హూస్టన్: అమెరికాలోని టెక్సస్ రాజధాని ఆస్టిన్‌లో ఈ నెలలో నాలుగోసారి పేలుడు సంభవించింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఆస్టిన్‌లో వరుసగా పేలుళ్లు సంభవిస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వీటి వెనుక సీరియల్ బాంబర్ ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రాంతంలోని ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ 350 మంది ప్రత్యేక ఏజెంట్లను, బాంబు స్క్వాడ్‌లను ఆస్టిన్‌కు పంపింది.
Comments
Please login to add a commentAdd a comment