Mexican
-
మిస్ యూఎస్ఏ స్థానం నుంచి తప్పుకుంటున్న మరో బ్యూటీ!..
గతేడాది 2023లో మిస్ యూఎస్ఏ విజేతగా ఎంపికైన నోలియా వోయిగ్ట్ సడెన్‌గా తన స్థానం నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవలే ప్రకటించింది. అది మరువకు మునుపే మరో బ్యూటీ తన కిరీటాన్ని వదులుకుంటున్నట్లు ప్రకటించి అందర్నీ షాక్‌కి గురి చేసింది. అందాల తారలు వరుస ప్రకటనలు అమెరికా అందాల పోటీల నిర్వాహకులను తీవ్ర గందరగోళంలో పడేశాయి. నోలియా రాజీనామా చేసిన రెండు రోజులకే 17 ఏళ్ల మిస్ టీన్ యూఎస్ఏ ఉమా సోఫియా తాను కూడా తన స్థానం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మెక్సికన్ ఇండియన్ అమెరికన్ అయిన ఉమా సోఫియా నా విలువలు సంస్థ తీరుతో పూర్తిగా సరిపోవడం లేదని అందువల్ల తాను తన స్థానం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తాను ఈ అత్యున్నత టైటిల్‌ని గెలుకోవడంలో సహకరించిన తన కుటుంబం, తన రాష్ట్ర ప్రజలు, తన సహ మోడళ్లకు ఎంతగానో రుణపడి ఉన్నాను.వారందిరి ఆదరాభిమానానికి కృతజ్ఞతలు అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. జాతీయ స్థాయిలో తొలి మెక్సికన్ ఇండియన్ అమెరికన్‌గా తన రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించినందుకు గర్వంగా ఉందని పేర్కొంది. ఆమెకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు..ఉమా సోఫియా శ్రీవాస్తవ అమెరికా తొలి మెక్సికన్ ఇండియన్ అమెరికన్ మిస్ న్యూజెర్సీ టీన్. యూఎన్ అంబాసిడర్ కావలన్నది ఆమె కల. ఆమె భారతదేశంలోని అనగారిన పిల్లలకు చక్కటి విద్య, సరైన పోషకాహారం, ఆరోగ్య సంరక్షణను అందించడంలో సహాయపడటానికి లోటస్ పెటల్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తుంది. ఉమాసోఫియా తన దివైట్ జాగ్వర్ పుస్తకాన్ని రచించారు. ఆమె మొత్తం నాలుగు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు. ఆమె ఒక పియానిస్ట్ దట్స్ ఫ్యాన్ బిహేవియర్‌ని నడుపుతోంది. ప్రస్తుతం ఆమె జూనియర్ కళాశాల విద్యను అభ్యసిస్తోంది.(చదవండి: తెల్లటి చీరలో మెరిసిపోతున్న మిల్కీబ్యూటీ..ధర వింటే నోరెళ్లబెడతారు!) -
అమెరికాలో విషాదం.. 42 మంది మృతి
అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శాన్ ఆంటోనియోలో ట్రక్కులో వెళ్తున్న దాదాపు 42 మంది మృతిచెందారు. ఈ మేరకు లా ఎన్ఫోర్స్మెంట్ అధికారి తెలిపారు. వివరాల ప్రకారం.. శాన్ ఆంటోనియో దక్షిణ శివారులో రైలు పట్టాల పక్కనే ఓ ట్రక్కు నిలిపివేసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అనుమానాస్పదంగా ఉన్న ట్రక్కు డోర్‌ను తెరిచిచూడగా.. అందులో దాదాపు 42 మంది చనిపోయి ఉన్నారు. 16 మంది ప్రాణాలతో బయట పడ్డారని.. వారిలో నలుగురు చిన్నారుల ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. At least 42 people were found dead Monday in a big-rig truck in San Antonio, Texas Gov. Greg Abbott said. More people have been transported to area hospitals. Updates: https://t.co/lfTU70A9B7 pic.twitter.com/L6oULaE7sB — NBC DFW (@NBCDFW) June 28, 2022 అయితే, మెక్సికన్ సరిహద్దు నుండి 160 మైళ్ళు (250 కిమీ) దూరంలో ఉన్న శాన్ ఆంటోనియోలో సోమవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక తేమతో 103 డిగ్రీల ఫారెన్‌హీట్ (39.4 డిగ్రీల సెల్సియస్) వరకు టెంపరేచర్ పెరిగింది. దీంతో, వలసదారులు ట్రక్కులో మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మెక్సికో నుంచి అమెరికాకు అక్రమ వలసదారులు ఎక్కువ సంఖ్యలో ట్రక్కుల్లో వెళ్తుంటారు. అంతకు ముందు కూడా వలసదారులతో వెళ్తున్న మెక్సికోకు చెందిన ట్రక్కులు ప్రమాదానికి గురి కావడంతో పదుల సంఖ్యలో మెక్సికన్లు మృతిచెందారు. More than 40 bodies have been found in a truck in San Antonio, Texas. The number of casualties is yet to be officially confirmed, but up to 16 occupants required medical treatment. The people found inside the truck are reportedly undocumented migrants. pic.twitter.com/IfEKth86qT — 10 News First (@10NewsFirst) June 28, 2022 ఇది కూడా చదవండి: అంతరిక్షంలో చైనా సౌర విద్యుత్ కేంద్రం! -
13.5 సెకన్లలో ఫుడ్ సర్వ్ చేసే హోటల్.. ఎక్కడో తెలుసా?
ఏది కావాలంటే దానిని క్షణాల్లో ప్రత్యక్షం చేసే అక్షయ పాత్ర గురించి పురాణాల్లో వినే ఉంటారు. కానీ, ఆహార పదార్థం పేరు చెప్పగానే క్షణాల్లో మీ టేబుల్ మీద ఉంచే హోటల్ గురించి విన్నారా? మెక్సికోలో ఇలాంటి హోటలే ఒకటి ఉంది. పేరు ‘కర్నే గారిబాల్డీ’ ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఫుడ్ సర్వ్ చేసే హోటల్. ఆర్డర్ ఇచ్చిన 13.5 సెకన్లలో ఆహారాన్ని సర్వ్ చేసి ఈ మధ్యనే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోనూ తన పేరు నమోదు చేసుకుంది. ఎంత పెద్ద ఆర్డర్ అయినా సరే, వంటగది నుంచి కస్టమర్ టేబుల్ మీదకు చేర్చడానికి గరిష్ఠంగా 15 సెకన్ల కంటే ఆలస్యం అవదు. దాదాపు 1996 నుంచి ఈ హోటల్ అత్యంత వేగంగా సర్వ్ చేస్తూనే ఉందట. ఈ రికార్డును బ్రేక్ చేయడానికి చాలా మంది పెద్ద పెద్ద ఆర్డర్లు ఇస్తూ విఫలయత్నం చేశారు. ‘సాధారణంగా మెక్సికన్ వంటకాలు చేయడానికి చాలా సమయం పడుతుంది. అందుకే, ఆ ఆలస్యం ఆహారాన్ని అందించడంలో ఉండకూడదనుకున్నాం. ఇందుకు మా సిబ్బంది కూడా తోడ్పడటంతో ఈ రికార్డు సాధించగలిగాం’ అని చీఫ్ మేనేజర్ డేనియల్ ఫ్లోర్స్ తెలిపారు. ఏది ఏమైనా ఇలాంటి హోటల్ మన ప్రాంతంలో కూడా ఉంటే భలే బాగుండు కదా! -
వృక్షాన్ని వివాహం చేసుకున్న మహిళ!...ఎందుకో తెలుసా!!
కొంతమంది పర్యావరణం కోసం ఎంతలా పాటుపడతారంటే తమ జీవితం మొత్తం ధారపోసేలా శ్రమిస్తారు. ఆహర్నిసలు మొక్కలు పెంచుతూ ఒక అడవినే తయారు చేసి అవార్డులు పొందిన మహామహుల్ని చూశాం. అంతేకాదు సుందర్లాల బహుగుణ చిప్కో ఉద్యమానికి యావత్తు దేశం ఆకర్షింపబడటమే కాక చాలామంది అదేబాటలో నడిచినవాళ్లు కూడా ఉన్నారు. అచ్చం అలానే మెక్సికన్ దేశంలోని మహిళా పర్యావరణ ప్రేమికులను ఆదర్శంగా తీసుకుని యూకేకి చెందిన ఒక మహిళ ఒక విన్నూతమైన పనికి శ్రీకారం చుట్టింది. (చదవండి: ప్రధాని ఫోటో తొలగించాలి!...అని పిటిషన్ దాఖలు చేసినందుకు రూ లక్ష జరిమానా!!) అసలు విషయంలోకెళ్లితే...యూకేలో మెర్సీసైడ్‌లోని సెఫ్టన్‌లో 37 ఏళ్ల కేట్ కన్నింగ్‌హామ్ అనే మహిళ 2019లో చాలా ఏళ్ల నాటి పెద్ద వృక్షాన్ని పెళ్లి చేసుకుంది. అంతేకాదు తన ఇంటిపేరును ఎల్డర్‌గా మార్చుకుంది. పైగా వారానికి ఐదు సార్లు చెట్టును సందర్శిస్తానని కూడా చెబుతుంది. అంతేకాదు ఆమె కుటుంబ సభ్యులందర్నీ ఇంట్లో వదిలి బాక్సింగ్ డేని తన బెటర్ హాఫ్‌తో గడపాలని ప్లాన్ చేసుకుంటుందట. అయితే రిమ్రోస్ వ్యాలీ కంట్రీ పార్క్ గుండా బైపాస్ నిర్మించాలనే ఆలోచనకు వ్యతిరేకంగా కేట్ ఆ పార్క్‌లోని ఆ మహా వృక్షాన్ని వివాహం చేసుకుంది. అంతేకాదు చాలా ఏళ్ల క్రితం ల్యాండ్ క్లియరెన్స్ కోసం చట్టవిరుద్ధంగా చెట్టను నరకడాన్ని వ్యతిరేకించి చెట్లను వివాహం చేసుకున్న మెక్సికన్ మహిళలు తనకు ఆదర్శం అని కేట్ చెప్పింది. పైగా తాను పెళ్లి చేసుకోవాలనుకునే చెట్టుని వెతకడానికే ఆ పార్క్‌ని సందర్శించానని కూడా చెబుతోంది. అంతేకాదు కేట్ ఆ చెట్టుతో కలిసి మూడో క్రిస్మస్ని జరుపుకోనున్నట్లు చెప్పింది. ఈ మేరకు కేట్ పండుగ కోసం చెట్టును పుష్పగుచ్ఛం, టిన్సెల్, బాబుల్స్‌తో కూడా అలంకరించింది. పైగా కేట్ తన క్రిస్మస్ కార్డులపై 'విత్ వింటర్ విషెస్, ఫ్రమ్ మిస్టర్ అండ్ మిసెస్ ఎల్డర్' అని సంతకాలు కూడా చేసింది. కేట్ కుటుంబ సభ్యులు స్నేహితులు ఆమె వివాహానికి పూర్తిగా మద్ధతు ఇవ్వడం విశేషం. (చదవండి: నరమాంస భక్షణ వల్ల బ్రైయిన్ క్యూర్ అవుతుందని నమ్మాడు...ఐతే చివరికి..!!) -
ఘోర బస్సు ప్రమాదం...19 మంది దుర్మరణం
Massive Bus Accident In Mexico: సెంట్రల్ మెక్సికోలో యాత్రికులను తీసుకువెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా మరో 32 మందికి గాయలైయ్యాయి. అయితే బస్సు బ్రేకులు కోల్పోయి మెక్సికో రాష్ట్రంలోని ఒక భవనంపైకి దూసుకెళ్లడంతోనే ఈ ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. అంతేకాదు ఈ ప్రమాదం మెక్సికో సిటీకి నైరుతి దిశలో ఉన్న జోక్విసింగో టౌన్షిప్లో జరిగిందని రాష్ట్ర అంతర్గత కార్యదర్శి రికార్డో డి లా క్రూజ్ వెల్లడించారు. (చదవండి: ఆ పిల్లాడి కంటే ఈ కుక్క పిల్లే భలే మాట్లాడేస్తోంది!!!) ఈ మేరకు ఆయన ఈ బస్సు పశ్చిమ రాష్ట్రమైన మిచోకాన్ నుండి శతాబ్దాలుగా రోమన్ క్యాథలిక్ యాత్రికులు సందర్శించే ఛల్మా పట్టణానికి వెళ్తోండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని చెప్పారు. అయితే గాయపడిన ప్రయాణికుల పరిస్థితిపై ఎటువంటి తక్షణ సమాచారం లేదన్నారు. పైగా చాలా మంది మెక్సికన్లు డిసెంబర్ 12, వర్జిన్ ఆఫ్ గ్వాడాలుపే రోజు సమీపిస్తున్న కొద్దీ మతపరమైన తీర్థయాత్రలకు వెళ్తుంటారని చెబుతున్నారు. అంతేకాదు వారు తరచుగా ఇరుకైన రోడ్లపై నడవడం, కాలం చెల్లిన బస్సులలో ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే 1521 ఆక్రమణకు ముందు హిస్పానిక్ పూర్వ కాలంలో ఛల్మా ఒక పవిత్ర ప్రదేశం. అంతేకాక స్పానిష్కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత అజ్టెక్ దేవుడికి అంకితం చేయబడిన ఒక గుహలో ఒక శిలువ అద్భుతంగా కనిపించింది. దీంతో అప్పటి నుంచి ఈ ఛల్మా పేరుగాంచిన క్రైస్తవ తీర్థయాత్ర మారింది. అంతేకాదు పెద్ద ఎత్తున భక్తులు భక్తులు చల్మాను దర్శించుకునేందుకు తరలివస్తుంటారు. (చదవండి: కరోనా కొత్త వేరియంట్.. జర్మనీలో తీవ్రరూపం..రంగంలోకి వైమానిక దళం) -
చిలీ సింగర్ అర్ధ నగ్నంగా....
-
చిలీ సింగర్ అర్ధ నగ్నంగా.......
చిలీలో మానవ హక్కులకు కాలరాసి ప్రజలను హింసిస్తున్న భద్రతా దళాలకు వ్యతిరేకంగా ప్రముఖ చిలీ–మెక్సికన్ గాయనీ మాన్ లఫ్తార్టే గురువారం నాడు లాస్ వెగాస్‌లో జరిగిన 20వ లాటిన్ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో అర్ధనగ్నంగా నిరసన ప్రదర్శన జరిపారు. నిరసనగా గుర్తుగా నల్లటి ప్యాంట్, నల్లటి కోటు ధరించిన ఆమె రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వేదికపైకి ఎక్కి కోటును కిందకు జారవిడిచి తన వక్షోజాలను బయట పెట్టారు. తన చిలీ ప్రజలను హింసించి, రేప్ చేసి, చంపుతున్నారన్న మెడ మీదు నుంచి వక్షోజాల కింది వరకు రాసుకున్నారు. ఆ తర్వాత చిలీ ప్రజల పోరాటానికి మద్దతుగా ఆమె చిలీ కవి రాసిన కవిత్వాన్ని వినిపించారు. ఆ తర్వాత పోరాటానికి మద్దతుగా పాటను కూడా పాడి వినిపించారు. మాన్ లఫ్తార్టే తన పాటలకు వచ్చిన రెండో ‘గ్రామీ అవార్డు ట్రోపీ’ని అందుకోవడానికి అక్కడికి వెళ్లారు. ఆ తర్వాత ఆమె తెల్లటి గౌను ధరించి నవ్వుతూ ట్రోపీతో ప్రేక్షకుల ముందు కనిపించి ఆకట్టుకున్నారు. మంచి పింఛన్లు ఇవ్వాలంటూ మంచి ఆరోగ్య భద్రతను కల్పించాలంటూ, విద్యావకాశాలను పెంచాలంటూ లక్షలాది మంది చిలీ ప్రజలు వీధుల్లోకి వచ్చి గత కొంతకాలంగా నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. వారి ఆందోళనలను అణచి వేసేందుకు చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పియనెరా, అక్టోబర్ 19వ తేదీన దేశంలో అత్యయిక (ఎమర్జెన్సీ) పరిస్థితిని విధించారు. నాటి నుంచి చిలీ భద్రతా దళాలు ప్రజలను నిర్బంధించి హింసిస్తున్నాయి. కొంత మంది మహిళలను రేప్‌లు చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. భద్రతా దళాలు పేల్చిన పెల్లెట్స్ వల్ల నెల రోజుల్లో దాదాపు 200 మంది అంథులయ్యారు. -
‘మీరు ఒలింపిక్స్‌లోట్రై చేయొచ్చు కదా..?!’
-
‘మీరు ఒలింపిక్స్‌లోట్రై చేయొచ్చు కదా..?!’
చిన్నప్పుడు ఇంట్లో అల్లరి పనులు చేయడం.. తర్వాత అమ్మ చేతిలో తన్నులు తినడం దాదాపు అందిరి జీవితాల్లో జరిగే చాలా సాధరణ సంఘటన. దెబ్బల నుంచి తప్పించుకోవడం కోసం వీధుల వెంబడి పరిగెత్తిన వారు కూడా ఉంటారు. మన దగ్గర ఏమో కానీ పంజాబీ తల్లులు మాత్రం పిల్లలకు ఇలా పరిగెత్తే చాన్స్ ఇవ్వరు. తప్పించుకోవడం కోసం పరిగెత్తే పిల్లల్ని ఆపడానికి వారి మీదకు చెప్పునో, షూనో విసిరేస్తారు. దరిద్రం కొద్ది చెప్పు తగిలి కింద పడ్డారా.. అప్పుడుంటది ఇక.. వీపు విమానం మోత మోగాల్సిందే. చిన్నప్పుడు ఇలా దెబ్బలు తినడం ఓకే కానీ టీనేజ్‌కొచ్చాక కూడా ఇలాంటి పరిస్థితి వస్తే.. ఎలా ఉంటుంది. ఈ వీడియోలో చూపినట్లు ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్న ఈ వీడియోలో ఓ తల్లి తప్పించుకు పారిపోతున్న కూతుర్ని ఆపడానికి పంజాబీ తల్లులు చేసే ప్రయోగం చేసింది. మెక్సికోలో జరిగింది ఈ సంఘటన. తల్లీకూతులిద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది. కోపంతో ఉన్న తల్లి కూతుర్ని కొట్ట బోయింది. కానీ కూతరు తప్పించుకోవడం కోసం రోడ్డు మీద పరిగెత్తింది. దాంతో విచక్షణ కోల్పోయిన తల్లి చెప్పు తీసుకుని కూతురి మీదకు విసిరేసింది. అది కూడా 30 మీటర్ల దూరంలో ఉండగా. ఆశ్చర్య ఆ చెప్పు సరిగ్గా వెళ్లి ఆ అమ్మాయికి తగిలడం.. కింద పడిపోవడం క్షణాల్లో జరిగాయి. గురి తప్పకుండా చెప్పు విసిరిన ఆమె కోపాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. ఒలింపిక్స్‌లో ట్రై చేస్తే రికార్డలన్నీ మీవే అంటూ కామెంట్ చేస్తున్నారు. -
‘అమ్మ’ సమయస్ఫూర్తికి సలామ్.. వైరల్
బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుందంటారు. ఆ బిడ్డ ఆకలితో ఏడిస్తే తల్లి పేగు కదులుతుంది. ఆ సమయంలో మరో విషయం ఆలోచించకుండా మాతృమూర్తులు తన బిడ్డకు చనుపాలు ఇస్తారు. కానీ నేటికీ పలానా చోట ఉన్నప్పుడు పాలు ఇవ్వకూడదు, పలానా సమయంలో చనుపాలు అలా ఎలా ఇస్తారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఓ మెక్సికన్ మదర్ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. పరిస్థితిని చాలా హుందాగా ఎదుర్కొన్నారంటూ ఆమెకు మద్దతు లభిస్తోంది. మెలానీ డడ్లీ అనే మహిళకు సంతానం నాలుగు నెలల బాబు ఉన్నాడు. ఆమె మెక్సికోలోని కాబో శాన్లుకాస్లో రెస్టారెంట్‌కు ఇటీవల కుటుంబంతో పాటు వెళ్లారు. అయితే అదే సమయంలో ఆమె బిడ్డ ఆకలితో ఏడుపు మొదలుపెట్టాడు. ఆ కన్నతల్లి వెంటనే తన బిడ్డకు పాలు ఇస్తూ మాతృత్వంలోని మాధుర్యాన్ని ఆస్వాధిస్తున్నారు. రెస్టారెంట్ ముందు నుంచి వెళ్తున్న ఓ వ్యక్తి కవర్ చేసుకోండి అని ఆమెకు సూచించాడు. దీంతో తన ఉద్దేశాన్ని స్పష్టం చేయాలనుకున్న మెలానీ వెంటనే తన చీర కొంగుతో తల, ముఖం మొత్తం కప్పేసుకుని ఆ పాదచారికి బదులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను మెలానీ ఫ్యామిలీ ఫ్రెండ్ కారల్ లాక్వుడ్ తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. (ఆ ఫొటోలో అశ్లీలత లేదు: హైకోర్టు) ఆమె ఫ్యామిలీ నాకు సన్నిహితులే. కానీ నేను ఆమెను ఎప్పుడూ చూడలేదు. అయితేనేం ఆమె చేసిన పని ప్రశంసనీయం. మెలానీ చాలా మంచిపని చేశారు. ఆమె అనుమతిని కోరుతూ లాక్వుడ్ తన ఫేస్బుక్లో ఈ వివరాలను పోస్ట్ చేయగా విశేష స్పందన వస్తోంది. సమయస్ఫూర్తితో ఆమె తల, ముఖాన్ని కవర్ చేసుకుని తనకు సూచనలిచ్చిన వ్యక్తికి బదులిచ్చారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మెలానీ మీడియాతో మాట్లాడుతూ.. మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో.. తమ పిల్లలకు బహిరంగ స్థలాల్లో చనుపాలు ఇవ్వడం ఒకటని చెప్పారు. కుటుంబంతో పాటు ఉన్న తనకు శరీరాన్ని కవర్ చేసుకోవాలని ఓ వ్యక్తి సూచించడం విచిత్రంగా అనిపించిందన్నారు. అందుకే తెలివిగా నా ముఖాన్ని కవర్ చేసుకున్నానని వివరించారు. కాగా, ఇటీవల అమెరికాకు చెందిన మారా మార్టిన్ అనే మోడల్ మియామీలో ర్యాంప్ వాక్ చేస్తుండగా ఆమె ఐదు నెలల చిన్నారి ఏడుస్తున్నాడని.. బిడ్డకు పాలిస్తూనే ఈవెంట్లో పాల్గొని తల్లిప్రేమను మించింది మరొకటి లేదని నిరూపించారు. (మాతృత్వానికే అంబాసిడర్‌గా నిలిచిన మోడల్) -
మెక్సికన్లపై హోటల్ మేనేజర్ అత్యాచారయత్నం
జైపూర్ : మహిళలకు భారత్ అత్యంత ప్రమాదకర దేశమని తాజాగా థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ సర్వే వెల్లడించడంతో దేశం పరువు అంతర్జాతీయంగా మసకబారింది. మరోవైపు భారత్ పర్యటనకు వచ్చిన విదేశీ మహిళలపై బుధవారం లైంగికదాడి యత్నం జరగడంతో దేశంలో మహిళల భద్రత ప్రశ్నార్ధకమేనన్న వాస్తవం కళ్లకు కట్టినట్టయింది. వివరాలు.. పింక్ సిటీ (జైపూర్) పర్యటనలో ఉన్న ఇద్దరు మెక్సికన్ మహిళలు నగరంలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో దిగారు. హోటల్ జనరల్ మేనేజర్ రిషిరాజ్ సింగ్(40) బుధవారం రాత్రి వారి గదిలోకి చొరబడి అత్యాచార యత్నం చేశాడని పోలీసులు తెలిపారు. అతని బారి నుంచి తప్పించుకున్న సదరు మహిళలు హోటల్ సిబ్బంది సాయంతో పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు, ఘటనా ప్రదేశంలో లభ్యమైన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు రిషిరాజ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని జైపూర్ (దక్షిణ) డీసీపీ వికాస్ పాటక్ వెల్లడించారు. -
పెళ్లయితే ఇక అంతే!
మెక్సికోకు చెందిన ఐదుగురు మిత్రులు.. వారికి ఫుట్‌బాల్ ఆట అంటే చాలా ఇష్టం. ఫిఫా వరల్డ్ కప్ ఎక్కడ జరిగినా వెంటనే అక్కడ వాలిపోయేంత ఇష్టం. 2014 బ్రెజిల్ వరల్డ్ కప్ సందర్భంగా వీరంతా అక్కడికి వెళ్లి చాలా ఎంజాయ్ చేసి వచ్చారు. రష్యాలో జరిగే ఫిఫా వరల్డ్ కప్‌కు హాజరుకావాలని అప్పుడే నిర్ణయం తీసేసుకున్నారు. అప్పటినుంచే డబ్బులు కూడా ఆదా చేసుకుంటూ వచ్చారట. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఆ ఆటలకు జేవియర్ హాజరు కాలేకపోయాడు. ఎందుకంటే అతడికి పెళ్లయింది. పెళ్లయితే ఏంటి అనే కదా మీ ప్రశ్న. జేవియర్ సడన్‌గా ఏప్రిల్‌లో తాను రాలేకపోతున్నానని.. తన భార్య అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదని మిగతా వారికి చెప్పాడట. ఎంత బతిమాలినా కూడా తన భార్య ఒప్పుకోలేదట. కానీ వారికేమో ఆ ఒక్కడు రాకపోతే ఎలా అని తర్జనభర్జన పడ్డారట. చివరికి ఓ మంచి ఐడియా వచ్చింది వారికి. అదేంటంటే జేవియర్ నిలువెత్తు ఫొటో కార్డ్‌బోర్డ్‌ను తయారు చేయించి వారితో పాటు రష్యాకు తీసుకొచ్చుకున్నారు. జేవియర్‌తో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసేసరికి ఆ ఫొటోలకు ప్రపంచవ్యాప్తంగా తెగ క్రేజ్ వస్తోంది! -
వయసు 10 నెలలే.. కానీ బరువెంతో తెలుసా.?
మెక్సికో: లూయిస్ మాన్యుఎల్ అనే బాలుడి వయసు 10 నెలలు.. కానీ ఆ బాలుడిబరువు మాత్రం దాదాపు 10 ఏళ్ల వయసు వారికి ఉండాల్సిన దానికి సమానంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. మెక్సికో పశ్చిమ మెక్సికన్ రాష్ట్రంలోని కొలమిమాలోనికి చెందిన లూయిస్ మాన్యుఎల్ వయసు పది సంవత్సరాలు. ఆ బాలాడి బరువు మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. దాదాపు 10 ఏళ్ల వయసున్న వారికి ఉండాల్సినంత బరువు లూయిస్ ఉన్నాడు. ప్రస్తుతం ఈ బాలుడి బరువు 30 కిలోలు. దీంతో లూయిస్ ప్రపంచంలోనే భారీ బేబీ కాయుడిగా రికార్డుకెక్కాడు. లూయిస్ మాన్యుఎల్కు పిల్లలకు అరుదుగా వచ్చే ప్రిడర్ విల్లీ సిండ్రోమ్ అనే డిసీజ్ ఉందని వైద్యులు చెందుతున్నారు. దీంతో లూయిస్‌కి ఏమవుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పుట్టినపుడు లూయిస్ 3.5 కిలోలు ఉన్నాడని అతని తల్లి ఇసాబెల్ పాన్టోజా చెప్పారు. ఒక నెల తరువాత నుంచి లూయిస్ బరువు వేగంగా పెరుగుతున్నాడని చెప్పారు. అధిక బరువు వల్ల కొన్ని సందర్భాల్లో ఊపిరి అందేది కాదని, సరిగా నిద్రపోవడం లేదని వారు చెబుతున్నారు. నెల వయసు ఉన్నపుడే అతనికి రెండెళ్ల పిల్లాడికి కొనే బట్టలను కొనేవాళ్లమని చెప్పారు. ఇటీవలి కాలంలో ప్రపంచంలోనే భారీ కాయుడిగా ఉన్న మెక్సికోకు చెందిన జువాన్ పెడ్రో ఫ్రాంకో(32) కు ఆపరేషన్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. -
అడవుల్లో అద్భుతాన్ని కనిపెట్టిన బాలుడు!
మెక్సికో: శాటిలెట్ ఫొటోల ఆధారంగా ఓ బాలుడు అద్భుతాన్ని ఆవిష్కరించాడు. దట్టమైన అడవుల్లో నిక్షిప్తమైన, ఎవ్వరికీ కనపడకుండా మరుగున పడిపోయిన మయన్ నగరాన్ని గుర్తించాడు. మాయ నాగరికతకు చెందిన చరిత్ర ఆధారంగా పరిశోధనలు చేశాడు. సెంట్రల్ అమెరికాకు చెందిన మెక్సికన్ పర్వత ప్రాంతంలో వేల ఏళ్ళనాడు మరుగున పడిపోయిన నగరాన్ని 15ఏళ్ళ విలియమ్స్ గడౌరీ గుర్తించాడు. ఇప్పటివరకూ పరిశోధకుల కంట కూడ పడని దట్టమైన అడవులు, కొండలు, గుట్టల్లో దాగి ఉన్న ఆ అద్భుత 'మాయ' నగరాన్ని శాటిలెట్ చిత్రాల ద్వారా గుర్తించిన బాలుడు... ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారిపోయాడు. ప్రాచీన కళలు, సంస్కృతి ప్రతిబింబించే కట్టడాలు, అద్భుత నిర్మాణాలు ఇప్పుడా నగరంలో బయటపడి, వేల యేళ్ళ చరిత్రకు ఆనవాళ్ళుగా మారాయి. 2014 సంవత్సరంలోనూ పురావస్తు శాఖ వారు రెండు పురాతన పట్టణాలను కనుగొన్నారు. అయితే అప్పట్లో అడవుల్లో దాగి ఉన్న ఈ నగరాన్ని మాత్రం గుర్తించలేకపోయారు. తాను చదివిన ఓ పుస్తకం ఆధారంగా ఆ అదృశ్య నగరాన్ని గుర్తించినట్లు విలియమ్స్ గడౌరీ చెప్తున్నాడు. మాయ నాగరికత నాటి నిర్మాణాలన్ని మారుమూల ప్రాంతాలు, దట్టమైన అడవులు, పర్వతాల నడుమే ఉన్నట్లు తెలుసుకున్న అతడు... అలా ఎందుకు నిర్మించేవారో తెలుసుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆ విషయంపై అధ్యయనాలు ప్రారంభించాడు. ఆ కాలంలో ప్రజలు నక్షత్రాలను ఎక్కువగా పూజించేవారని తెలుసుకుని ఆదిశగా అధ్యయనాలను మొదలు పెట్టాడు. నక్షత్రాల ఆధారంగా నగరాలను గుర్తించవచ్చన్న కోణంలో అడుగులు వేశాడు. గడౌరీ అనుకున్నట్లుగానే ఇప్పటిదాకా గుర్తించిన నగరాలన్నీ 22 నక్షత్ర సమూహాల స్థానంలోనే ఉన్నట్లు గుర్తించాడు. కానీ ఇంతకు ముందు పరిశోధకులు గుర్తించిన వాటిలో ఓ నగరం మిస్ అయినట్లు తెలుసుకున్న అతడు.. గూగుల్ ఎర్త్ ఆధారంగా పరిశోధనలు కొనసాగించి, రాడార్ శాట్-2 ఉపగ్రహ చిత్రాలద్వారా అడవుల్లో దాగిఉన్న అద్భుతాన్ని కనుగొన్నట్లు తెలిపాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మానవమాత్రులు అడుగు పెట్టలేని అ మారుమూల యుకాతాన్ అడవుల్లోని నగరానికి తాను.. కాక్ చి అని గాని, మౌత్ ఆఫ్ ఫైర్ అనిగాని కొత్త పేరు పెట్టాలని కూడ భావిస్తున్నాడు. అయితే ఆ నగరం మానవ నిర్మితంగానే కనిపిస్తోందని, అయితే ప్రపంచం ఈ నంగరం ద్వారా కొత్త ఆవిష్కణను చూసే అవకాశం ఉందని న్యూ బ్రున్స్విక్ విశ్వవిద్యాలయం రిమోట్ సెన్సింగ్ లేబొరేటరీకి చెందిన డాక్టర్ ఆర్మాండ్ లా రాక్యూ చెప్తున్నారు. శాటిలెట్ చిత్రాల్లోని ఒక ఫొటో అక్కడి నిర్మాణాలు చతురస్రాకారంలో పిరమిడ్ ను పోలి ఉన్నట్లుగా తెలుస్తోందని చెప్తున్నారు. విలియమ్స్ కనుగొన్న పద్ధతిలో మాయన్ నగరం ఆధారంగా పురాతత్వవేత్తలు మరిన్ని నగరాలను కూడ గర్తించే అవకాశం ఉందన్నారు. తన కొత్త ఆవిష్కరణలను సైంటిఫిక్ జనరల్ లో ప్రచురించిన విలియమ్స్... 2017 లో జరిగే బ్రెజిల్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెయిర్ లో ప్రదర్శించనున్నట్లు కూడ తెలుస్తోంది. -
మహిళా పోలీసు టాప్‌లెస్ సెల్ఫీ
ఓ మహిళా పోలీసు అధికారి టాప్ లెస్ గా దిగిన ఫోటో ఆమె ఉద్యోగానికే ఎసరు తెచ్చింది. మెక్సికోలోని ఎస్కోబెడోలో పెట్రోలింగ్ చేస్తున్న కారులో నిదియా గార్సియా ఆనే మహిళ పోలీసు టాప్ లెస్ సెల్ఫీ తీసుకుంది. తన యూనిఫాం ను కిందికు దించి రొమ్ము భాగం కనబడేలా సెల్ఫీ దిగింది. అంతేకాకుండా ఆ ఫోటోను తన ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. దీంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. యూనిఫాంలో ఉండటమే కాకుండా ఆయుధాలను కూడా పక్కనే ఉంచి ఇలా చేసినందుకు అధికారులు అమెను సస్పెండ్ చేశారు. అంతే కాకుండా నిదియా సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న ఇతర సిబ్బంది కూడా పక్కనే ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తుకు ఆదేశించారు. అలా చేసినందుకు తనను తానే అసహ్యించుకుంటున్నానని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన నిదియా తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. తన ఇద్దరు కూతుళ్లు, భర్త, తల్లిదండ్రులు, సోదరులకు చెడ్డ పేరు తీసుకు వచ్చానని వాపోయింది. -
మెక్సికన్ మాజీ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు!
రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్‌పై మెక్సికన్ మాజీ అధ్యక్షుడు ఫెలిపె కాల్డెరోన్ విరుచుకు పడ్డారు. ట్రంప్ ప్రచార ప్రణాళికపై స్పందించిన కాల్దెరోన్.. తీవ్ర పదజాలంతో విమర్శించారు. సరిహద్దు గోడ నిర్మాణాకి ఒక్క సెంట్ కూడా చెల్లించేది లేదని.. అదో స్టుపిడ్ వాల్ అని అన్నారు. బిజినెస్ కాన్ఫరెన్స్ కోసం యాంఛెన్ వెళ్ళిన కాల్దెరోన్.. ఆ వాల్ నిర్మాణ ప్రయత్నం ఎందుకూ పనికి రానిదన్నారు. అంతేకాక అధ్యక్ష పదవికి ట్రంప్ సరిపోడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవికి డోనాల్డ్ ట్రంప్ పోటీపై కాల్డెరోన్ తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్నివ్యక్తం చేశారు. ఓ ప్రశంసనీయ సమాజం ఉన్న ఆమెరికాలో రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ రేస్‌లో ట్రంప్ వంటి అభ్యర్థులు పోటీ పడటం నమ్మలేకపోతున్నామంటూ తన అయిష్టాన్ని వెళ్ళగక్కారు. ట్రంప్ బాగా చదువుకున్న మనిషే అయినా అధ్యక్ష పదవికి తగ్గ తెలివితేటలు లేవన్నారు. కాగా తన ప్రచారంలో ట్రంప్... సరిహద్దు సమస్యలు, ఇమ్మిగ్రేషన్లను ప్రధాన అజెండాలుగా చేసుకున్నారని, మెక్సికో ...రేపిస్టులను, క్రిమినల్స్‌ను బరిలోకి పంపిస్తోందంటూ ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు. అంతేకాకుండా ట్రంప్.. ఇమ్మిగ్రేషన్ సమస్యలను ప్రచార సాధనంగా ఎంచుకోవడాన్ని కాల్డెరోన్ తప్పుబట్టారు. ప్రజల, వాణిజ్య శ్రేయస్సును కోరుకునేవారు సరిహద్దును మూసివేయడంపై మాట్లాడటం వారి ఓటమికి ప్రధమ కారణం అవుతుందన్న కాల్దెరోన్... అటువంటి విధానాలను ప్రవేశపెట్టడం అమెరికా శ్రేయస్సుకు ఎంతమాత్రం సరికాదన్నారు. అలాగే ఇమ్మిగ్రేషన్ పై ట్రంప్ చేస్తున్న ప్రకటనలు అసంబద్ధమని, మెక్సికో నుంచి అక్రమ వలసలు సమస్యలను తెచ్చి పెడతాయని అన్నారు. గత నవంబరులో చేపట్టిన ఓ నివేదిక ప్రకారం మెక్సికోకు ఇమ్మిగ్రేట్ అయ్యేవారికంటే ఆమెరికా నుంచి వలసలు ఎక్కువయినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా సరిహద్దు గోడ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కాల్దెరోన్ తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. -
అమెరికా పోలీసుల అరాచకం!: పాస్కోలో ఉద్రిక్తత
లాస్ ఏంజలిస్: అమెరికా పోలీసుల దుందుడుకు స్వభావానికి తాజాగా మరో ఘటన ఉదాహరణగా నిలిచింది. వాషింగ్టన్ రాష్ట్రంలోని పాస్కో నగర పోలీసులు ఒక మెక్సికన్ వలసదారుణ్ని తమపై రాళ్లు విసిరాడన్న కారణంతో కాల్చి చంపారు. ఈ ఘటనను ఓ వ్యక్తి సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. ఆ వీడియో ద్వారా జరిగిన సంఘటన పూర్తిగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం జరిగిన ఈ ఘటనతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత ఏడాది కాలంగా శ్వేత జాతి పోలీసులు నిరాయుధులైన శ్వేతేతరులను కాల్చి చంపుతున్నారని దేశ వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్న సమయంలో ఈ ఘటన జరగడం గమనార్హం. వీడియోలో కనిపిస్తున్న దృశ్యం ప్రకారం ముగ్గురు పోలీసు అధికారులు ఆంటోనియో జాంబ్రానో మంటీస్ అనే మెక్సికన్ వలసదారుడిపై గురి పెట్టారు. అదుపులోకి తీసుకొవాలని ప్రయత్నించగా మాంటీస్ తమపై రాళ్లు విసురుతూ పారిపోయాడని, తప్పని పరిస్థితుల్లో అతనిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. కాని వీడియోలో, కాల్పులు జరపడానికి కొద్ది సెకండ్ల ముందు అతను చేతులు పైకిత్తి పరుగెత్తుతున్న దృశ్యం కనిపిస్తోంది. వీడియో బయటకు రావడంతో నగర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నియాతో ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. జాంబ్రానో మాంటీస్ కుటుంబానికి అవసరమైన సహకారం అందించాలని తన విదేశాంగ మంత్రిని ఆదేశించారు. నిరసన కారులు గతేడాది జరిగిన ఆఫ్రో అమెరికన్ యువకుడు మైకేల్ బ్రౌన్ హత్యను గుర్తుచేస్తూ మరో 'ఫెర్గుసన్'కోరుకోవడంలేదని నినదించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పాస్కో పోలీసులు నగరంలో నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతామని వాషింగ్టన్ గవర్నర్ జే ఇన్స్లీ తెలిపారు.