At Least 42 Found Dead Inside Truck In Texas - Sakshi
Sakshi News home page

అమెరికాలో విషాదం.. 42 మంది మృతి

Published Tue, Jun 28 2022 8:27 AM | Last Updated on Tue, Jun 28 2022 9:22 AM

At Least 42 Found Dead Inside Truck In Texas - Sakshi

అగ‍్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్‌ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శాన్‌ ఆంటోనియోలో ట్రక్కులో వెళ్తున్న దాదాపు 42 మం​ది మృతిచెందారు. ఈ మేరకు లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి తెలిపారు.

వివరాల ప్రకారం.. శాన్‌ ఆంటోనియో దక్షిణ శివారులో రైలు పట్టాల పక్కనే ఓ ట్రక్కు నిలిపివేసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అనుమానాస్పదంగా ఉన్న ట్రక్కు డోర్‌ను తెరిచిచూడగా.. అందులో దాదాపు 42 మంది చనిపోయి ఉన్నారు. 16 మంది ప్రాణాలతో బయట పడ్డారని.. వారిలో నలుగురు చిన్నారుల ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయితే, మెక్సికన్ సరిహద్దు నుండి 160 మైళ్ళు (250 కిమీ) దూరంలో ఉన్న శాన్ ఆంటోనియోలో సోమవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక తేమతో 103 డిగ్రీల ఫారెన్‌హీట్ (39.4 డిగ్రీల సెల్సియస్) వరకు టెంపరేచర్‌ పెరిగింది. దీంతో, వలసదారులు ట్రక్కులో మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. మెక్సికో నుంచి అమెరికాకు అక్రమ వలసదారులు ఎక్కువ సంఖ్యలో ట్రక్కుల్లో వెళ్తుంటారు. అంతకు ముందు కూడా వలసదారులతో వెళ్తున్న మెక్సికోకు చెందిన ట్రక్కులు ప్రమాదానికి గురి కావడంతో పదుల సంఖ్యలో మెక్సికన్లు మృతిచెందారు. 

ఇది కూడా చదవండి: అంతరిక్షంలో చైనా సౌర విద్యుత్‌ కేంద్రం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement