పెళ్లయితే ఇక అంతే! | Mexican Man Missing  FIFA World Cup 2018 Live After Marriage | Sakshi
Sakshi News home page

పెళ్లయితే ఇక అంతే!

Published Sun, Jun 17 2018 9:45 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

Mexican Man Missing  FIFA World Cup 2018 Live After Marriage - Sakshi

మెక్సికోకు చెందిన ఐదుగురు మిత్రులు.. వారికి ఫుట్‌బాల్‌ ఆట అంటే చాలా ఇష్టం. ఫిఫా వరల్డ్‌ కప్‌ ఎక్కడ జరిగినా వెంటనే అక్కడ వాలిపోయేంత ఇష్టం. 2014 బ్రెజిల్‌ వరల్డ్‌ కప్‌ సందర్భంగా వీరంతా అక్కడికి వెళ్లి చాలా ఎంజాయ్‌ చేసి వచ్చారు. రష్యాలో జరిగే ఫిఫా వరల్డ్‌ కప్‌కు హాజరుకావాలని అప్పుడే నిర్ణయం తీసేసుకున్నారు. అప్పటినుంచే డబ్బులు కూడా ఆదా చేసుకుంటూ వచ్చారట. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఆ ఆటలకు జేవియర్‌ హాజరు కాలేకపోయాడు. 

ఎందుకంటే అతడికి పెళ్లయింది. పెళ్లయితే ఏంటి అనే కదా మీ ప్రశ్న. జేవియర్‌ సడన్‌గా ఏప్రిల్‌లో తాను రాలేకపోతున్నానని.. తన భార్య అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదని మిగతా వారికి చెప్పాడట. ఎంత బతిమాలినా కూడా తన భార్య ఒప్పుకోలేదట. కానీ వారికేమో ఆ ఒక్కడు రాకపోతే ఎలా అని తర్జనభర్జన పడ్డారట. చివరికి ఓ మంచి ఐడియా వచ్చింది వారికి. అదేంటంటే జేవియర్‌ నిలువెత్తు ఫొటో కార్డ్‌బోర్డ్‌ను తయారు చేయించి వారితో పాటు రష్యాకు తీసుకొచ్చుకున్నారు. జేవియర్‌తో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసేసరికి ఆ ఫొటోలకు ప్రపంచవ్యాప్తంగా తెగ క్రేజ్‌ వస్తోంది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement