టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మంచు ఫ్యామిలీలో కొద్దిరోజులుగా గొడవలు, కేసులు వంటి ఘటనలు జరుగుతున్నాయి. జల్‌పల్లిలో తన నివాసం వద్ద మీడియా ప్రతినిధిని మోహన్‌బాబు కొట్టడంతో ఆయనపై కేసు నమోదు అయింది. ఇప్పటికే ఆయన మీద మనోజ్ కూడా ఒక కేసు పెట్టడం జరిగింది. ఆపై మనోజ్‌పై కూడా ఒక కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే, మోహన్ బాబు ఫ్యామిలీపై రాచకొండ సీపీ తాజాగా మీడియాతో మాట్లాడారు.
'ఇప్పటికీ మంచు కుటుంబంపై 3 FIRలు నమోదు అయ్యాయి. వాటిపై మేము విచారణ ప్రారంభించాము. చట్టప్రకారంగా మాత్రమే మేము చర్యలు తీసుకుంటాం. మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదు. ఆయనకు ఇప్పటికే నోటీసు ఇచ్చాము. కానీ, డిసెంబర్ 24 వరకు టైమ్ అడిగారు. కోర్టు సమయం ఇచ్చింది కాబట్టి మేము అరెస్ట్ చేయలేదు.మోహన్ బాబు విచారణపై మేము కూడా కోర్టును ఆశ్రయిస్తాము. ఆయన వద్ద రెండు గన్స్ ఉన్నాయి. కానీ, రాచకొండ స్టేషన్ నుంచి ఆయన ఎలాంటి పర్మిషన్ గన్స్ ఇవ్వలేదు. మరోకసారి మోహన్‌బాబుకు నోటీసు ఇస్తాం. అప్పుడు ఆయన తప్పకుండా విచారణకు రావాలి. లేదంటే వారంటీ ఇష్యు చేస్తాము. ఒకవేళ మళ్లీ విచారణకు ఆయన రాకపోతే కోర్టు అనుమతి తీసుకోవాలి. లేదంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.' అని సీపీ అన్నారు.
లైసెన్స్‌డ్ గన్స్ సరెండర్ చేసిన మోహన్ బాబు
మోహన్‌బాబు తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ గన్‌ను సరెండర్ చేశారు. ఆయన ఇంట్లో వివాదాలు రావడంతో తుపాకుల్ని సరెండర్ చేయాలని పోలీసులు కోరారు. దీంతో తన పీఆర్వో ద్వారా డబుల్ బ్యారెల్ గన్‌ను చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. ఆయన వద్ద రెండు గన్స్ ఉన్నాయి. డబుల్ బ్యారెల్ గన్‌తో పాటు స్పానిష్ మెడ్ గన్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment