విజయవాడలో అదృశ్యమై.. విశాఖలో తేలారు! | inter students missing in vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడలో అదృశ్యమై.. విశాఖలో తేలారు!

Published Sun, Jul 2 2017 11:29 AM | Last Updated on Thu, May 3 2018 3:20 PM

విజయవాడలో అదృశ్యమై.. విశాఖలో తేలారు! - Sakshi

విజయవాడలో అదృశ్యమై.. విశాఖలో తేలారు!

విజయవాడ: నగరంలో అదృశ్యమైన నలుగురు ఇంటర్‌ విద్యార్ధినులు విశాఖపట్నంలో ప్రత్యక్షమయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. విజయవాడ సూర్యారావుపేటలోని బిషప్ అజరయ్య హాస్టల్ కు చెందిన నలుగురు ఇంటర్ విద్యార్థులు శనివారం కాలేజీకి వెళ్లి తిరిగి రాలేదు.

ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న కీర్తి,  దీప్తీ, మౌనిక, మాధవి శనివారం నుంచి కనిపించకుండాపోయారు. వారు తిరిగి రాకపోవడంతో హాస్టల్ నిర్వాహకులు సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆరాతీయగా వారు విశాఖపట్నంలో ఉన్నట్టు తేలింది. సెల్‌ఫోన్‌ వాడొద్దంటూ లెక్చరర్లు మందలించడంతోనే విద్యార్థినులు హాస్టల్‌ నుంచి పారిపోయినట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement