ఒమెగా క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభం
ఒమెగా క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభం
Published Sun, Feb 12 2017 10:12 PM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు నగరంలోని నందికొట్కూరు రోడ్డులో ఆదివారం ఒమెగా క్యాన్సర్ హాస్పిటల్‌ను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఆసుపత్రిలోని ఓటీ కాంప్లెక్స్, సర్జికల్ ఆంకాలజి బ్లాక్, ఎంఐసీయూ, డిజిటల్ మామోగ్రఫి, కన్సల్టేషన్ రూమ్స్, రేడియేషన్ ఆంకాలజి బ్లాక్, మెడికల్ ఆంకాలజి వార్డు, సిటీ స్కాన్, బ్రాచీథెరపీ, లైనియర్ యాక్సిలేటర్‌ను రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య ప్రారంభించారు.
ప్రైవేటు ఆసుపత్రులతోనూ అభివృద్ధి
ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తూనే మరోవైపు ప్రతి జిల్లా కేంద్రంలో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల ఏర్పాటుకు ప్రోత్సాహిస్తుందన్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోనూ త్వరలో రూ.120కోట్లతో క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ప్రారంభం కాబోతుందని చెప్పారు. మెరుగైన క్యాన్సర్ చికిత్స కోసం గతంలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ వెళ్లేవారని, ఇప్పుడు కర్నూలులోనే ఆ అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కర్నూలు నగరం మెడికల్ హబ్‌గా మారబోతుందన్నారు.
ఒమెగా హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ మోహనవంశీ మాట్లాడుతూ రాయలసీమలో మొట్టమొదటిసారిగా అత్యున్నత శ్రేణి క్యాన్సర్ చికిత్సను తాము అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆసుపత్రి డైరెక్టర్లు డాక్టర్ వై. వెంకటరామిరెడ్డి, డాక్టర్ బి. రవీంద్రబాబు, డాక్టర్ ఉమామహేశ్వరరెడ్డి, డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement