ఒమెగా క్లబ్ గెలుపు | omega, club win basket ball league | Sakshi
Sakshi News home page

ఒమెగా క్లబ్ గెలుపు

Published Thu, Aug 4 2016 9:36 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

omega, club win basket ball league

క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నీ
హైదరాబాద్: క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నీలో ఒమెగా బాస్కెట్‌బాల్ క్లబ్ 66-57తో కేవీబీఆర్ స్టేడియం క్లబ్‌పై విజయం సాధించింది. సికింద్రాబాద్ వైఎంసీఏ కోర్టులో బుధవారం జరిగిన ఈ లీగ్ పోరులో ఒమెగా జట్టులో సాయి (35) అదరగొట్టాడు. క్రమం తప్పకుండా పాయింట్లు చేయడంలో సఫలమయ్యాడు. మింటు 11 పాయింట్లు చేశాడు. కేవీబీఆర్ జట్టులో మిథిల్ 30, దినేశ్ 21 పాయింట్లు సాధించారు. మిగతా మ్యాచ్‌ల్లో ఎఫ్‌ఐబీఏ 54-34తో స్టూడెంట్స్ స్పోర్ట్స్ క్లబ్ ‘ఎ’ జట్టుపై గెలిచింది. ఎఫ్‌ఐబీఏ తరఫున రేవంత్ 17, శుభాంకర్ 8 పాయింట్లు చేశారు.


స్టూడెంట్స్ జట్టులో సంజయ్ కుమార్ (18), ఆకాశ్ (6) రాణించారు. మూడో మ్యాచ్‌లో బీహెచ్‌ఈఎల్ ‘బి’ జట్టు 47-17తో రహీంపురా బాస్కెట్‌బాల్ క్లబ్‌పై నెగ్గింది. బీహెచ్‌ఈఎల్ జట్టులో ప్రణీత్ (15), హరీశ్ (9) ఆకట్టుకున్నారు. రహీంపురా తరఫున శ్రీనాథ్ 8, రవీందర్‌నాథ్ 6 పాయింట్లు చేశారు. చివరి మ్యాచ్‌లో కేపీహెచ్‌బీ 55-40తో హైదరాబాద్ లీడర్స్‌పై గెలుపొందింది. కేపీహెచ్‌బీ జట్టులో లెండిల్ 15, సాయి 13 పాయింట్లు చేశారు. లీడర్స్ తరఫున నగేశ్ (9), శివ (10) ఆకట్టుకున్నారు.
 
14, 15 తేదీల్లో ఇండిపెండెన్స్ టోర్నీ
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వైఎంసీఏ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ నెల 14, 15 తేదీల్లో ఇండిపెండెన్స్ డే బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. మహిళలు, పురుషుల విభాగాల్లో రెండు రోజుల పాటు పోటీలు జరుగుతాయి. వివరాలకు రాజారెడ్డి(9666600091)ని సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement