టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్‌లో కొద్ది రోజులుగా కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. పానాండిల్, ఓక్లహామా ప్రాంతాల్లో దావానలంలా వ్యాపించిన అతిపెద్ద కార్చిచ్చు స్మోక్‌హౌజ్‌క్రీక్‌ఫైర్ కారణంగా ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే 4వేల 4 వందల కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని దహించి వేసిన ఈ కార్చిచ్చులో చాలా ఇళ్లు, నిర్మాణాలు లక్షల సంఖ్యలో చెట్లు కాలిపోయాయి.
కార్చిచ్చు వల్ల కలిగిన ప్రాణ, ఆస్తి నష్టాన్ని పూర్తిగా తేల్చలేకపోతున్నామని అధికారులు తెలిపారు. పానాండిల్ ప్రాంతంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని, ఇప్పటివరకు 500 వరకు నిర్మాణాలు మంటల్లో కాలిపోయాయని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తెలిపారు. కార్చిచ్చు వల్ల కాలిపోయిన నిర్మాణాలను పరిశీలిస్తే అక్కడ బూడిద తప్ప ఏమీ మిగలలేదని మీడియాతో అబాట్ వ్యాఖ్యానించారు. ఈ వారాంతంలో వాతావరణపరిస్థితులు కార్చిచ్చుకు మరింత అనుకూలంగా మారుతున్నాయని, టెక్సాస్ ఓక్లహామా, కాన్సాస్, న్యూ మెక్సికోలో అగ్ని కీలలు మరింత విజృంభిస్తాయని జాతీయ వాతావరణ సేవల కేంద్రం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment