inter students missing
-
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి మిస్సింగ్ కలకలం.. బన్నీకి ఏమైంది?
సాక్షి, బాసర: నిజామాబాద్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో మరో కలకలం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. సదరు విద్యార్థి మూడు రోజులుగా కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో విద్యార్థి పేరెంట్స్ ఆందోళనకు గురవుతున్నారు. దీంతో, తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. వివరాల ప్రకారం.. బాసర ట్రిపుల్ ఐటీలో రెండో సంవత్సరం చదువుతున్న బన్నీ(18) ఏళ్ల విద్యార్థి అదృశ్యమయ్యాడు. అతడి స్వస్థలం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నర్సంపల్లి. ఈ నెల 6న తాను ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి ఔట్‌పాస్ తీసుకున్నాడు. వర్సిటీ నిబంధనల మేరకు సిబ్బంది అతడికి ఔట్‌పాస్ జారీ చేశారు. అయితే, బన్నీ మాత్రం ఇంటికి వెళ్లలేదు. ఈ క్రమంలో మూడు రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. విషయం తెలిసిన తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. మూడు రోజులుగా బన్నీ ఫోన్ చేయకపోవడం.. తాము ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుండడంతో కంగారు పడిన తల్లిదండ్రులు ఆదివారం హాస్టల్‌కు వచ్చి ఆరాతీశారు. కాగా, బన్నీ ఇంటికి వెళ్తుతున్నానని చెప్పి హాస్టల్ నుంచి వెళ్లినట్టుగా యాజమాన్యం తెలిపింది. దీంతో షాక్ అయిన తల్లిదండ్రులు.. తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా పంపుతారని యాజమాన్యాన్ని నిలదీశారు. బన్నీ ఎక్కడికి వెళ్లాడో తెలియకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ రావడం, ఇంటికి వెళ్లకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: ఈటల, అర్వింద్‌కు భద్రత పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం -
ముగ్గురు అమ్మాయిల అదృశ్యం
పటాన్చెరు టౌన్: వేర్వేరు ఘటనల్లో బుధవారం ముగ్గురు అమ్మాయిలు అదృశ్యమయ్యారు. వారిలో ఇద్దరు ఇంటర్ విద్యార్థినులు, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఉన్నారు. కళాశాలకు వెళుతున్నామని చెప్పి వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు, ఇంట ర్వూ్యకని చెప్పిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని కనిపించకుండా పోయారు. ఈ ఘటనలు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నాయి. ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి కథనం ప్రకారం..పటాన్చెరు కృషి డిఫెన్స్ కాలనీకి చెందిన రాంరెడ్డి కూతురు శివాని గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. మంగళవారం ఉదయం 10 గంటలకు మరో ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వూ్య ఉందని ఇంట్లో చెప్పి వెళ్లింది. రాత్రి 8:45 గంటలకు తన స్నేహితుడు సాయికిరణ్ రెడ్డికి ఫోన్ చేసి తాను లింగంపల్లి వద్ద ఉన్నానని తన ఇంటి వద్ద దించాల్సిందని అడిగింది. దీంతో శివానిని లింగంపల్లి నుంచి తీసుకొచ్చి కృషి డిఫెన్స్ కాలనీ వద్ద దించినట్లు సాయి కిరణ్‌రెడ్డి తెలిపాడు. ఇంట ర్వూ్యకని చెప్పి వెళ్లిన తన కూతురు ఇంటికి రాలేదని తండ్రి రాంరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కళాశాలకని చెప్పి వెళ్లిన విద్యార్థినులు మరో ఘటనలో పటాన్చెరు పట్టణంలోని ఎంజీ రోడ్డు లో ఉంటున్న ఆకుల వసంత, యాదగిరిల కూతురు ఆకుల ప్రశాంతి, ఆల్విన్ కాలనీకి చెందిన కృష్ణమూర్తి కూతురు చాకలి గాయత్రి ఇద్దరు కలసి మంగళవారం ఉదయం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్తున్నామని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి వెళ్లారు. రాత్రి ఎంత సేపటి కి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆకుల ప్రశాంతి, గాయత్రి ల తల్లిదండ్రులు తెలిసిన వారి ఇంటి వద్ద, బంధువుల ఇంటి వద్ద వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. పోలీసు లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మరో ఇద్దరు విద్యార్థినుల అదృశ్యం
హైదరాబాద్ : ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల దన దాహానికి విద్యార్థులు ఉరికొయ్యలకు వేలాడుతున్నారు. గడిచిన రెండేండ్లలో నారాయణ, శ్రీచైతన్య కళాశాలల్లో నలభైమంది విద్యార్థుల ఆత్మహత్యలు మరువక ముందే మరో విద్యాసంస్థకు చెందిన విద్యార్థినుల పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. రాచకొండ పోలీస్ కమిషనేరట్ పరిధిలో కుషాయిగూడలోని ఒమేగా జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న జెశ్వాని, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సాయి ప్రజ్వల అనే విద్యార్థిని అదృశ్యం అయ్యారు. దీనితో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. తమ బిడ్డల ఆచూకీ తెలపాలంటూ పోలీసులను ఆశ్రయించారు. సాయి ప్రజ్వల అనే విద్యార్థిని కళాశాల యాజమాన్యం వేధిస్తుందని ఆవేదనను వ్యక్తపరిచింది. దీంతో విద్యార్థునుల అదృశ్యంపై సందిగ్దత నెలకొంది. -
విజయవాడలో అదృశ్యమై.. విశాఖలో తేలారు!
విజయవాడ: నగరంలో అదృశ్యమైన నలుగురు ఇంటర్ విద్యార్ధినులు విశాఖపట్నంలో ప్రత్యక్షమయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. విజయవాడ సూర్యారావుపేటలోని బిషప్ అజరయ్య హాస్టల్ కు చెందిన నలుగురు ఇంటర్ విద్యార్థులు శనివారం కాలేజీకి వెళ్లి తిరిగి రాలేదు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న కీర్తి, దీప్తీ, మౌనిక, మాధవి శనివారం నుంచి కనిపించకుండాపోయారు. వారు తిరిగి రాకపోవడంతో హాస్టల్ నిర్వాహకులు సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆరాతీయగా వారు విశాఖపట్నంలో ఉన్నట్టు తేలింది. సెల్‌ఫోన్ వాడొద్దంటూ లెక్చరర్లు మందలించడంతోనే విద్యార్థినులు హాస్టల్ నుంచి పారిపోయినట్టు తెలుస్తోంది.