ఒమేగా -3 ఫాటీ యాసిడ్లు కలిగిన ఆహార పదార్థాలు తీసుకుంటే రొమ్ము క్యాన్సర్‌కు దూరం కావచ్చట. మహిళల్లో రుతుక్రమం ఆగిన దశలో వచ్చే రొమ్ము క్యాన్సర్ ప్రమాదం నుంచి.. ఒమేగా 3 రక్షిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అమెరికాలోని పెన్సల్వేనియా విశ్వవిద్యాలయ పరిశోధక బృందం చేపట్టిన తాజా పరిశోధనలు ఒమేగా-3 ప్రయోజనాలను వెల్లడించాయి. రక్తంలో ఒమేగా-3 స్థాయిని బట్టి రొమ్ము సాంద్రత ఆధారపడి ఉంటుందని పరిశోధనల ద్వారా తెలుసుకున్నారు.
మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించేందుకు ఒమేగా-3 కలిగిన ఆహారాన్ని తీసుకోవడం మంచి మార్గమని, దాంతో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. మహిళల్లో బాడీ మాస్ ఇండెక్స్ 29 దాటితే ఊబకాయం సమస్యలు ఎదురౌతున్నట్లు పరిశోధక బృదం కనుగొంది. సహజంగా కొవ్వు ఆమ్లాలు కలిగిన ట్యూనా చేపలు, సముద్ర జీవరాశులు, కొన్ని కాయ, గింజ ధాన్యాలు ఆహారంలో తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్‌ను నిరోధించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో కనిపించే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాన్ని ఒమేగా 3ఎస్ తగ్గించే అవకాశం ఉందని పరిశోధనల్లో తెలుసుకున్నారు. కొవ్వు ఆమ్లాలు కలిగిన ఒమేగా-3 నొప్పి, మంట, వాపు నిరోధకానికి ఉపయోగపడుతుందని, కాబట్టి ఊబకాయం కలిగిన మహిళల్లో ఇది సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నామని ఆమెరికా పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆండ్రియా మన్ని చెప్తున్నారు.
రుతుక్రమం నిలిచిపోయిన మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్ కు ఊబకాయం ప్రధాన కారణంగా చెప్తున్నారు. రుతుక్రమం నిలిచిపోయిన మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ.. వారిలో చాలామంది మహిళల్లో రొమ్ము సాంద్రత అధికంగా ఉంటున్నట్లు తెలుస్తోందని క్యాన్సర్ ప్రివెన్షన్ రీసెర్చ్ ఆన్ లైన్ జర్నల్ లో పేర్కొన్నారు. లోవోజా.... కొవ్వు ఆమ్లాలను, డీహెచ్ ఏ, ఇకోసా పెంటాయనోయక్ యాసిడ్ల ను కలిగి ఉన్నప్పటికీ డీహెచ్ఏ రక్తస్థాయిలు మాత్రమే రొమ్ము సాంద్రతను తగ్గించేందుకు ఉపయోగపడతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తప్పించే ఫ్యాటీ యాసిడ్లు
Published Thu, Feb 25 2016 3:31 PM | Last Updated on Fri, Aug 17 2018 2:18 PM
Advertisement
Advertisement