![Huge Drugs Seized At rachakonda {Police Commissionerate 7 arrest - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/11/Huge-Drugs.jpg.webp?itok=Yi49xcL2)
( ఫైల్ ఫోటో )
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్, గంజాయి వాడకాన్ని నిర్మూలించేందుకు పోలీసు శాఖ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ప్రధాన కూడళ్లు, చెక్‌పోస్టులు, పబ్బులు, క్లబ్బుల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. నిత్యం ఏదో ఒక చోట డ్రగ్స్, గంజాయి పట్టుబడుతూనే ఉన్నాయి తాజాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో గురువారం భారీగా డ్రగ్స్ పట్టుబడింది. డ్రగ్స్ తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్‌బీ నగర్ ఎస్‌వోటీ, లా అండ్ ఆర్డర్ పోలీసులు చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టైంది. బాలాపూర్‌లో 24 గ్రాముల హెరాయిన్, మీర్‌పేట్‌లో 1.5 కేజీల ఓపీఎం, 5 కేజీల మేర పోపీస్ట్రా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరికొందరు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి ఒక కంటైనర్, 8 బైక్స్, మొబైల్స్ సీజ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని రాచకొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment