వైఎంసీఏకు రెండో విజయం | YMCA secon win at club league basket ball | Sakshi
Sakshi News home page

వైఎంసీఏకు రెండో విజయం

Published Sat, Jul 30 2016 11:48 AM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

YMCA secon win at club league basket ball

క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్
సాక్షి, హైదరాబాద్: క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో వైఎంసీఏ సికింద్రాబాద్, హూప్‌స్టర్స్ క్లబ్ జట్లు రెండో విజయాన్ని సాధించాయి. శుక్రవారం జరిగిన మ్యాచ్‌ల్లో వైఎంసీఏ జట్టు 32-14 స్కోరుతో గావిన్స్ బాస్కెట్‌బాల్ అకాడమీపై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో వినోద్ కుమార్ (12 పాయింట్లు) , శరవణకుమార్(8) రాణించారు. మరో మ్యాచ్ లో హూప్‌స్టర్స్ క్లబ్ జట్టు 53-37తో వీజేఐటీ జట్టును ఓడించింది.

హూప్‌స్టర్స్ తరఫునవెంకటేశ్ 20 పాయింట్లు, వెంకటేశ్వర్‌రావు 10 పా యింట్లు సాధించారు. మూడో మ్యాచ్‌లో సైనిక్‌పురి బాస్కెట్ బాల్ అకాడమీ 32-18తో స్టూ డెంట్స్ స్పోర్ట్స్ క్లబ్‌పై విజయం సాధించింది. సైనిక్‌పురి ఆటగాళ్లు దీపక్ (12), అరుణ్ (10) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement