
హైదరాబాద్ : ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల దన దాహానికి విద్యార్థులు ఉరికొయ్యలకు వేలాడుతున్నారు. గడిచిన రెండేండ్లలో నారాయణ, శ్రీచైతన్య కళాశాలల్లో నలభైమంది విద్యార్థుల ఆత్మహత్యలు మరువక ముందే మరో విద్యాసంస్థకు చెందిన విద్యార్థినుల పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది.
రాచకొండ పోలీస్ కమిషనేరట్ పరిధిలో కుషాయిగూడలోని ఒమేగా జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న జెశ్వాని, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సాయి ప్రజ్వల అనే విద్యార్థిని అదృశ్యం అయ్యారు. దీనితో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. తమ బిడ్డల ఆచూకీ తెలపాలంటూ పోలీసులను ఆశ్రయించారు. సాయి ప్రజ్వల అనే విద్యార్థిని కళాశాల యాజమాన్యం వేధిస్తుందని ఆవేదనను వ్యక్తపరిచింది. దీంతో విద్యార్థునుల అదృశ్యంపై సందిగ్దత నెలకొంది.