omega
-
ఒమేగా సీకి ఎలక్ట్రిక్ ఆటో.. ఒక్క చార్జ్‌తో 80 కిలోమీటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉన్న ఒమేగా సీకి మొబిలిటీ తాజాగా ప్యాసింజర్ వెహికిల్స్ విభాగంలోకి ప్రవేశించింది. స్ట్రీమ్ సిటీ ఏటీఆర్ ధర ఎక్స్‌షోరూంలో రూ.1.85 లక్షలు. వాహనం నుంచి బ్యాటరీని విడదీయవచ్చు. ఒకసారి చార్జింగ్‌తో 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. స్ట్రీమ్ సిటీ 8.5 ధర రూ.3.01 లక్షలు. ఫిక్స్డ్ బ్యాటరీతో రూపొందింది. ఒకసారి చార్జింగ్‌తో 117 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. తయారీ సామర్థ్యాన్ని అయిదింతలు పెంచినట్టు కంపెనీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10,000 యూనిట్ల ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలను విక్రయించాలన్నది కంపెనీ లక్ష్యం. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఫోర్ వీలర్లను సైతం ఒమేగా సీకి మొబిలిటీ తయారు చేస్తోంది. దేశవ్యాప్తంగా సంస్థకు 175కుపైగా డీలర్షిప్ కేంద్రాలు ఉన్నాయి. -
పోర్టర్‌కు 5,000 ఈ–కార్గో వాహనాలు
ముంబై: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉన్న ఒమెగా సీకి మొబిలిటీ భారీ ఆర్డర్‌ను అందుకుంది. ఇందులో భాగంగా సరుకు రవాణా రంగంలో ఉన్న పోర్టర్‌కు 5,000 ఎలక్ట్రిక్ కార్గో త్రిచక్ర వాహనాలను సరఫరా చేయనుంది. వచ్చే ఏడాది చివరినాటికి ఈ వెహికిల్స్‌ను డెలివరీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పోర్టర్ వద్ద 1,000 ఎలక్ట్రిక్ త్రీవీలర్లు ఉన్నాయి. ఈ–కామర్స్ కంపెనీల నుంచే కాకుండా ఎఫ్ఎంసీజీ, డెయిరీ, నిర్మాణ, వాహన విడిభాగాల వంటి రంగాల నుండి కూడా డిమాండ్ రావడంతో ట్రక్కుల అవసరం పెరిగిందని ఒమెగా సీకి మొబిలిటీ ఫౌండర్, చైర్మన్ ఉదయ్ నారంగ్ తెలిపారు. ‘2023లో ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహన విభాగంలో 200 శాతం వృద్ధి ఆశిస్తున్నాం. పోర్టర్‌తో భాగస్వామ్యం గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. ఇటువంటి డీల్స్ మరిన్ని కుదుర్చుకోనున్నాం. వచ్చే 2–3 ఏళ్లలో డీల్స్‌లో భాగంగా భాగస్వామ్య కంపెనీలకు 50,000 వెహికిల్స్ సరఫరా చేసే అవకాశం ఉంది’ అని వివరించారు. ఈ–కామర్స్ కంపెనీలు పండగల నెలలో రూ.96,170 కోట్ల విలువైన వ్యాపారం నమోదు చేసే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. -
కర్ణాటకలో ఓఎస్ఎం మెగా ఫ్యాక్టరీ!
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఒమేగా సైకీ మొబిలిటీ (ఓఎస్ఎం) తాజాగా ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ త్రీవీలర్ ప్లాంటును కర్ణాటకలో ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం దాదాపు 250 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,900 కోట్లు) వెచ్చించనున్నట్లు సంస్థ తెలిపింది. 250 ఎకరాల స్థలంలో 10 లక్షల యూనిట్ల వార్షిక సామర్థ్యంతో ఈ ప్లాంటును మూడు దశల్లో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ఈ మెగా ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభం కాగలదని ఒమేగా సైకీ మొబిలిటీ వ్యవస్థాపక చైర్మన్ ఉదయ్ నారంగ్ తెలిపారు. రేజ్‌ప్లస్ ఫ్రాస్ట్, రేజ్‌ప్లస్ తదితర త్రీ వీలర్లను కొత్త ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. సంఘటిత ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల మార్కెట్ 2020–21తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో 200 శాతం వృద్ధి నమోదు చేసింది. దీంతో మొత్తం త్రిచక్ర వాహనాల అమ్మకాల్లో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల వాటా ఏకంగా 46 శాతం స్థాయికి చేరిందని నారంగ్ వివరించారు. ప్రస్తుతం తమకు 50,000 పైచిలుకు ఆర్డర్లు ఉన్నాయని చెప్పారు. ఆగ్నేయాసియా దేశాలు, ఆఫ్రికా, మధ్య ప్రాచ్య మార్కెట్ల కోసం వాహనాలను మెగా ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేయనున్నట్లు వివరించారు. -
మెదడు ఆరోగ్యానికి మేలుచేసే చేపలు! స్ట్రోక్ సమస్యకు కూడా..
Regularly Consuming Fish May Protect Brain Health: సెరెబ్రోవాస్కులర్ లేదా వాస్కులర్ బ్రెయిన్ డిసీజ్ గురించే ఇప్పుడు అంతటా చర్చజరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో సెరెబ్రోవాస్కులర్ రెండో స్థానంలో ఉంది. ప్రతి ఏట అమెరికాలోని ప్రతి లక్ష మందిలో 37.6 మరణాలు ఈ వ్యాధివల్లనే సంభవిస్తున్నాయి. మెదడులోని రక్త నాళాలు, రక్త ప్రసరణను ప్రభావితం చేసే స్ట్రోక్ వంటి సమస్యలకు ఈ వ్యాధి కారణమవుతుందట. ఏమిటీ సెరెబ్రోవాస్కులర్ డిసీజ్? సెరెబ్రోవాస్కులర్ అనేది రక్త ప్రవాహాన్ని, మెదడులోని రక్త నాళాలను ప్రభావితం చేసే ఓ వ్యాధి. ఈ వ్యాధి వల్ల రక్త నాళాలు కుంచించుకుపోవడం, గడ్డకట్టడం, రక్త నాళాల్లో అడ్డంకులు ఏర్పడటం.. వంటి సమస్యలు తలెత్తి ప్రాణాంతకంగా మారుతుంది. మెదడు సమస్యలతో ప్రారంభమై.. ప్రారంభ దశలో ఈ వ్యాధి తాలూకు ప్రాథమిక లక్షణాలు స్పష్టంగా బయటపడకముందే బ్రెయిన్ అబ్నార్మాలిటీస్ కనిపిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇవి ముదిరితే డిమెన్షియాకు దారితీస్తుంది. చదవండి: 88 యేళ్లనాటి కేకు.. ఇప్పటికీ తాజాగానే ఉంది!! చేపలకు - ఈ వ్యాధికి మధ్య సంబంధం ఏమిటి? జీవనశైలిలో కొద్దిపాటి మార్పులు, శారీరక వ్యాయామం, ఆరోగ్య ఆహారపు అలవాట్లు, ధూమపానానికి దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలతో సెరెబ్రోవాస్కులర్ వ్యాధి తాలూకు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా స్ట్రోక్ ప్రమాదానికి, అధికంగా చేపలను తినడానికి మధ్య సంబంధం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే! ఇది మెదడుకు, సెరెబ్రోవాస్కులర్ వ్యాధికి మధ్య వారధిగా పనిచేస్తుందట. ఏదిఏమైనప్పటికీ అధికంగా చేపలు తినడం వల్ల మెదడు దెబ్బతినడం తగ్గుముఖం పడుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అధ్యయన నివేదికల ఫలితాలు ఇలా.. క్రాస్ సెక్షనల్ అధ్యయనాల తాజా నివేదిక ప్రకారం ఆరోగ్యంగా ఉన్న వృద్ధులపై చేసిన పరిశోధనల్లో చేపల వినియోగం, మెదడు దెబ్బతినడం మధ్య సంబంధాన్ని పరిశోధించింది. వారానికి రెండు లేదా మూడు సార్లు చేపలు తినేవారిలో సెరెబ్రోవాస్కులర్ వ్యాధికి కారణమయ్యే మెదడు సంబంధిత సమస్యలు తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ఫ్రాన్స్‌లోని బోడో యూనివర్సిటీకి చెందిన సీనియర్ రీసెర్చర్ డా. సిసిలియా సమీరి ఏంచెబుతున్నారంటే.. ప్రతి వారం రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు చేపలు తినడం వల్ల మెదడు గాయాలు తగ్గుముఖం పట్టడం పరిశోధనల్లో కనుగొన్నాము. ఐతే 75 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్నవారిలో చేపలు తినడం వల్ల కలిగే ఈ రక్షణా ప్రభావం అంతగా కనిపంచలేదని పేర్కొన్నారు. అంటే చిన్నతనం నుంచే క్రమంతప్పకుండా చేపలు తినడం అలవాటు చేసుకోవాలి. చేపలు అధికంగా తినేవారితో పోల్చితే తక్కువగా తినేవారికి ఈ వ్యాధి ముప్పు అధికమని డా. సిసిలియా సమీరి సూచించారు. చదవండి: దుస్తులకు లింగ భేదం ఏంటీ..! స్కూల్‌కి స్కర్టులతోనే వస్తాం!! -
టైఫాయిడ్ టైంలో ఇవి తినడం చాలా ప్రమాదకరం.. మరేం తినాలి?!
పరిసరాల అపరిశుభ్రత కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్‌గున్యా, కలరా, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. వీటిల్లో టైఫాయిడ్ జ్వరం కొంత ప్రమాదకారనే చెప్పవచ్చు. సాధారణంగా టైఫాయిడ్ జ్వరం కలుషిత ఆహారం, నీళ్ల ద్వారా వ్యాపిస్తుంది. సాల్మొనెల్లా టైఫి అనే బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ సంక్రమిస్తుంది. అయితే నిపుణులు సూచించిన ఈ ఆహార అలవాట్లతో ఏవిధంగా టైఫాయిడ్ నుంచి ఉపశమనం పొందవచ్చో తెలుసుకుందాం.. టైఫాయిడ్ లక్షణాలు ఏ వ్యాధినైనా ఎంత త్వరగా గుర్తించగలిగితే అంత సులువుగా దానిని నయం చేయవచ్చు. టైఫాయిడ్‌ను కూడా తేలికగా గుర్తించవచ్చు. ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కడుపునొప్పి, నీరసం, వాంతులు, విరేచనాలు లేద మలబద్ధకం, అలసట..వంటి ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి. ఈ ఆహారం అస్సలు తీసుకోకూడదు.. టైఫాయిడ్ జ్వరం నుంచి త్వరగా తేరుకోవడానికి కొన్ని రకాల ఆహార అలవాట్లు తప్పక పాటించవల్సి ఉంటుంది. ముఖ్యంగా తొక్క తీయకుండా తినగలిగే పండ్లు, కూరగాయాలు, ఘాటుగా ఉండే ఆహారం, నెయ్యి లేదా నూనెతో వండిన పదార్ధాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి మీ కడుపులో మంట లేదా తాపాన్ని పుట్టించే అవకాశం ఉంది. ఇవి కూడా తినకూడదు కడుపులో గ్యాస్‌ను ఉత్పత్తి చేసే కొన్ని రకాల కూరగాయలు అంటే.. క్యాబేజీ, బ్రొకోలీ, క్యాలీఫ్లవర్ వంటి వాటిని కూడా తినకపోవడం మంచిది. అలాగే వ్యాధి నివారణకు ఆటంకాలుగా పరిణమించే ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి కూడా తినకూడదు. మరేం తినాలి? టైఫాయిడ్‌తో బాధపడే వారికి దివ్యౌషధం ఏంటంటే.. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే ఆహార పదార్ధాలు. అంటే.. సోయా బీన్స్, వివిధ రకాల గింజలు (నట్స్), భిన్న రకాలైన విత్తనాలు, గుడ్లు.. వంటివి తినాలి. ఆలుగడ్డ వేపుడు, ఉడికించిన అన్నం.. వంటి కార్బొహైడ్రేట్స్ పుష్కలంగా ఉండే ఆహారం కూడా తీసుకోవాలి. పాలు, పన్నీర్ వంటి పాల ఉత్పత్తులు కూడా తినొచ్చు. అలాగే టైఫాయిడ్ నుంచి కోలుకునే ప్రక్రియలో మరిన్ని నీళ్లు తాగడం మాత్రం మర్చిపోకూడదు. ఈ ఆహారపు అలవాట్లతో మీ ఆరోగ్యాన్ని మరింత పదిలంగా కాపాడుకోవచ్చనేది నిపుణుల మాట. చదవండి: Health Tips: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఇది తరచుగా తింటే సరి! -
హైదరాబాద్‌లోని పిల్లల్లో ఇవి తక్కువగా ఉన్నాయి..
సాక్షి, హైదరాబాద్: పిల్లల మేధోశక్తితో పాటు ఏకాగ్రత పెరగాలంటే ఎక్కువగా ఒమేగా–3 పాలీ అచ్‌శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఆహారంతో పాటు అందేలా చూడాలని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) శాస్త్రవేత్తలు సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పిల్లల్లో (7– 13 ఏళ్ల మధ్య వయస్కులు) ఈ రకమైన కొవ్వులు తక్కువగా ఉన్నాయని ఎన్ఐఎన్ అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. శరీర, జీవక్రియలు సక్రమంగా జరిగేందుకు కొవ్వులు లేదా ఫ్యాటీ ఆమ్లాలు చాలా అవసరం. ఆహారంలోని కొన్ని రసాయనాల ద్వారా శరీరం వీటిని తయారు చేసుకోగలదు. కానీ కొవ్వుల్లో కొన్నింటిని మాత్రం తయారుచేసుకోలేదు. ఆల్ఫా లినోలిక్ యాసిడ్ (ఏఎల్ఏ) లేదా ఒమేగా–3, లినోలిక్ యాసిడ్ (ఎల్ఏ) లేదా ఒమేగా–6 ఫ్యాటీ ఆమ్లాలను ఆహారం ద్వారా అందించాల్సి ఉంటుంది. అందుకే వీటిని ఆవశ్యక కొవ్వులుగా పిలుస్తారు. ఒమేగా–3 ఫ్యాటీ ఆమ్లాల్లో రెండు రకాలు ఉంటాయి. అవి డోకోసా హెక్జనోయిక్ యాసిడ్ (డీహెచ్ఏ), ఈకోసాపెంటనోయిక్ యాసిడ్ (ఈపీఏ). మెదడులో ఉండే పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాల్లో డీహెచ్ఏ అత్యధికం. గుండె, రోగ నిరోధక వ్యవస్థ, మేధోశక్తి పనితీరుపై ప్రభావం చూపుతుంటుంది. గర్భధారణ చివరి త్రైమాసికంలో పిండంలోని మెదడులోకి చేరే డీహెచ్ఏ.. పుట్టిన తర్వాత రెండేళ్లవరకు ఎక్కువఅవుతూ ఉంటుంది. తద్వారా మెదడు ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. శాఖాహారులకు అవిశగింజలు, చియాసీడ్స్.. హైదరాబాద్‌లోని 5 పాఠశాలల నుంచి 625 మంది విద్యార్థులను ఎంపిక చేసుకుని వారు ఒమేగా–3 ఫ్యాటీ ఆమ్లాలను ఎలా.. ఎంత మోతాదుల్లో అందుకుంటున్నారో పరిశీలించారు. చాలా మందిలో తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 80 శాతం మంది ఒమేగా–3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే చేపలను ఆహారంగా తీసుకుంటున్నారని, కానీ నెలకు 100 గ్రాములకు మించి తినకపోవడం, ఈపీఏ, డీహెచ్ఏలు అత్యధికంగా ఉండే సముద్ర చేపలను కాకుండా మంచినీటి చేపలను తినడం కారణంగా తగిన మోతాదులో శరీరానికి ఈ ఫ్యాటీ ఆమ్లాలు అందట్లేదని తెలిసింది. ఈపీఏ, డీహెచ్ఏ ప్రయోజనాలను గరిష్ట స్థాయిలో పొందేందుకు వారానికి వంద నుంచి 200 గ్రాముల వరకు చేపలు.. ముఖ్యంగా ఉప్పునీటి చేపలను తినడం అవసరమని ఎన్ఐఎన్ సూచించింది. మాంసం, పౌల్ట్రీ, గుడ్లలో ఈపీఏ, డీహెచ్ఏలు తక్కువ మోతాదులో ఉంటాయని, శాఖాహారంలో అసలు ఉండవని ఈ అధ్యయనం నిర్వహించిన శాస్త్రవేత్త పి.దేవరాజ్ తెలిపారు. అవిశగింజలు, చియాసీడ్స్, వాల్నట్స్ వంటి వాటిల్లో ఏఎల్ఏ పూర్వ రూపంలోని రసాయనాలు కొన్ని ఉంటాయని, శాఖాహారులు వీటిని తీసుకోవడం ద్వారా ఏఎల్ఏ లేమిని భర్తీ చేసుకోవచ్చని సూచించారు. ఆవనూనె, సోయా నూనెల్లోనూ ఈ కొవ్వులు ఉంటాయని తెలిపారు. ఒమేగా–3 ఫ్యాటీ ఆమ్లాలను ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ అధ్యయనం తెలుపుతోందని ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత వివరించారు. -
ఒమేగా– 3 కొవ్వులతో కేన్సర్‌కు చెక్!
ఆరోగ్యానికి పలు విధాలుగా మేలు చేస్తాయన్న నమ్మకమున్న ఒమేగా–3 ఫ్యాటీ ఆసిడ్లు పనిలో పనిగా కేన్సర్‌కూ చెక్ పెట్టగలవని అంటున్నారు ఇల్లినాయీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. ఎలుకలపై తాము జరిపిన పరిశోధనల్లో ఒమేగా –3 కొవ్వులు జీర్ణమయ్యే క్రమంలో ఎండోకానబినాయిడ్స్ అనే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయని గుర్తించినట్లు అదితిదాస్ అనే శాస్త్రవేత్త చెప్పారు. ఈ రసాయనం గంజాయిలో ఉండే కానబినాయిడ్స్ మాదిరిగానే ఉండే ఈ రసాయనం కేన్సర్ కణితి పెరుగుదలను అడ్డుకోవడంతోపాటు, ఇతర భాగాలకు వ్యాపించడాన్ని కూడా తగ్గిస్తుందని చెప్పారు. గంజాయి కేన్సర్ నిరోధకంగా పనిచేస్తుందని ఇప్పటికే కొన్ని పరిశోధనలు రుజువు చేసిన నేపథ్యంలో తాము ఎముకల కేన్సర్ ఉన్న ఎలుకలపై పరిశోధనలు చేశామని అన్నారు. జీర్ణమైన ఒమేగా –3 కొవ్వుల కారణంగా వచ్చే రసాయనాలు తగుమోతాదులో ఉంటే, కేన్సర్ కణాలు మరణిస్తున్నట్లు తాము గుర్తించామని చెప్పారు. అంతేకాకుండా ఈ పదార్థాలు కేన్సర్ కణితికి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు పెరగకుండా అడ్డుకున్నాయని అన్నారు. ఒమేగా–3 కొవ్వులు తరచూ తీసుకోవడం ద్వారా ఈ రసాయనాలు శరీరంలో ఉత్పత్తి అయ్యేలా చేసుకోవచ్చునని సూచించారు. ఎండోకానబినాయిడ్ రసాయనాలను కృత్రిమ పద్ధతిలో అందించడం ద్వారా కూడా కేన్సర్‌కు చెక్ పెట్టవచ్చునని వివరించారు. -
మరో ఇద్దరు విద్యార్థినుల అదృశ్యం
హైదరాబాద్ : ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల దన దాహానికి విద్యార్థులు ఉరికొయ్యలకు వేలాడుతున్నారు. గడిచిన రెండేండ్లలో నారాయణ, శ్రీచైతన్య కళాశాలల్లో నలభైమంది విద్యార్థుల ఆత్మహత్యలు మరువక ముందే మరో విద్యాసంస్థకు చెందిన విద్యార్థినుల పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. రాచకొండ పోలీస్ కమిషనేరట్ పరిధిలో కుషాయిగూడలోని ఒమేగా జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న జెశ్వాని, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సాయి ప్రజ్వల అనే విద్యార్థిని అదృశ్యం అయ్యారు. దీనితో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. తమ బిడ్డల ఆచూకీ తెలపాలంటూ పోలీసులను ఆశ్రయించారు. సాయి ప్రజ్వల అనే విద్యార్థిని కళాశాల యాజమాన్యం వేధిస్తుందని ఆవేదనను వ్యక్తపరిచింది. దీంతో విద్యార్థునుల అదృశ్యంపై సందిగ్దత నెలకొంది. -
ఒమెగా క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు నగరంలోని నందికొట్కూరు రోడ్డులో ఆదివారం ఒమెగా క్యాన్సర్ హాస్పిటల్‌ను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఆసుపత్రిలోని ఓటీ కాంప్లెక్స్, సర్జికల్ ఆంకాలజి బ్లాక్, ఎంఐసీయూ, డిజిటల్ మామోగ్రఫి, కన్సల్టేషన్ రూమ్స్, రేడియేషన్ ఆంకాలజి బ్లాక్, మెడికల్ ఆంకాలజి వార్డు, సిటీ స్కాన్, బ్రాచీథెరపీ, లైనియర్ యాక్సిలేటర్‌ను రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య ప్రారంభించారు. ప్రైవేటు ఆసుపత్రులతోనూ అభివృద్ధి ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తూనే మరోవైపు ప్రతి జిల్లా కేంద్రంలో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల ఏర్పాటుకు ప్రోత్సాహిస్తుందన్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోనూ త్వరలో రూ.120కోట్లతో క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ప్రారంభం కాబోతుందని చెప్పారు. మెరుగైన క్యాన్సర్ చికిత్స కోసం గతంలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ వెళ్లేవారని, ఇప్పుడు కర్నూలులోనే ఆ అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కర్నూలు నగరం మెడికల్ హబ్‌గా మారబోతుందన్నారు. ఒమెగా హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ మోహనవంశీ మాట్లాడుతూ రాయలసీమలో మొట్టమొదటిసారిగా అత్యున్నత శ్రేణి క్యాన్సర్ చికిత్సను తాము అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆసుపత్రి డైరెక్టర్లు డాక్టర్ వై. వెంకటరామిరెడ్డి, డాక్టర్ బి. రవీంద్రబాబు, డాక్టర్ ఉమామహేశ్వరరెడ్డి, డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఒమెగా క్లబ్ గెలుపు
క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నీ హైదరాబాద్: క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నీలో ఒమెగా బాస్కెట్‌బాల్ క్లబ్ 66-57తో కేవీబీఆర్ స్టేడియం క్లబ్‌పై విజయం సాధించింది. సికింద్రాబాద్ వైఎంసీఏ కోర్టులో బుధవారం జరిగిన ఈ లీగ్ పోరులో ఒమెగా జట్టులో సాయి (35) అదరగొట్టాడు. క్రమం తప్పకుండా పాయింట్లు చేయడంలో సఫలమయ్యాడు. మింటు 11 పాయింట్లు చేశాడు. కేవీబీఆర్ జట్టులో మిథిల్ 30, దినేశ్ 21 పాయింట్లు సాధించారు. మిగతా మ్యాచ్‌ల్లో ఎఫ్‌ఐబీఏ 54-34తో స్టూడెంట్స్ స్పోర్ట్స్ క్లబ్ ‘ఎ’ జట్టుపై గెలిచింది. ఎఫ్‌ఐబీఏ తరఫున రేవంత్ 17, శుభాంకర్ 8 పాయింట్లు చేశారు. స్టూడెంట్స్ జట్టులో సంజయ్ కుమార్ (18), ఆకాశ్ (6) రాణించారు. మూడో మ్యాచ్‌లో బీహెచ్ఈఎల్ ‘బి’ జట్టు 47-17తో రహీంపురా బాస్కెట్‌బాల్ క్లబ్‌పై నెగ్గింది. బీహెచ్ఈఎల్ జట్టులో ప్రణీత్ (15), హరీశ్ (9) ఆకట్టుకున్నారు. రహీంపురా తరఫున శ్రీనాథ్ 8, రవీందర్నాథ్ 6 పాయింట్లు చేశారు. చివరి మ్యాచ్‌లో కేపీహెచ్‌బీ 55-40తో హైదరాబాద్ లీడర్స్‌పై గెలుపొందింది. కేపీహెచ్‌బీ జట్టులో లెండిల్ 15, సాయి 13 పాయింట్లు చేశారు. లీడర్స్ తరఫున నగేశ్ (9), శివ (10) ఆకట్టుకున్నారు. 14, 15 తేదీల్లో ఇండిపెండెన్స్ టోర్నీ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వైఎంసీఏ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ నెల 14, 15 తేదీల్లో ఇండిపెండెన్స్ డే బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. మహిళలు, పురుషుల విభాగాల్లో రెండు రోజుల పాటు పోటీలు జరుగుతాయి. వివరాలకు రాజారెడ్డి(9666600091)ని సంప్రదించవచ్చు. -
మన వాళ్లు రూ.2 కోట్ల వాచీనీ కొనేస్తున్నారు..!
లగ్జరీ కార్లకు ఏమాత్రం తీసిపోకుండా ఇప్పుడు ఖరీదైన వాచీలూ భారత్‌లో దర్శనమిస్తున్నాయి. ఒమెగా, బుల్గారీ, పియాజెట్, బ్రుగీ, ఉర్విక్.. ఇలా కంపెనీ ఏదైతేనేం. లిమిటెడ్ ఎడిషన్ అయితే చాలు భారత్‌లో రూ.2 కోట్ల వరకూ వెచ్చించే సంపన్నులూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వజ్రాలు పొదిగిన, ప్లాటినం, బంగారంతో తయారైన ఈ ఖరీదైన వాచీలను ఇష్టపడని వారుండరు. అయితే వీటి అమ్మకాలే వాచీలో ముల్లుల్లాగా సెలైంట్‌గా జరుగుతున్నాయి. విక్రయించిన కంపెనీగానీ, కొనుక్కున్న కస్టమర్ గానీ ఈ విషయాన్ని వెల్లడించడానికి ఇష్టపడడం లేదు. రూ.10 లక్షలు, ఆపైన ఖరీదు చేసే ‘ప్రెస్టీజ్’ వాచీలు భారత్‌లో ఏటా 300లపెనే అమ్ముడు అవుతున్నాయంటే ఆశ్చర్యం వేయకమానదు. ఇదీ వాచీల విపణి.. దేశవ్యాప్తంగా వ్యవస్థీకత రంగంలో వాచీల విక్రయ పరిమాణం రూ.6,000 కోట్లుంది. అవ్యవస్థీకత రంగంలోనూ ఇదే స్థాయిలో వ్యాపారం జరుగుతోంది. అయితే, ప్రతి వంద మందిలో ముగ్గురికి మాత్రమే వాచీ ఉంటోంది. అదే ప్రపంచంలో ఇది 25 శాతం దాకా ఉంది. అంతస్తును ప్రదర్శించుకునేందుకు.. రూ.10 లక్షలు ఆపైన ధరలో ఉండే వాచీలను ప్రెస్టీజ్ విభాగం కింద పరిగణిస్తున్నారు. ఈ విభాగంలో ఏటా దేశంలో 300 వాచీలు అమ్ముడవుతున్నాయట. లిమిటెడ్ ఎడిషన్లలో చేతితో చేసిన ఒక్కో వాచీ తయారీకి ఆరు నెలల పైన సమయం పడుతోంది. మొత్తం వాచీల అమ్మకాల్లో టాప్-30 నగరాల వాటా 80 శాతముంది. కలర్‌ఫుల్ కాపర్.. రాగి (కాపర్) వర్ణంతో తయారైన వాచీలను ధరించేందుకు మహిళలు మక్కువ చూపుతున్నారు. ఆ తర్వాత వైన్ వర్ణం, తెలుపు రంగుల వాచీలకు గిరాకీ ఎక్కువ. మగ వారి విషయంలో స్టీలు, రోజ్ గోల్డ్ కలర్స్‌కు క్రేజ్ ఉంది. వ్యాపారులైతే చేతికి రోజ్ గోల్డ్ కలర్ వాచీ ఉండాల్సిందేనంటున్నారు. దక్షిణాదిన ఈ రంగు వాచీలకు మంచి ఆదరణ ఉంది. మూడేళ్ల క్రితం వరకు అమ్ముడైన వాచీల్లో పురుషులు ధరించేవి 90 శాతం, స్త్రీలవి 10 శాతం ఉండేవి. ఇప్పుడు స్త్రీల వాచీల వాటా 30 శాతానికి ఎగసింది. డిస్కౌంట్లు కోరరు.. వాచీల విషయంలో హైదరాబాద్ కస్టమర్లు హుందాగా వ్యవహరిస్తారట. బ్రాండ్, విలువకే తొలి ప్రాధాన్యమిస్తారని జస్ట్ లైఫ్‌సై ్టల్ బ్రాండ్ మేనేజర్ మనోజ్ సుబ్రమణియన్ అంటున్నారు. -
బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తప్పించే ఫ్యాటీ యాసిడ్లు
ఒమేగా -3 ఫాటీ యాసిడ్లు కలిగిన ఆహార పదార్థాలు తీసుకుంటే రొమ్ము క్యాన్సర్‌కు దూరం కావచ్చట. మహిళల్లో రుతుక్రమం ఆగిన దశలో వచ్చే రొమ్ము క్యాన్సర్ ప్రమాదం నుంచి.. ఒమేగా 3 రక్షిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అమెరికాలోని పెన్సల్వేనియా విశ్వవిద్యాలయ పరిశోధక బృందం చేపట్టిన తాజా పరిశోధనలు ఒమేగా-3 ప్రయోజనాలను వెల్లడించాయి. రక్తంలో ఒమేగా-3 స్థాయిని బట్టి రొమ్ము సాంద్రత ఆధారపడి ఉంటుందని పరిశోధనల ద్వారా తెలుసుకున్నారు. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించేందుకు ఒమేగా-3 కలిగిన ఆహారాన్ని తీసుకోవడం మంచి మార్గమని, దాంతో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. మహిళల్లో బాడీ మాస్ ఇండెక్స్ 29 దాటితే ఊబకాయం సమస్యలు ఎదురౌతున్నట్లు పరిశోధక బృదం కనుగొంది. సహజంగా కొవ్వు ఆమ్లాలు కలిగిన ట్యూనా చేపలు, సముద్ర జీవరాశులు, కొన్ని కాయ, గింజ ధాన్యాలు ఆహారంలో తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్‌ను నిరోధించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో కనిపించే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాన్ని ఒమేగా 3ఎస్ తగ్గించే అవకాశం ఉందని పరిశోధనల్లో తెలుసుకున్నారు. కొవ్వు ఆమ్లాలు కలిగిన ఒమేగా-3 నొప్పి, మంట, వాపు నిరోధకానికి ఉపయోగపడుతుందని, కాబట్టి ఊబకాయం కలిగిన మహిళల్లో ఇది సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నామని ఆమెరికా పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆండ్రియా మన్ని చెప్తున్నారు. రుతుక్రమం నిలిచిపోయిన మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్ కు ఊబకాయం ప్రధాన కారణంగా చెప్తున్నారు. రుతుక్రమం నిలిచిపోయిన మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ.. వారిలో చాలామంది మహిళల్లో రొమ్ము సాంద్రత అధికంగా ఉంటున్నట్లు తెలుస్తోందని క్యాన్సర్ ప్రివెన్షన్ రీసెర్చ్ ఆన్ లైన్ జర్నల్ లో పేర్కొన్నారు. లోవోజా.... కొవ్వు ఆమ్లాలను, డీహెచ్ ఏ, ఇకోసా పెంటాయనోయక్ యాసిడ్ల ను కలిగి ఉన్నప్పటికీ డీహెచ్ఏ రక్తస్థాయిలు మాత్రమే రొమ్ము సాంద్రతను తగ్గించేందుకు ఉపయోగపడతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.