![Omega - 3 toothache for cancer! - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/18/Omega-3.jpg.webp?itok=n85iW6sy)
ఆరోగ్యానికి పలు విధాలుగా మేలు చేస్తాయన్న నమ్మకమున్న ఒమేగా–3 ఫ్యాటీ ఆసిడ్లు పనిలో పనిగా కేన్సర్‌కూ చెక్ పెట్టగలవని అంటున్నారు ఇల్లినాయీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. ఎలుకలపై తాము జరిపిన పరిశోధనల్లో ఒమేగా –3 కొవ్వులు జీర్ణమయ్యే క్రమంలో ఎండోకానబినాయిడ్స్ అనే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయని గుర్తించినట్లు అదితిదాస్ అనే శాస్త్రవేత్త చెప్పారు. ఈ రసాయనం గంజాయిలో ఉండే కానబినాయిడ్స్ మాదిరిగానే ఉండే ఈ రసాయనం కేన్సర్ కణితి పెరుగుదలను అడ్డుకోవడంతోపాటు, ఇతర భాగాలకు వ్యాపించడాన్ని కూడా తగ్గిస్తుందని చెప్పారు.
గంజాయి కేన్సర్ నిరోధకంగా పనిచేస్తుందని ఇప్పటికే కొన్ని పరిశోధనలు రుజువు చేసిన నేపథ్యంలో తాము ఎముకల కేన్సర్ ఉన్న ఎలుకలపై పరిశోధనలు చేశామని అన్నారు. జీర్ణమైన ఒమేగా –3 కొవ్వుల కారణంగా వచ్చే రసాయనాలు తగుమోతాదులో ఉంటే, కేన్సర్ కణాలు మరణిస్తున్నట్లు తాము గుర్తించామని చెప్పారు. అంతేకాకుండా ఈ పదార్థాలు కేన్సర్ కణితికి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు పెరగకుండా అడ్డుకున్నాయని అన్నారు. ఒమేగా–3 కొవ్వులు తరచూ తీసుకోవడం ద్వారా ఈ రసాయనాలు శరీరంలో ఉత్పత్తి అయ్యేలా చేసుకోవచ్చునని సూచించారు. ఎండోకానబినాయిడ్ రసాయనాలను కృత్రిమ పద్ధతిలో అందించడం ద్వారా కూడా కేన్సర్‌కు చెక్ పెట్టవచ్చునని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment