
మెక్సికో: లూయిస్ మాన్యుఎల్ అనే బాలుడి వయసు 10 నెలలు.. కానీ ఆ బాలుడిబరువు మాత్రం దాదాపు 10 ఏళ్ల వయసు వారికి ఉండాల్సిన దానికి సమానంగా ఉంది.
వివరాల్లోకి వెళితే.. మెక్సికో పశ్చిమ మెక్సికన్ రాష్ట్రంలోని కొలమిమాలోనికి చెందిన లూయిస్ మాన్యుఎల్ వయసు పది సంవత్సరాలు. ఆ బాలాడి బరువు మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. దాదాపు 10 ఏళ్ల వయసున్న వారికి ఉండాల్సినంత బరువు లూయిస్ ఉన్నాడు. ప్రస్తుతం ఈ బాలుడి బరువు 30 కిలోలు. దీంతో లూయిస్ ప్రపంచంలోనే భారీ బేబీ కాయుడిగా రికార్డుకెక్కాడు.
లూయిస్ మాన్యుఎల్‌కు పిల్లలకు అరుదుగా వచ్చే ప్రిడర్ విల్లీ సిండ్రోమ్ అనే డిసీజ్ ఉందని వైద్యులు చెందుతున్నారు. దీంతో లూయిస్‌కి ఏమవుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పుట్టినపుడు లూయిస్ 3.5 కిలోలు ఉన్నాడని అతని తల్లి ఇసాబెల్ పాన్టోజా చెప్పారు. ఒక నెల తరువాత నుంచి లూయిస్ బరువు వేగంగా పెరుగుతున్నాడని చెప్పారు. అధిక బరువు వల్ల కొన్ని సందర్భాల్లో ఊపిరి అందేది కాదని, సరిగా నిద్రపోవడం లేదని వారు చెబుతున్నారు. నెల వయసు ఉన్నపుడే అతనికి రెండెళ్ల పిల్లాడికి కొనే బట్టలను కొనేవాళ్లమని చెప్పారు. ఇటీవలి కాలంలో ప్రపంచంలోనే భారీ కాయుడిగా ఉన్న మెక్సికోకు చెందిన జువాన్ పెడ్రో ఫ్రాంకో(32) కు ఆపరేషన్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment