club league
-
57 సిక్సర్లు.. 27 ఫోర్లు.. 490 !
విట్రాండ్ ఓవల్: దక్షిణాఫ్రికా టీనేజ్ క్రికెటర్ డాడ్స్ వెల్ సంచలన ఇన్నింగ్స్ తో చెలరేగిపోయాడు. సెంచరీ, డబుల్, ట్రిపుల్ సెంచరీలను సునాయాసంగా అధిగమించిన డాడ్స్ వెల్.. క్వాడ్రాపుల్ సెంచరీ నమోదు చేసి ఔరా అనిపించాడు. పాచ్ డార్ప్ అనే క్లబ్బుతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఎన్‌డబ్ల్యూయూ జట్టుకు ఆడిన అతను విశ్వరూపం చూపించాడు. 150 బంతుల్లో 57 సిక్సర్లు, 27 ఫోర్లతో 490 పరుగులు నమోదు చేశాడు. బౌండరీలే లక్ష్యంగా చెలరేగిపోయిన డాడ్స్ వెల్ దాటికి పాచ్ డార్ప్ బౌలర్లు చూస్తూ ఉండిపోవడం మినహా చేసేది ఏమీ లేకపోయింది. అతనికి సహచర ఆటగాడు హాస్ బ్రక్ నుంచి చక్కటి సహకారం లభించింది. హాస్ బ్రక్ 54 బంతుల్లో 104 పరుగులు చేశాడు. దాంతో ఎన్‌డబ్ల్యూయూ జట్టు 50 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఏకంగా 677 పరుగులు చేసింది. ఈ సంచలన ఇన్నింగ్స్ ఆడిన డాడ్స్వెల్ పుట్టిన రోజు శనివారం కావడం మరో విశేషం. ఇన్నింగ్స్ మొత్తంలో 63 సిక్సర్లు, 48 ఫోర్లు నమోదయ్యాయి. బౌండరీల ద్వారా మాత్రమే 570 పరుగులు రావడం విశేషం. మూడు వికెట్లకు వరుసగా 194, 204, 220 భాగస్వామ్యాలు నమోదవడం గమనార్హం. ప్రత్యర్థి బౌలర్లలో నలుగురు 100కు పైగా, ఇద్దరు 90కి పైగా పరుగులిచ్చుకున్నారు. అనంతరం పాచ్ డార్ప్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 290 పరుగులే చేయడంతో ఎన్‌డబ్ల్యూయూ జట్టు ఏకంగా 387 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. -
44 ఫోర్లు.. 23 సిక్సర్లు..413!
కోల్ కతా: క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ఫస్ట్ డివిజన్ టోర్నమెంట్లో బారిషా క్లబ్ ఆటగాడు పంకజ్ షా విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. దక్షిణ్ కాలికటా సంసాద్ తో జరిగిన మ్యాచ్ లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించిన పంకజ్ క్వాడ్రాపుల్ సెంచరీతో సత్తా చాటాడు. ఆదివారం 44 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన 28 ఏళ్ల పంకజ్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. 44 ఫోర్లు, 23 సిక్సర్లతో 413 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ నాలుగు వందలకు పైగా వ్యక్తిగత పరుగులను సాధించాడు. ఈ క్రమంలోనే ఆరో వికెట్ కు 203 పరుగుల భాగస్వామ్యాన్ని, ఎనిమిదో వికెట్ కు 191 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించాడు. దాంతో 192/2 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ఆరంభించిన బారిషా క్లబ్ జట్టు 708/8 వద్ద డిక్లేర్ చేసింది. గత సీజన్లో రాజస్తాన్ తో మ్యాచ్ సందర్బంగా రంజీల్లో అరంగేట్రం చేసిన షా.. బెంగాల్ తరపున ఇప్పటివరకూ 12 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడగా, నాలుగు లిస్ట్-ఎ మ్యాచ్‌లను, 12 ట్వంటీ 20 మ్యాచ్‌లను ఆడాడు. -
ఒమెగా క్లబ్ గెలుపు
క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నీ హైదరాబాద్: క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నీలో ఒమెగా బాస్కెట్‌బాల్ క్లబ్ 66-57తో కేవీబీఆర్ స్టేడియం క్లబ్‌పై విజయం సాధించింది. సికింద్రాబాద్ వైఎంసీఏ కోర్టులో బుధవారం జరిగిన ఈ లీగ్ పోరులో ఒమెగా జట్టులో సాయి (35) అదరగొట్టాడు. క్రమం తప్పకుండా పాయింట్లు చేయడంలో సఫలమయ్యాడు. మింటు 11 పాయింట్లు చేశాడు. కేవీబీఆర్ జట్టులో మిథిల్ 30, దినేశ్ 21 పాయింట్లు సాధించారు. మిగతా మ్యాచ్‌ల్లో ఎఫ్‌ఐబీఏ 54-34తో స్టూడెంట్స్ స్పోర్ట్స్ క్లబ్ ‘ఎ’ జట్టుపై గెలిచింది. ఎఫ్‌ఐబీఏ తరఫున రేవంత్ 17, శుభాంకర్ 8 పాయింట్లు చేశారు. స్టూడెంట్స్ జట్టులో సంజయ్ కుమార్ (18), ఆకాశ్ (6) రాణించారు. మూడో మ్యాచ్‌లో బీహెచ్ఈఎల్ ‘బి’ జట్టు 47-17తో రహీంపురా బాస్కెట్‌బాల్ క్లబ్‌పై నెగ్గింది. బీహెచ్ఈఎల్ జట్టులో ప్రణీత్ (15), హరీశ్ (9) ఆకట్టుకున్నారు. రహీంపురా తరఫున శ్రీనాథ్ 8, రవీందర్నాథ్ 6 పాయింట్లు చేశారు. చివరి మ్యాచ్‌లో కేపీహెచ్‌బీ 55-40తో హైదరాబాద్ లీడర్స్‌పై గెలుపొందింది. కేపీహెచ్‌బీ జట్టులో లెండిల్ 15, సాయి 13 పాయింట్లు చేశారు. లీడర్స్ తరఫున నగేశ్ (9), శివ (10) ఆకట్టుకున్నారు. 14, 15 తేదీల్లో ఇండిపెండెన్స్ టోర్నీ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వైఎంసీఏ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ నెల 14, 15 తేదీల్లో ఇండిపెండెన్స్ డే బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. మహిళలు, పురుషుల విభాగాల్లో రెండు రోజుల పాటు పోటీలు జరుగుతాయి. వివరాలకు రాజారెడ్డి(9666600091)ని సంప్రదించవచ్చు. -
వైఎంసీఏకు రెండో విజయం
► క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ సాక్షి, హైదరాబాద్: క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో వైఎంసీఏ సికింద్రాబాద్, హూప్‌స్టర్స్ క్లబ్ జట్లు రెండో విజయాన్ని సాధించాయి. శుక్రవారం జరిగిన మ్యాచ్‌ల్లో వైఎంసీఏ జట్టు 32-14 స్కోరుతో గావిన్స్ బాస్కెట్‌బాల్ అకాడమీపై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో వినోద్ కుమార్ (12 పాయింట్లు) , శరవణకుమార్(8) రాణించారు. మరో మ్యాచ్ లో హూప్‌స్టర్స్ క్లబ్ జట్టు 53-37తో వీజేఐటీ జట్టును ఓడించింది. హూప్‌స్టర్స్ తరఫునవెంకటేశ్ 20 పాయింట్లు, వెంకటేశ్వర్రావు 10 పా యింట్లు సాధించారు. మూడో మ్యాచ్‌లో సైనిక్‌పురి బాస్కెట్ బాల్ అకాడమీ 32-18తో స్టూ డెంట్స్ స్పోర్ట్స్ క్లబ్‌పై విజయం సాధించింది. సైనిక్‌పురి ఆటగాళ్లు దీపక్ (12), అరుణ్ (10) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.