న్యూఢిల్లీ: 1993 వరుస పేలుళ్ల కేసులో అబ్దుల్ కరీం తుండా(81)ను నిర్దోషిగా పేర్కొంటూ స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని సీబీఐ తెలిపింది. కోర్టు తీర్పును క్షుణ్నంగా పరిశీలించాక సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని పేర్కొంది.తుండాపై మోపిన అభియోగాలను రుజువు చేసేందుకు అవసరమైన సాక్ష్యాధారాలను ప్రాసిక్యూషన్ చూపలేకపోయిందని పేర్కొన్న అజ్మేర్‌లోని ప్రత్యేక టాడా కోర్టు అతడిని నిర్దోషిగా తేల్చింది.
ఇదే కేసులో రైళ్లలో బాంబులను అమర్చినట్లు ఉన్న ఆరోపణలు రుజువు కావడంతో ఇర్ఫాన్, హమీదుద్దీన్ అనే వారికి కోర్టు జీవిత ఖైదు విధిస్తూ గురువారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. బాబ్రీ మసీదు విధ్వంసానికి ఏడాదైన సందర్భంగా 1993 డిసెంబర్ 5, 6 తేదీల్లో లక్నో, కాన్పూర్, హైదరాబాద్, సూరత్, ముంబైల్లోని రైళ్లలో వరుసగా పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనల్లో ఇద్దరు చనిపోగా మరో 22 మంది గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment