YMCA
-
విశాఖ బీచ్‌కు కొట్టుకొచ్చిన బాక్స్ ఓపెన్.. వీడిన సస్పెన్స్
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. విశాఖలోని వైఎంసీఏ బీచ్ తీరానికి ఓ భారీ చెక్క పెట్టె అలల మధ్య కొట్టుకుని వచ్చింది. శుక్రవారం రాత్రి కొందరు పర్యాటకులు, మత్స్యకారులు ఈ పెట్టెను గమనించారు. దీంతో, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కాగా, అధికారులు రెండు ప్రొక్లెయినర్ సాయంతో భారీ పెట్టెను ఓపెన్ చేశారు. ఈ క్రమంలో అది చెక్కలతో చేసిన దిమ్మెగా అధికారులు తెల్చారు. కాగా, బీచ్‌లో పడవలకు లంగర్ వేసేందుకు ఉపయోగించే చెక్క దిమ్మె అని ఖరారు చేశారు. అంతకుముందు.. విశాఖలోని వైఎంసీఏ బీచ్ తీరానికి ఓ భారీ చెక్క పెట్టె అలల మధ్య కొట్టుకుని వచ్చింది. దీంతో, సమాచారం అందుకున్న పోలీసులకు అక్కడికి చేరుకున్నారు. పురాతమైన చెక్క పెట్టె కావడంతో ప్రొక్లెనర్ సహాయంతో ఒడ్డుకు చేర్చారు. అలాగే, రాత్రంతా పెట్టెకు పోలీసులు కాపలాగా ఉన్నారు. బీచ్‌లో పెట్టె సమాచారం స్థానికులకు తెలియడంతో దాన్ని చూసేందుకు ఎగబడ్డారు. వారిని పోలీసులు కట్టడి చేయడానికి ఇబ్బందిపడాల్సి వచ్చింది. పోలీసులు పెట్టెను.. బ్రిటీష్ కాలం నాటిదిగా అంచనా వేస్తున్నారు. పురాతన పెట్టె ఇలా ఒడ్డుకు వచ్చిందని ఆర్కియాలజీ విభాగానికి పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇది కూడా చదవండి: అమెరికాను ముంచెత్తిన వరదలు... -
మదర్ ఫెయిర్
‘మనసు ఉంటే మార్గమూ ఉంటుంది’. చెన్నై బుక్ ఫెయిర్ ఈ నానుడిని నిజం చేస్తోంది. కోవిడ్ కారణంగా ఇల్లు కదలని వాళ్లు కూడా బుక్ ఫెయిర్‌కు వస్తున్నారు. ఫిబ్రవరి 24వ తేదీ మొదలైన ఈ బుక్ ఫెయిర్ మార్చి తొమ్మిది వరకు కొనసాగుతుంది. చెన్నైలోని నందనం, వైఎమ్‌సీఏలో ఏడు వందల స్టాళ్లతో మొదలైన ఈ బుక్ ఫెయిర్‌లో వేలాది పుస్తకాలున్నాయి. సాధారణంగా బుక్ ఫెయిర్‌లో పుస్తకప్రియులతోపాటు రచయిత లు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఈ దఫా కూడా రచయితలు తమ పుస్తకాల పట్ల పాఠకుల రెస్పాన్స్ తెలుసుకోవడం కోసం రోజూ బుక్ ఫెయిర్ కు వస్తున్నారు. అయితే ఈ ఏడాది ప్రత్యేకం ఏమిటంటే... పేరెంట్స్ తమ పిల్లలను బుక్ ఫెయిర్‌కు తీసుకురావడం. పేరెంట్స్‌లో కూడా తల్లులే అధికంగా కనిపిస్తున్నారు. కోవిడ్ కారణంగా ఏడాది నుంచి గడపదాటలేదు. ఆన్లైన్ క్లాసుల్లో పాఠాలతో పిల్లలు విసిగిపోతున్నారు. వాళ్లకు నచ్చే పుస్తకాలు కొనిద్దామని తీసుకువచ్చామని చెబుతున్నారు బుక్ ఫెయిర్‌కి పిల్లలతో వచ్చిన తల్లులు. ‘ఈ కోవిడ్ విరామం పిల్లలకు ఇష్టమైన పుస్తకాలు చదువుకోవడానికి బాగా ఉపకరిస్తుంది. మనకు నచ్చినవి కొనుక్కుని వెళ్లి వీటిని చదవండి అంటే పిల్లలకు చదవాలనే ఆసక్తి కలగదు. వాళ్లనే తీసుకు వచ్చి చూపించినట్లయితే తమకు ఇష్టమైన వాటినే ఎంచుకుంటారు, ఇష్టంగా చదువుతారు కూడా’ అన్నారు తన ఇద్దరు పిల్లలతో బుక్ ఫెయిర్ కొచ్చిన రాజి. బుక్ ఫెయిర్‌లో జనసమ్మర్ధం విపరీతంగా ఉంటుందేమోనని రావడానికి కొంచెం భయపడ్డాం. కానీ ఇక్కడ ఎప్పుడూ ఉండే రష్ లేదు. మాస్కు లేకుండా వచ్చిన వాళ్లను వెనక్కి పంపించకుండా ఇక్కడ మాస్కు ఇస్తున్నారు. శానిటైజర్ కూడా అందుబాటులో ఉంచారు. నిర్వహకులు కోవిడ్ ప్రోటోకాల్ కచ్చితంగా పాటిస్తున్నారు. దాంతో ధైర్యంగా ఎక్కువ సమయం ఉండగలుగుతున్నాం. కొత్త పుస్తకాలను కూడా డిస్కౌంట్లో ఇస్తున్నారు. దాంతో నాలుగు కొనాలనుకున్న వాళ్లు కూడా మరో రెండు ఎక్కువగా తీసుకుంటున్నాం’ అన్నారామె. చెన్నై బుక్ ఫెయిర్‌లో షాపింగ్ -
దైవ ప్రార్థన చాలా అవసరం
రేపల్లె: యువతతో సమాజాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడమే వైఎంసీఏ ధ్యేయమని వైఎంసీఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లెబి ఫిలిప్ మాథ్యూ పేర్కొన్నారు. పట్టణంలోని ఇండియా రూరల్ ఇవాంజిలికల్ చర్చిలో గురువారం నిర్వహించిన కృతజ్ఞతా ప్రార్థన కూడికలో ఆయన మాట్లాడారు. ‘నిన్ను వలె నీరు పొరుగు వారిని ప్రేమించు’ అని క్రీస్తు చెప్పిన మార్గాన్ని యువత ఎంచుకోవాలని సూచించారు. సేవా కార్యక్రమాలతో పాటు దైవప్రార్థనకు కొంత సమయాన్ని కేటాయించాలని చెప్పారు. వైఎంసీఏ సౌత్, ఈస్ట్ రీజియన్ చైర్మన్, ఐఆర్ఈఎఫ్ అధినేత బిషప్ డాక్టర్ ఇమ్మానియులు రెబ్బా మాట్లాడుతూ ప్రేమ, కరుణ, దయ గుణాలు ఎక్కడ ఉంటాయో అక్కడ ఏసు ప్రభువు కొలువుతీరి ఉంటాడరన్నారు. జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ లెబి ఫిలిప్ మాధ్యూ, సీహెచ్ఆర్పీ మణికుమార్‌ను ఇమ్మానియేలు రెబ్బా దంపతులు పూలమాలలు, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. వైఎంసీఏ జాతీయ కార్యదర్శి సీహెచ్ఆర్పీ మణికుమార్, ఐఆర్ఈఎఫ్ పరిపాలనాధికారి దీవెన రెబ్బా, రెబ్బా జాన్‌పాల్(చంటి), ప్రిన్సిపాల్స్ జడ్.రత్నప్రసాద్, హానోక్ తదితరులు పాల్గొన్నారు. -
క్వార్టర్స్‌లో వైఎంసీఏ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ బాస్కెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతోన్న క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో సికింద్రాబాద్ క్లబ్, సికింద్రాబాద్ వైఎంసీఏ జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో సికింద్రాబాద్ క్లబ్ 74- 62తో సెయింట్ మార్టిన్స్ క్లబ్‌పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో సికిం ద్రాబాద్ వైఎంసీఏ జట్టు 81-70తో సిటీ కాలేజ్ క్లబ్‌పై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో సికింద్రాబాద్ వైఎంసీఏ జట్టు తరఫున పృథ్వీ (30), డేవిడ్ (11) రాణించగా, సిటీ కాలేజ్ జట్టులో ఫణి (26) ఆకట్టుకున్నాడు. -
సీసీఓబీపై వైఎంసీఏ గెలుపు
సాక్షి, హైదారాబాద్: క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో గ్రూప్ ‘ఇ’ విభాగంలో హైదరాబాద్ వైఎంసీఏ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. హైదరాబాద్ జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం నిర్వహిస్తున్న ఈ టోర్నీలో బుధవారం ఆసక్తి రేకెత్తించిన మ్యాచ్‌లో వైఎంసీఏ జట్టు 49-40తో సీసీఓబీ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్‌లో వైఎంసీఏ తరఫున లలిత్ రెడ్డి 20 పాయింట్లు, వినయ్ 10 పాయింట్లు చేయగా... సీసీఓబీ జట్టులో ఫణి 12, నాగరాజ్ 10 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ ‘ఎ’ 42-27తో ఎన్బీఏ ‘బి’ జట్టుపై గెలిచింది. బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ తరఫున ప్రదీప్ సింగ్ (16), విపిన్ (15) అద్భుతంగా రాణించగా... ఎన్బీఏ జట్టులో శేరు (15) ప్రతిభ కనబరిచాడు. -
వైఎంసీఏకు రెండో విజయం
► క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ సాక్షి, హైదరాబాద్: క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో వైఎంసీఏ సికింద్రాబాద్, హూప్‌స్టర్స్ క్లబ్ జట్లు రెండో విజయాన్ని సాధించాయి. శుక్రవారం జరిగిన మ్యాచ్‌ల్లో వైఎంసీఏ జట్టు 32-14 స్కోరుతో గావిన్స్ బాస్కెట్‌బాల్ అకాడమీపై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో వినోద్ కుమార్ (12 పాయింట్లు) , శరవణకుమార్(8) రాణించారు. మరో మ్యాచ్ లో హూప్‌స్టర్స్ క్లబ్ జట్టు 53-37తో వీజేఐటీ జట్టును ఓడించింది. హూప్‌స్టర్స్ తరఫునవెంకటేశ్ 20 పాయింట్లు, వెంకటేశ్వర్రావు 10 పా యింట్లు సాధించారు. మూడో మ్యాచ్‌లో సైనిక్‌పురి బాస్కెట్ బాల్ అకాడమీ 32-18తో స్టూ డెంట్స్ స్పోర్ట్స్ క్లబ్‌పై విజయం సాధించింది. సైనిక్‌పురి ఆటగాళ్లు దీపక్ (12), అరుణ్ (10) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. -
వైఎంసీఏ ఘన విజయం
క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: డేవిడ్ (18 పాయింట్లు), హర్ష (18), ముస్తఫా (17) అద్భుతంగా రాణించడంతో క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నీలో వైఎంసీఏ జట్టు ఘన విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో వైఎంసీఏ జట్ట 53- 28 స్కోరు తేడాతో స్టూడెంట్స్ స్పోర్ట్స్ క్లబ్‌ను ఓడించింది. స్టూడెంట్స్ స్పోర్ట్స్ క్లబ్ తరఫున చరణ్ (10), సాయి కిరణ్ (10), జీవన్ (8) రాణించారు. ఇతర మ్యాచ్‌ల్లో జోసెఫియన్ జట్టు 29-22తో ఆర్బీవీఆర్ రెడ్డి హాస్టల్‌పై గెలుపొందగా... ఎన్బీఏ జట్టు 50-30తో ఈసీఐఎల్ జట్టును చిత్తుగా ఓడించింది -
అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యం
నిడదవోలు, న్యూస్‌లైన్ : క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడమే వైఎంసీఏ ప్రధాన ధ్యేయమని వైఎంసీఏ నేషనల్ బోర్డు సభ్యుడు, ఇండియన్ వైఎంసీఏ చైర్మన్ కె.రాజారత్నం ఐజాక్ పేర్కొన్నారు. నిడదవోలులో శనివారం ఆల్ ఇండియా ఇంటర్ వైఎంసీఏ వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు సందర్భంగా బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ వైఎంసీఏ ఆధ్వర్యంలో బాస్కెల్ బాల్, క్రికెట్లో రాణించిన వారిని జర్మనీ, ఇంగ్లండ్, శ్రీలంక దేశాలకు పంపించామన్నారు. అమెరికాలో ఉన్న స్పింగ్ ఫీల్డు యూనివర్సిటీతో అనుబంధంగా చెన్నై వైఎంసీఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. క్రీడలతో పాటు సామాజిక కార్యక్రమాలను కూడా చేపడుతున్నట్టు తెలిపారు. గతంతో వచ్చిన సునామీతో నష్టపోయిన పలు కుటుంబాలను ఆదుకున్నామన్నారు. నెల్లూరు జిల్లాలో నాగపట్నం, మధురై, సంజావూర్ ప్రాంతాల్లో సుమారు రూ.22 కోట్లతో గృహాలు నిర్మించామన్నారు. విశాఖపట్నంలో 50 మంది చిన్నారులకు ఆశ్రయం కల్పించినట్టు చెప్పారు.