fatty
-
వణికిపోతున్న ప్రజలు.. పొంచిఉన్న ముప్పు.. ఒకవేళ అదే జరిగితే పరిస్థితేంటి?
లండన్: బ్రిటన్ ప్రజలు ఇప్పుడు ఎలుకల పేరు చెబితేనే వణికిపోతున్నారు. వీధుల్లో చెత్తకుండీల వద్ద కుప్పలుకుప్పలుగా కన్పిస్తున్న మూషికాలను చూసి హడలిపోతున్నారు. ప్రస్తుతం బ్రిటన్‌లో 20-30 కోట్ల ఎలుకలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి పొరపాటున బ్రిటన్ను చుట్టుముట్టి ప్లేగు వ్యాధిని వ్యాపింపజేస్తే పరిస్థితి అత్యంత భయంకరంగా ఉంటుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజులు మారుతున్న కొద్ది బ్రిటన్ ప్రజలు ఆహారపు అలవాట్లు కూడా మారాయి. ఇప్పుడు ఎక్కువ మంది ఫాస్ట్‌ఫుడ్, కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే ఫుడ్‌ను ఇష్టపడుతుత్నారు. బేకరీలు, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లలో కస్టమర్లు తినివదిలేసిన ఆహారం చెత్తకుండీల్లో పడేస్తున్నారు. వీటిని ఆరగించేందుకు ఎలుకలు డస్ట్బిన్ల వద్ద కుప్పలుకుప్పలుగా దర్శనమిస్తున్నాయి. వీటిని చూసి అటువైపు వెళ్లే వాళ్లు జడుసుకుంటున్నారు. (చదవండి: కొత్త జంటపై విధి చిన్న చూపు.. పెళ్లై గంటలు గడవకముందే ఊహించని ప్రమాదం) కస్టమర్లు వదిలేసిన ఆహార పదార్థాలు తిని బ్రిటన్‌లో ఎలుకలు ఫ్యాటీగా తయారవుతున్నాయి. కొవ్వు పదార్థాలు అధికమై ఊబకాయం బారినపడుతున్నాయి. దీంతో వాటి పరిమాణం చిన్నసైజు కుక్క స్థాయికి పెరిగిపోతుంది. వీటిని చూస్తేనే హడలిపోయేలా కన్పిస్తున్నాయి. ఊబకాయంతో విషం తట్టుకునే శక్తి.. ఎలుకలు ఫ్యాటీగా తయారు కావడంతో వాటిని చంపేందుకు మందుపెట్టి విషప్రయోగం చేసినా అవి తట్టుకుంటున్నాయి. బ్రిటన్‌లో మూషికాలను చంపేందుకు 1950 నుంచి ఉపయోగిస్తున్న పెస్ట్ కంట్రోల్‌ను ప్రయోగించినా అవి చావడం లేదని పారిశుద్ధ్య నిర్వాహకులు చెబుతున్నారు. దాదాపు 78 శాతం ఎలుకలు విషాన్ని సైతం తుట్టుకునే నిరోధక శక్తి కలిగి ఉన్నాయని వాపోతున్నారు. అయితే ఎలుకల సంఖ్య గణనీయంగా పెరగడానికి పారిశుద్ధ్య ప్రమాణాలు, పరిశుభ్రత సరిగ్గా పాటించకపోవడమూ ఓ కారణమని పలువురు అభిప్రాయపడ్డారు. వాటిని ఎప్పుడో నియంత్రించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. లండన్ గ్రీన్విచ్ యూనివర్శిటీలోని నేచురల్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్లో ఎకాలజీ ప్రొఫెసర్ స్టీవ్ బెల్మైన్ ఎలుకల సంఖ్య గురించి మాట్లాడుతూ.. 'ఇక్కడ కనీసం 200 నుంచి 300 మిలియన్ల(సుమారు 30 కోట్లు) ఎలుకలు ఉన్నాయని నేను ఊహించగలను' అని అన్నారు. వ్యాధి ప్రాబల్యాన్ని పరీక్షించడానికి నార్ఫోక్, ఎసెక్స్‌లోని వ్యవసాయ క్షేత్రాల్లో ఎలుకలను బోణుల ద్వారా ట్రాప్ చేస్తున్నట్లు తెలిపారు. బ్రిటన్‌లో 2018లో బోర్న్మౌత్ పెస్ట్ హంటర్ పట్టుకున్న ఓ ఎలుక 21 అంగుళాల పొడవు ఉంది. అంటే ఇది చిన్న కుక్క సైజులో ఉంటుందన్నమాట. బ్రిటన్‌లో అప్పటివరకు పట్టుకున్న ఎలుకల్లో ఇదే అతిపెద్దది కావడం గమనార్హం. అయితే ఇప్పుడు ఎలుకల పరిమాణం ఇంకా పెరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదిలాఉండగా.. 2021 లెక్కల ప్రకారం బ్రిటన్ జనాభా సుమారు 7 కోట్లు. చదవండి: ప్రాణులకు ప్లాస్టికోసిస్ ముప్పు -
‘లావుగా ఉన్నానన్నాడు.. అందుకే చంపేశా’
లక్నో : గ్యాంగ్‌స్టర్ ప్రేమ్ ప్రకాశ్ సింగ్ అలియాస్ మున్నా బజరంగీ సోమవారం ఉదయం బాగ్పట్ జైల్లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. అదే జైల్లో ఉన్న మరో గ్యాంగ్‌స్టర్ సునీల్ రాతీ బజరంగీని తుపాకితో కాల్చి చంపాడు. ప్రస్తుతం పోలీసుల కస్టడిలో ఉన్న రాతీ విచారణలో ‘బజరంగీ తనను లావుగా ఉన్నాని హేళన చేశాడని, అందుకే తాను బజరంగీని హత్య చేసినట్లు’ తెలిపాడు. ఈ విషయం గురించి రాతీ ‘ఆ రోజు నేను మా గదిలో ఎప్పటిలానే నడుస్తూ ఉన్నాను. ఇంతలో బజరంగీ నన్ను దాటుకుని ముందుకు వెళ్లి, నేను చాలా లావుగా ఉన్నానంటూ హేళన చేయడం ప్రారంభించాడు. నేను అతని మాటలను వ్యతిరేకించాను. నన్ను హేళన చేయవద్దని చెప్పాను. అయినా అతను వినలేదు. దాంతో మా మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకుంది. ఇంతలో బజరంగీ ఉన్నట్టుండి తుపాకీ తీశాడు. దాంతో నేను అతన్ని కొట్టి అతని చేతిలో నుంచి తుపాకీని లాక్కున్నాను. వెంటనే ఆ తుపాకీలో ఉన్న తుటాలన్నింటిని బజరంగీ తలలోకి దింపేశాను’ అన్నాడు. అనంతరం ఆ తుపాకీని బయట మురుగు కాల్వలో పడేశానని తెలిపాడు. అయితే రాతీ, బజరంగీ మధ్య గొడవ జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న మరో ఖైదీ రాతీ వ్యాఖ్యలను ఖండించాడు. అసలు వారిద్దరి మధ్య ఎటువంటి గొడవ జరగలేదని తెలిపాడు. రాతీ కావాలనే బజరంగీపై దాడి చేశాడని.. కనీసం బజరంగీకి పారిపోయే అవకాశం కూడా దొరకలేదని తెలిపాడు. వీరిద్దరి మాటలను రికార్డు చేసిన పోలీసు అధికారులు ‘బజరంగీని అతని శత్రువులు పథకం ప్రకారమే హత్య చేయించి ఉంటారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక కేసు నిమిత్తమై కోర్టులో ప్రవేశపెట్టేందుకు గాను బజరంగీని ఆదివారమే ఝాన్సీ జైలు నుంచి బాగ్పట్ జైలుకు తీసుకువచ్చారుము. కాబట్టి రాత్రికి రాత్రే బజరంగీ ఆయుధాలు ఏర్పాటు చేసుకునే అవకాశం లేదు అని పోలీసులు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
వయసు 10 నెలలే.. కానీ బరువెంతో తెలుసా.?
మెక్సికో: లూయిస్ మాన్యుఎల్ అనే బాలుడి వయసు 10 నెలలు.. కానీ ఆ బాలుడిబరువు మాత్రం దాదాపు 10 ఏళ్ల వయసు వారికి ఉండాల్సిన దానికి సమానంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. మెక్సికో పశ్చిమ మెక్సికన్ రాష్ట్రంలోని కొలమిమాలోనికి చెందిన లూయిస్ మాన్యుఎల్ వయసు పది సంవత్సరాలు. ఆ బాలాడి బరువు మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. దాదాపు 10 ఏళ్ల వయసున్న వారికి ఉండాల్సినంత బరువు లూయిస్ ఉన్నాడు. ప్రస్తుతం ఈ బాలుడి బరువు 30 కిలోలు. దీంతో లూయిస్ ప్రపంచంలోనే భారీ బేబీ కాయుడిగా రికార్డుకెక్కాడు. లూయిస్ మాన్యుఎల్కు పిల్లలకు అరుదుగా వచ్చే ప్రిడర్ విల్లీ సిండ్రోమ్ అనే డిసీజ్ ఉందని వైద్యులు చెందుతున్నారు. దీంతో లూయిస్‌కి ఏమవుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పుట్టినపుడు లూయిస్ 3.5 కిలోలు ఉన్నాడని అతని తల్లి ఇసాబెల్ పాన్టోజా చెప్పారు. ఒక నెల తరువాత నుంచి లూయిస్ బరువు వేగంగా పెరుగుతున్నాడని చెప్పారు. అధిక బరువు వల్ల కొన్ని సందర్భాల్లో ఊపిరి అందేది కాదని, సరిగా నిద్రపోవడం లేదని వారు చెబుతున్నారు. నెల వయసు ఉన్నపుడే అతనికి రెండెళ్ల పిల్లాడికి కొనే బట్టలను కొనేవాళ్లమని చెప్పారు. ఇటీవలి కాలంలో ప్రపంచంలోనే భారీ కాయుడిగా ఉన్న మెక్సికోకు చెందిన జువాన్ పెడ్రో ఫ్రాంకో(32) కు ఆపరేషన్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. -
లివర్ వ్యాధి చికిత్సలో ముందడుగు
కోల్‌కతా: ఇటీవలి కాలంలో కాలేయ సమస్యలు పెరిగిపోతున్నాయి. కాలేయ వ్యాధుల్లో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్(ఎన్ఏఎఫ్డీ) ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. ఈ వ్యాధి చికిత్సలో భారతీయ శాస్త్రవేత్తలు పురోగతి సాధించారు. ముఖ్యంగా అధిక బరువు, టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో కనిపించే ఈ ఎన్ఏఎఫ్డీలో లివర్‌లో కొవ్వు పరిమాణం పెరగడంతో ప్రాణాంతకంగా మారుతోంది. భారత్‌లోని వయోజనుల్లో సుమారు 30 శాతం మంది ఎన్ఏఎఫ్ఎల్డీ బారిన పడుతున్నారు. ఇప్పటివరకూ దీనికి ప్రత్యేకంగా ఎలాంటి వైద్య చికిత్స అందుబాటులో లేదు. దీనిపై పరిశోధనలు నిర్వహిస్తున్న సీఎస్ఐఆర్కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ శాస్త్రవేత్తలు.. కణంలోని సీఓపీ-1 ప్రొటీన్‌ను నిరోధించడం ద్వారా లివర్ ఫ్యాట్ పరిమాణం గణనీయంగా తగ్గుతోందని గుర్తించారు. అయితే ఈ పరిశోధన ఇంకా ప్రయోగదశలోనే ఉందని.. మరిన్ని ప్రయోగాలు జరగాల్సి ఉందని పరిశోధనకు నేతృత్వం వహించిన పార్థా చక్రవర్తి వెల్లడించారు. ఈ పరిశోధన ఫలితాలను అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్(ఏడీఏ) జర్నల్‌లో ప్రచురించినట్లు తెలిపారు. -
బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తప్పించే ఫ్యాటీ యాసిడ్లు
ఒమేగా -3 ఫాటీ యాసిడ్లు కలిగిన ఆహార పదార్థాలు తీసుకుంటే రొమ్ము క్యాన్సర్‌కు దూరం కావచ్చట. మహిళల్లో రుతుక్రమం ఆగిన దశలో వచ్చే రొమ్ము క్యాన్సర్ ప్రమాదం నుంచి.. ఒమేగా 3 రక్షిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అమెరికాలోని పెన్సల్వేనియా విశ్వవిద్యాలయ పరిశోధక బృందం చేపట్టిన తాజా పరిశోధనలు ఒమేగా-3 ప్రయోజనాలను వెల్లడించాయి. రక్తంలో ఒమేగా-3 స్థాయిని బట్టి రొమ్ము సాంద్రత ఆధారపడి ఉంటుందని పరిశోధనల ద్వారా తెలుసుకున్నారు. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించేందుకు ఒమేగా-3 కలిగిన ఆహారాన్ని తీసుకోవడం మంచి మార్గమని, దాంతో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. మహిళల్లో బాడీ మాస్ ఇండెక్స్ 29 దాటితే ఊబకాయం సమస్యలు ఎదురౌతున్నట్లు పరిశోధక బృదం కనుగొంది. సహజంగా కొవ్వు ఆమ్లాలు కలిగిన ట్యూనా చేపలు, సముద్ర జీవరాశులు, కొన్ని కాయ, గింజ ధాన్యాలు ఆహారంలో తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్‌ను నిరోధించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో కనిపించే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాన్ని ఒమేగా 3ఎస్ తగ్గించే అవకాశం ఉందని పరిశోధనల్లో తెలుసుకున్నారు. కొవ్వు ఆమ్లాలు కలిగిన ఒమేగా-3 నొప్పి, మంట, వాపు నిరోధకానికి ఉపయోగపడుతుందని, కాబట్టి ఊబకాయం కలిగిన మహిళల్లో ఇది సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నామని ఆమెరికా పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆండ్రియా మన్ని చెప్తున్నారు. రుతుక్రమం నిలిచిపోయిన మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్ కు ఊబకాయం ప్రధాన కారణంగా చెప్తున్నారు. రుతుక్రమం నిలిచిపోయిన మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ.. వారిలో చాలామంది మహిళల్లో రొమ్ము సాంద్రత అధికంగా ఉంటున్నట్లు తెలుస్తోందని క్యాన్సర్ ప్రివెన్షన్ రీసెర్చ్ ఆన్ లైన్ జర్నల్ లో పేర్కొన్నారు. లోవోజా.... కొవ్వు ఆమ్లాలను, డీహెచ్ ఏ, ఇకోసా పెంటాయనోయక్ యాసిడ్ల ను కలిగి ఉన్నప్పటికీ డీహెచ్ఏ రక్తస్థాయిలు మాత్రమే రొమ్ము సాంద్రతను తగ్గించేందుకు ఉపయోగపడతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.