొరుగు కూడా తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందుకోసం సాధారణ జీవనం గడుపుతూ సమాజంలో కలిసిపోయారు. అదును చూసి పెట్రేగాలని ఆలోచించారు కానీ చివరకు దొరికిపోయారు. వీరిలో యూపీకి చెందిన జీషన్ ఖమర్ ఎంబీఏ గ్రాడ్యుయేట్. దుబాయ్‌లో అకౌంటెంట్‌గా పనిచేశాడు. కరోనా లాక్డౌన్ సందర్భంగా భారత్‌కు తిరిగివచ్చి ఖర్జూరాలమ్మే వ్యాపారం ఆరంభించాడు. లక్నోకు చెందిన మొహ్మద్ అమీర్ జావెద్, జీషన్‌కు దగ్గర చుట్టం. జెడ్డాలో చాలా సంవత్సరాలు గడిపాడు. భారత్‌కు వచ్చాక మతబోధకుడి అవతారం ఎత్తాడు. అబూ బకర్ సైతం జెడ్డా నుంచి భారత్‌కు వచ్చి స్థిరపడ్డాడు. దీయోబంద్లోని ఒక మదర్సాలో చదువుకున్నాడు. కుట్రలో కీలకమైన మూల్‌చంద్ అలియాస్ లాలాకు డీ కంపెనీ (దావూద్ ఇబ్రహీం దందా)తో దగ్గర సంబంధాలున్నాయి. కానీ బయటకు మాత్రం రైతుగా కనిపించేవాడు. ఇక ఒసామా సమీ కుటుంబం డ్రైఫ్రూట్ బిజినెస్‌లో ఉంది. ఇతను చాలాసార్లు మధ్యాసియా దేశాలకు వెళ్లి వచ్చాడు. మస్కట్ నుంచి పాకిస్తాన్‌కు జలమార్గంలో చేరుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన జాన్ మహ్మద్ షేక్ అలియాస్ సమీర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సెంట్రల్ ముంబైలో నివశిస్తున్న ఇతనికి ఇద్దరు కూతుర్లున్నారు. పోలీసులు అరెస్టు చేసేవరకు వీరి గురించి పక్కింటివారికి కూడా తెలియదంటే ఎంత పకడ్బందిగా వ్యవహరించారో అర్ధం అవుతోంది. డీ కంపెనీతో లింకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నిర్వహించే ముఠాతో అరెస్టయిన వారికి దగ్గర సంబంధాలున్నాయి. వీరిలో ఒసామా, ఖమర్‌లు ఐఎస్ఐ వద్ద శిక్షణ పొందిన ఉగ్రవాదులు కాగా, దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ ఇబ్రహీంకు సమీర్ దగ్గరవాడు. అంటే వీరికి డీ కంపెనీతో పాటు పాక్ అండదండలు కూడా ఉన్నట్లు అర్థమవుతోందని పోలీసులు చెప్పారు. పాక్‌లో ఉంటున్న అనీస్ ఆదేశాల ప్రకారం సమీర్ పేలుడు పదార్ధాలను, ఆధునిక ఆయుధాలను, గ్రెనేడ్లను భారత్‌లోని వివిధ ప్రాంతాల్లోని టెర్రరిస్టులకు అందించాలని ప్లాన్ చేశారు. గతేడాది ముంబై పోలీసులు ఫజుల్ రహమన్ ఖాన్ అలియాస్ ముజ్జుతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ ముంబైలోని ఒక వ్యాపారవేత్తను చంపమని వీరికి అనీస్ ఆదేశాలిచ్చాడు. దావూద్ అనుచరుడు ఫహీమ్ మాచ్మచ్కు ముజ్జు సన్నిహితుడు. అతనితో పనిచేసేవారు, కిరాయి హంతకుల గురించిన సమాచారాన్ని పోలీసులు మజ్జు నుంచి రాబట్టారు. ఇతని విచారణలోనే జాన్ మహ్మద్ పేరు బయటపడింది. అప్పటినుంచి ఇతని కదలికలపై పోలీసులు కన్నేసి ఉంచారు. కానీ జాన్ సాధారణ డ్రైవర్‌గా గడుపుతున్నట్లు నటించడంతో ఎలాంటి ఉగ్రకుట్ర గురించి తొలుత బయటపడలేదు. గతనెల ఫహీమ్ మరణించిన తర్వాత అనీస్ ఇతనికి నేరుగా ఆదేశాలు ఇవ్వడం ఆరంభించాడు. దీంతో ఇతని గుట్టు రట్టయింది, అప్పటివరకు ముంబైలో స్లీపర్ సెల్‌గా జాన్ పనిచేస్తున్నాడని, గ్యాంగుకు ఆయుధాలు సరఫరా చేసేవాడని తెలిసింది. దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో మొత్తం ఉగ్ర కుట్ర బయటపడింది. యూపీపై కన్ను యూపీలో వరుస పేలుళ్లను జరిపాలని ప్లాన్ చేశారు. ప్రయాగ్ రాజ్‌లో ఒక ఐఈడీ(పేలుడు పదార్ధం)ని టెర్రరిస్టులు అమర్చారని పోలీసులకు తెలిసింది. కచ్చితంగా ఎక్కడ ఈ బాంబు పెట్టారో తెలియకపోవడంతో ఆందోళన అధికమైంది. దీనికితోడు యూపీలో వీఐపీల రాకపోకలు అధికంగా ఉండడంతో సోదాలు నిర్వహించడం, దర్యాప్తు చేయడం ఎంతో కష్టమయ్యాయని పోలీసులు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల వేడితో రాష్ట్రంలో హడావుడి పెరిగింది. ఈ నేపథ్యంలో బాంబున్న ప్రదేశాన్ని కనుగొనడం సముద్రంలో సూదిని వెతికినట్లయింది. దీనికితోడు టెర్రరిస్టులు తప్పించుకోవడానికి అనువుగా నేపాల్ బోర్డర్‌ను ఆనుకొనే యూపీ ఉంది. కానీ ముమ్మర సోదాలు, లోతైన విచారణతో ఎట్టకేలకు బాంబు లొకేషన్ కనుగొని దాన్ని నిర్వీర్యం చేశారు. ఆపరేషన్ తొలిదశలోనే ఉగ్రవాదులు పట్టుబడడంతో ఎంతో ప్రాణనష్టాన్ని నివారించినట్లయింది. అయితే పాక్ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ఇదే చివరిసారి కాదని, అప్రమత్తతే దేశానికి రక్ష అని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. –నేషనల్ డెస్క్, సాక్షి -
వరుస పేలుళ్లతో వణికిన బాగ్దాద్
బాగ్దాద్: రెండు ఆత్మాహుతి బాంబు దాడులతో గురువారం ఇరాక్ రాజధాని బాగ్దాద్ వణికి పోయింది. సెంట్రల్ బాగ్దాద్‌లోని నిత్యం రద్దీగా ఉండే ‘బాబ్ అల్ షార్కి’లో జరిగిన ఈ రెండు వరుస పేలుళ్లలో కనీసం 32 మంది ప్రాణాలు కోల్పోయారు. 110 మందికి పైగా గాయాల పాలయ్యారు. చెల్లాచెదురుగా పడిన మృతులు, క్షతగాత్రుల దేహాలతో ఘటనాస్థలి హృదయవిదారకంగా మారింది. ఈ పేలుళ్లకు ఇంతవరకు ఏ సంస్థ కూడా బాధ్యత తీసుకోలేదు. కానీ, అధికారులు మాత్రం ఇది ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్ర సంస్థ పనేనని ధ్రువీకరించారు. ఆర్థిక సంక్షోభంతో పాటు ముందస్తు ఎన్నికలు జరగనున్నాయన్న వార్తలతో రాజకీయంగా దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆత్మాహుతికి సిద్ధమైన వ్యక్తి మొదట, మార్కెట్ మధ్య నిల్చుని తనకు ఆరోగ్యం బాలేదంటూ గట్టిగా అరిచాడని, దాంతో అందరూ ఆయన చుట్టూ మూగారని, అదే సమయంలో ఆ ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నాడని జాయింట్ ఆపరేషన్స్ కమాండ్ మేజర్ జనరల్ తహసిన్ అల్ ఖఫాజీ వివరించారు. ఆ తరువాత కాసేపటికే మరో వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ స్లీపర్ సెల్ చేసిన దారుణమిదని అన్నారు. -
వాళ్లంతా భారత్‌లోనే శిక్షణ పొందారు!
కొలంబో : ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలో ఆత్మాహుతి దాడికి పాల్పడే ముందు ఉగ్రవాదులు భారత్‌కు వచ్చారని ఆ దేశ ఆర్మీ చీఫ్ తెలిపారు. ఇందులో భాగంగా అక్కడే ఉగ్రదాడులపై శిక్షణ పొందారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 21న శ్రీలంకలో జరిగిన ఎనిమిది వరుస పేలుళ్లలో 250కి పైగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన 500 మందికి పైగా క్షతగాత్రుల్లో కొంతమంది ఇప్పటికీ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పేలుళ్ల గురించి శ్రీలంక ఆర్మీ చీఫ్ మహేష్ సేననాయకే మాట్లాడుతూ...‘ వాళ్లు(ఉగ్రవాదులు) భారత్‌లోని కశ్మీర్, బెంగళూరు, కేరళకు వెళ్లినట్లు మా వద్ద సమాచారం ఉంది. బహుషా ఆత్మాహుతి దాడుల్లో శిక్షణ పొందేందుకే వాళ్లు అక్కడికి వెళ్లి ఉండవచ్చు. పేలుళ్లకు దేశం బయటే వ్యూహ రచన జరిగినట్లు తెలుస్తోంది’ అని వ్యాఖ్యానించారు. కాగా శ్రీలంకను వణికించిన వరుస పేలుళ్లకు తామే పాల్పడ్డామని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రకటించింది. అయితే ఘటన జరిగిన వెంటనే స్పందించే ఐఎస్ ఘటనకు తామే పాల్పడ్డామని ప్రకటించడంలో జాప్యం చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు న్యూజిలాండ్‌లో మసీదుపై జరిగిన దాడికి ప్రతీకారంగానే వరుస పేలుళ్లు జరిగాయని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని శ్రీలంక రక్షణ శాఖ సహాయ మంత్రి రువన్ విజేవర్ధనే వెల్లడించిన సంగతి తెలిసిందే. పేలుళ్లపై ఇంటలెజిన్స్ హెచ్చరికలు పట్టించుకోని పోలీస్ ఛీఫ్‌పై వేటు వేయడంతో పాటుగా.. ముసుగులు ధరించడంపై శ్రీలంక ప్రభుత్వం నిషేధం విధించింది. -
శ్రీలంక పేలుళ్లు; ఫొటో జర్నలిస్టు అరెస్టు
కొలంబో : నిబంధనలు అతిక్రమించాడన్న కారణంగా ఓ ఫొటో జర్నలిస్టును శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో భాగంగా మే15 వరకు నెగోంబో మెజిస్ట్రేట్ అతడికి రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. ఈస్టర్ ఆదివారం నాడు శ్రీలంకలో ముష్కరులు సృష్టించిన నరమేధంలో 250 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలో నివసించే రాయిటర్స్ జర్నలిస్టు సిద్ధిఖి అహ్మద్ డానిష్ న్యూస్ కవరేజ్ కోసం అక్కడికి వెళ్లారు. ఇందులో భాగంగా నెగోంబో సిటీకి చేరుకున్న ఆయన అనుమతి లేకున్నా ఓ స్కూళ్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వరుస పేలుళ్లలో మరణించిన ఓ విద్యార్థి కుటుంబాన్ని కలిసేందుకు అక్కడికి వెళ్లగా పోలీసులు సిద్ధిఖిని అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతరం నెగొంబో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా ఈనెల 15వరకు రిమాండ్ విధించారు. ఇక ఎనిమిది చోట్ల జరిగిన పేలుళ్లలో నెగోంబోలోని సెయింట్ సెబాస్టియన్ చర్చిలో అత్యధికంగా వంద మంది చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా శ్రీలంకను వణికించిన వరుస పేలుళ్లకు తామే పాల్పడ్డామని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రకటించింది. అయితే ఘటన జరిగిన వెంటనే స్పందించే ఐఎస్ ఘటనకు తామే పాల్పడ్డామని ప్రకటించడంలో జాప్యం చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు న్యూజిలాండ్‌లో మసీదుపై జరిగిన దాడికి ప్రతీకారంగానే వరుస పేలుళ్లు జరిగాయని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని శ్రీలంక రక్షణ శాఖ సహాయ మంత్రి రువన్ విజేవర్ధనే వెల్లడించిన సంగతి తెలిసిందే. పేలుళ్లపై ఇంటలెజిన్స్ హెచ్చరికలు పట్టించుకోని పోలీస్ ఛీఫ్‌పై వేటు వేయడంతో పాటుగా.. ముసుగులు ధరించడంపై శ్రీలంక ప్రభుత్వం నిషేధం విధించింది. -
శ్రీలంక సంచలన నిర్ణయం; వాళ్లూ మనుషులే!
కొలంబో : శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో బుర్ఖాలతో సహా ముఖాన్ని కవర్ చేసుకునేందుకు ఉపయోగించే దుస్తులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఈమేరకు ఆదేశాలు జారీచేయగా.. సోమవారం నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. శ్రీలంక ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది సంప్రదాయవాదులు ఈ విషయాన్ని తప్పుపడుతుండగా...బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లిమా నస్రీన్ మాత్రం స్వాగతించారు. ఈ మేరకు... ‘ బాంబు పేలుళ్ల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా శ్రీలకం బుర్ఖాలను నిషేధించింది. చాలా మంచి నిర్ణయం. దీని ద్వారా మహిళలు తాము కూడా మనుషులమేనని భావిస్తారు. మొబైల్ ప్రిజన్(ముసుగులో ఉన్న కారణంగా ఎక్కడ ఉన్నా జైలు ఉన్నట్లుగా అనే ఉద్దేశంలో) నుంచి బయపడేందుకు వారు’ అర్హులు అంటూ తస్లిమా ట్విటర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్‌పై స్పందించిన నెటిజన్లు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. ‘ మొబైల్ ప్రిజన్ అనే ఒకే ఒక్కమాటతో ఈ విషయాన్ని అత్యద్భుతంగా వర్ణించారు అని కొందరు కామెంట్ చేస్తూ.. భారత్‌తో పాటు పలు ముస్లిం దేశాలలో ఇలాంటి నిబంధన రావాలని కోరుకుంటుండగా.. మరికొందరు మాత్రం.. ‘అందరూ మీ లాగే బుర్ఖాను జైలులా భావించారు. దయచేసి మీ అభిప్రాయాన్ని ముస్లిం మహిళలందరికీ ఆపాదించకండి. కేవలం ముస్లిం కమ్యూనిటీలోనే కాదు హిందూ మతంలో కూడా రాజస్తాన్ వంటి చోట్ల పర్దా పద్ధతి ఉంది’ అంటూ తస్లిమాను ట్రోల్ చేస్తున్నారు. Sri Lanka banned burqas for 'public protection' after bomb attacks. Good decision. It will help women feel like human beings. They deserve to have the right to not live in a mobile prison. — taslima nasreen (@taslimanasreen) April 29, 2019 -
చెప్పండయ్యా; వరుస పేలుళ్లు తప్పవు!
సాక్షి, చెన్నై: బాంబు బెదిరింపులు పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. శ్రీలంకలో సాగిన వరుస పేలుళ్ల తదుపరి కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు కాల్స్ రాక క్రమంగా పెరిగింది. ఇది కాస్త పోలీసు యంత్రాంగాన్ని కలవరంలో పడేసింది. ఆదివారం అర్ధరాత్రి ఓ వ్యక్తి కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి తమిళనాట వరుస పేలుళ్లు జరగనున్నట్టుగా బెదిరింపులు ఇవ్వడం, మరో వ్యక్తి ఫోన్ చేసి కాసేపట్లో మంత్రి ఎంఆర్ విజయభాస్కర్ ఇంటిని బాంబులతో పేల్చి వేయబోతున్నట్టుగా హెచ్చరించడం పోలీసులకు శిరోభారంగా మారింది. రాష్ట్రంలోని పోలీసు స్టేషన్లకు, ఉన్నతాధికారుల కార్యాలయాలు, కంట్రోల్ రూమ్‌లకు తరచూ వస్తున్న బెదిరింపు కాల్స్ పోలీసుల్ని పరుగులు తీయిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలో సాగిన వరుస పేలుళ్ల తదుపరి తమిళ పోలీసులతో చెడుగుడు ఆడుకునే వాళ్లు పెరిగినట్టున్నారు. గత మూడు నాలుగు రోజుల్లో ఒకే కంట్రోల్ రూమ్‌కు అనేక బెదిరింపు కాల్స్ రావడం పోలీసుల్ని పరుగులు తీయించడమే కాదు, ఆ కాల్స్ చేసిన వారిని పట్టుకునేందుకు తీవ్రంగానే కుస్తీలు పట్టాల్సిన పరిస్థితి. చెన్నైలో బాంబులు, మదురైలో బాంబులు, అదిగో తీవ్రవాది, ఇదిగో అజ్ఞాత వ్యక్తులు అంటూ వచ్చిన ఫోన్‌కాల్స్ చివరకు సీఎం పళనిస్వామి మీదకు ఆదివారం మళ్లాయి. సీఎం పళని స్వామిని హతమారుస్తామంటూ దిండుగల్ నుంచి వచ్చిన ఫోన్‌కాల్ మీద విచారణ సాగుతోంది. ఆ కాల్ చేసిన యువకుడిని గుర్తించినా, అతడు అజ్ఞాతంలో ఉండటంతో గాలింపునకు ప్రత్యేక బృందాల్ని రంగంలో దించక తప్పలేదు. ఈ విచారణ ఓ వైపు సాగుతుంటే, మరో వైపు ఆదివారం రాత్రి మరో రెండు కాల్స్ పోలీసులకు ముచ్చెమటలు పట్టించాయి. వరుస పేలుళ్లు తప్పవు ఆదివారం రాత్రి ఎగ్మూర్‌లోని కంట్రోల్ రూమ్‌కు తొలుత ఓ కాల్ వచ్చింది. తాను స్వామిని మాట్లాడుతున్నట్టు గంభీర గళం వినిపించడంతో తమ ఉన్నతాధికారుల్లో ఎవరో ఒకరై ఉంటారనుకుని అక్కడి సిబ్బంది చెప్పండయ్యా అంటూ మర్యాద పూర్వకంగా పలకరించారు. అయితే, ఆ వ్యక్తి అవతలి వైపు నుంచి పదే పదే స్వామిని.. స్వామిని అంటూ చివరకు శ్రీలంక బాంబు పేలుళ్లను గుర్తు చేస్తూ, తమిళనాట మరో మూడు నెలల్లో ఇలాంటి వరుస పేలుళ్లు జరగబోతున్నాయని, ఇందుకు తగ్గ పథకం, వ్యూహాలు రచించబడ్డట్టుగా హెచ్చరించి కట్ చేశాడు. ఇది బెదిరింపు కాల్లో భాగంగానే భావించినా, దీన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉన్నతాధికారులకు కంట్రోల్‌రూమ్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. దీంతో ఇంటెలిజెన్స్ వర్గాలను అలర్ట్ చేశారు. ఆ వర్గాలు మరింత నిఘాతో వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాల్ని ఉన్నతాధికారులకు చేర వేయాల్సిన పరిస్థితి. అలాగే, ఆ బెదిరింపు కాల్ మదురై నుంచి వచ్చినట్టు గుర్తించారు. మదురై సైతం తీవ్రవాదుల హిట్ లిస్ట్‌లో ఉండటంతో ఈ బెదిరింపు ఇచ్చిన వ్యక్తి కోసం ఆ జిల్లా పోలీసులు తీవ్రంగానే గాలించే పనిలో పడ్డారు. అలాగే, ఇదే కంట్రోల్ రూమ్‌కు వచ్చిన మరో కాల్లో గ్రీన్‌వేస్ రోడ్డులోని రవాణ మంత్రి ఎంఆర్ విజయభాస్కర్ ఇంట్లో బాంబుల్ని అమర్చామని, అవి పేలబోతున్నట్టుగా హెచ్చరించడంతో, ఆయన ఇంటి వద్ద పోలీసు హడావుడి పెరిగింది. గ్రీన్‌వేస్ రోడ్డులోనే సీఎం పళనిస్వామితోపాటుగా ఇతర మంత్రులు అందరూ ఉండటంతో, ఆ పరిసరాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టక తప్పలేదు. ఇవన్నీ బూచీలుగా తేలినా, ఈ బెదిరింపులు ఇస్తున్న వ్యక్తులు తమ చేతికి చిక్కకుండా తప్పించుకుంటుండటం పోలీసుల శిరోభారంగా మారింది. ఈ బెదిరింపు కాల్స్ చేసిన వాళ్లు ఒక్కరు చిక్కినా, మరో కాల్ రాకుండా చేసే రీతిలో వారితో కఠినంగా వ్యవహరించేందుకు తగ్గట్టుగా ముందుకు సాగుతున్నారు. ఆ ఇద్దరు ఎవరు? శ్రీలంకలో బాంబుదాడికి పాల్పడ్డ తీవ్రవాదులు తమిళనాడులోకి చొరబడే అవకాశం ఉందన్న సంకేతాలు ఇప్పటికే వెలువడ్డాయి. దీంతో నాగపట్నం, వేదారణ్యం, రామేశ్వరం తీరాల్లో భద్రతను మరింతగా పెంచి ఉన్నారు. గస్తీ ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి వేదారణ్యం నాలుగు రాళ్ల తీరంలో ఇద్దరు యువకులు గస్తీలో ఉన్న పోలీసులకు పట్టుబడ్డారు. అర్ధరాత్రి వేళ ఆ ఇద్దరు ఇక్కడకు ఎలా వచ్చారో అన్న అనుమానాలు బయలుదేరాయి. దీంతో ఆ ఇద్దర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో బెంగళూరుకు చెందిన ప్రణవ్, చెన్నైకు చెందిన సునీల్కుమార్లుగా తేలింది. ఓ కేసు విషయంగా ఓ వ్యక్తి సాయం కోసం వచ్చామని, వాళ్లే తమను ఇక్కడ ఉండమని చెప్పినట్టు ఆ ఇద్దరూ పేర్కొన్నారు. అసలు ఆ కేసు ఏమిటీ, ఆ వ్యక్తులు ఎవరో అన్న కోణంలో విచారణను క్యూబ్రాంచ్ వర్గాలు వేగవంతం చేశాయి. -
‘ఆ పేలుళ్ల సూత్రధారే నాకు స్ఫూర్తి’
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలో ఆత్మాహుతి దాడికి కుట్రపన్ని సోమవారం ఎన్ఐఏ చేతికి చిక్కిన 29 ఏళ్ల ఐఎస్ ఉగ్రవాది రియాజ్ విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. తాను ఏడాదిగా శ్రీలంకకు చెందిన జహ్రన్ హషీం, జకీర్ నాయక్‌ల ప్రసంగాలు, వీడియోలను ఫాలో అవుతున్నానని, కేరళలో ఆత్మాహుతి దాడిని చేపట్టాలని భావించానని విచారణలో రియాజ్ వెల్లడించినట్టు ఎన్ఐఏ పేర్కొంది. శ్రీలంక బాంబు పేలుళ్ల సూత్రధారి హషీం ప్రసంగాలతో తాను స్ఫూర్తి పొందానని రియాజ్ చెప్పాడు. మరోవైపు ఐఎస్ ఆపరేటివ్ అబ్దుల్ రషీద్ అబ్దుల్లాతో కూడా తాను సంప్రదింపులు జరిపానని కేరళలోని పలక్కాడ్ జిల్లాకు చెందిన రియాజ్ వెల్లడించాడు. సిరియాకు చెందిన మరో ఐఎస్ అనుమానిత ఉగ్రవాది అబు ఖలీద్‌తో తాను ఆన్లైన్ చాట్ చేసినట్టు నిందితుడు తెలిపాడు. కాగా రియాజ్‌ను మంగళవారం కొచిన్‌లోని ఎన్ఐఏ కోర్టు ఎదట హాజరుపరచనున్నారు. -
నిజంగా అదృష్టవంతుడే..!!
అబుదాబి : భూమి మీద నూకలు ఉంటే చాలు చావు అంచుల దాకా వెళ్లినా సరే తిరిగి రావొచ్చు అన్న మాట అభినవ్ చారి అనే వ్యక్తికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ముష్కరులు జరిపిన దాడుల్లో రెండుసార్లు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఏప్రిల్ 21న శ్రీలంకలో మొదలైన బాంబుల మోత ఇప్పటికీ మోగుతూనే ఉంది. భద్రతా వైఫల్యం కారణంగా ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడుల్లో వందలాది ప్రాణాలు కోల్పోగా..మరెంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈస్టర్ ఆదివారం రోజున జరిగిన శ్రీలంక పేలుళ్ల నుంచే కాకుండా.. భారత్‌లోని ముంబై ఉగ్రదాడుల(26/11) నుంచి కూడా బయటపడ్డానని చెబుతున్నాడు దుబాయ్‌లో నివసించే ఎన్నారై అభినవ్ చారి. దుబాయ్‌లో నివసిస్తున్న అభినవ్ చారి భార్య నరూప్తో కలిసి బిజినెస్ ట్రిప్‌లో భాగంగా శ్రీలంకకు వెళ్లాడు. ఈ క్రమంలో కొలంబోలోని సినామన్ గ్రాండ్ హోటల్లో బస చేశాడు. ఈస్టర్ సండే సందర్భంగా ఓ చర్చికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి హోటల్‌కు చేరుకునే సరికి అక్కడి బాంబు దాడిలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం చూసి బెంబేలెత్తిపోయాడు. ఈ విషయం గురించి అభినవ్ చారి మాట్లాడుతూ.. ‘ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దాటి బయటి దేశాల్లో బస చేసింది కేవలం రెండే రెండుసార్లు. కానీ ఆ రెండు సందర్భాల్లోనూ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాను. మత విద్వేషం సృష్టించే అరాచకాన్ని చూశాను. మెడిసిన్ చదివేందుకు ముంబై వెళ్లాను. 2008లో అక్కడ ఉన్న సమయంలో ఉగ్రవాదులు దాడి చేశారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో ఐదారు రోజులు వణికిపోయా. ఇప్పుడేమో శ్రీలంకలో. చర్చికి వెళ్లి ప్రార్థనలు చేసిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేద్దామనుకున్నాం. కానీ అప్పటికే రోడ్డుపై అంతా గందరగోళంగా ఉంది. దీంతో హోటల్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. అయితే అక్కడికే చేరుకునే కొద్ది నిమిషాల కంటే పేలుడు సంభవించిందని తెలుసుకుని ఆందోళన చెందాను. ఉగ్రదాడుల నుంచి నేను నా భార్య తృటిలో బయటపడ్డాం’ అని చెప్పుకొచ్చాడు. -
‘విదేశాల్లో చదివొచ్చి.. ఇక్కడ రక్తం పారిస్తున్నారు’
కొలంబో : క్రైస్తవ ప్రార్థనా మందిరాలే లక్ష్యంగా శ్రీలంకలో ఐసిస్ ఉద్రవాదులు వరుస బాంబు పేలుళ్లకు తెగబడటంతో 359 మంది అసువులుబాసారు. వేలమంది క్షతగాత్రులయ్యారు. స్థానిక ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ నేషనల్ తౌహీద్ జమాత్ ఈ మారణహోమానికి పాల్పడినట్టు తొలుత భావించారు. అయితే, గత నెల 15న న్యూజిలాండ్‌లో జరిగన మసీదు దుర్ఘటనకు ప్రతీకారంగానే ఈస్టర్ పండుగ వేళ తమ ప్రతీకారాన్ని తీర్చుకున్నామని ఐసిస్ ఉగ్రసంస్థ వెల్లడించింది. బాంబు పేలుళ్లకు పాల్పడిన తొమ్మిది మంది ఆత్మాహుతి దళ సభ్యుల్లో ఓ మహిళ కూడా ఉండటం.. అంతా లంకేయులే కావడం గమనార్హం. ఇక విదేశాల్లో ఉన్నత చదువుసాగించిన విద్యావంతులు ఉగ్రవాదంవైపు మళ్లడం ద్వీపదేశాన్ని మరింత కలవరపెడుతోంది. బాగా చదువుకొని అటు కుంటుంబాన్ని ఇటు దేశాన్ని ఉద్ధరిస్తారనుకున్న ‘మేధావులు’ పుట్టిన గడ్డపై రక్తం పారిస్తున్నారని రక్షణశాఖ సహాయమంత్రి రువాన్ విజయవర్దనే ఆవేదన వ్యక్తం చేశారు. పదిమందికి తిండి పెడతారనుకున్న ఐశ్వర్యవంతులు ప్రజల ఉసురు తీస్తున్నారని వాపోయారు. ఆత్మాహుతి దాడులకు తెగబడ్డవారిలో యూకే, ఆస్ట్రేలియాలో పీజీ పూర్తి చేసిన ఓ వ్యక్తి కూడా ఉన్నాడని తెలిపారు. చదువుల కోసం విదేశాలకు వెళ్లినప్పుడు అతను ఉగ్రవాదం ఆకర్షితుడయ్యాడా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఇక బడా వ్యాపారవేత్త మహమ్మద్ యూసుఫ్ ఇబ్రహీం ఇద్దరు కుమారులు కూడా సూసైడ్ బాంబర్లుగా మారారు. 33 ఏళ్ల ఇమ్సాత్ కొలంబోలోని సిన్నమన్ గ్రాండ్ హోటల్లో, 31ఏళ్ల ఇల్హామ్.. షాంగ్రిల్లా హోటల్లో పేలుళ్లకు తెగబడినట్టు వెల్లడైంది. దాడులకు సంబంధించి ఇప్పటివరకు 90 మందిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. మృతుల్లో 39మంది విదేశీయులున్నారు. ఇందులో 10మంది భారతీయులు ఉండగా.. నలుగురు అమెరికన్లు ఉన్నట్టు తెలిసింది. ఈస్టర్ సండే రోజు వరుస దాడులతో ఉగ్రవాదులు నరమేథం సృష్టించిన నేపథ్యంలో సోమవారం అర్థరాత్రి నుంచి శ్రీలంకలో ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది. పోలీసులు, త్రివిధ దళాలు ప్రజా భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. -
శ్రీలంక పేలుళ్లు : ఇద్దరు ఉన్నతాధికారులపై వేటు
కొలంబో : వరుస పేలుళ్లతో 300 మందికి పైగా మరణించడం, వందలాది మంది గాయపడటంతో నిలువెల్లా వణికిన శ్రీలంక ఉగ్ర ఘటన నేపథ్యంలో బాధ్యులపై చర్యలు చేపడుతోంది. విదేశీ నిఘా వర్గాల నుంచి దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు వచ్చినా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ పోలీస్ చీఫ్, రక్షణ కార్యదర్శులను రాజీనామా చేయాలని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తేల్చిచెప్పారు. ఉగ్ర దాడుల నేపథ్యంలో భద్రతా దళాల నాయకత్వంలో సమూల మార్పులు చేపట్టనున్నట్టు వెల్లడించారు. నిఘా వర్గాల సమాచారాన్ని భద్రతాధికారులు తన దృష్టికి తీసుకురాకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సీనియర్ అధికారులు ఉద్దేశపూర్వకంగానే దాడులు జరుగుతాయనే సమాచారాన్ని బయటకు పొక్కనీయలేదని శ్రీలంక పార్లమెంట్లో సీనియర్ నేత లక్ష్మణ్ కిరిల్లా తెలిపారు. చర్చిలు, హోటళ్లు, రాజకీయ నేతల లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశం ఉందని ఏప్రిల్ 4న భారత నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చిందని, ఏప్రిల్ 7న అధ్యక్షుడు సిరిసేన అధ్యక్షతన జరిగిన సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై భద్రతాధికారులు ఎలాంటి వివరణ ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నిఘా వర్గాల నుంచి దాడులపై సమాచారం ఉన్నప్పటికీ సరైన చర్యలు చేపట్టడంలో టాప్ ఇంటెలిజెన్స్ అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. -
‘ఆరోజు అలసిపోవడంతో బతికిపోయాను’
‘నిజానికి ఆరోజు నేను చర్చికి వెళ్లాల్సింది. ఆదివారం ఉదయం ఇంట్లో ఉన్న సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు విన్నాను. చర్చిలో బాంబు పేలిందని అందరూ అరుస్తున్నారు. నేను వెంటనే అక్కడికి పరిగెత్తుకు వెళ్లాను. అక్కడి భయానక దృశ్యాల్ని నేను ఎన్నటికీ మరచిపోలేను’ అంటూ శ్రీలంక క్రికెటర్ దసున్ షణక తన అనుభవం గురించి చెప్పుకొచ్చాడు. అలసిపోయినందు వల్ల చర్చికి వెళ్లలేకపోయాయని.. అందుకే ప్రస్తుతం ప్రాణాలతో ఉన్నానని పేర్కొన్నాడు. ఈస్టర్ సండే రోజున శ్రీలంకలోని వరుస పేలుళ్లలో ఇప్పటికే 320కు పైగా మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఎనిమిది చోట్ల జరిగిన ఈ పేలుళ్లలో నెగోంబోలోని సెయింట్ సెబాస్టియన్ చర్చిలో అత్యధికంగా వంద మంది చనిపోయారు. ఈ విషయం గురించి దసున్ మాట్లాడుతూ.. ‘ ఆరోజు మా అమ్మ, బామ్మ కూడా ఈస్టర్ సర్వీస్ కోసం సెయింట్ సెబాస్టియన్ చర్చికి వెళ్లారు. అక్కడి సీన్ చూస్తే ఎవరైనా భయంతో వణికిపోవాల్సిందే. పేలుడు కారణంగా చర్చి మొత్తం ధ్వంసమైంది. వందలాది శవాలను బయటికి తీసుకు వస్తుంటే నా శరీరం కంపించింది. ఆ దృశ్యాలను చూస్తుంటే అక్కడ ఉన్న వాళ్లెవరైనా బతికి ఉంటారనే ఆలోచన కూడా రాదు. అయితే అదృష్టవశాత్తూ అమ్మా, బామ్మ ప్రాణాలతో బయటపడ్డారు. బామ్మ తలకు గాయమైంది. సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పారు’ అని వ్యాఖ్యానించాడు. కాగా శ్రీలంక తరఫున మూడు టెస్టు మ్యాచ్‌లు, 19 వన్డేలు, 27 టీ20లు దసున్ ఆల్‌రౌండర్‌గా జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. ఇక తన హోం టౌన్ నెగోంబోలో ఎప్పుడూ మత ఘర్షణలు జరగలేదని చెప్పే ఈ యువ ఆటగాడు.. ఆదివారం నాటి ఘటన మాత్రం తనను బెంబేలెత్తించిందని పేర్కొన్నాడు. ఇప్పుడు వీధుల్లో నడవాలంటేనే చాలా భయంగా ఉంటోందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఇక శ్రీలంకను వణికించిన వరుస పేలుళ్లకు తామే పాల్పడ్డామని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రకటించింది. శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం జరిగిన వరుస పేలుళ్లలో 321 మంది మరణించగా, దాదాపు 500 మంది గాయపడ్డారు. పేలుళ్ల ఘటన ఐఎస్ మిలిటెంట్ గ్రూపు చర్యేనని అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేశాయి. అయితే ఘటన జరిగిన వెంటనే స్పందించే ఐఎస్ ఘటనకు తామే పాల్పడ్డామని ప్రకటించడంలో జాప్యం చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు న్యూజిలాండ్‌లో మసీదుపై జరిగిన దాడికి ప్రతీకారంగానే వరుస పేలుళ్లు జరిగాయని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని శ్రీలంక రక్షణ శాఖ సహాయ మంత్రి రువన్ విజేవర్ధనే వెల్లడించారు. -
‘శ్రీలంక పేలుళ్లు మా పనే’
కొలంబో : శ్రీలంకను వణికించిన వరుస పేలుళ్లకు తామే పాల్పడ్డామని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రకటించింది. శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం జరిగిన వరుస పేలుళ్లలో 321 మంది మరణించగా, దాదాపు 500 మంది గాయపడ్డారు. పేలుళ్ల ఘటన ఐఎస్ మిలిటెంట్ గ్రూపు చర్యేనని అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేశాయి. అయితే ఘటన జరిగిన వెంటనే స్పందించే ఐఎస్ ఘటనకు తామే పాల్పడ్డామని ప్రకటించడంలో జాప్యం చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ మసీదులో ఇటీవల జరిగిన దాడికి ప్రతీకారంగానే వరుస పేలుళ్లకు పాల్పడ్డారని శ్రీలంక అధికారులు పేర్కొన్నారు. పేలుళ్ల ఘటనకు లంకకు చెందిన రెండు ఇస్లామిస్ట్ గ్రూపులే బాధ్యులని భావిస్తున్నారు. న్యూజిలాండ్‌లో మసీదుపై జరిగిన దాడికి ప్రతీకారంగానే వరుస పేలుళ్లు జరిగాయని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని శ్రీలంక రక్షణ శాఖ సహాయ మంత్రి రువన్ విజేవర్ధనే వెల్లడించారు. కాగా పేలుళ్ల ఘటనకు సంబంధించి అనుమానితుడిగా భావించి ఓ సిరియన్‌ను అదుపులోకి తీసుకున్నట్టు సైనిక వర్గాలు తెలిపాయి. -
బాంబుపేలడానికి ముందు వీడియో.. బ్యాగుతో ఉగ్రవాది!
కొలంబో: శ్రీలంకలోని వరుస బాంబు పేలుళ్లు ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చాయి. ముష్కరుల ఉన్మాద చర్య కారణంగా వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అయితే నెగొంబోలోని సెయింట్ సెబాస్టియన్ చర్చిలో సరిగ్గా బాంబు పేలడానికి కొద్ది సమయం ముందు ఓ వ్యక్తి భారీ బ్యాగుతోలోపలికి రావడాన్ని సీసీటీవీ కెమెరాలో పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి చర్చిలోకి వచ్చిన తర్వాత, బాంబుపేలడానికి ముందు నుంచి సీసీటీవీ కెమెరా పనిచేయడం ఆగిపోయింది. ఆ వ్యక్తే ఆత్మహుతిదాడికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీలంకలోని ఉగ్రమూకల రాక్షసక్రీడలో ప్రాణాలు కోల్పోయిన ప్రజల సంఖ్య అమాంతం పెరిగింది. మూడు చర్చిలు, మూడు ఐదు నక్షత్రాల హోటళ్లపై ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడుల్లో మృతుల సంఖ్య 310కి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో 500 మందికిపైగా ప్రజలు చికిత్స పొందుతున్నారు. సెయింట్ సెబాస్టియన్ చర్చితోపాటూ కొలంబోలోని సెయింట్ ఆంథోనీ చర్చి, బట్టికలోవాలోని జియోన్ చర్చితో పాటు షాంగ్రీలా, సినమన్ గ్రాండ్, కింగ్స్బరీ ఫైవ్‌స్టార్ హోటళ్లలో వరుస బాంబు పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. వరుస బాంబుపేలుళ్ల నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ఓ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థకు చెందిన 40 మందిని అరెస్ట్ చేశారు. -
నిర్లక్ష్యానికి మూల్యం
ఉగ్రవాద దాడులు, విధ్వంసం ఉదంతాలను దాదాపు మరిచిపోయిన శ్రీలంక ఈస్టర్ పర్వదినాన నెత్తురోడిన తీరు ఉగ్రవాదంపై ఉపేక్ష ఎంతటి ముప్పు తెచ్చిపెడుతుందో తేటతెల్లం చేసింది. ఆది వారంనాడు శ్రీలంక రాజధాని నగరం కొలంబోలో చర్చిలు, విలాసవంతమైన హోటళ్లు లక్ష్యంగా చేసుకోవడం మాత్రమే కాదు.. అటు ఉత్తరప్రాంత నగరమైన బట్టికలోవలోని చర్చిలో కూడా ఉగ్రవాదులు కేవలం నిమిషాల వ్యవధిలో దారుణ మారణహోమాన్ని సృష్టించడం.. వాటికి 300మంది అమాయకులు బలికావడం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. అంతవరకూ ఎంతో సందడిగా కనబడిన ప్రాంతాలన్నీ వల్లకాళ్లుగా మారడం, ఎటుచూసిన మాంసపు ముద్దలే దర్శనమీయడం, తమను కాపాడమంటూ గాయపడినవారు ఆర్తనాదాలు చేయడం ఎంతటివారినైనా కలచివేస్తుంది. దాడులకు ఎంచుకున్న సందర్భాన్ని, ప్రాంతాలను గమనిస్తే ఉగ్రవాదుల లక్ష్యమేమిటో స్పష్టంగా అర్ధమ వుతుంది. విదేశీ పర్యాటకులు, వ్యాపారవేత్తలు, స్థానిక సంపన్నులు సందర్శించే విలాసవంతమైన హోటళ్లపై ఉగ్రవాదులు గురిపెట్టారు. భయానక వాతావరణాన్ని సృష్టిస్తే దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే పర్యాటకం దెబ్బతింటుందని వారు భావించినట్టు కనబడుతుంది. ఘటనలు జరిగిన 24 గంటల తర్వాత కూడా ఏ సంస్థా తామే ఈ పని చేశామని ప్రకటించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇవన్నీ ఆత్మాహుతి దాడులేనా కాదా అన్నది కూడా ఇంకా నిర్ధారించాల్సి ఉంది. ఈ దాడులు సరిగ్గా పదకొండేళ్లక్రితం మన ముంబై నగరంపై ఉగ్రవాదులు సాగించిన యుద్ధాన్ని గుర్తుకు తెచ్చాయి. అప్పట్లో ఉగ్రవాదులు రెండు విలాసవంతమైన హోటళ్లు, ఎప్పుడూ రద్దీగా ఉండే రైల్వే స్టేషన్, యూదుల సామాజిక కేంద్రం వంటివి ఎంచుకున్నారు. ఇప్పుడు కూడా మరణాల సంఖ్య అధికంగా ఉండేలా క్రైస్తవ పర్వదినాన్ని ఎంచుకుని, చర్చిలను లక్ష్యంగా చేసుకు న్నారు. విలాసవంతమైన హోటళ్లలో బాంబులు పేల్చారు. కొలంబోలోని కొచికడేలో ఉన్న సెయింట్ ఆంథోనీ కాథలిక్ చర్చి పర్యాటకపరంగా ఎంతో సుప్రసిద్ధమైనది. విదేశీ యాత్రికులు తప్పనిసరిగా సందర్శించే స్థలం. ఆత్మాహుతి దాడులు, విధ్వంస ఘటనలు శ్రీలంక గతంలోనూ చవిచూసింది. దాదాపు మూడు దశాబ్దాలపాటు తమిళ టైగర్ల కార్యకలాపాలతో అట్టుడికిన దేశ మది. ఆ సంస్థను నామరూపాల్లేకుండా చేసి పదేళ్లవుతోంది. సుదీర్ఘకాలం ఇటువంటి ఘటనలతో తలపడి, ఎంతో అనుభవాన్ని సంపాదించిన దేశం ఇంత ఏమరుపాటుగా, ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంది? చూడటానికి అన్నిచోట్లా భద్రత కట్టుదిట్టంగానే ఉన్నట్టు కనబడుతుంది. పైగా ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉందని పక్షంరోజులక్రితమే ప్రభుత్వానికి ఉప్పందింది. కానీ ప్రజలను అప్రమత్తం చేయడంలో, ముష్కరులను నిలువరించడంలో అది ఘోరంగా విఫలమైంది. ఈ ఉన్మాదం వెనక స్థానికంగా పనిచేసే నేషనల్ తోహబుత్ జమాత్ (ఎన్టీజే) అనే ఉగ్రవాద సంస్థ ఉన్నదని ప్రభుత్వం చెబుతోంది. కానీ అది పుట్టి అయిదేళ్లు కాలేదు. ఆ సంస్థ నిరుడు సాగించిన బుద్ధ విగ్రహాల విధ్వంసంతో తొలిసారి వార్తల్లోకెక్కింది. అలాంటి సంస్థ ఇంత పకడ్బందీగా, ఇంత భారీయెత్తున దాడులు చేయగలిగిందంటే నమ్మశక్యంగా అనిపించదు. ఈ స్థాయి దాడులు చేయా లంటే పటిష్టమైన పథకం రచించుకోవాలి. దాన్ని అమలు చేయడానికి భారీయెత్తున నిధులు సమ కూర్చుకోవాల్సి ఉంటుంది. బాంబులను అవసరమైన ప్రాంతాలకు చేరేయడానికి కావలసిన మను షులు అందుబాటులో ఉండాలి. ఇదంతా స్థానికంగా, అదికూడా పరిమితమైన ప్రాంతంలో కార్య కలాపాలు సాగించే సంస్థకు సాధ్యం కాదు. ఆ దేశంలో అధిక సంఖ్యాకులైన బౌద్ధ మతానికి చెందిన సింహళ జాతీయులతో గతంలో తమిళులకు తరచు ఘర్షణలు తలెత్తేవి. నిరుడు బౌద్ధు లకూ, ముస్లింలకూ మధ్య ఘర్షణలు జరిగాయి. కానీ దేశంలో ఎప్పుడూ క్రైస్తవులను లక్ష్యంగా చేసుకున్న ఉదంతాలు లేవు. తమిళ టైగర్ల ఆధిపత్యం ఉన్న ఉత్తర తూర్పు ప్రాంతంలో సైతం క్రైస్తవులపై ఎప్పుడూ దాడులు జరగలేదు. దేశ జనాభాలో వారు మైనారిటీలు. వేరే జాతులతో వైరం లేదు. కనుకనే దాడులు జరిగిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఏదైనా జరిగాక ఆదరా బాదరాగా చర్యలు తీసుకోవడం రివాజే. లంక ప్రభుత్వం కూడా ఆ పనే చేసింది. ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలను ఆపేసింది. ఇటీవల న్యూజి లాండ్‌లోని క్రైస్ట్ చర్చిలో ఉగ్రవాది తాను సాగించిన మారణకాండను ప్రత్యక్ష ప్రసారం చేసినప్పుడు ఫేస్బుక్ దాన్ని సకాలంలో గమనించి అరికట్టలేకపోయింది గనుక ఈ చర్య తీసుకోవడాన్ని అర్ధం చేసుకోవచ్చు. వెనువెంటనే కర్ఫ్యూ విధించి నిందితుల గాలింపు ప్రారంభించి దాదాపు 30మందిని అదుపులోకి తీసుకున్నారు. కానీ ముందస్తు సమాచారాన్ని భద్రతా వ్యవస్థ ఎందుకు పట్టించుకోలేదో అంతుబట్టదు. నిర్దిష్టంగా చర్చిలపై దాడులు జర గొచ్చునని కూడా ఆ సమాచారం తెలిపింది. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. జాతుల ఘర్షణలు సర్వసాధారణమైన దేశంలో తాజా దాడులు ఎలాంటి పరిణామాలను తీసు కొస్తాయో ఊహించడం అసాధ్యం కాదు. నాలుగేళ్లక్రితం వరకూ రహదారులు దిగ్బంధించి ముమ్మరంగా తనిఖీలు చేసే విధానం అమల్లో ఉండేది. అంతా సవ్యంగా ఉన్నదని భావించి ఆ సంప్రదాయానికి దేశంలో పూర్తిగా స్వస్తి పలికారు. తమిళ టైగర్లు అంతరించాక దేశం ప్రశాంతంగా ఉన్నదని భావించి విదేశీ పర్యాటకులు వెల్లువలా వస్తున్నారు. కానీ ప్రభుత్వానికి కూడా అవే భ్రమలున్నట్టున్నాయి. అందుకే నిఘాను అటకెక్కించింది. దాడులపై వచ్చిన ముందస్తు సమా చారాన్ని సైతం నిర్లక్ష్యం చేసే స్థితికి చేరుకుంది. ఈ తప్పిదానికి దాదాపు 300 మంది తమ ప్రాణా లను మూల్యంగా చెల్లించుకోవాల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం తరచు పంజా విసు రుతున్న వర్తమానంలో ప్రతి దేశమూ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసు కోవాలని లంక పేలుళ్లు హెచ్చరిస్తున్నాయి. -
శ్రీలంక పేలుళ్లు; ‘కుబేరుడి’ ముగ్గురు పిల్లలు మృతి
కోపెన్‌హాగ్ : శ్రీలంకలోని వరుస బాంబు పేలుళ్లు ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చాయి. ముష్కరుల ఉన్మాద చర్య కారణంగా వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వీరిలో సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు, వారి పిల్లలు కూడా ఉన్నారు. శ్రీలంక టీవీ సెలబ్రిటీ చెఫ్ శాంతా మయదున్నెతో పాటు ఆమె కూతురు నిళంగా కూడా మరణించగా... సెలవులు ఎంజాయ్ చేసేందుకు వచ్చిన డెన్మార్క్ ‘కుబేరుడి’ ముగ్గురు పిల్లలు కూడా మృతి చెందడం పట్ల విచారం వ్యక్తమవుతోంది. డెన్మార్క్‌లో అత్యంత సంపన్నుడిగా ఖ్యాతిగాంచిన ఆండర్స్ హోల్చ్ పోవల్‌సన్‌కు నలుగురు సంతానం. హాలిడే ట్రిప్ కోసం ఈయన ముగ్గురు పిల్లలు శ్రీలంకకు వచ్చారు. కాగా ఆదివారం జరిగిన బాంబు పేలుళ్లలో వీరు మరణించినట్లు ఆండర్స్ అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు. అయితే వారు ఎక్కడ బస చేశారు, వారితో పాటు ఎవరు వెళ్లారన్న విషయాలపై మాత్రం స్పష్టతనివ్వలేదు. కాగా ఫ్యాషన్ ఫర్మ్ ‘బెస్ట్‌సెల్లర్’ యజమాని అయిన ఆండర్స్.. డెన్మార్క్‌లోనే అత్యంత సంపన్నుడిగా గుర్తింపు పొందారు. ఫ్యాషన్ ప్రియులకు సుపరిచితమైన వెరో మోడా, జాక్ అండ్ జోన్స్ తదితర ప్రసిద్ధ బ్రాండ్లను ఎక్స్పోర్ట్ చేసే ఆండర్స్ కంపెనీ దేశీ ఆన్లైన్ రీటైల్ మార్కెట్లో ప్రధాన స్టాక్‌హోల్డర్‌గా ఉంది. అంతేగాక స్కాట్లాండ్లో ఉన్న మొత్తం భూభాగంలో.. ఒకటి కంటే ఎక్కువ శాతం భూములకు ఆండర్స్ యజమాని అని ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది. ఇక శ్రీలంకలోని ఎనిమిది చోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 290 మంది మరణించగా, 450 మంది గాయాలపాలయ్యారు. ప్రముఖ బౌద్ధ, హిందూ పుణ్యక్షేత్రాలకు నెలవైన శ్రీలంకను ప్రతిఏటా లక్షలాది మంది విదేశీయులు సందర్శిస్తుంటారు. అయితే ఈ ఘటన కారణంగా లంక పర్యాటకంపై పెద్ద దెబ్బే పడనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సెలవుల సీజన్ ప్రారంభానికి ముందే ఈ దాడులు జరగడం.. అందులో సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు మృతి చెందడం దురదృష్టకరమని.. వీటి ప్రభావం కచ్చితంగా తమ వ్యాపారిన్ని దెబ్బతీస్తుందని టూర్లు ఆపరేటర్లు, హోటళ్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
భారత తీర ప్రాంతంలో హై అలర్ట్
న్యూఢిల్లీ: శ్రీలంకలో మరణహోమం నేపథ్యంలో భారత కోస్ట్ గార్డ్ అధికారులు తీర ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. శ్రీలంకలో వరుస పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు సముద్ర జలాల గుండా భారత్‌లో ప్రవేశించే అవకాశం ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈస్టర్ పర్వదినాన జరిగిన వరుస బాంబు పేలుళ్ల వెనుక ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ‘నేషనల్ తౌహీద్ జమాత్ (ఎన్టీజే)’ హస్తం ఉందని శ్రీలకం ప్రభుత్వం ప్రకటించింది. ఈ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు సముద్ర మార్గం గుండా ద్వీప దేశం నుంచి పారిపోయే అవకాశం ఉందని అక్కడి వర్గాలు పేర్కొన్నాయి. దీంతో అప్రమత్తమైన భారత కోస్ట్ గార్డ్ అధికారులు ముందస్తు భద్రత చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా భారత సముద్ర జలాల్లో గస్తీ నిర్వహించడానికి భారీగా షిప్పులను, డ్రోనియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను మోహరించినట్టు ఏఎన్ఐ వార్త సంస్థ తెలిపింది. భారత జలాల్లోకి ప్రవేశించే అనుమానిత బోట్స్‌ను గుర్తించడానికి పెద్ద ఎత్తున భద్రత చర్యలు చేపట్టారు. మరోవైపు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సోమవారం అర్ధరాత్రి నుంచి శ్రీలంక వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించనున్నట్టు పేర్కొన్నారు. ఆదివారం శ్రీలంకలో జరిగిన వరసు పేలుళ్లలో మృతుల సంఖ్య దాదాపు 300 మందికి చేరింది. దాయాది పాకిస్తాన్ నుంచి సుముద్ర జలాల గుండా భారత్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు 2008 నవంబర్ 26వ తేదీన ముంబైలో మరణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. -
శ్రీలంకలో ఎమర్జెన్సీ : కొలంబోలో 87 బాంబులు లభ్యం
కొలంబో : వరుస పేలుళ్లతో భీతిల్లిన శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించారు. భారీ పేలుళ్ల నేపథ్యంలో జాతీయ భద్రతా మండలితో దేశంలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించిన ప్రధాని విక్రమ సింఘే సోమవారం రాత్రి నుంచి ఎమర్జెన్సీ అమల్లోకి రానుందనే సంకేతాలు పంపారు. ఎమర్జెన్సీపై అధ్యక్ష కార్యాలయం అధికారికంగా ప్రకటన చేస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా శ్రీలంక రాజధాని కొలంబో ఇంకా భయం గుప్పిట్లోనే ఉంది. కొలంబో మెయిన్ బస్టాండ్ వద్ద సోమవారం పోలీసులు 87 బాంబు డిటోనేటర్లను గుర్తించారు. భారీ పేలుళ్లకు కుట్ర జరిగిందని అధికారులు వెల్లడించారు. 24 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. కొలంబో వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు దాడి వెనుక నేషనల్ తౌహీత్ జమాద్ హస్తముందని భావిస్తున్నారు. ఈ సంస్థకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు సహకరించాయని చెబుతున్నారు. ఇక శ్రీలంక వరుస పేలుళ్లలో మృతుల సంఖ్య 300కు చేరువైంది. మరో బాంబు పేలుడు శ్రీలంకను వరస బాంబు పేలుళ్లు వణికిస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం కొచ్చికేడ్‌లోని సెయింట్ ఆంథోనియా చర్చి వద్ద మరో బాంబు పేలుడు చోటుచేసుకుంది. తాజా పేలుడుతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. కొలంబోలోని హోటళ్లన్నింటినీ విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. శ్రీలంక వ్యాప్తంగా హైఅలర్ట్ కొనసాగుతోంది. -
‘మరణంలోనూ బంధం కొనసాగింది’
‘నిళంగ చాలా స్మార్ట్. ప్రతిభావంతురాలు. నిజానికి ఈ లక్షణాలు కలిగి ఉండటం కంటే కూడా వాళ్ల అమ్మ శాంతా మయదున్నె కారణంగానే కాలేజీలో తను పాపులర్ అయింది. వాళ్లిద్దరు ఇకలేరనే విషయం తెలియగానే షాక్ గురయ్యాను. నిళంగా నీకు.. మీ అమ్మ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’ అంటూ శ్రీలంక బాంబు పేలుళ్లలో మరణించిన తన స్నేహితురాలికి రాధా అనే యువతి నివాళులు అర్పించారు. ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలోని ప్రముఖ చర్చిలు, హోటళ్లలోని విదేశీయులే లక్ష్యంగా బాంబు దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా షాంగ్రీ లా హోటల్లో సంభవించిన పేలుళ్లలో శ్రీలంక టీవీ సెలబ్రిటీ చెఫ్ శాంతా మయదున్నెతో పాటు, ఆమె కూతురు కూడా మృత్యువాత పడ్డారు. మరణించడానికి కొన్ని నిమిషాల ముందు కూతురుతో కలిసి ఆమె తీసుకున్న సెల్ఫీ చూసి వారి బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. స్నేహితుల్లా మెలిగే తల్లీకూతుళ్లు మరణంలోనూ అనుబంధాన్ని కొనసాగించారంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. కాగా శ్రీలంకలో లైవ్ టెలివిజన్ కుకింగ్ షో నిర్వహించిన మొదటి మహిళగా శాంత మయదున్నె నిలిచారు. తమ అభిమాన సెలబ్రిటీ దుర్మరణం పట్ల పలువురు ఆవేదన చెందుతున్నారు. ఇక ఆదివారం జరిగిన శ్రీలంక వరుస పేలుళ్లలో మృతులు సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఎనిమిది చోట్ల జరిగిన ఈ బాంబు పేలుళ్లలో 290 మంది మరణించగా, 450 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటనలో భారతదేశానికి చెందిన పలువురు మహిళలు, జేడీఎస్ నాయకులు కూడా మృతి చెందిన సంగతి తెలిసిందే. -
శ్రీలంక పేలుళ్లలో కేరళ మహిళ మృతి
తిరువనంతపురం/కొలంబో: శ్రీలంకలో జరిగిన వరుస పేలుళ్లలో మృతులు సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలోని ప్రముఖ చర్చిలు, హోటళ్లలోని విదేశీయులు లక్ష్యంగా బాంబు దాడులు జరిగాయి. ఈ పేలుళ్లలో కేరళకు చెందిన ఓ మహిళ కూడా మృతి చెందారు. బాధితురాలిని కాసర్గోడ్లోని మొగ్రాల్ పుత్తూరుకు చెందిన రసీనాగా గుర్తించారు. శ్రీలంక బాంబు పేలుళ్లలో రసీనా మృతి చెందినట్టు కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం ధ్రువీకరించింది. కొలంబో ఉన్న తమ బంధువులను కలవడం కోసం రసీనా అక్కడికి వెళ్లినట్టుగా తెలుస్తోంది. అయితే రసీనా మృతదేహాన్ని వీలైనంతా తొందరగా స్వస్థలానికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు కేరళ ప్రభుత్వ అధికారులు తెలిపారు. శ్రీలంకలో జరిగిన మరణహోమాన్ని కేరళ సీఎం పినరాయి విజయన్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఫేస్బుక్లో ఓ పోస్టు షేర్ చేశారు. అలాగే శ్రీలంకలోని రసీనా బంధువులతో, భారత హైకమిషన్ అధికారులతో తమ సిబ్బంది చర్చలు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. శ్రీలంకలో ఆదివారం ఎనిమిది చోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 207 మంది మరణించగా, 450 మందికి గాయాలయ్యాయి. మరణించినవారిలో 39 మంది విదేశీయులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పేలుళ్ల ఘటన అనంతరం శ్రీలంకలో ఎమర్జెన్సీ సర్వీసులు రంగంలోకి దిగాయి. శ్రీలంక వ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన అధికారులు.. కొలంబోలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. -
శ్రీలంక పేలుళ్లపై బిషప్ ఎమోషనల్ వీడియో
కొలంబో: శ్రీలంకలో వరుస పేలుళ్లపై యావత్తు ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. శ్రీలంకలోని ప్రముఖ చర్చిలు, హోటళ్లు లక్ష్యం చేసుకుని జరిగిన బాంబు పేలుళ్లను కొలంబో బిషప్ డిలోరాజ్ ఖండించారు. ఈస్టర్ పర్వదినాన ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై భావోద్వేగంతో కూడిన ఒక వీడియో సందేశాన్ని ఆయన విడుదల చేశారు. బాంబు పేలుళ్లలో తమ ఆత్మీయులను కోల్పోయినవారికి, గాయపడినవారికి తాను అండగా ఉంటానని తెలిపారు. తమలాంటి దేశంలో ఈ ఘటన జరగడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. 30 ఏళ్ల క్రితం జరిగిన సివిల్ వార్ అనంతరం శ్రీలంక ప్రజల శాంతియుతంగా జీవనం సాగిస్తున్నారని అన్నారు. ప్రజలంతా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి విధ్వంసక ఘటనలకు వ్యతిరేకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఆరు గంటల వ్యవధిలో ఎనిమిది చోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 160 మందికి పైగా మరణించగా, 400 మందికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. మరణించినవారిలో 35 మంది విదేశీయులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పేలుళ్ల ఘటన అనంతరం శ్రీలంకలో ఎమర్జెన్సీ సర్వీసులు రంగంలోకి దిగాయి. శ్రీలంక వ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన అధికారులు.. కొలంబోలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. -
శ్రీలంక పేలుళ్లపై ట్రంప్ ట్వీట్ వైరల్
న్యూయార్క్ : శ్రీలంక పేలుళ్లలో 13.8 కోట్ల (138 మిలియన్లు) మంది మరణించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్‌తో అవాక్కవడం నెటిజన్ల వంతైంది. శ్రీలంక పేలుళ్లలో 138 మిలియన్ల మంది మరణించడం, 600 మందికి పైగా గాయపడటం పట్ల అమెరికా ప్రగాఢ సానుభూతి తెలుపుతోందని ట్రంప్ ట్వీట్ చేశారు. శ్రీలంక పేలుళ్లలో మరణాలు 200 లోపు ఉండటం, అక్కడి జనాభా 2.1 కోట్లు కావడం గమనార్హం. కాగా, ట్వీట్లో తన పొరపాటు తెలుసుకున్న ట్రంప్ ఆ ట్వీట్‌ను డిలీట్ చేసేటప్పటికే అది వైరల్‌గా మారింది. అటు తర్వాత మరో ట్వీట్లో మరణాల ముందు మిలియన్ పదాన్ని ఆయన వాడకపోవడంతో నెటిజన్లు ఊపిరిపీల్చుకున్నారు. కొలంబో సహా మరో రెండు శ్రీలంక నగరాల్లోని ఫైవ్‌స్టార్ హోటళ్లు, చర్చిలో జరిగిన బాంబు పేలుళ్లలో 160 మందికి పైగా మరణించగా, 300 మందికి పైగా గాయాలైన సంగతి తెలిసిందే. శ్రీలంకలో పేలుళ్లను భారత్, అమెరికా సహా పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఆపద సమయంలోశ్రీలంకకు బాసటగా ఉంటామని సంఘీభావం ప్రకటించాయి. -
కొలంబో పేలుళ్లు: టీడీపీ నేతకు స్వల్ప గాయాలు
సాక్షి, అనంతపురం : శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల నుంచి పలువురు తెలుగువాళ్లు ప్రాణాలు దక్కించుకున్నారు. అనంతపురంకు చెందిన టీడీపీ నేత, ఎస్ఆర్ కనస్ట్రక్షన్స్ అధినేత అమిలినేని సురేంద్ర బాబు బృందం కొలంబోకు విహార యాత్రకు వెళ్లింది. ఆదివారం ఉదయం సురేంద్ర బాబు మిగతా నలుగురు స్నేహితులు షాంగ్రీలా హోటల్లో టిఫిన్ చేస్తుండగా బాంబు పేలింది. ఈ సందర్భంగా తోపులాట జరగగా అమిలినేని సురేంద్ర బాబు స్వల్పంగా గాయపడ్డారు. కొంచెం తేరుకుని ప్రాణభయంతో హోటల్ ఎమర్జెన్సీ గేటు నుంచి బయటకు వచ్చేసినట్లు బాధితులు తెలిపారు. అనంతరం అమిలినేని సురేంద్ర బాబు తాను క్షేమంగానే ఉన్నట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అయితే వీరికి సంబంధించిన పాస్‌పార్ట్‌లు, లగేజీ హోటల్ గదిలోనే ఉండిపోవడంతో సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు శ్రీలంకలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో భారత విదేశాంగశాఖ అప్రమత్తం అయ్యింది. కొలంబోలోని భారత హైకమిషనర్‌తో ఫోన్లో మాట్లాడి పరిస్థితి తెలుసుకుంటున్నట్లు కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ట్వీట్‌చేశారు. ఘటనలో భారతీయులెవరైనా చనిపోయారా లేక గాయపడ్డారా అన్న సమాచారాన్ని తెలుసుకుంటున్నట్టు ప్రకటించారు. బాధితుల సహాయార్థం కొలంబోలోని ఇండియన్ హై కమిషన్ ప్రత్యేక సెల్ ఏర్పాటుచేసింది. అత్యవసర సేవల కోసం సంప్రదించడానికి ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. అలాగే శ్రీలంకలోని భారతీయ సంఘాలు కూడా సహాయం చేసేందుకు ముందుకొచ్చాయి. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా శ్రీలంక ప్రధానితో ఫోన్లో మాట్లాడారు. ఎలాంటి సాయం చేసేందుకైనా భారత్ సిద్ధంగా ఉందని ఆయన ఈ సందర్భంగా శ్రీలంక ప్రధానికి తెలిపారు. కాగా బాంబు దాడుల నుంచి సినీనటి రాధిక తృటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే. ఈ మారణహోమానికి పాల్పడింది జహ్రాన్ హహీమ్, అబు మహ్మద్‌గా నిర్థారణకు వచ్చారు. -
దాడులపై 10రోజుల ముందే ఇంటెలిజెన్స్ హెచ్చరికలు
కొలంబో: వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక దద్దరిల్లుతోంది. ఆదివారం ఆరు గంటల వ్యవధిలో ఎనిమిది చోట్ల జరిగిన పేలుళ్లలో 160 మందికి పైగా మరణించగా, 400 మందికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. అయితే శ్రీలంకలో ఆత్మహుతి దాడులకు సంబంధించి పది రోజుల ముందుగానే ఆ దేశ ఇంటెలిజెన్స్ అధికారులుకు సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. ‘నేషనల్ తోహీత్ జమాత్(ఎన్టీజే)’ సంస్థ శ్రీలంకలో ఆత్మహుతి దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఓ విదేశీ నిఘా సంస్థ హెచ్చరించిననట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు శ్రీలంక పోలీసు చీఫ్ పుజత్ జయసుందర ఏప్రిల్ 11వ తేదీన ప్రభుత్వ ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. ప్రముఖ చర్చిలు, కొలంబోలోని భారత హై కమిషనర్ కార్యాలయం లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉన్నట్టుగా అందులో పేర్కొన్నారు. కాగా, గతేడాది బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనతో ఎన్టీజే రాడికల్ ముస్లిం వర్గానికి సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. చదవండి: బాంబు పేలుళ్లతో రక్తమోడుతున్న కొలంబో ఈస్టర్ పర్వదినాన చర్చిలకు వచ్చే విదేశీ యాత్రికులే లక్ష్యంగా దాడులు జరిగనట్టుగా తెలుస్తోంది. ఈ దాడుల్లో మరణించినవారిలో 35 మంది విదేశీయులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పేలుళ్ల ఘటన అనంతరం శ్రీలంకలో ఎమర్జెన్సీ సర్వీసులు రంగంలోకి దిగాయి. శ్రీలంక వ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన అధికారులు.. కొలంబోలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. మరోవైపు కొలంబోలో వరుస పేలుళ్ల ఘటనను శ్రీలంక ప్రధాని విక్రమసింఘే తీవ్రంగా ఖండించారు. వదంతులను నమ్మరాదని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
చిగురుటాకులా వణుకుతున్న శ్రీలంక
కొలంబో : వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక చిగురుటాకులా వణుకుతోంది. విదేశీయులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డ విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకూ మొత్తం ఎనిమిది చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. హోటళ్లు, చర్చిల్లో విదేశీ యాత్రికులే టార్గెట్‌గా ఆత్మహుతి దాడులు జరిగాయి. కొలంబో సహా నెగొంబో, బట్టికలోవా నగరాల్లో ఆదివారం ఉదయం జరిగిన వరుస పేలుళ్లలో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా, పెద్ద ఎత్తున గాయపడ్డారు. వరుస బాంబు పేలుళ్లలో 35మంది విదేశీయులు చనిపోయారు. ఈ పేలుళ్ల వెనుక ఐసిస్ హస్తముందని శ్రీలంక ప్రభుత్వం భావిస్తోంది. చదవండి...(బాంబు పేలుళ్లతో రక్తమోడుతున్న కొలంబో) అయితే ఈ దాడుల్లో 185మంది చనిపోయినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినప్పటికీ మృతుల సంఖ్య మరింతగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సుమారు 500మంది గాయపడినట్లు సమాచారం. కాగా ఆరు గంటల వ్యవధిలో ఎనిమిదిచోట్ల పేలుళ్లు జరిగాయి. తాజాగా దెహివాలా జులాజికల్ గార్డెన్‌లోని రిసెప్షన్ హాల్ వద్ద ఎనిమిదో పేలుడు జరగ్గా ఇద్దరు మరణించగా పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. చదవండి... (శ్రీలంకలో హైఅలర్ట్ : వదంతులు నమ్మరాదన్న విక్రమసింఘే) మరోవైపు శ్రీలంక భద్రతా సిబ్బంది అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. మరోవైపు ఇవాళ నుంచి సోమవారం సాయంత్రం వరకూ కర్ఫ్యూ విధించింది. అలాగే సోషల్ మీడియాపై కూడా లంక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇక పాఠశాలలకు రెండు రోజులు సెలవు ప్రకటించింది. పేలుడు జరిగిన ప్రాంతాల్లో భద్రతా దళాలను మోహరించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకూ జులాజికల్ గార్డెన్‌ను మూసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా ఈ ఘటనలో మృతులు, క్షతగాత్రుల్లో భారతీయులు ఎవరూ ఉన్నట్టు వార్తలు రాకున్నా కొలంబోలోని భారత హైకమిషన్ పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తోంది. చదవండి...(కొలంబో పేలుళ్లు : తృటిలో బయటపడ్డ సినీ నటి) -
హై అలర్ట్ : వదంతులు నమ్మొద్దు
కొలంబో : శ్రీలంక రాజధాని కొలంబో వరుస పేలుళ్లతో దద్దరిల్లిన క్రమంలో శ్రీలంక అంతటా హైఅలర్ట్ ప్రకటించారు. ఆదివారం ఉదయం మూడు చర్చిలు, ఐదు ఫైవ్‌స్టార్ హోటళ్లలో పేలుళ్లతో 160 మందికి పైగా మరణించగా, 400 మందికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. పేలుళ్ల ఘటన అనంతరం శ్రీలంకలో ఎమర్జెన్సీ సర్వీసులు రంగంలోకి దిగాయి. పేలడు జరిగిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి నెలకొనేందుకు స్ధానిక భద్రతాధికారుల ప్రయత్నాలకు తోడు ఎమర్జెన్సీ సర్వీసులు తోడ్పాటు అందిస్తున్నాయి. చదవండి... (బాంబు పేలుళ్లతో రక్తమోడుతున్న కొలంబో) సహాయ, పునరావాస చర్యలు ముమ్మరంగా చేపట్టేందుకు పలు చోట్ల సైన్యాన్ని రంగంలోకి దించారని అధికారులు తెలిపారు. భద్రతా సిబ్బందికి సెలవులు రద్దు చేసి తక్షణమే విధుల్లోకి చేరాలని ఆదేశించారు. కొలంబోలోని బండారునాయకే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. మరోవైపు కొలంబోలో వరుస పేలుళ్ల ఘటనను శ్రీలంక ప్రధాని విక్రమసింఘే తీవ్రంగా ఖండించారు. వదంతులను నమ్మరాదని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జాతీయ భద్రతా మండలి సమావేశంలో బాంబు పేలుళ్ల ఘటన అనంతర పరిస్ధితులపై ఆయన తన నివాసంలో సమీక్షించనున్నారు. కాగా బాంబు పేలుళ్ల ఘటనపై ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినా అధికారులు అందుకు అనుగుణంగా అప్రమత్తం కాలేదనే వార్తలు దుమారం రేపాయి. -
ప్రతీకారేచ్ఛతోనే పేలుళ్లు
సాక్షి, హైదరాబాద్ : రాజధానిలో జంట బాంబు పేలుళ్లవెనుక ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదుల ప్రతీకారేచ్ఛే కారణమని దర్యాప్తు అధికారులు తేల్చారు. హైదరాబాద్ పాతబస్తీ లోని మక్కా మసీదులో 2007 మే 18న జరిగిన బాంబు పేలుడుకు ఓ వర్గం వారే బాధ్యులని భావించిన ఐఎం ఉగ్రవాదులు అందుకు ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే 2007 ఆగస్టు 25న గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో పేలుళ్లకు పాల్పడినట్లు నిర్ధారించారు. అదే రోజు దిల్‌సుఖ్‌నగర్‌లోని వెంకటాద్రి థియేటర్ సమీపంలో ఉన్న ఫుట్ఓవర్ బ్రిడ్జి సమీపంలో మరో బాంబును అమర్చినా అది పేలకపోవ డంతో పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని పుణేలో ఉన్న అశోక్ మీవ్స్ అపార్ట్మెంట్లో ఈ పేలుళ్లకు కుట్ర జరిగిందని నిందితులు బయటపెట్టారు. భారీ ప్రాణ నష్టమే లక్ష్యం... హుస్సేన్‌సాగర్ బోట్లో అనీఖ్, గోకుల్‌చాట్‌లో రియాజ్, దిల్‌సుఖ్‌నగర్‌లో అక్బర్ బాంబులు పేట్టాలన్నది పథకం. వాస్తవానికి సికింద్రాబాద్, అమీర్‌పేట్, చార్మినార్ సహా మరికొన్ని చోట్ల రెక్కీ చేసినా చివరకు రియాజ్ ఆదేశాలతో ఈ మూడింటినే టార్గెట్‌గా చేసుకున్నారు. భారీ ప్రాణ నష్టాన్ని సృష్టించాలని భావించిన రియాజ్ భత్కల్... నగరంలో మూడు బాంబులూ రద్దీ సమయమైన రాత్రి 7 గంటలకు కచ్చితంగా పేలేలా అనీఖ్, అక్బర్‌ల వాచీలను రీ–సెట్ చేయించాడు. టైమర్‌తో కూడిన షేప్డ్ బాంబుల్లో సరిగ్గా 6.45 గంటలకు బ్యాటరీలను పెట్టి, తమ టార్గెట్స్‌లో జన సమ్మర్థం ఉన్న చోట వదలాలని స్పష్టం చేశాడు. తమ దగ్గర ఉన్న సెల్ఫోన్లను ఫ్లాట్ నుంచి బయటకు వెళ్లే ముందు ఆపేయాలని, విధ్వంసం జరిగి ఫ్లాట్‌కు చేరుకున్నాకే వాటిని ఆన్‌చేయాలని చెప్పాడు. ఒకవేళ ముగ్గురిలో ఎవరైనా పట్టుబడితే పోలీసుల సమక్షంలోనే మిగిలిన ఇద్దరికీ ఫోన్ చేసి ‘బిగ్ బజార్‌కు రండి’అని చెప్పాలంటూ రియాజ్ కోడ్ ఏర్పాటు చేశాడు. ఇలా ఫోన్ వస్తే మిగిలిన వారు పారిపోవాలని స్పష్టం చేశాడు. తారుమారైన పరిస్థితులు... గోకుల్‌చాట్ వద్ద పేలుడుకు రియాజ్ భత్కల్ పథకం ప్రకారమే అక్కడి ఐస్‌క్రీమ్ డబ్బాపై బాంబు పెట్టి జారుకున్నా మిగిలిన ఇద్దరు మాత్రం పేలుళ్ల అమల్లో కంగారుపడ్డారు. హబ్సిగూడ నుంచి ఆర్టీసీ బస్సులో సికింద్రా బాద్‌కు వెళ్లిన అనీఖ్ అక్కడి నుంచి ఆటోలో లుంబినీ పార్కుకు చేరుకొని ఆటోడ్రైవర్‌కు రూ. 500 నోటు ఇవ్వగా అతడు చిల్లర లేదన్నాడు. దీంతో అక్కడే ఉన్న లేజర్ షో బుకింగ్ కౌంటర్లో టికెట్ కొని చిల్లర తెచ్చిచ్చాడు. కానీ ఆటో దిగే ముందే టైమర్‌ను ఆన్ చేయడంతో బాంబు యాక్టివేట్ అయి పోయింది. అయితే అప్పుడే షికారు బోటు హుస్సేన్‌సాగర్‌లోకి వెళ్లిపోవడం, మరొకటి బయలుదేరే వరకు తాను వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండటం, ఈలోగా బాంబు పేలే ప్రమాదం నెలకొనడంతో తాను కొన్న టికెట్‌తో లేజర్ షో వద్దకు వెళ్లి బాంబు అమర్చి పరారయ్యాడు. మరోవైపు దిల్సుఖ్నగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో బాంబు పెట్టడానికి హబ్సిగూడలోని ఫ్లాట్ నుంచి సరిగ్గా సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరిన అక్బర్ ఇస్మాయిల్ చౌదరి బస్సు కోసం నిరీక్షించి అది రాకపోవడంతో ఆటోలో 6.20 గంటలకు అక్కడకు చేరుకున్నాడు. ఆ ప్రాంతమంతా జన సమ్మర్థంగా ఉన్నప్పటికీ బాంబు ఉన్న బ్యాగ్‌ను ఎక్కడ పెట్టాలో అతనికి అర్థంకాలేదు. ఆ ఆందోళనలోనే బాంబులో బ్యాటరీని హడావుడిగా పెట్టడంతో టైమర్ వాచ్ పని చేయకపోవడాన్ని గమనించినా... ఏమీ చేయలేక బ్యాగ్‌ను ఓ ద్విచక్ర వాహనానికి తగిలించి చివరకు ఫ్లాట్‌కు చేరుకున్నాడు. పేలుడు జరిగిన మర్నాడూ ముగ్గురు ఉగ్రవాదులు ఫ్లాట్‌లోనే గడిపారు. ఆగస్టు 27న మధ్యాహ్నం 3.30 గంటలకు అక్బర్ సికింద్రాబాద్ నుంచి బస్సు ద్వారా పుణే పరారవగా ఆపై రెండు రోజుల వ్యవధిలో మిగిలిన వాళ్లూ పరారయ్యారు. ఈ విధ్వంసాలకు అవసరమైన సహాయ సహకారాలను ఇతర నిందితులు అందించారు. రియాజ్ భత్కల్ స్కెచ్... ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ తన సోదరుడు ఇక్బాల్ భత్కల్, పాకిస్తాన్లో ఉన్న అమీర్ రజా ఖాన్‌తో కలసి హైదరాబాద్‌లో పేలుళ్లకు స్కెచ్ వేశాడు. రియాజ్ ఆదేశాలతో 2007 ఆగస్టు మొదటి వారంలో అనీఖ్ షఫీఖ్ సయ్యద్ నగరానికి చేరుకోగా సురక్షిత ప్రాం తంలో ఇల్లు అద్దెకు తీసుకోవడంతోపాటు కం ప్యూటర్ కోర్సులో చేరాలంటూ అతన్ని రియా జ్ ఆదేశించాడు. దీంతో అనీఖ్ తొలుత సరూర్ నగర్లో ఉంటున్న ఫారూఖ్ బంధు వైన నవీద్ వద్ద ఆశ్రయం పొందాడు. ఆపై నాంపల్లిలోని అజీజియా లాడ్జిలో కొన్ని రోజులు బస చేశాడు. ఆ తర్వా త హబ్సిగూడలోని బంజారా నిల యం అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 302ను అద్దెకు తీసుకున్నాడు. అనీఖ్ ఎవరికీ అనుమానం రాకుండా నగరంలో ఆశ్రయం పొందడంతో పుణేకు చెందిన అక్బర్ ఇస్మాయిల్ చౌదరిని రియాజ్ హైద రాబాద్ పంపాడు. వారిద్దరూ అమీ ర్‌పేటలోని ధూమ్ కంప్యూటర్స్ లో హార్డ్‌వేర్ శిక్షణలో చేరారు. పే లుళ్లకు కొన్ని రోజుల ముందు సిటీ వచ్చిన రియాజ్... ఇక్కడి ఏర్పాట్ల పై సంతృప్తి చెందాడు. కొన్ని రోజు ల తర్వాత మంగుళూరు నుంచి ఆర్టీసీ బస్సు లో పేలుడు పదార్థాలను పంపగా... అనీఖ్, అక్బర్ ఎంజీబీఎస్‌లో వాటిని అందుకున్నారు. పేలుళ్లకు రెండ్రోజుల ముందు అనీఖ్, అక్బర్లను నగరంలో కలిసిన రియాజ్ కుట్ర అమలుకు సిద్ధం కావాలని ఆదేశించాడు. దీంతో వారిద్దరూ సికింద్రాబాద్‌లో బ్యాగ్‌లు, కోఠిలో బ్యాటరీలు కొని అనుకున్నట్లుగానే 2007 ఆగస్టు 25న మూడు బ్యాగుల్లో బాంబులు పెట్టుకొని బయలుదేరారు. -
ఇద్దరు దోషులు.. ఇద్దరు నిర్దోషులు
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ జంట బాంబు పేలుళ్ల కేసులో 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో టైమర్ బాంబులు పేల్చి 44 మంది అమాయ కుల మరణాలకు దారితీసిన ఇండియన్ ము జాహిదీన్ ఉగ్ర ఘాతుకంపై ఎట్టకేలకు తీర్పు వెలు వడింది. పోలీసులు అరెస్టు చేసిన ఐదు గురు నిందితుల్లో అనీక్ షఫీక్ సయీద్, మ హ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలను న్యాయ స్థానం మంగళవారం దోషులుగా నిర్ధారించిం ది. వారిద్దరూ నేరానికి పాల్పడినట్లు రుజువైందని కోర్టు స్పష్టం చేసింది. దేశంపై తిరుగుబాటు, హత్య, కుట్ర, పేలుడు పదారా ్థల నిరోధక చట్టం, చట్ట వ్యతిరేక కార్యకలా పాల నిరోధక చట్టం తదితర వాటి కింద సయీద్, చౌదరిలను దోషులుగా పేర్కొంది. అయితే మరో ఇద్దరు నిందితులైన సాదిక్ ఇష్రార్ షేక్, ఫరూఖ్ షర్ఫుద్దీన్ తర్ఖాష్లు పేలుళ్లకు పాల్పడినట్లు నిరూపించే సరైన సాక్ష్యాధారాలు లేవంటూ వారిని నిర్ధోషులు గా ప్రకటించింది. ఈ మేరకు రెండో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి టి. శ్రీనివాసరా వు మంగళవారం తీర్పు నిచ్చారు. దోషులకు ఈ నెల 10న శిక్షలు ఖరారు చేస్తామని, నిందితులకు సహకరించిన తారీఖ్ అంజూమ్ ఎహసాస్ విషయంలోనూ ఆ రోజునే నిర్ణయం వెలువరిస్తామని కోర్టు స్పష్టం చేసింది. భద్రతా కారణాలరీత్యా నిందితుల ను ఉంచిన చర్లపల్లి కేంద్ర కారాగారంలో ప్రత్యేక కోర్టు గదిని ఏర్పాటు చేసి విచారణ చేపట్టగా తీర్పును కూడా అక్కడి నుంచే జడ్జి వెలువరిం చారు. మీడియా ప్రతినిధులకు కోర్టులోకి అనుమతి లేకపోవడంతో తీర్పు పూర్తి పాఠం రెండు, మూడు రోజుల్లో అందుబాటులోకి రానుంది. కేసు విచారణలో సుమారు 170 మంది సాక్షుల వాంగ్మూలాల ను న్యాయస్థానం నమోదు చేసింది. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులైన ఇండియ న్ ముజాహిదీన్ వ్యవ స్థాపకుడు రియాజ్ భత్కల్, అతని సోదరుడు ఇక్బాల్ భత్కల్, అమీర్ రజాఖాన్‌లు పేలుడు జరిగినప్పటి నుంచీ ఇంకా పరారీలోనే ఉన్నారు. ప్రస్తుతం వారు పాకిస్తాన్లో ఆశ్ర యం పొందుతున్నారు. దోషులకు మరణశిక్ష విధించాల్సిందిగా కోరాలని ప్రాసి క్యూషన్ నిర్ణయించింది. ఈ కేసులో న్యాయ స్థానం ఇద్దరు నిందితులను నిర్దోషు లుగా ప్రకటించడంపై బాధితులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఎంతమాత్రం సరికాదని, ట్రయల్ కోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేయాలని డిమాండ్ చేశారు. కోర్టు తీర్పుతో కేసు మూతబడ లేదని, బాధిత కుటుంబాలకూ న్యాయం జరగలేదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్లో విమర్శించారు. నాటి నుంచి నేటి వరకు... జంట పేలుళ్ల కేసులో 11 ఏళ్ల 11 రోజుల తర్వాత తీర్పు రాజధానిలోని గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో జంట పేలుళ్లు జరిగి మంగళవారానికి 11 ఏళ్ల 11 రోజులైంది. ఈ కేసులో కోర్టు తీర్పు మంగళవారం వెలువడిన నేపథ్యంలో ఉగ్ర ఘాతుకం చోటుచేసుకున్నప్పటి నుంచి తీర్పు వెలువడే వరకు చోటుచేసుకున్న పరిణామాలు ఇలా... 25-08-07 రాత్రి 7–7.30 గంటల మధ్య గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో పేలిన బాంబులు. దిల్సుఖ్నగర్ ఫుట్ఓవర్ బ్రిడ్జి కింద పేలని బాంబు స్వాధీనం. ఈ పేలుళ్లపై అదే రోజు సైఫాబాద్, సుల్తాన్ బజార్, మలక్‌పేట పోలీసు స్టేషన్లలో కేసుల నమోదు. 27-08-07 ఉగ్రవాద పేలుళ్ల కేసులు కావడంతో సీసీఎస్ ఆధ్వర్యంలోని సిట్‌కు బదిలీ. నాడు లుంబినీ పార్కులో ఉన్న నాసిక్‌కు చెందిన అమృతవాహిని ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు చెప్పిన వివరాల ఆధారంగా నిందితుడి ఊహాచిత్రం విడుదల. 15-09-08 2007 సెప్టెంబర్ 13న ఢిల్లీలో వరుస పేలుళ్లకు బాధ్యత ప్రకటించుకున్న ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) బాధ్యత ప్రకటించుకుంది. ఈ కేసులో నిందితుల షెల్టర్ గుర్తించిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు. జామియానగర్‌లోని బాట్లాహౌస్ ఎల్–18 ఫ్లాట్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఆతిఖ్ అలియాస్ బషర్ సహా మరో ఇద్దరు ఉగ్రవాదుల మృతి, ముగ్గురు అరెస్ట్. ఈ ఉదంతంతో కదిలిన ఐఎం డొంక. 06-10-08 ఢిల్లీ ఎన్కౌంటర్లో దొరికిన ఆధారాలతో దర్యాప్తు ముమ్మరం. మొత్తం ఐఎం గుట్టు విప్పిన ముంబై క్రైమ్ బ్రాంచ్. 2005 ఫిబ్రవరి నుంచి దేశవ్యాప్తంగా 11 విధ్వంసాలకు పాల్పడిన ఐఎం ఉగ్రవాదుల్లో దాదాపు 20 మంది అరెస్ట్. వారిలోనే హైదరాబాద్ జంట పేలుళ్ల కేసు నిందితులు ఉండటంతో సిట్ పోలీసుల దర్యాప్తు కొలిక్కి. పీటీ వారెంట్‌పై నిందితుల తరలింపు, విచారణకు సిట్ ప్రయత్నాలు ప్రారంభం. 30-11-08 ఉగ్రవాదంపై పోరుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ (ఆక్టోపస్) రూపుదిద్దుకున్న ఏడాది తర్వాత అధికారిక దర్యాప్తు ప్రారంభం. జంట పేలుళ్ల ఉదంతంతోపాటు పేలని బాంబుపై సిట్‌లో నమోదైన మూడు కేసులు ఈ విభాగానికి బదిలీ. 01-02-09 జంట పేలుళ్ల కేసులో నిందితులైన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదుల్లో అనీఖ్ షఫీఖ్ సయ్యద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి పీటీ వారెంట్‌పై ముంబై నుంచి హైదరాబాద్‌కు... 09-02-09 కేసు దర్యాప్తులో కీలకమైన టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ చర్లపల్లి కేంద్ర కారాగారంలో నిర్వహణ. లుంబినీ పార్కులో బాంబు పెట్టిన అనీఖ్, హబ్సిగూడలోని బంజారా నిలయంలో బస చేసిన అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలను గుర్తించిన సాక్షులు. 25-03-09 కేసులోని ఇతర నిందితులైన ఐఎం సహ వ్యవస్థాపకుడు సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖాష్ పీటీ వారంట్‌పై హైదరాబాద్ తీసుకొచ్చిన ఆక్టోపస్. 15/28-05-09, 20-06-09 కేసులో ఆక్టోపస్ అధికారుల కీలక ఆధారాల సేకరణ. లుంబినీ పార్కులో పేలుడుకు సంబంధించి 2009 మే 15న, పేలని బాంబుపై అదే నెల 28న, గోకుల్‌చాట్ పేలుడు ఉదంతానికి సంబంధించి అదే ఏడాది జూన్ 20న నాంపల్లి కోర్టులో చార్జిషీట్ల దాఖలు. 03-02-2012 జంట పేలుళ్లకు నిధులు అందించిన తారీఖ్ అంజుమ్ హసన్‌ను దుబా య్ నుంచి డిపోర్టేషన్‌పై తీసుకొచ్చిన ఢిల్లీ పోలీసులు. పీటీ వారంట్‌పై సిటీకి తరలించిన సీఐ సెల్ అధికారులు. అనుబంధ చార్జ్‌షీట్ దాఖలు. 07-08-2018 చర్లపల్లి కేంద్ర కారాగారంలోని ప్రత్యేక కోర్టులో (నాంపల్లి కోర్టు అనుమతితో) కేసుల విచారణ పూర్తి. 04-09-2018 మూడు కేసుల్లో అరెస్టయిన ఐదుగురు నిందితుల్లో అనీఖ్, అక్బర్‌లపై నేరం నిరూపణ. సాదిఖ్, ఫారూఖ్లపై వీగిపోయిన అభియోగాలు. నాలుగో చార్జ్‌షీట్‌లో నిందితుడైన తారీఖ్ దోషా కాదా అనే విషయంతో పాటు అనీఖ్, అక్బర్‌లకు సోమవారం ఖరారు కానున్న శిక్షలు. -
క్రికెట్ స్టేడియంలో రక్తపు ముద్దలు
కాబూల్: ఉగ్రదాడితో అఫ్ఘనిస్థాన్ మరోసారి నెత్తురోడింది. శుక్రవారం రాత్రి నంగర్హర్ ప్రొవిన్స్‌లోని ఓ క్రికెట్ స్టేడియంలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఘటనలో 8 మంది మృతి చెందగా, 45 మంది గాయపడ్డారు. రంజాన్ మాసం ప్రారంభం కావటంతో జలాలాబాద్‌లో ఓ ఎన్జీవో సంస్థ నైట్‌టైమ్ టోర్నమెంట్‌ను నిర్వహించింది. శుక్రవారం మ్యాచ్‌ను వీక్షించేందుకు వందలాది మంది ప్రేక్షకులు స్పింగర్ క్రికెట్ స్టేడియానికి వచ్చారు. ఆ సమయంలో వరుస పేలుళ్లతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. రక్తపు ముద్ధలు చెల్లాచెదురుకాగా, హాహాకారాలతో ప్రేక్షకులు పరుగులు తీశారు. మూడు శక్తివంతమైన బాంబులు పేలాయని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు ‘అష్రఫ్ ఘని’ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, ఘటనకు బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటిదాకా ప్రకటన చేయలేదు. -
టెక్సస్‌లో సీరియల్ బాంబర్!
హూస్టన్: అమెరికాలోని టెక్సస్ రాజధాని ఆస్టిన్‌లో ఈ నెలలో నాలుగోసారి పేలుడు సంభవించింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఆస్టిన్‌లో వరుసగా పేలుళ్లు సంభవిస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వీటి వెనుక సీరియల్ బాంబర్ ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రాంతంలోని ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ 350 మంది ప్రత్యేక ఏజెంట్లను, బాంబు స్క్వాడ్లను ఆస్టిన్‌కు పంపింది. -
ఉలిక్కి పడ్డ బుద్ధ గయ
పట్న : భారీ ఉగ్ర కుట్రను బిహార్ పోలీసులు భగ్నం చేశారు. అప్రమత్తమై బోధ్(బుద్ధ) గయలో మరో మారణ హోమం జరగకుండా నిలువరించగలిగారు. దలైలామ పర్యటన, రిపబ్లిక్ డే నేపథ్యంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు శుక్రవారం సాయంత్రం రెండు క్రూడ్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి.. తనిఖీలను విస్తృతం చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... బౌద్ధ గురువు దలైలామా ప్రస్తుతం భోద్ గయలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తనిఖీలు కొనసాగుతుండగా.. శుక్రవారం సాయంత్రం వంట గదిలో ఓ స్వల్ఫ పేలుడు సంభవించింది. తొలుత గ్యాస్ లీకేజీ అని భావించిన పోలీసులు.. తర్వాత ఫ్లాస్క్‌లో బాంబు అమర్చి పేలుడుకు పాల్పడినట్లు నిర్ధారించారు. వెంటనే బాంబ్ స్వ్కాడ్ రంగంలోకి దిగి ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో కాలచక్ర మైదానంలో రెండు శక్తివంతమైన బాంబులను స్వాధీనం చేసుకున్నారు. దలైలామా శుక్రవారం తన కార్యక్రమాలను ముగించుకుని వెళ్లిన కాసేపటికే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాగా, 2013 బుద్ధ గయలో వరుస పేలుళ్లు(9 చోట్ల) దేశం మొత్తాన్ని దిగ్ర్భాంతికి గురి చేశాయి. అయితే అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం మాత్రం సంభవించలేదు. ఈ ఘటన తర్వాత సీఆర్పీఎఫ్ సిబ్బందిని ఆలయ ప్రాంగణంలో మోహరించేందుకు కేంద్ర హోం శాఖ ప్రయత్నాలు చేసినా.. అవి సఫలం కాలేదు. దీంతో ఆలయ సిబ్బంది ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకుంది. ఇది కూడా చదవండి... బుద్ధ గయపై నెత్తుటిచారిక -
థాయ్‌లాండ్‌లో వరుస పేలుళ్లు.. ఒకరు మృతి
థాయ్‌లాండ్‌లోని పట్టాని రాష్ట్రంలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా 30 మందికి పైగా గాయపడ్డారు. రెండు వారాల క్రితమే వరుస పేలుళ్లు దేశాన్ని కుదిపేసిన తర్వాత మళ్లీ అలాంటి ఘటనే మరోసారి జరిగింది. రాత్రి 10.40 గంటల సమయంలో ఓ పబ్‌కు సమీపంలో ఉన్న పార్కింగ్ ప్రదేశంలో నిలిపి ఉంచిన కారులో బాంబులు పేలాయి. రాత్రి 11 గంటల సమయంలో మరో కారు బాంబు పేలింది. దాంతో ఓ మహిళ మరణించగా, 30 మంది గాయపడ్డారు. స్థానిక మార్కెట్ సమీపంలోని చెత్తబుట్టలో దాచి ఉంచిన మూడో బాంబు రాత్రి 11.30 సమయంలో పేలింది. అయితే ఆ సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంతకుముందు ఉత్తర థాయ్‌లాండ్‌లో జరిగిన వరుస పేలుళ్లలో నలుగురు మరణించగా, 11 మంది విదేశీ పర్యాటకులు సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. -
థాయ్‌లాండ్ రిసార్టులో వరుస పేలుళ్లు
-
థాయ్‌లాండ్ రిసార్టులో వరుస పేలుళ్లు
థాయ్‌లాండ్‌లోని హువాహిన్ రిసార్టు సమీపంలో రెండు వరుస పేలుళ్లు సంభవించాయి. దాంతో నలుగురు మరణించగా దాదాపు 20 మందివరకు గాయపడినట్లు థాయ్ పోలీసులు తెలిపారు. థాయ్ రాణి సిరికిట్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం నాడు అక్కడ సెలవు ప్రకటించారు. సరిగ్గా ఇదే సమయంలో పేలుళ్లు సంభవించాయి. వరుస సెలవులు రావడంతో హువాహిన్ రిసార్ట్ వద్దకు ఎక్కువ మంది జనం చేరుకుంటారు. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో బాబులు పేలాయి. దాంతో ఒక థాయ్ మహిళ సహా నలుగురు మరణించగా కొందరు థాయ్ పౌరులు, మరికొందరు విదేశీయులు గాయపడినట్లు స్థానిక డిప్యూటీ పోలీసు చీఫ్ సమీర్ యోసమ్రన్ తెలిపారు. క్షతగాత్రులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రెండు బాంబులు 50 మీటర్ల దూరంలో పేలాయి. బాంబులు ఎవరు పెట్టారో, ఎందుకు పెట్టారో ఇంకా తెలియలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. స్థానిక గొడవల వల్లే బాంబులు పేలి ఉంటాయని భావిస్తున్నారు. థాయ్ రాజు భూమిబాల్ (88), ఆయన భార్య సిరికిట్ ఇద్దరూ బ్యాంకాక్ ఆస్పత్రిలోనే ఉన్నారు. వాళ్లు కొంతకాలం పాటు హువాహిన్ ప్రాంతంలో కూడా నివసించారు. -
బంగ్లాదేశ్‌లో వరుస పేలుళ్లు
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో వరుస బాంబుపేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 90 మందికి పైగా గాయపడ్డారు. 17వ శతాబ్థానికి చెందిన షియాల ప్రార్థనా స్థలం వద్ద శనివారం తెల్లవారు జామున ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. మొహరం సందర్భంగా నిర్వహించే అశుర వేడుకలకు జనం ఎక్కువగా గుమికూడిన సమయంలో పేలుళ్లు జరగడంతో క్షతగాత్రులు అధిక సంఖ్యలో ఉన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుళ్లకు సంబంధించి ఉగ్రవాద సంస్థలు ఎలాంటి ప్రకటన చేయలేదని పోలీసు అధికారులు వెల్లడించారు. దేశంలోని ప్రజలను భయాందోళనకు గురిచేయడానికే ఈ దాడులకు పాల్పడ్డారని ఎడిషనల్ డైరెక్టర్ జనరల్ హసన్ తెలిపారు. -
12 మంది దోషులుగా నిర్ధారణ
- ముంబై రైలు పేలుళ్ల కేసులో మహారాష్ట్ర మోకా కోర్టు తీర్పు - శిక్షల ఖరారుపై సోమవారం నుంచి వాదనలు.. ఐదుగురికి మరణశిక్ష పడే అవకాశం ముంబై: ముంబైలోని రైళ్లలో వరుస పేలుళ్లకు పాల్పడి 188 మందిని బలితీసుకున్న కేసులో 12 మందిని మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ (మోకా) కోర్టు శుక్రవారం దోషులుగా నిర్ధారించింది. సిమీ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్న వీరిలో ఐదుగురికి మరణశిక్ష పడే అవకాశం ఉంది. 2006 జూలై 11న సిమీ, లష్కరే తోయిబాతో సంబంధాలున్న ఉగ్రవాదులు ముంబైలోని సబర్బన్ రైళ్లలో వరుసగా ఏడు పేలుళ్లకు పాల్పడ్డారు. పది నిమిషాల వ్యవధిలో ఖర్‌రోడ్, బాంద్రా, శాంతాక్రజ్, జోగేశ్వరి, మాహిమ్ జంక్షన్, మిరారోడ్, మతుంగ, బొరివలి ప్రాంతాల మధ్య ప్రయాణిస్తున్న రైళ్లలో పేలుళ్లు జరిగాయి. 188 మరణించగా... 829 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మోకా చట్టంతో పాటు ఐపీసీ, పేలుడు పదార్థాల చట్టం, రైల్వే యాక్ట్ తదితర చట్టాల కింద 30 మందిపై మహారాష్ట్ర యాంటీ టైజం స్క్వాడ్ కేసులు నమోదు చేసింది. 13 మందిని అరెస్టు చేయగా.. పాకిస్తాన్‌కు చెందిన మిగతా 17 మంది పరారీలో ఉన్నారని పేర్కొంటూ మోకా కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. తొమ్మిదేళ్ల పాటు విచారణ జరగగా శుక్రవారం మోకా కోర్టు న్యాయమూర్తి యతిన్ డి షిండే 12 మందిని దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు ఇచ్చారు. కమల్ అహ్మద్ అన్సారీ(37), తన్వీర్ అహ్మద్ అన్సారీ (37), మహ్మద్ ఫైసల్ షేక్(36), ఇస్తెహాం సిద్ధిఖీ(30), మహమ్మద్ మాజిద్ షఫీ(32), షేక్ ఆలం షేక్ (41), మహ్మద్ సాజిద్ అన్సారీ (34), ముజమిల్ షేక్(27), సోహైల్ మెహమూద్ షేక్(43), జమీర్ అహ్మద్ షేక్(36), నవీద్ హుస్సేన్ ఖాన్(30), ఆసిఫ్ ఖాన్(38)లను దోషులుగా నిర్ధారించగా.. మరొకరిని నిర్దోషిగా వదిలిపెట్టారు. అయితే వీరిలో ఐదుగురిని ఐపీసీ 302(హత్య), మోకాలోని సెక్షన్ 3(1) కింద దోషులుగా పేర్కొన్నారు. ఈ సెక్షన్ల ప్రకారం వారికి మరణశిక్ష పడే అవకాశం ఉంది. శిక్షల ఖరారుపై సోమవారం నుంచి వాదనలు జరిగే అవకాశం ఉంది. -
బాంబు పేలుళ్ల నుంచి రాంచీని రక్షించిన ఫైలీన్ తుఫాన్
ఇటీవల వచ్చిన ఫై-లీన్ తుఫాన్ ఒడిషాతో పాటు ఉత్తరాంధ్రకు అపార నష్టం కలిగించగా, జార్ఖండ్ రాజధాని రాంచీకి మాత్రం ఎంతో మేలు చేసింది. పెద్ద ఉపద్రవం నుంచి బయటపడేసింది. గత నెలలో దుర్గా పూజ సందర్భంగా రాంచీలో వరుస బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), జార్ఖండ్ పోలీసులు ఇటీవల రాంచీలోని ఓ లాడ్జిపై దాడి చేసి తొమ్మిది బాంబులు, 25 జిలెటిన్ స్టిక్స్, 14 డిటోనేటర్లు, 12 టైమర్లను స్వాధీనం చేసుకున్నారు. దుర్గా పూజ సందర్భంగా రాంచీలో పేల్చేందుకు బాంబులను సిద్ధం చేసినట్టు ఓ పోలీస్ అధికారి తెలిపారు. సాధారణంగా ప్రజలు భారీ సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. అయితే గత నెలలో తుఫాన్ కారణంగా రాంచీలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. దీంతో ప్రజలు ఇళ్లు విడిచి బయటకు రాలేకపోయారు. దీంతో ఉగ్రవాదుల పన్నాగం విఫలమైంది. ఇండియన్ ముజాహిద్దీన్ జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో యువతను ఉగ్రవాద కార్యకలాపాల వైపు మళ్లిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. పాట్నా బాంబు పేలుళ్ల కేసులో రాంచీకి చెందిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
నరేంద్ర మోడీకి భద్రత పెంచాలి:శివరాజ్ సింగ్ చౌహాన్
ఇండోర్ : బీజేపీ ప్రధానిమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకీ భద్రత మరింత పెంచాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. ఆదివారం పాట్నాలో మోడీ నిర్వహించిన సభకు కూతవేటు దూరంలో బాంబు పేలుళ్లు సంభవించడం తీవ్రమైనదిగా ఆయన పరిగణించారు. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర దర్యాప్తు జరిపించి, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. ఆదివారం రాత్రి చౌహాన్ మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోడీ ఇప్పుడు దేశంలో ఒక ప్రముఖ వ్యక్తి కావడంతో అతనికి భద్రత పెంచాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని చౌహాన్ తెలిపారు. ఈ ఘటన ఎటువంటి విమర్శలకు దారితీయకుండా ఉండాలండే దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలన్నారు. మధ్యప్రదేశ్ లోని సత్తా పరివర్తన్’ ర్యాలీల్లో గురువారం పాల్గొన్న రాహుల్ ముజాఫర్ నగర బాధితులకు పాకిస్థాన్ గాలం వేస్తుందని ఆరోపించడాన్ని ఆయన ఖండించారు. పాకిస్తాన్ గాలం వేస్తుంటే ఇంటిలిజెన్సీ ఏజెన్సీలు ఏం చేస్తున్నాయన్నారు.